Part-XIII
కళింగ మహారాజు ఇంద్రవర్మ వీరఘాతకుడిని చంపడానికి 8 రోజులు ముందు వీరఘాతకుడు రాజ్య పర్యటనికి అని చెప్పి దంతపురం నుంచి బయలుదేరుతాడు.
అలా ఒక రోజు ప్రయాణం తరువాత కళింగ రాజ్యం సరిహద్దుకి చేరుకుంటాడు. అక్కడ తన గుఱ్ఱాన్నీ ఒక చెట్టు కి కట్టి కాలి నడకన కొంత దూరం అడివిలోకి ప్రయాణిస్తాడు. అలా ఒక చోట ఆగి అక్కడె ఉన్న ఒక గుహ లోకి వెళతాడు.
గుహలోకి కొంత దూరం నడిచాకా. ఒక చోట ఆగి నించుంటాడు.
వీరఘాతక : మీరన్నట్టె చేసాను గురువుగారు.
అని తన ఎదురు గా కూర్చున్న ఒక సిద్ద సాధువు ని చూసి అంటాడు. అతనె వీరఘాతకుడి కి హిమాలయాల్లొ విద్య నేర్పిన గురువు.
వీరఘాతకుడి కి మరణం రాబోతున్నదని ముందుగానె గ్రహించి. అది తనకి వివరించడానికి అని వచ్చాడు.
నిజానికి వీరఘాతకుడు తండ్రి పేరు విచిత్ర వర్మ. అతను మరెవరొ కాదు కళింగ రాజ్య మహారాజు ఇంద్ర వర్మ కు తోడబుట్టిన అన్నయ్య.
చిన్న వయసు నుంచె విచిత్ర వర్మ కు రాజ్యం పైన గాని సింహాసనం పైన గాని ఎటువంటి ఆశ లేదు. అతనికి హిమాలయాలకు వెళ్ళి సిద్ద విద్య లు నేర్చుకోవాలి అని. యోగ విద్య లొ అత్యున్నత స్థాయి కి చేరుకోవాలి అనె కోరిక ఉండేది.
అందుకె అతను తన కౌమార వయసు (Teenage) లొ. తన తండ్రి వద్ద అనుమతి కోరుతు తన తమ్ముడు ఇంద్ర వర్మ ని రాజు ని చేయమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోతాడు.
అలా వెళ్ళిన విచిత్ర వర్మ చాలా సంవత్సరాల పాటు కఠోర సాదన ద్వారా ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు.
తరువాత లోపముద్ర అనె అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని. వీరఘాతకుడి కి జన్మనిస్తాడు. కాని ప్రసవించిన 10 రోజులకె తన భార్య లోపముద్ర చనిపోతుంది. ఇది చూసి విచిత్ర వర్మ కు బాధ, ఒంటరి తనం మరియు వైరాగ్య భావన కలిగి.
తన కొడుకు వీరఘాతకుడిని తన తమ్ముడు ఇంద్రవర్మ కు అప్పగించమని చెప్పి తన గురువు కు అప్పగించి తాను తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోతాడు.
విచిత్ర వర్మ గురువు కళింగ రాజ్య సరిహద్దుకు వెళ్ళి రహస్యంగా ఇంద్ర వర్మ ను పిలిపించి. జరిగింది చెప్పి పసి బిడ్డగా ఉన్న వీరఘాతకుడి ని అతనికి ఇచ్చి పంపిస్తాడు. వెళుతున్న తనకి ఆ బిడ్డ గురించిన వివరాలు రహస్యంగా ఉంచమని, తెలిస్తె బిడ్డ ప్రాణానికె ప్రమాదమని చెబుతాడు.
కాని ఆ గురువు కు తెలుసు ఈ వీరఘాతకుడి మరణం తన బాబాయి ఇంద్రవర్మ చేతులోనె ఉంద ని.
ఆ గురువె మళ్ళి వీరఘాతకుడికి కూడా విద్య నేర్పింది.
అలా గతాన్నీ ఆలొచిస్తున్న సిద్ద సాధువు ని "గురువు గారు.... గురువు గారు" వీరఘాతకుడు పిలుస్తాడు.
గురువు : ఆ వీరఘాతక! చెప్పు నాయన
వీరఘాతక : మీరు చెప్పినట్టె చేసాను. ఆ నీలమణిని కళింగ రాజ్యం యొక్క నిధి దాగి ఉన్న నేలమాళిగలొ (Under ground Tunnel) దాచి. మీరు చెప్పిన పద్దతి లొ ఆ నేలమాళిగ ద్వారం మూసేశాను. ఇప్పుడు ఆ ద్వారం ప్రతి 120 సంవత్సరాల ఒకసారి మాత్రమె కనిపిస్తుంది. నా ద్వారా లేదా నా వారసుల ద్వారా తప్ప మరింకెవరి ద్వారా ఆ ద్వారం తెరుచుకోదు.
గురువు : సరే మరి నీ కొడుకు అనిరుద్ ఎక్కడ.?
------------------------------------------------------------------------
మహేష్ ని తీసుకొని గురుమూర్తి, నారాయణమూర్తి మరియు తదితరులు పలాస నుంచి బయలుదేరి ఆంధ్రా సరిహద్దు కి అవతల వైపు ఒరిస్సా లోని తూర్పు కనుమలు (Eastern Ghats) లొ ఉన్న ఖళ్ళికోటె అడవి లోకి వెళతారు.
వంశి : ఈ అడవి లోంచి ఎక్కడికి వెళ్ళతున్నాం ఇప్పుడు?
నారాయణ మూర్తి : నిధి ఉన్న చోటికి వంశి.
గురుమూర్తి : మహేష్ నీకు ఇప్పుడు ఎలా ఉంది ? వాళ్ళు నీకు డీ.ఎమ్.టి (DMT) ఇంజక్షన్ ఇచ్చారు అని నాదీర్ చెప్పాడు.
మహేష్ : అవును నాదీర్ చెప్పింది నిజమె వాళ్ళు నాకు డీ.ఎమ్.టి (DMT) ఇంజక్షన్ ఇచ్చారు. నా నుంచి ఆ నిధి రహస్యం తెలుసుకోడానికి.
గురుమూర్తి : మరి చెప్పావా?
మహేష్ : నాకు తెలిసింది ఆ నిధి గురించి వివరాలు మొత్తం చెప్పాను కాని. ఆ నిధి ఉన్న చోటు మాత్రం తప్పు చెప్పాను.
వంశి : తప్పు చెప్పారా? ఎలా ? నిజానికి డీ.ఎమ్.టి (DMT) రసాయనం మన శరీరం లోకి వెళ్ళగానె మన మెధడు మన ఆధీనంలో ఉండదు కదా.? అలాంటప్పుడు మీరు వాళ్ళకి మీరు నిధి ఉన్న చోటు చెప్పకుండా. వేరె చోటు ఎలా చెప్పగలిగారు.?
మహేష్ : అది మీ నాన్న నె అడుగు వంశి.
అని అనగానె వంశి వాళ్ళ నాన్న నారాయణమూర్తి వైపు చూస్తాడు.
నారాయణమూర్తి : ఆ నిధి ఉన్నచోటు నాకు మాత్రమె తెలుసు. అందరికి మొత్తం వివరాలు తెలిస్తె. మాలో ఏ ఒక్కడు దొరికినా వాళ్ళ కి ఆ నిధి ఉన్న చోటు తెలిసిపోతుంది. అందుకె ఆ నిధి దంతపురం ఊరి చివర ఉన్న మఱ్ఱి చెట్టు క్రింద ఉందని మహేష్ కి అబద్దం చెప్పాను. నేను అబద్దం చెప్పాను అని మహేష్ కి తెలుసు.
వంశి : తెలిసి కూడా మరి మహేష్ అంకుల్ ఎందుకు మీరు చెప్పిన అబద్దాన్నే వాళ్ళకి చెప్పాడు.
పూజారి : చూడు వంశి ఒక మనిషి ఎప్పుడైతె తన మెదడు పై ఆధినం కోల్పోతాడొ. అప్పుడు తనకి ఎదుటి వారు అడిగిన ప్రశ్నల కు తనకు తెలిసిన సమాధానాలు మాత్రమె చెప్పగలడు. తెలియనవి మరియు ఎదుటి వారు అడగని వాటికి వాళ్ళు ఏం చెప్పరు.
నారాయణమూర్తి : మహేష్ కి నేను చెప్పిన అబద్ధం మాత్రమె తెలుసు నిజం తెలియదు. అందుకె వాళ్ళు ఆ నిధి ఎక్కడ ఉంది అన్న ప్రశ్న కు ఆ అబద్దాన్నీ చెప్పాడు. ఒక వెళ వాళ్ళు మహేష్ తాను చెప్తున్న చోటు నిజమా లేక అబద్దమా అన్న ప్రశ్న వేస్తె. అది అబద్దం అని చెప్పేవాడు. అప్పుడు మనల్ని అడిగేవారు.
నాదీర్ : కాని అలా అడగకుండా నేను అక్కడి తొ అపించేశాను.
వంశి : అవును పూజారి గారు ఇదంతా మీకు ఎలా తెలుసు?
అని అనగానె అందరు నవ్వుతారు.
గురుమూర్తి : ఆయనకి ఎలా తెలుసా అడుగుతున్నావా? ఆయన ని నివ్వు గుడి పూజారి గా మాత్రమె చూసావు కాని ఆయన ఎవరొ తెలుసా?
వంశి : ఎవరు?
నారాయణమూర్తి : ఆయన పూర్తి పేరు డాక్టర్ అగ్నివేశ శర్మ. ప్రముఖ సైక్యాట్రిస్ట్ (Psychiatrist) మరియు ప్రముఖ డెర్మెటోలజిస్ట్ (Dermotologist) దీంట్లొ ఆయన ఇమ్యూన్ డెర్మెటోలజిస్ట్ (Immune Dermotologist) కూడా చేశారు.
గురుమూర్తి : ఆ 9 మంది ని చంపడానికి పథకం వేసింది ఈయనె. వాళ్ళు చావులొ వాడిన డీ.ఎమ్.టి (DMT) రసాయనం మరియు ఎలాస్టేస్ (Elastase) అనె మాంసకృతి (Enzyme) ని తయారు చేసి మాకు ఇచ్చింది ఈయనె.
వంశి : ఈయన అంత పెద్ద డాక్టర్ అయితె దంతపురం ఊరి గుడి లొ పూజారి గా ఎందుకు చేస్తున్నారు.?
డాక్టర్ అగ్నివేశ శర్మ (పూజారి) : దంతపురం లోని అమ్మవారి గుడి యొక్క అర్చకత్వం మాకు వంశపారంపర్యంగా వస్తొంది. మా నాన్న గారు తరువాత అది మా అన్నయ్య కి వచ్చింది. అప్పుడు నేను విజయవాడలొ సైక్యాట్రిస్ట్ (Psychiatrist) గా పనిచేస్తూ డెర్మెటోలజి (Dermotology) చేసి అందులొ మరింత ఆసక్తి పెరిగి ఇమ్యూన్ డెర్మెటోలజి (Immune Dermotology) చేస్తున్నాను అప్పుడు.
గురుమూర్తి : ఈయన అన్నగారు అర్చకుడు గా మొదలుపెట్టిన 2 సంవత్సరాలకి మన ఊరి అమ్మవారి జాతర లొ జరిగిన అగ్నిప్రమాదం లొ చిక్కుకున్న ప్రజలను కాపాడె ప్రయత్నంలొ వీళ్ళ నాన్నగారు మరియు అన్నగారు చనిపోయారు.
నారాయణ : దాంతొ ఆ అర్చకత్వ భాద్యత ఈయనకి వచ్చింది. అందుకోసం ఆయన ఎంతొ ఇష్టంతొ చేస్తున్న డాక్టర్ వృత్తిని వదిలి ఈ అర్చకత్వంలొ చేరారు.
గురుమూర్తి : అందుకె ఊరి ప్రజలకు ఈయన అన్న ఈయన కుటుంబం అన్న ఎంతొ గౌరవం మరియు అభిమానం.
వంశి : మీలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టె ఈ కాలం లొ కూడా అర్చకత్వం ఇంకా బ్రతికి ఉంది.
గురుమూర్తి : సరిగ్గ చెప్పావు వంశి.
వంశి : సరె గాని నాన్న ఆ నిధి ఉన్న చోటు మీకు మాత్రమె తెలుసు అన్నారు గా. అయితె ఆ చోటు ఎక్కడ ఉంది?
నారాయణమూర్తి : ఈ అడివి లోని సిమిలి అనె చిన్న ఊరు ఉంది. ఆ ఊరి చివర పనిఖియా అనె జలపాతం దగ్గర ఉంది.
గురుమూర్తి : త్వరగా పోని అల్తాఫ్ చీకటిపడె లోపు మనం సిమిలి ఊరికి చేరుకోవాలి.
చీకటి పడె సమయానికి వాళ్ళు సిమిలి గ్రామానికి చేరుకుంటారు. నారాయణ మూర్తికి సిమిలి గ్రామ పెద్ధ తెలుసు. అతనె ఆ రాత్రి వాళ్ళు ఉండడానికి బస ఎర్పాటు చేస్తాడు.
మరుసటి రోజు ఉదయం నాదీర్ మరియు అతని తమ్ముడు అల్తాఫ్ ఇద్దరు ఆ గ్రామ పెద్ద కొడుకు తొ కలిసి బయట ఊరికి వెళ్ళి నిధి వేటకు కావలసిన సామన్లు కొనుక్కోని. చీకటి పడె సమయానికి సిమిలి గ్రామానికి చేరుకుంటారు.
రాత్రి భోజనాలు అన్నీ అయ్యాక. గ్రామ ప్రజలందరు నిద్రపోయె సమయానికి. అందరు గ్రామ పెద్ద మరియు అతని కొడుకు తొ కలిసి ఆ రాత్రి పనిఖియా జలపాతం దగ్గరికి చేరుకుంటారు.
అల్తాఫ్ దంతపురం నుంచి తీసుకువచ్చిన దూరదర్శిని (Telescope) ని తీసి నారాయమూర్తికి ఇస్తాడు.
నారాయమూర్తి ఆ దూరదర్శిని (Telescope) ద్వారా ఆకాశంలొ అశ్విని, పుష్యమి, మఘ నక్షత్రాలు ఒకే రేఖలో కనపడె "త్రివేణి నక్షత్ర కూటమి" కోసం చూస్తున్నాడు.
కాసేపటికి ఆ "త్రివేణి నక్షత్ర కూటమి" ఏర్పడింది.
నారాయణమూర్తి : మూడు నక్షత్రాలు ఒకే రేఖలోకి వచ్చాయి. అంటె ఇప్పుడు ఆ నిధి ఉండె చోటు కనిపించబోతుంది. అందరు వెతకండి.
గురుమూర్తి: దశరథ్ గారు (సిమిలి గ్రామ పెద్ద) మీకు ఈ ఊరు మరియు ఈ జలపాతం గురించి బాగా తెలుసు కాబట్టి మీరు మీ కొడుకు రామ్ కలిసి ఈ జలపాతం చుట్టు ప్రక్కల వెతకండి. క్రొత్త గా ఏమైన కనిపిస్తె చెప్పండి.
దశరథ్ (గ్రామ పెద్ద) : అలాగె. రామ్ నువ్వు అటువైపు వెతుకు నేను ఇటువైపు చూస్తా.
అని చెప్పి తండ్రి కొడుకు లు ఇద్దరు ఆ చోటు కోసం వెతకడం ప్రారంభించారు. కొంతమంది దశరథ్ (గ్రామ పెద్ద) తొ కలిసి మరి కొంత మంది రామ్ తొ కలిసి వెతుకుతున్నారు.
కాసేపటికి దశరథ్ (గ్రామ పెద్ద) కి ఏదొ కనిపిస్తుంది. దాంతొ నారాయణమూర్తిని చూడమంటాడు.
నారాయణమూర్తి మరియు మహేష్ టార్చి లైట్ వేసి ఆ రాతి ని క్షుణ్ణంగా పరిశాలిస్తారు. దానిపై దక్షిణ నగరి భాష లొ ఉన్న అక్షరాలు కనిపించి పైన మద్యలొ ఒక అరచెయ్యి గుర్తు ఉంటుంది. ఆ లిపిని కళింగ రాజులు కాలంలొ వాడెవాళ్ళు అని గుర్తిస్తారు. దీంతొ ఇదె వాళ్ళు వెతుకుటున్న ద్వారం అని నిర్ధారించుకుంటారు.
వంశి : దాని పైన ఏం వ్రాసి ఉంది నాన్న? ఇంతకి అది ఏ భాషా?
నారాయణమూర్తి : ఇది దక్షిణ నగరి భాష. ఆ కాలం లొ కళింగ రాజులు వాడేవాళ్ళు. దీనిపై ఏం వ్రాసి ఉందంటె "ఎవరైతె ఈ రుథీర బందనాన్నీ తాయ్యారు చేసారొ వాళ్ళు లేద వాళ్ళ వారసులు మాత్రం చెయ్యిపెడితేనె ఈ ద్వారం తెరుచుకుంటుంది. అలా కాకుండా ఇంకెవరు చెయ్యి పెట్టిన వెంటనె అది మళ్ళి కనిపించకుండా ఈ ద్వారం శాశ్వతంగా మాయం అయిపోతుంది " అని ఉంది.
వంశి : ఇంతకి ఏవరు తయ్యారు చేసారు ఈ రుథీర బందనం?
మహేష్ : వీరఘాతకుడు.
వంశి : అలాగైతై ఇప్పుడు తన వారసుడిని ఎక్కడ నుంచి తీసుకురాగలం.?
అని వంశి అడుగుతుండగా చటుక్కున నారాయమూర్తి వంశి కుడి అరచెయ్యి ని పట్టుకొని ఆ రుథీర బంధనం పైన పెడతాడు.
పెట్టగనె వంశి అర చేతికి ఏదొ గుచ్చుకోని రక్తం వస్తుంది. తరువాత కాసేపటికి పెద్ద శబ్ధం చేసుకుంటు ఆ ద్వారం తెరుచుకుంటుంది.
ఇదంతా చూసిన వంశి కి నోట మాట రాలేదు. ఏం జరిగిందొ అని తేరుకునె లోపె ద్వారం పూర్తిగా తెరుచుకుంటింది.
అది పౌర్ణమి రాత్రి అవ్వడం తొ చంద్రుని వెలుగు లోపల ఉన్న ఒక అద్దం పై పడి ఆ కాంతి ఈ అద్దం నుంచి మిగిలిన అద్దం ల పై పడగనె వెలుతురు వస్తుంది.
ఆ వెలుతురు లొ వాళ్ళ కి కళింగ రాజ్యం యొక్క అపార సంపద మరియు దాని మద్య లొ ఉన్న నీలమణి కనిపిస్తుంది. ఆశ్చర్యంతొ అందరు చూస్తు నిలబడి పోతారు.
మహేష్ : మనం సాధించాం నారాయణ. మన ఇద్దరి తండ్రుల కల ఇది.
నారాయణమూర్తి : అవును వాళ్ళ కలె ఇది. ఈ సంపదనంతటి ని వాళ్ళ కోరిక మేరకు కేంద్రం ప్రభుత్వానికి అప్పగించాలి.
"అవసరం లేదు ఆ పని మేము చూసుకుంటాం" అని వెనుక నుంచి ఎవరిదొ గొంతు వినిపిస్తుంది. ఎవరా అని తిరిగి చూస్తె మహేంద్ర వర్మ. తనతో పాటు తన కొడుకు విక్రమ్, మంత్రి ఆనంద రాజు, (SIT) ధనుంజయ్ మరియు వాళ్ళ మనుషులు ఉంటారు.