Read Kalinga Rahasyam - 12 by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 12

Part-XII

(SIT)ధనుంజయ్ తాను మహేంద్ర వర్మ మనిషి అని వంశి కి తెలియగానె. వెంటనె వంశి తొ పాటు తన నాన్న మరియు పెద్దనాన్న ఉన్న గది తలుపు మూసి తాళం వేస్తాడు.

అక్కడ ఉన్న మిగిలిన పోలీసు అధికారులంతా కూడా (SIT)ధనుంజయ్ మనుషులె. వాళ్ళంతా కూడా  (SIT)ధనుంజయ్ తొ పాటు వెళ్ళిపోతారు.

వంశి : ఇలా జరిగిందేంటి? ఇదంతా నేను నమ్మలేకపోతున్నా.

గురుమూర్తి : నమ్మితిరాలి వంశి. ఇదే కాదు. నీకు తెలియని ఇంకొ నిజం కూడా ఉంది. 

వంశి : ఏంటి ఆ నిజం?

నారాయణమూర్తి : ఇప్పటి వరకు జరిగిన ఈ దర్యాప్తు (Investigation) అంతా కూడా డమ్మీ దర్యాప్తు. ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిపించారు.

వంశి : ఏంటి?

గురుమూర్తి : అవును అసలు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాదు.

వంశి : మరీ ? ప్రభుత్వానికి కాకుండా ఇంక ఎవరికి ఉంది ఆ అధికారం.?

నారాయణమూర్తి : పిచ్చివాడా అసలు ఇది దర్యాప్తు (Investigation) కాదు రా. మమ్మల్ని పట్టుకోడానికి వేసిన ఉచ్చు (trap) ఇందులొ నిన్ను ఎర గా వాడారు.

గురుమూర్తి : అవును ఇదంతా ఆ మహేంద్ర వర్మ మరియు మంత్రి ఆనందరాజు ఈ (SIT)ధనుంజయ్ తొ ఆడించిన నాటకం.

వంశి : ఏంటి నాటకమా? 

గురుమూర్తి : అవును ఎప్పడైతె మహేంద్ర వర్మ అనుచరులు ఒక్కక్కరుగా ఒకేలా చనిపోవడం జరిగిందొ అప్పుడె తనకి అనుమానం వచ్చింది. వెంటనె తాను మంత్రి ఆనందరాజు కి చెప్పి ప్రభుత్వానికి తెలియకుండా ఆ (SIT)ధనుంజయ్ తొ రహస్యంగా దర్యాప్తు చేపించాడు. 

నారాయణమూర్తి : ఆ దర్యాప్తు లొ నేను హాస్పెటల్ నుంచి మాయమవ్వడం గురించి (SIT)ధనుంజయ్ కి తెలిసంది దాంతొ తనకి మా మీద అనుమానం వచ్చింది. 

గురుమూర్తి : ఎందుకంటె చనిపోయిన వాళ్ళంతా కూడా మా తల్లిదండ్రుల ను చంపిన వాళ్ళు కాబట్టి ఆ అనుమానం మా మీదకి మళ్ళింది. కాని ఈ విషయం ప్రభుత్వానికి గాని పత్రికల వాళ్ళకి గాని తెలిసి నిజమైన దర్యాప్తు జరిపితె వాళ్ళ మీద కూడా అనుమానాలు వెళతాయి. దాంతొ వాళ్ళ నిజస్వరూపం బయటపడె అవకాశం ఉంది.

నారాయణమూర్తి : అందుకె వాళ్ళు ఈ నాటకం అంతా ఆడారు. అంతె కాదు మీ అమ్మ శాంతి చావు కి కూడా వాళ్ళె కారణం.

వంశి : ఛా! ఇలాంటి దుర్మార్గుల కోసమా నేను ఇన్నీ రోజులు పనిచేసింది.

అని వంశి బాగా కోపం తొ రగిలిపోతాడు. 

సరిగ్గా అప్పుడె ఆ గది తలుపు తెరుచుకుంటున్న చప్పుడు వస్తుంది. అందరు అటు వైపు చూస్తారు. అప్పుడె దంతపురం ఊరి గుడి పూజారి మరియు అతని తొ పాటు ఇంకొక వ్యక్తి తలుపు తీసుకొని లోపలికి వస్తారు.

పూజారి తొ ఉన్న వ్యక్తి ఎవరో కాదు. అతని పేరు అల్తాఫ్ హుస్సేన్ తను (SIT)ధనుంజయ్ మనుషులలొ ఒకడు అతనికె ఇంతకుముందు (SIT)ధనుంజయ్ గురుమూర్తి ఇచ్చిన వీడియొ కాసెట్ ను ఇచ్చి ఫారెనసిక్ ల్యాబ్ కి పంపిచాడు. 

వంశి వాళ్ళిద్దరు రావడం చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు.

పూజారి : క్షమించాలి కొంచెం ఆలస్యం అయ్యింది. హాస్పెటల్ దగ్గర ఉన్న పోలీసులు వెళ్ళేంతవరకు ఆగాల్సి వచ్చింది.

గురుమూర్తి : ఆలస్యం ఏం లేదు పూజారి గారు సరైన సమయానికె వచ్చారు. 

అల్తాఫ్ హుస్సేన్ : త్వరగ పదండి. మనం మహేష్ గారి ని దాచిన చోటు కి వెళ్ళాలి. లేదంటె వాళ్ళు అతనిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు.

వీళ్ళ మాటలు వింటున్న వంశి కి ఏమి అర్ధం కాదు. 

వంశి : అసలు ఇక్కడ ఏం జరుగుతుంది.? నాకు ఎవరైన చెబుతారా?

నారాయణమూర్తి : తప్పకుండా వంశి కాని అంతకంటె ముందు మనం ఇక్కడ నుంచి బయట పడాలి. దారిలొ నీకు అంతా చెబుతా పదా.

వాళ్ళు 5గురు అక్కడ నుంచి బయట పడి కొంచెం దూరం లొ ఆపి ఉంచిన ఇనోవా కారులొ ఎక్కి బయలుదేరుతారు.

వంశి : ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం.?

అల్తాఫ్ హుస్సేన్ : పలాస కి వెళుతున్నాం. అక్కడె మీ మహేష్ గారిని దాచి ఉంచారు.

వంశి : మహేష్ అంకుల్ ని అక్కడె దాచారు అని నీకు ఎలా తెలుసు? 

అల్తాఫ్ హుస్సేన్ : మా అన్నయ్య నాదీర్ హుస్సేన్ చెప్పాడు.

వంశి : నాదీర్ మీ అన్నయ్యా.? అతను మహేంద్ర వర్మ కొడుకు విక్రమ్ మనిషి కదా?

గురుమూర్తి : కాదు వంశి ఆ నాదీర్ మనవాడె. మేమె అతనిని విక్రమ్ దగ్గర పనిచేయడానికి పంపించాం. వాళ్ళ కదలికలు మరియు మహేష్ యొక్క సమాచారం తెలియచేయడానికి మనవాడు ఒకడు ఉండాలి అని.

వంశి : నాకంతా అయొమయంగా ఉంది పెద్దనాన్న.

గురుమూర్తి : వివరంగా చెబుతా విను.  ఎప్పుడైతె వాళ్ళు మీ అమ్మ ని చంపి మీ నాన్న ని చంపాలి అని చూసారొ అప్పుడె మేము వాళ్ళ ని చంపాలి అని నిర్ణయించుకున్నాం. మా పథకం లొ భాగంగా మహేంద్ర వర్మ ఏం చేయబోతున్నాడొ ముందుగా తెలియడం కోసం మా మనిషి నాదీర్ ని తన కొడుకు విక్రమ్ దగ్గర పని లొ చేరెలా చేశాము. 

నారాయణమూర్తి: మహేంద్రవర్మ కచ్చితంగా నా స్నేహితుడు మహేష్ ని బంధిస్తాడని తెలుసు. అందుకె తనని రహస్యంగా భువనేష్వర్ కి పంపించాలని చూసాం కాని వాళ్ళు ముందె పసిగట్టి మహేష్ ని ఎత్తుకెళ్ళిపోయారు.

గురుమూర్తి : మహేష్ చచ్చినా వాళ్ళకి ఆ నిధి తాలుకు రహస్యం చెప్పడు. ఒకవేళ చెప్పిన వాళ్ళు అక్కడికి చేరుకోలేరు. 

నారాయణమూర్తి : ఆ నిధి దొరికేంతవరకు మహేష్ ని వాళ్ళు ఏమి చేయరని మాకు అర్ధం అయింది. పైగా మనవాడు నాదీర్ ఉన్నాడు అనె ధైర్యంతొ ఉండి మా పథకం ప్రకారం ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చాం.

వంశి : అంతా బాగానె ఉంది మరి పెద్దనాన్న ని మరియు పూజారి గారిని ఎందుకు చంపాలి అనుకున్నారు నాన్న?

నారాయణమూర్తి : ఎందుకంటె వాళ్ళ కి మీ పెద్దనాన్న మీద అనుమానం వచ్చింది. 

గురుమూర్తి : నా మీద మొదలైన అనుమానం నా ద్వారా పూజారి గారి మీద తర్వాత నాదీర్ మరియు అల్తాఫ్ అందరి మీద అనుమానం వచ్చిందంటె మన పథకం మొత్తం బయటపడిపోతుంది. అందుకె మీ నాన్న నేను ఆ నాటకం ఆడాము.

వంశి : కాని జరిగిన హత్యల్లొ మీకు కూడా భాగం ఉందని తెలిసిపోయింది కదా ఇప్పుడు ?

గురుమూర్తి : తెలిసింది కాబట్టె వాళ్ళ నిఘా మొత్తం మా మీదె ఉంది. మేమిద్దరం వాళ్ళ అదుపులొ ఉన్నాము కాబట్టి ఇంక ఏ సమస్య ఉండదని ప్రశాంతంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళ మీద ఏ అనుమానం రాలేదు. 

నారాయణమూర్తి : మిగిలిన వాళ్ళు బయట ఉండడం వల్లె మనం తప్పించుకోగలిగాం. 

వంశి : ఇదంతా వింటుంటె నాకు వాళ్ళని చంపేయాలి అన్నంత కసిగా ఉంది.

నారాయణమూర్తి : ఆ అవకాశం నీకు కచ్చితంగా దొరుకుతుంది. 

కాసేపటికి వాళ్ళు పలాస ఊరి పొలిమేరకు చేరుకున్నారు. అక్కడ అల్తాఫ్ అన్నయ్య నాదీర్ నించోని ఉన్నాడు వాళ్ళ కోసం. తాను కూడా వాళ్ళు ఉన్న కార్ ఎక్కి. మహేష్ ఉన్న చోటకి దారి చూపించాడు.

గురుమూర్తి : నాదీర్ ఇప్పుడు అక్కడ ఎవరు లేరు కదా?

నాదీర్ : లేరు. నన్ను మహేష్ గారికి కాపలాగా పెట్టి విక్రమ్ మరియు వాళ్ళ నాన్న మహేంద్ర వర్మ కలిసి మిగిలిన వాళ్ళ మనుషుల తొ మంత్రి ఆనందరాజు ని కలవడానికి అని శ్రీకాకుళానికి వెళ్ళారు. (SIT)ధనుంజయ్ కూడా అక్కడికి వెళుతున్నాడు.

గురుమూర్తి : అంటె శత్రువులు అంతా ఇప్పుడు ఒకచోటికి చేరారు అనమాట. 

నాదీర్ : అవును. 

నారాయణమూర్తి : వాళ్ళకి అసలు నిజం తెలిసుకొని తిరిగి వచ్చె లోపు మనం ఇక్కడనుంచి వెంటనె మహేష్ ని తీసుకొనిపోవాలి.

అలా వాళ్ళు మహేష్ ని ఉంచిన చోటికి వెళ్ళి తనని విడిపించి తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతారు.
------------------------------------------------------------------------
శ్రీకాకుళంలొ విక్రమ్ వాళ్ళ నాన్న మహేంద్ర వర్మ ఇద్దరు మంత్రి ఆనందరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

కొంచెం సేపటికి మంత్రి ఆనందరాజు తొ పాటు (SIT) ధనుంజయ్ అక్కడికి వస్తారు.వాళ్ళంతా కలిసి శ్రీకాకుళం ఊరి చివర ఉన్న మహేంద్ర వర్మ ఫార్మ్ హౌస్ కి వెళతారు.

విక్రమ్ : అదేంటి నాన్న మనం పలాస కి వెళ్ళకుండా ఇక్కడ మన ఫార్మ్ హౌస్ లొ కలుద్దామని ఎందుకు అన్నావు.?

మహేంద్రవర్మ : ఇప్పుడె మనకు ఓ ముఖ్యమైన విషయం తెలిసింది.

విక్రమ్ : ఏంటది ?

(SIT) ధనుంజయ్ : వీరఘతకుడి వారసుడు దొరికాడు.

విక్రమ్ : ఎవరు వాడు?

(SIT) ధనుంజయ్ : గురుమూర్తి తమ్ముడి నారాయణమూర్తి కొడుకు అనిరుద కృష్ణ వంశి.

విక్రమ్ : ఏంటి వంశి ఆ?