Part - IX
తాను వీరఘాతకుడి కొడుకు ని అని నారాయణ మూర్తి చెప్పగానె వంశి మరియు సిట్ (SIT) ఆఫీసర్ ధనుంజయ్ నవ్వుతున్న నారాయణమూర్తి వంక ఆశ్చర్యంగా అలా చూస్తు ఉండిపోతారు.
తరువాత కోంచెంసేపటికి తేరుకొని. అతనిని పరి పరి విధాలు గా ప్రశ్నలు వేశారు ప్రతి దానికి అదే సమాధానం. ఇలా ఒక 4 రోజులు విచారణ కొనసాగింది గాని లాభం లేదు. ఆ తరువాత 5 వ రోజు విచారణ లొ కూడా నారాయణమూర్తి అలాగె చెప్తాడు.
(SIT) ధనుంజయ్ : ఏంటి తమాషా గా ఉందా? ఎన్నీ సార్లు అడిగినా అదె సమాధానం చెబుతున్నారు. అయిన ఎప్పుడొ 18వ శతాబ్దం లొ చనిపోయిన వీరఘాతకుడికి మీరు కొడుకా? అంటె ఇప్పుడు మీ వయసు 246 సంవత్సరాల? నమ్మాడానికి మేము ఏమైన పిచ్చివాళ్ళమా?
నారాయణమూర్తి : మీరు నమ్మిన నమ్మకపోయిన అదే నిజం. నేను వీరఘాతకుడి కొడుకుని.
(SIT) ధనుంజయ్ : నాన్ సెన్స్ మీ చేత ఎలా నిజం చెప్పించాలొ నాకు బాగా తెలుసు.
అని చెప్పి ఆ గది నుంచి బయటకి వెళ్ళబోతూ ఆగి వంశి వైపు చూస్తాడు. తను ఇంకా వాళ్ళ నాన్న నారాయణ మూర్తి వైపె చూస్తు ఉంటాడు.
(SIT) ధనుంజయ్ : వంశి..... వంశి.....
అని పిలవగానె వంశి ధనుంజయ్ వైపు తిరుగుతాడు
(SIT) ధనుంజయ్ : బయటికి పదా...
అని చెప్పి వంశి ని బయటకి తీసుకువెళతాడు.
(SIT) ధనుంజయ్ : వంశి నువ్వు మీ నాన్నగారిని ఇలా చూసి తట్టుకోలేక పోతున్నావు అని నాకు అర్ధం అవుతుంది. నువ్వు కావాలి అంటె ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పుకోవచ్చు పై అధికారులతొ నేను మాట్లాడుతాను. ఇక్కడ నుంచి ఈ కేసు ని మేము చూసుకుంటాము.
వంశి : లేదు నేను ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పుకోవాలి అని అనుకోవడం లేదు. నాకు ఇంకా తెలుసుకోవలిసినవి చాలా ఉన్నాయి.
1) 2 నెలల క్రితం లారి తొ గుద్దించి మా అమ్మ ని ఎవరు చంపించారు.?
2) మా నాన్న హోస్పెటెలు లొ చనిపోయినట్టు నాటకం ఆడి ఇక్కడకు వచ్చి ఇదంతా ఎందుకు చేస్తాన్నారు. చివరికి మా పెద్దనాన్న ని కూడా ఎందుకు చంపాలి అని చూశారు.?
3) ఆయన వెనుక ఇంకా ఎవరు ఉన్నారు.?
4) అసలు మా నాన్నె ఇదంతా చేస్తున్నారా? లేక ఇంక ఎవరైన ఇదంతా చేసి మా నాన్న ని ఇరికించారా?
ఎందుకంటె ఇందాక మా నాన్న మాట్లాడిన తీరు చూస్తె ఆయనకి మతి స్తిమితం తప్పినట్టు అనిపిస్తుంది. అదె నిజం అయితె దీన్నీ ఆసరాగా తీసుకొని వెరెవరైన ఈ హత్యలు చేసి మా నాన్న ని ఇందులొ ఇరికించవచ్చు.
(SIT) ధనుంజయ్ : నీ అనుమానాలన్నీ సరైనవె వంశి. కచ్చితంగా నువ్వు అడిగిన అన్నీ కోణాలనుంచి దర్యాప్తు చెద్దాం. ముందుగా మీ నాన్న గారు నిజమె చెప్తున్నారా లేదా అని లై డిటెక్టర్ ద్వారా చూద్దాం అప్పటికి కుదరకపోతె నార్కొ అనాలసిస్ చెద్దాం దానికి అనుమతి నేను తీసుకువస్తా
వంశి : అవును ముందుగా మా నాన్న నిజం చెప్తున్నారా లేదా తెలుసుకోవాలి.
అని చెప్పి వాళ్ళిద్దరు మరుసుటి రోజు ఒక మానసిక వైద్యుడిని, లై డిటెక్టర్ పరీక్ష చేసేవాడిని తీసుకు వస్తారు. వీళ్ళద్దరి సమక్షంలొ తాము బంధించిన నారాయణ మూర్తిని మళ్ళి విచారించారు.
కాని అప్పుడు కూడా వాళ్ళ అడిగిన ప్రశ్నలకి అవె జవాబులు "తాను వీరఘాతకుని కొడుకు ను అని తన కోసమె ఇదంతా చేశాను అని" చెబుతాడు.
లై డిటెక్టర్ పరిక్ష లొ అతను నిజమే చెబుతున్నట్టు చూపిస్తుంది.
వంశి మరియు ధనుంజయ్ అక్కడ ఉన్న మానసిక వైద్యుడి వద్దకి వెళ్ళి అడుగుతారు.
(SIT) ధనుంజయ్ : డాక్టర్ అతని మానసిక పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు.?
అతను నాటకాలు ఆడుతున్నాడా? లేక అతని మతిస్తితి సరిగ్గ లేదా?
మానసిక వైద్యుడు : అతిని మతిస్తితి సరిగ్గానె ఉంది. మరియు అతను నిజమె చెబుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఒకసారి నార్కొ అనాలసిస్ కి వెళ్ళి చూడండి.
అని చెప్పగానె కోర్టు నుంచి అనుమతి తెచ్చి నారాయణ మూర్తికి నార్కొ అనాలిసిస్ చేస్తారు. అందులొ కూడా అవె సమాధానాలు వస్తాయి. ఏం చెయ్యాలొ తెలియక బుర్ర లు పట్టుకొని కూర్చుంటారు.
ఈ లోపల డాక్టర్ విరించి ని ఫాన్ లొ బెదిరించి తన చేత తప్పుడు శవ పంచనామ (Post Mortem) రిపోర్ట రాయిచిన వ్యక్తి ఎవరొ తెలుస్తుంది. అది విని ధనుంజయ్ ఆశ్చర్య పోతాడు. వెంటనె వంశి ని పిలిచి
(SIT) ధనుంజయ్ : వంశి ఇప్పుడె నాకొక విషయం తెలిసింది డాక్టర్ విరించి కి కాల్ చేసి బెదిరించిన వ్యక్తి ఎవరో తెలుసింది.
వంశి : ఎవరు సార్ ?
(SIT) ధనుంజయ్ : మీ పెద్ద నాన్న గురు మూర్తి.
వంశి : ఏంటి మా పెద్ద నాన్న?
(SIT) ధనుంజయ్ : అవును...
............................................................
దంతపురం నుంచి మహేంద్ర వర్మ రహస్యం గా మహేష్ ని బంధించిన చోటికి చేరుకుంటాడు. అక్కడ బయట తనకోసం కొడుకు విక్రమ్ మరియు అతని స్నేహితుడు నాదీర్ తన కోసమె చూస్తున్నారు.
మహేంద్ర వర్మ : ఏరా విక్రమ్ వాడు ఇంకా ఆ మందు వల్ల కలిగిన అదె భ్రమ లొ ఉన్నాడా?
విక్రమ్ : లేదు. స్పృహ లోకి వచ్చాడు. నారాయణ మూర్తి పట్టుబడిన విషయం చెప్పాను
మహేంద్ర వర్మ : విని ఏమంటున్నాడు? అది ఎక్కడ ఉందొ నిజం చెప్పాడా?
విక్రమ్ : ఎక్కడుందొ చెప్పాడు గాని. అక్కడ ఒక సమస్య ఉంది.
మహేంద్ర వర్మ : ఏంటది?
విక్రమ్ : అందులోకి ఎవరు పడితె వాళ్ళు వెళ్ళడం కుదరదు.
మహేంద్ర వర్మ : మరి అందులోకి ఎవరు వెళ్ళగలరు?
విక్రమ్ : నువ్వె ఆ మహేష్ మాటల్లో విందువుగాని రా.
అని చెప్పి తనని మహేష్ ని బంధించిన గదికి తీసుకు వెళతారు. అక్కడ నారాయణమూర్తి పోలీసుల కి పట్టుబడ్డాడు అని మహేష్ బాధపడుతూ ఉంటాడు
విక్రమ్ : ఏ మహేష్..... నిన్నే...
అని పిలవగనె తను వాళ్ళ వైపు తిరుగుతాడు.
విక్రమ్ : అది ఉన్న చోటు ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా వెళ్ళాలొ మళ్ళి ఇప్పుడు చెప్పు?
మహేష్ : మళ్ళి తెలుసుకొని ఏం చేస్తారు.?
విక్రమ్ : తిక్క ప్రశ్నలు వేయకుండా అడిగింది చెప్పు
మహేష్ : సరె విను. దంతపురం ఊరి చివర వీరఘాతకుడిని కాల్చి చంపిన మఱ్ఱి చెట్టు ఉంది కదా.
మహేంద్ర వర్మ : అక్కడ ఉందా? అక్కడ ద్వారం ఉన్నట్టు ఏ అనవాళ్ళు లేవె?
మహేష్ : ఆ చెట్టు ఉన్న కొండ క్రింద ఎవరికి కనిపించని ఒక రహస్య ద్వారం ఉంది.
మహేంద్ర వర్మ : రహస్య ద్వారమా?
మహేష్ : అవును అది వేద మాయచక్రం ద్వారా కప్పబడిన ద్వారం. ఇది చుట్టుపక్కల వారి దృష్టిని తప్పు దారిలో నడిపిస్తుంది. కాని ప్రతి 120 సంవత్సరాలకు ఒకసారి అశ్విని, పుష్యమి, మఘ నక్షత్రాలు ఒకే రేఖలో కనపడె "త్రివేణి నక్షత్ర యోగం" ఉన్న సమయానికే ఈ ద్వారాని కి కప్పిన మాయజాలం తొలగుతుంది.
మహేంద్ర వర్మ : ఆ "త్రివేణి నక్షత్ర యోగం" ఎప్పుడు వస్తుంది?
మహేష్ : ఇంకొక వారం రోజుల్లో. కాని ఆ ద్వారం మీరు తెరవలేరు.
మహేంద్ర వర్మ : ఎందుకు అని.?
మహేష్ : ఎందుకంటె అది రుధిర బంధ ద్వారం
మహేంద్ర వర్మ : అంటె?
మహేష్ : అంటె ఆ ద్వారం సాధారణ తాళంతో మూయబడలేదు ఒక రుధిర తాళంతొ మూయబడింది అని.
మహేంద్ర వర్మ : రుధీర తాళం అంటే?
మహేష్ : అంటె ఒక నిర్దిష్ట రక్తసంబంధ వంశానికి చెందిన వ్యక్తి రక్తంతో మాత్రమే ఈ తాళం తెరుచుకుటుంది. ఇది ఒక జీవన-వేద శాస్త్రం ఆధారంగా రూపొందించబడిన శక్తియంత్రమ్.
మహేంద్ర వర్మ : అసలు అది ఎలా పని చేస్తుంది?
మహేష్ : ఆ తాళం ఎలా పని చేస్తుంది అంటె ద్వారంపై ఒక రక్త గ్రహిణి యంత్రం (Blood absorption system) ఉంటుంది.
ఈ యంత్రం లోపల ఒక మనిషికి సంబంధించిన జీనేతిక శబ్దాన్ని (genetic resonance) గుర్తించగల శక్తి ఉంది.
దానపై చెయ్యి వేసిన తర్వాత యంత్రం ఆ వ్యక్తి రక్తపు శక్తిని మరియు రేఖను చదువుతుంది.
మహేంద్ర వర్మ : తరువాత?
మహేష్ : సరైన వంశానికి చెందిన రక్తం అయితే యంత్రం స్పందించి తాళాన్ని తెరుస్తుంది
మహేంద్ర వర్మ : అలా కాకుండా వేరొకరి రక్తం అయితె?
మహేష్ : తప్పుడు రక్తమైతే యంత్రం తన రక్షణ చర్యలు ప్రారంభిస్తుంది. పూర్తిగా ఆ ద్వారం కనుమరుగు అయ్యి ఇంక శాశ్వతంగా ఎవరికి కనిపించకుండా చేస్తుంది.
మహేంద్ర వర్మ : ఇంత కి ఎవరి రక్తంతొ ఆ ద్వారం మూసివేయబడంది.?
మహేష్ : వీరఘాతకుని ది.
మహేంద్ర వర్మ : వీరఘాతకుని దా?
మహేష్ : అవును. ఆ ద్వారం తెరవాలంటె వీరఘాతకుడు గాని లేదా తన వారసులు గాని ఉండాలి.