Part - VII
ఆ రోజు రాత్రి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు వంశి తొ కలిసి నారాయణమూర్తి ని పట్టుకున్న విషయం ఊరి లోని మరియు బయట ప్రజలు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఎందుకంటె నారాయణ మూర్తి వెనక ఎవరైన ఉండి ఇదంతా చేయించి ఉండవచ్చు అనె అనుమానం తొ బయట పెట్టలేదు.
కాని ఈ విషయం ఎలాగో మహేంద్ర వర్మ కి తెలిసిపోయింది. వెంటనె తన కొడుకు విక్రమ్ కు కాల్ చేసి.
మహేంద్ర వర్మ : ఏరా వాడు నోరు విప్పాడా?
విక్రమ్ : చెప్పాడు నాన్న కాని వాడంతట వాడు చెప్ప లేదు.
మహేంద్ర వర్మ : మరీ ఎలా చెప్పించావు?
అని మహేంద్ర వర్మ తన కొడుకు ని అడిగేసరికి విక్రమ్ నవ్వుతాడు.
మహేంద్ర వర్మ : ఎలా చెప్పించావు అంటె నవ్వుతావు ఏంటి రా?
ఆని కాసేపు ఆగి
మహేంద్ర వర్మ : ఆగు ఆగు కొంప తీసి ఆ ఫార్ములా (Formula) దొరికిందా.?
విక్రమ్ : అవును నాన్న ఆ మహేష్ గాడి కొంప లోనె దొరికింది. మనం ఆ ఫార్ములా ఎక్కడ ఉందొ కనిపెట్ట లేము అనుకున్నాడు. కాని ఎక్కడ ఉందొ వెతికి అదె ఫార్ములా వాడి మీద ప్రయోగిస్తాను అని ఉహించి ఉండడు.
మహేంద్ర వర్మ : ఎదైతెనేమి మొత్తానికి ఆ ఫార్ముల వాడి మనకి కావలిసింది ఎక్కడ ఉందొ ఆ రహస్యం ఆ మహేష్ చేత చెప్పించావు అది చాలు. ఇప్పుడె బయలుదేరి నేను అక్కడికి వస్తున్నా.
విక్రమ్ : అలాగె నాన్న .
అని చెప్పి కాల్ కట్ చేసాడు.
ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు నారాయణ మూర్తి ని దంతపురం ఊరి చివరినె ఒక రహస్య ప్రదేశం లొ బంధించి ఉంచారు.
స్పృహ లొ లేని గురుముర్తిని మరియు ఆ ఊరి గుడి పూజారిని ఆసుపత్రి లొ చేర్చారు. అక్కడ వైద్యులు వాళ్ళ ని పరిశీలుస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించారు తెలుసుకోవడం కోసం వాళ్ళనుంచి రక్తం మరియు మూత్రం నమూనాలను (Blood & Urine samples) తీసుకొని పరీక్షించారు. దాని తాలుక రిపోర్ట్సు కోసం వంశి బయట ఎదురు చూస్తూన్నాడు.
అప్పుడు ఒక అసిస్టెంట్ డాక్టరు వచ్చి వంశి ని పిలిచి లోపలికి తీసుకు వెళతాడు. లోపల వెళ్ళగానె డాక్టర్ సత్యదేవ్ వంశి ని పలకరించి అక్కడె ఉన్న ప్రముఖ న్యూరోలజిస్ట్ డాక్టర్ విశ్వకర్మ ని పరిచయం చేస్తాడు.
వంశి : చెప్పండి డాక్టర్ ఏముంది రిపోర్ట్సు లొ?
డాక్టర్ సత్యదేవ్ : వాళ్ళ రక్త నమూనాల లొ ఏమి లేవు కాని వాళ్ళ మూత్ర నమూనాలను (Urine samples) పరీక్షించినప్పుడు డీ.ఎమ్.టి (DMT) అనె రసాయనం (Chemical) కలిసినట్టు గుర్తించాము. ఎవరొ వాళ్ళ శరీరంలొ ఈ రసాయనాన్నీ ఎక్కించారు.
వంశి : అసలు డీ.ఎమ్.టి (DMT) అంటె ఏంటి డాక్టర్? మామూలుగా ఇవి ఎక్కడ దొరకుతాయి మరియు ఎక్కడ వాడతారు?
అప్పుడు న్యూరోలజిస్ట్ డాక్టర్ విశ్వకర్మ కలగజేసుకొని.
డాక్టర్ విశ్వకర్మ : డీ.ఎమ్.టి (DMT) అంటె డైమిథైల్ ట్రిమ్టామైన్ (Dimethyltriptamine) ఇది ఒక సైకొడెలిక్ డ్రగ్ (Psychodelic drug) అంటె మానసిక క్రియాశీల మందు లాంటిది. క్లుప్తంగా చెప్పాలి అంటె మనిషి యొక్క మానసిక స్తితి పై ప్రభావం చూపేది.
వంశి : ఇది ఎలా పని చేస్తుంది డాక్టర్ ?
డాక్టర్ విశ్వకర్మ : ఇది శరీరం లొ చేరిన తరువాత మెదడు లొ రకారకాల ఆలోచనలు మెదులుతాయి. తరువాత మనిషి పూర్తిగా భ్రమ (Hallucination) లోకి వెళ్ళిపోతాడు. అందులొ ఉన్న వాళ్ళకి ఎవరొ పిలుస్తునట్టు ఏవొ కనిపిస్తున్నట్టు ఒక మైమరపు (trance) లొ ఉంటారు.
డాక్టర్ సత్యదేవ్ : నిజానికి ఈ రసాయనం (Chemical) కొన్ని రకాలైన మొక్కల్లోని, జంతువుల లోని చివరికి మనిషి మెదడు లొని సహజసిద్దంగా ఉంటుంది.
డాక్టర్ విశ్వకర్మ : మనిషి మెదడు లోని సిరోటినైన్ (Sirotinine) అనె మెదడు యొక్క నాడీ ప్రేరకం (Neurotransmitter) ఉంటుంది దీని వల్లె మనిషి యొక్క మానసిక స్తితి మరియు ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. దీంట్లొనె ఆ డీ.ఎం.టీ (DMT) అనె రసాయనం ఉంటుంది. ఇది ఏమాత్రం ఎక్కువ అయిన మనిషి మానసిక స్తితి లొ మార్పులు కలుగుతాయి.
డాక్టర్ సత్యదేవ్ : ఈ రసాయనాన్నీ పూర్వం మన భారత దేశంలొని కొన్నీ తాంత్రిక మరియు వైధిక పూజలొ తయ్యారు చేసి వాడె వాళ్ళంట. వాళ్ళు దీనిని సోమ లేదా సోమరసం అని పిలుస్తారు. ఇప్పటికి కొన్ని చోట్ల వైధిక పూజలలొ సోమయఙం అనె యఙం లొ సోమలత అనె మొక్క నుంచి ఈ సోమరసం తయ్యారు చేసి వాడతారు అని నేను విన్నాను. ఇది ఎంత వరకు నిజం నాకు తెలియదు
వంశి : ఇది శరీరం లొకి పంపించిన తరువాత ఎంత సేపు ఉంటుంది?
డాక్టర్ విశ్వకర్మ : అది ఇచ్చిన మొతాదు (Dosage) బట్టి ఆధారపడి ఉంటుంది. మామూలుగా 24 గంటలు నుంచి 30 గంటలు వరకు ఉంటుంది.
వంశి : ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎలా ఉంది? సృహ లోకి ఎప్పుడు వస్తారు.?
డాక్టర్ సత్యదేవ్ : సాయంకాలానికల్లా వాళ్ళు స్పృహ లోకి వస్తారు. వచ్చాక మీకు తెలియ పరుస్తాము
వంశి : సరే ఠాంక్యు డాక్టర్. ఇంక నేను బయలుదేరుతాను.
అని చెప్పి వంశి డాక్టర్సు ఇచ్చిన రిపోర్ట్సుని తీసుకొని వెళతాడు.
ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ పంచనామ (Post mortem) తాలుకు రిపోర్ట్సును మరియు ఆ రిపోర్ట్సు ఇచ్చిన డాక్టర్ విరించి ని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
(SIT) అధికారి ధనుంజయ్ : చెప్పండి డాక్టర్ విరించి చనిపోయిన వాళ్ళందరు కత్తి గాట్ల తొ చనిపోయారు అని పంచనామ (Post mortem) రిపోర్ట్సు లొ అబద్దం ఎందుకు వ్రాశారు.? నిజానికి వాళ్ళందరు ఎలా చనిపోయారు.? చేప్పండి? మీరుగా చెప్తె సరి లేదంటె మా పద్దతి లొ చెప్పించాల్సి ఉంటుంది.
డాక్టర్ విరించి : పంచనామ (Post mortem) రిపోర్ట్సు లొ అలా వ్రాయమని నాకు ఒక అతను 10 లక్షలు ఇచ్చాడు. డబ్బుకు ఆశపడి అలా వ్రాశాను.
(SIT) అధికారి ధనుంజయ్ : ఇతనె నా ?
అని నారాయణమూర్తి ఫొటొ చూపిస్తాడు.
డాక్టర్ విరించి : ఇతను కాదు.
(SIT) అధికారి ధనుంజయ్ : ఇతను కాదా? మరి ఇంకెవరు.?
డాక్టర్ విరించి : ఎవరొ నాకు తెలియదు ఒక రోజు నేను ఇంటి నుండి ఆసుపత్రి కి బయలుదేరుదాము అని అనకుంటు ఉండగా ఒకరు ఫోన్ చేసి ఇంటి బయట నీ కోసం ఒక పార్సల్ ఉంది చూడు అని చెప్పాడు. నేను వెళ్ళి చూస్తె ఆ పార్సల్ లొ డబ్బులున్నాయి. అది తీసుకొని అతను చెప్పినట్టు పంచనామ (Post mortem) రిపోర్ట్సు లొ వ్రాయమని అన్నాడు. లేదంటె నన్ను వాళ్ళ లాగా చంపేస్తాను అని బెదిరించాడు.
(SIT) అధికారి ధనుంజయ్ : ఫోన్ లొ అతని గొంతు ఎలా ఉంది? ఇంకొసారి వింటె గుర్తుపడతారా?
డాక్టర్ విరించి : గుర్తుపడతాను. ఎందుకు అంటె ఆ రోజు కాల్ లొ మాట్లాడింది అంతా రికార్డు అయ్యింది అది ఇంకా నా ఫోన్ లోనె ఉంది. మళ్ళి మర్చిపోకూడదు అని తీసి వెయకుండా ఉంచుకున్నా
అని డాక్టర్ విరించి చెప్పగానె తన ఫోన్ లొ ఉన్న కాల్ రికార్డింగ్సు అన్ని వాళ్ళు తమ కంప్యూటర్ లొ కాపి చేసుకున్నారు.
(SIT) అధికారి ధనుంజయ్ : సరే ఇంతకి వాళ్ళంతా ఎందు వల్ల చనిపోయారు? ముందు అది చెప్పండి?
డాక్టర్ విరించి : వాళ్ళందరి శరీరాల్లో ఎలాస్టేస్ (Elastase) అనె మాంసకృతి (Enzyme) ఉన్నట్టు గుర్తించాను.
(SIT) అధికారి ధనుంజయ్ : అది ఏంటి? దాని వల్ల ఏం జరుగుతుంది?
డాక్టర్ విరించి : మన శరీరం లొ ఎలాస్టిన (Elastin) మరియు కొలాజిన్ (Collagen) అనె ఒక రెండు పోషకాలు (Protiens) ఉంటాయి అవి మన చర్మం సాగాడానికి (Stretching) మరియు సాగింది మళ్ళి వెనక్కి రాడానికి (Shrinking) ఉపయోగ పడతాయి.
(SIT) అధికారి ధనుంజయ్ : అయితె?
డాక్టర్ విరించి : చనిపోయిన వాళ్ళందరి శరీరాల్లో ఈ పోషకాలు (Protiens) లేవు. ఈ ఎలాస్టేస్ (Elastase) అనె మాంసకృతి (Enzyme) వాటిని తినేసింది. దింతొ వాళ్ళు కొంచెం కదిలిన వాళ్ళ ఒంటి పై చర్మం తెగిపోయి రక్తం వస్తుంది. అలా ఒంటినిండా గాయాలు అయ్యి అధిక రక్తస్రావం తొ చనిపోతారు. విళ్ళందరు అలాగె చనిపోయారు.
ఇదంతా విన్న (SIT) అధికారి ధనుంజయ్ ఆశ్చర్యపోయాడు. "ఇలా కూడా మనుషులని చంపుతారా" అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపొతాడు.
తరువాత వంశి మరియు (SIT) అధికారి ధనుంజయ్ నారాయణ మూర్తి ని విచారించడానికి వస్తారు.
వంశి : నాన్న ఇప్పటికైన చెప్పండి ఎందుకు ఇదంతా చేశారు? దేనికోసం?
నారాయణ మూర్తి మౌనంగా ఉంటాడు. ఏమి మాట్లాడడు.
వంశి : దయచేసు చెప్పండి నాన్న ఎవరికోసం ఇదంతా చేశారు.?
నారాయణ మూర్తి : వీరఘాతకుని కోసం.
వంశి : ఏంటి వీరఘాతకుని కోసమా? ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఎప్పుడో 18 వ శతాబ్దం లొ చనిపోయిన వ్యక్తి కోసం ఇప్పుడు మీరు ఇదంతా చేసేరా?
నారాయణ మూర్తి : అవును.
వంశి : ఎందుకు నాన్న?
నారాయణ మూర్తి : ఎందుకంటె మనది ఆయన రక్తమే రా.
వంశి : ఆయన రక్తమా? ఏం మాట్లాడుతున్నారు నాన్న?
నారాయణ మూర్తి : అవును రా వంశి మనది ఆయన రక్తమె మనమంతా ఆయన వారసులం రా. ఆయన మా నాన్న నీకు స్వయాన తాతయ్య..
వంశి : ఏంటి వీరఘాతకుడు మీ నాన్న?
"అవును" అంటు నారాయణ మూర్తి విరగబడి నవ్వుతాడు
వంశి మరియు ధనుంజయ్ స్తబ్దులు (Stun) అయిపోయి నారాయణ మూర్తి ని చూస్తు ఉండిపోతారు.