Read Kalinga Rahasya - 6 by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • Pushpa 3 - Fan Theory Entertainment Touch

      Pushpa 3 Fan Theory (Entertainment Touch తో)ఇంట్రో:“ట్రైలర...

  • కళింగ రహస్యం - 6

    వీరఘాతక Part - VIకళింగ రాజ్యంలోని ప్రజలందరు వీరఘాతకుని ప్రతా...

  • అధూరి కథ - 7

    ప్రియ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉండడంతో అర్జున్ ఇక చేసిద...

  • అంతం కాదు - 28

    ఇప్పుడు వేటాడుదాం ఎవరు గెలుస్తారు చూద్దాం అని అంటూ ఆ చెట్లల్...

  • జానకి రాముడు - 1

    జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా   న...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 6

వీరఘాతక 
Part - VI

కళింగ రాజ్యంలోని ప్రజలందరు వీరఘాతకుని ప్రతాపం గురించి ఆంగ్లేయుల తొ తాను చేసిన యుద్దం గురించి కధలు కధలు గా చెప్పుకుటున్నారు. అతను తమ రాజు అయితె బాగుండును అని అనుకున్నారు. కాని అది కోటలోని రాజకుటుంబీకుల కి నచ్చలేదు వాళ్ళంతా మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

జనరల్ హెన్రీ మ్యేనార్డ్ (General Henry Maynard) మరియు తన ఆంగ్లేయుల సేన యొక్క మరణ వార్త బెంగాల్ లొ ఉన్న అప్పటి ఈస్ట్ ఇండియా కంపని గవర్నర్ (East India Company Governer) రాబర్ట క్లీవ్ (Robert Clive) కి తెలుస్తుంది. అప్పటికి ఇంకా ఈస్ట ఇండియా కంపని (East India Company) పూర్తి గా బెంగాల్ ని ఆక్రమించలేదు.

జెనరల్ హెన్రీ మ్యెనార్డ (General Henry Maynard) మరియు మిగిలిన కంపనీ సైన్యం యొక్క మరణ వార్త విన్న రాబర్ట క్లీవ్ (Robert Clive) కంపనీ అధికారుల తొ ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసాడు.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఛా ఇలా జరిగింది ఏమిటి? ఇంత ఆధూనిక ఆయుధాల తొ ఉన్న మన కంపనీ సైన్యాన్నీ కేవలం కత్తుల మరియు బాణాల ద్వారా చంపేశారా?. ఇది నమ్మశక్యంగా లేదె.

కంపిని ఆఫీసర్ వారన్ హాస్టింగ్స (Company Officer Warren Hastings) : సార్ మనకి వచ్చిన సమాచారం ప్రకారం ఇది నిజం. వాళ్ళు మన కంపనీ సైన్యాన్ని ఎంతొ సునాయాసంగా చంపేసారు.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అదే ఎలా?

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అక్కడికి వెళ్ళిన సైన్యాం లొ ఒకడు బ్రతికాడు. వాడి ద్వారానె తెలిసింది.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : నేను వాడిని ఇప్పుడె కలవాలి. అసలు అక్కడ ఏం జరిగిందొ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నా..

అక్కడ యుద్దం లొ విరఘాతకుడి నుంచి తప్పించుకున్న ఒక ఆంగ్ల సైనికుడిని తీసుకువచ్చి రాబర్ట క్లీవ్ (Robert Clive) ముందు నిలబెడతారు.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : చెప్పు అసలు అక్కడ ఏం జరిగింది.?

సైనికుడు : అక్కడ నేను ఒక అద్బుతాన్నీ చూసాను సార్. మన వాళ్ళు అందరు తుపాకుల తొ కళింగ సైన్యం పై దాడి చేస్తుంటె. ఒకడు గుఱ్ఱం పై మెరుపు వేగంతొ వచ్చి ఆ తుపాకీల నుంచి వచ్చె గుండ్లను తన ఖడ్గంతొ తిప్పికొట్టాడు సార్.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఏం మాట్లాడుతున్నావు. ఒకడు రావడం ఏంటి తన ఖడ్గంతొ తుపాకీ గుండ్ల ను తిప్పి కొట్టడం ఏంటి.

సైనికుడు : నిజం సార్. అతడు చాలా మెరుపువేగంతొ ఖడ్గాన్నీ తిప్పుతూ ముందుకు వచ్చాడు. ఏం జరుగుతుందొ తెలిసే లోపలే అక్కడ తుపాకీలు పట్టుకున్న మన సైనికుల చెతులు ఒక్కొక్కరిది నరుక్కుంటు పోయాడు.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఏంటి? అది ఎలా సాధ్యం ? ఇంత కి ఎవరు వాడు?

సైనికుడు : కళింగ రాజ్య సేనాధిపతి వీరఘాతకుడు సార్

ఆ పేరు వినగానె రాబర్ట క్లీవ్ (Robert Clive) ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు. 

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఏంటి వీరఘాతుకుడా? అతడు కళింగ రాజ్యానికి సేనాధిపతా? 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఏమైంది సార్? అతను మీకు ముందె తెలుసా?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : తెలుసు. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : తెలుసా? ఎలా ? ఎక్కడ చూసారు అతినిని మీరు.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : దక్షిణ భారతం లొ ని నేను ల్యుటినెంట్ (lieutenant) గా పని చేస్తున్నప్పుడు తంజావూర్ పై దాడి చేయ్యాలి అని నిశ్చయించుకొని అందుకు గాను సైన్యాన్నీ పంపించమని మద్రాస్ గ్యారీసన్ (Madras Garrison)  (గ్యారీసన్ అంటె అదనపు సైనికుల ను ఉంచె చోటు) లొని మేజర్ లారెన్స్ (Major Lawrence) కు సమాచారం ఇచ్చాము. ఆయన మొత్తం గ్యారీసన్ లోని సైన్యాన్నీ పంపించారు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అవును నాకు తెలుసు. అప్పుడు మనం గెలిచి ఆ తంజావూర్ ని మన స్వాధీనం లోకి తెచ్చుకున్నాము కూడా.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : మీ అందరికి అంతె తెలుసు. కాని అక్కడ ఏం జరిగిందొ నాకు మాత్రమె తెలుసు. నిజానికి ఆ యుద్దం మేము గెలవ లేదు

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : గెలవలేదా? మరి ఏం జరిగింది సార్ అక్కడ?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : సైన్యాన్నీ తీసుకొని నేను కావేరి నదికి ఉపనది అయినటువంటి కొళ్ళిధామ్ నదికి చేరుకున్నాము. అక్కడ మన సైన్యం కంటె పెద్ద సైన్యం అయినటువంటి తంజావూర్ సైన్యాన్నీ చూసాను. అప్పుడు ఆ సైన్యానికి నాయకుడు ఎవరో కాదు ఈ వీరఘాతకుడె.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఏంటి వీరఘాతకుడా? అక్కడ తంజావూర్ సైన్యానికి నాయుకుడు ఇక్కడ కళింగ రాజ్యానికి సేనాధిపతి గా ఎలా వచ్చాడు.?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అక్కడ ఉన్న తంజావూర్ సైన్యానికి యుద్ద విద్యం లొ మరింత నైపుణ్యం పొందెందుకు వాళ్ళందరికి శిక్షణి ని ఇవ్వడానికి తంజావూర్ నవాబ్ అయినటువంటి 'మొహమ్మద్ ఆలి ఖాన్ వల్లాజా' (Muhammad Ali Khan Wallajah) ఈ వీరఘాతకుడిని పిలిపించాడు అని తెలుసు కాని అతను కళింగ రాజ్యం సేనాధిపతి అని నాకు తెలియదు.
ఇంక అదే సమయం లొ మేము వస్తున్నట్టు వాళ్ళకి ముందుగానె సమాచారం అందడంతొ. వీరఘాతకుడుతొ నవాబ్ ఆలి ఖాన్ తన సైన్యాన్నీ అక్కడ మొహరించాడు.

అని చెప్పి కాసేపు ఆగాడు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఆ తరువాత ఏం జరిగింది సార్. 

రాబర్ట క్లీవ్ (Robert Clive) : వీరఘాతకుడి బలం తెలియని మేము అతని తొ మరియు అతని సైన్యం తొ యుద్దానికి దిగాము. అక్కడ అతను మెరుపు వేగంతొ తన కత్తిని తిప్పిడం చూసి ఆశ్చర్య పోయాను. అమిత వేగంతొ అతను ఒక చోట నుంచి ఇంకొ చోట కి కదులుతూ. అతనికి అడ్డొచ్చిన మన సైన్యం తలలు తెగనరుక్కుంటు వాళ్ళందిరిని దాటుకుంటు నావైపు దూసుకు వస్తున్నాడు. వెంటనె నేను ఎదురుగా నా వైపుకు వస్తున్నతన వైపు నా తుపాకిని గురిపెట్టాను. కాని నా తూటా లోని గుండు బయటికి వచ్చే లోపె అతను తన ఖడ్గం తొ నా తుపాకి ని రెండు ముక్కులు చేసాడు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఏంటి ఖడ్గం తొ మీ తుపాకి రెండు ముక్కలు చేసాడా?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అవును నా తుపాకి రెండు ముక్కలు అవ్వడం చూసి స్తబ్దుడి ని (stun) అయిపోయాను. వెంటనె నేను తేరుకొని నా ఒర లొని ఖడ్గాన్నీ బయటికి తీసే లోపు అతను తన ఖడ్గం తొ నా గుఱ్ఱం కాళ్ళు నరికేసాడు. దాంతొ నేను క్రింద పడ్డాను నా మీద నా గుఱ్ఱం పడింది. అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి నా తల నరకడానికి తన ఖడ్గాన్నీ పైకి ఎత్తాడు. నా మృత్యువు నాకు కళ్ళ ముందె కనిపించింది ఇవాళ నా చావు తద్యం అని కళ్ళు మూసుకున్నా. సరిగ్గ అతను నా తల నరికె సమయానికి.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఆ సమయానికి? ఏం జరిగింది సార్? చెప్పండి సార్ ఏం జరిగింది మీరు ఎలా తప్పించుకున్నారు. 

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఆ సమయానికి ఒక తంజావూర్ సైనికుడు వీరఘాతకుడిని ఆపి నవాబ్ ని బంధించారని నన్ను చంప వద్దు అని చెప్పాడు. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : నవాబ్ ని బంధించారా? ఎవరు సార్?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అవును నిజానికి మేము ఇక్కడ యుద్దం చేస్తున్న సమయం లొ మేజర్ లారెన్స్ (Major Lawrence) మరి కొంతమంది సైన్యంతొ కలిసి దేవకొట్టయి లొ దాగి ఉన్న తంజావూర్ నవాబ్ ఆలి ఖాన్ ని బంధించాడు. అక్కడ తక్కువ సైన్యం ఉండడం తొ నవాబ్ సునాయాసంగా పట్టుబడ్డాడు. అది విన్న ఆ వీరఘాతకుడు నన్ను చంపకుండా బంధించాడు 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : బంధించి ఎక్కడ కు తీసుకు వెళ్ళాడు సార్ 

రాబర్ట క్లీవ్ (Robert Clive) : నన్ను బంధించి దేవకొట్టయి కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఉన్న మేజర్ లారెన్స్ (Major Lawrence) నన్ను వదిలేయమని శాంతియుతంగా చర్చలు జరుపుదామని లేదంటె నవాబ్ ఆలిఖాన్ చనిపోతాడని బెదిరించాడు. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : దాంతొ వీరఘాతకుడు లొంగిపోయాడా సార్ ? 

రాబర్ట క్లీవ్ (Robert Clive) : లేదు నన్ను ముందుకు తోసి తన ఖడ్గం తొ నా వీపు మీద గాయం చేసి నా కంఠం పై కత్తి పెట్టి అందరు లొంగి పోకపోతె నన్ను చంపెస్తాను అని బెదిరించాడు . అసలు మెజర్ లారెన్స్ (Major Lawrence) పట్టుకుంది నవాబ్ ఆలి ఖాన్ ను కాదు అని చెప్పాడు. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అదేంటి? నవాబ్ కాదా?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అవును బంధించబడ్డది నవాబ్ ఆలి ఖాన్ కాదు. అతని లాగా వేషం వేసుకున్న అతని అంగరక్షకుడు. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఏంటి అంగరక్షకుడా ?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అవును అది తెలియగానె మేజర్ లారెన్స్ తొ పాటు అతని సైనికులను కూడా బంధించాడు. ఇంక మేము ఎవరము తప్పించుకొలేము అని మాకు అర్ధం అయ్యింది. సరిగ్గా ఆ సమయం లొనె నిజమైన నవాబ్ మొహమ్మద్ ఆలి ఖాన్ మరికొంతమంది సైన్యంతొ అక్కడికి వచ్చాడు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : వచ్చి మీ అందిరిని ఏం చేసాడు? 

రాబర్ట క్లీవ్ (Robert Clive) : వచ్చి రాగానె మమల్ని అందరిని వదిలేయమన్నాడు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అదేంటి మిమల్ని అందిరిని వదిలేయమన్నాడా? ఎందుకు?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : మద్రాసు నుంచి అతనికి ఒక ఉత్తరం వచ్చింది అది చదివి.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : మద్రాసు నుంచి వచ్చిన ఉత్తరమా? ఏంటి సార్ అది? అక్కడి నుంచి ఎవరు పంపించారు? ఏముంది ఆ ఉత్తరం లొ? అది చదివి నవాబ్ మిమల్ని అందిరిని ఎందుకు వదిలేయమన్నాడు?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఆ ఉత్తరం పంపించింది మద్రాసు గవర్నర్ తామస్ సాండర్స్ (Governer Thomas Saunders). అందులొ ఆయన ఇలా వ్రాశారు. నవాబ్ ఆలిఖాన్ వల్లాజా శత్రువు అయినటువంటి ఆర్కోట్ నవాబ్ చాంద్ సాహిబ్ (Arcot Nawab Chaand sahib) ఫ్రెంచి వాళ్ళ తొ కలిసి తన పై యుద్దానికి వస్తున్నాడు అని. మనతొ (ఆంగ్లేయుల తొ) చేతులు కలిపితె వాళ్ళ ని ఎదిరించడానికి మనం మద్దతు ఇస్తామని గవర్నర్ వ్రాశారు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : తరువాత ఏమైంది సార్.

రాబర్ట క్లీవ్ (Robert Clive) : తరువాత రొజుల్లొ మేము నవాబ్ ఆలిఖాన్ తొ కలిసి ఆర్కోట్ నవాబ్ చాంద్ సాహిబ్ ని అతని తొ కలిసి ఉన్న ఫ్రెంచి సైన్యాన్నీ యుద్దంలొ ఓడించి ఆ రాజ్యాన్నీ బ్రిటీష్ ఆధీనంలోకి తీసుకు వచ్చాము. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అవును ఇదంతా మాకు తెలుసు కాని ఆ వీరఘాతకుడు ఏమయ్యాడు.?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : వాడిని అంత తేలిక గా ఎలా వదిలేస్తాను నాకు చావు భయం ఎలా ఉంటుందొ చూపించాడు. అందుకె ఆర్కోట్ నవాబ్ తొ యుద్దానికి ముందు ఆ వీరఘాతకుడి ని చంపేయమని నవాబ్ ఆలి ఖాన్ కి చెప్పాము.
అతను "ఎందుకు చంపడం? వద్దు" అన్నాడు. కాని మేము "యుద్దం లొ మా మద్దతు కావాలి అంటె అతని చావు మాకు కావాలి అని" చెప్పాము. 

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : మరి ఒప్పుకున్నాడా?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : ఆ.. ఒప్పుకున్నాడు ఆ వీరఘాతకుడిని బంధించి నా ముందె ఉరి తీసి చంపి తరువాత అతని శవాన్నీ కొళ్ళిధామ్ నది లొ పడేశాము.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఏంటి చంపెసారా ? మరి చచ్చిన వాడు ఇప్పుడు కళింగ రాజ్యంలొ సెనాధిపతి గా ఎలా వచ్చాడు.?

రాబర్ట క్లీవ్ (Robert Clive) : అదే నాకు అర్ధం కావడం లేదు.