Read Kalinga Rahasyam - 3 by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 3

Part - III 

ఆ రోజు రాత్రి అందరు పడుకున్నాక వంశి నెమ్మదిగా బయటకి వచ్చి ఊరి చివరన ఉన్న మఱ్ఱి చెట్టుకు వద్దకు బయలుదెరుతాడు.

ఊరు పొలిమేర దాటాక చీకటి గా ఉండడంతొ తాను తెచ్చుకున్న టార్చ్ లైట్ (torch light) వెలిగిస్తాడు.

టార్చ్ లైట్ (torch light) వెలిగించగానె ఎవరొ నడుచుకుంటు వెళ్ళడం చూస్తాడు. ఎవరా అని చూస్తె ఆ ఊరి షావుకారు రామ్మోహన్. తన పై టార్చ్ లైట్ (torch light) వెలుతురు పడిన పట్టించుకోకుండా ఎటో చూస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు. 

"రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు" అని వంశి ఎంత పిలిచిన పట్టించుకోకుండా ఊరి చివర మఱ్ఱి చెట్టు వైపు కు నడుచుకుంటు వెళుతున్నాడు.

అది గమనించిన వంశి తన వెనకే వెళతాడు. ఇద్దరు మఱ్ఱి చెట్టుక వద్దకు చేరుకుంటారు. రామ్మోహన్ అలా మఱ్ఱి చెట్టు వంక చూస్తూ నించుటాడు. 

వంశి కొంచెం దూరంలొ నించోని అదంతా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఆ మఱ్ఱి చెట్టు నుంచి ఏదొ వెలుతురు మరియు ఏవొ పొగలు రావడం గమనిస్తాడు. 

ఎందుకైన మంచిదని వంశి ఇంకొంచెం దూరంగా వెళ్ళి అక్కడ నించొని ఇదంతా గమనించడం మొదలు పెడతాడు. 

చెట్టు నుంచి వచ్చిన పొగ వల్ల రామ్మోహన్ కనిపించడు. అక్కడ ఏం జరుగుతుందొ వంశి కనబడడటం లేదు. కొంచెం సేపు తరువాత పొగ పోయింది. కాని అక్కడ రామ్మోహన్ లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ అంతా వెతికి చూస్తాడు కాని కనిపించడు. 

ఏంచేయలొ తెలియక వంశి అక్కడ కొంచెం సేపు తచ్చాడి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లొ అందరు నిద్రపోతూ ఉండడం గమనించి తన గది లొకి వెళ్ళిపోతాడు.

మరుసటి రోజు ఉదయం వంశి ని వాళ్ళ పెద్దనాన్న గురుమూర్తి వచ్చి నిద్ర లేపి. 
"ఒరేయ్ నువ్వు త్వరగా బట్టలు మార్చుకొని రా" అని చెప్తాడు.

బట్టలు మార్చుకొని వంశి బయటకు వచ్చాక. తనని తీసుకొని షావుకారు రామ్మోహన్ ఇంటి వెళతాడు అక్కడ ఊళ్ళో జనం అంతా  రామ్మోహన్ ఇంటి ముందు గుమిగూడడం చూసి కొంచె ముందుక వెళితె అక్కడ అంబులెంసు (Ambulance) దాని పక్కన పోలీసులు నిలబడి ఉండడం చూస్తాడు. 

స్ట్రెట్చెర్ (Stretcher) లొ షావుకారు రామ్మోహన్ శవాన్నీ ఎక్కిస్తుంటారు. 

అది చూసి వంశి "రాత్రి మాయమైన రామ్మోహన్ ఇక్కడ శవం లా కనిపించడం ఏంటి" అంటు ఆలోచిస్తూ ఉండగా..

"రాత్రి నువ్వు ఏం చూశావు రా వంశి " అని గురుమూర్తి అడుగుతాడు.

అది విని "ఏం చూడ్డం పెద్ద నాన్న ఏం మాట్లాడుతున్నావు" 

"నువ్వు రాత్రి బయటకు వెళ్ళి రావడం నేను చూసాను రా. అంతే కాదు నువ్వు ఈ ఊరు కి వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు దేని గురించొ తెలుసుకోవాలి చూస్తున్నావు. 

ఈ చావుల వెనుకున్న రహస్యాం గురించేనా?"

" ఇక్కడ వద్దు పెద్దనాన్న మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం" అని చెప్పి వంశి గురుమూర్తిని ఇంటికి తీసుకొని పోయాడు.

ఇంటికి చేరాక వంశి తలుపులు అన్నీ మూసి తాను ఎవరనేది ఇక్కడికి ఎందుకు వచ్చింది చెప్తాడు. తరువాత తాను రాత్రి చూసింది కూడా చెబుతాడు.

ఇది విన్న గురుమూర్తి ఒకింత ఆశ్చర్యానికి లోనవుతాడు. 

" నాకు కూడా ఏం జరుగుతుందొ తెలుసుకోవాలనె ఉంది. కాని భయం వల్ల నేను ముందకు వెళ్ళ లేక పోయాను" అని అంటాడు గురుమూర్తి.

"చూసిన నాకే ఏం అర్ధం కావడం లేదు పెద్ద నాన్నా. అక్కడ మాయం అయిన రామ్మోహన్ ఇక్కడ శవం లా కనబడడం ఏంటో"

"ఇదంతా చూస్తుంటె నాకు కూడా ఆ వీరఘాతకుడి ఆత్మే వచ్చి చంపుతున్నాడు అనిపిస్తోంది రా వంశి" 

"ఇది వీరఘాతకుడి ఆత్మ చేసిన పని అని నేను నమ్మను పెద్దనాన్న." 

"ఏమో రా నువ్వు మాత్రం జాగ్రత్త గా ఉండు  నీకేమైనా అయితె నేను తట్టుకోలేను"

"నాకు ఏమి అవ్వదూ లే పెద్దనాన్న". అని చెప్పి తన గదికి వెళ్ళి పోతాడు.
............................................................

మహేంద్ర వర్మ దంతపురం ఊరిలొ జరుగుతున్న విషయం గురించి మాట్లాడడానికి మంత్రి ఆనంద రాజు అపాయింటమెంట్ (Appointment) తీసుకొని అతని ని విశాఖపట్టణం లొ కలుస్తాడు. 

"నమస్కారం మంత్రి గారు" అంటు మహేంద్ర వర్మ మంత్రి ఆనందరాజు ఆఫీసు లోకి వస్తాడు 

"నమస్కారం మహేంద్ర గారు. రండి కూర్చోండి" 

మంత్రి : ఎలా ఉన్నారు ? 
మహేంద్ర వర్మ: నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
మంత్రి : కాఫీ లాంటిది ఏమైన తీసుకుంటారా?
మహేంద్ర వర్మ : ఇప్పుడు ఏం వద్దు. నిజానికి నేను మీతొ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను.
మంత్రి : మీ దంతపురంలొ జరుగుతున్న చావుల గురించే గా? 
మహేంద్ర వర్మ : అవును. 
మంత్రి : మా ప్రభుత్వం ఇంతకు ముందె ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ (Special imvestigation team) మీ ఊరికి పంపించింది. వాళ్ళు తమ దర్యాపతు ని మొదలుపెట్టారు కూడా. 
మహేంద్ర వర్మ : అంటే దానితొ పాటు మిమల్ని ఇంకో విషయం కూడా అడుగుదామనె ఉద్దేష్యంతొ వచ్చాను.
మంత్రి : ఏంటది?
మహేంద్ర వర్మ : మా ఊరి నడిబొడ్డులొ విరిగిన వీరఘాతకుడి విగ్రాహాన్నీ తీసి కొత్తది పెట్టి అక్కడ శాంతి హోమం చేయిద్దామని చూస్తున్నాము. అందుకు మీ అనుమతి కావాలి.
మంత్రి : ఆ విగ్రహం పెట్టడం అంత అవసరమా? ఆ కధ ని మీరు నమ్ముతున్నారా?
మహేంద్ర వర్మ : ఇక్కడ నేను నమ్మడం కాదు ఊరి ప్రజలు నమ్ముతున్నారు. అది కాక ఆ విగ్రాహాన్నీ మా పూర్వికులు పెట్టించారు. కాబట్టి వాళ్ళందరి మీద గౌరవంతొ....
మంత్రి : సరె సరె. ముందు నేను మీ ఊరులొ ఉన్న దర్యాప్తు బృందం తాలుకు ఆధికారి (SIT Head) తొ మాట్లాడి. వాళ్ళు ఒప్పుకుంటె అప్పుడు చెప్తాను. 
మహేంద్ర వర్మ : సరే అయితె మరి నేను వెళ్ళొస్తాను. 
మంత్రి : సరే. ఇంతకి మీ అబ్బాయి పని ఎంత వరకు వచ్చింది.?
మహేంద్ర వర్మ : ఇంకొక్క నెల రోజులు. పూర్తి అయిపోతుంది ఈ సారి. ఇంక నేను వస్తాను.
............................................................

అదొక పాడుబడిన ఇల్లు. చుట్టూ జన సంచారం లేని ప్రాంతం. అక్కడ ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు దిగి ఆ ఇంట్లోకి వెళతారు. వాళ్ళ చేతులొ ఒక బాగు ఉంటుంది.

లోపలికి వెళ్ళి ఒక గది తలుపు తీస్తారు. ఆ గది లొ ఓ వ్యక్తి నేల మీద పడుకొని ఉంటాడు. అతనిని వాళ్ళు గొలుసుల తొ కట్టి బంధించి ఉంచారు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి 

" ఏ లే " అని అనగానె అతను లేచి వాళ్ళను చూస్తాడు. 

"ఏం మహేష్ ఎలా ఉన్నావు" అని నాదిర్ అడుగుతాడు.

మహేష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు

"మేము చెప్పినట్టు విని ఉంటె నీకు ఈ అవస్త తప్పేది కదా. మాకు తెలియకుండా నువ్వు భువనేష్వర్ పారిపోవాలి అనుకున్నావు. కాని అది నీ వల్ల కాలేదు" అని విక్రమ్ అంటాడు.

"నువ్వు పారిపోకుండా రహాదారి (Highway) కి వెళ్ళె మార్గం లొ చెట్ల కొమ్మలను నరికింది మేమె." అని నాదిర్ అంటె

"ఇప్పటికైన మించి పోయింది ఏమి లేదు మాకు సహకరించు. అది ఎక్కడుందొ చెప్పు నిన్ను వదిలేస్తాము" అని విక్రమ్ మహేష్ ని హెచ్చరిస్తాడు. 

"నేను చెప్పను మీరు నన్ను చంపిన కూడా" మహేష్ అంటాడు.

"త్వరలోనె నువ్వు చెప్తావు నీ చేత ఎలా చెప్పించాలొ నాకు బాగు తెలుసు" అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుంచు వెళ్ళి పోతారు.
............................................................

దంతపురం లొ వంశి తన గది లో కూర్చొని ఆ రోజు రాత్రి తాను ఆ మఱ్ఱి చెట్టు వైపు వెళుతున్నప్పుడు మరియు ఆ చెట్టు దగ్గర తన పెన్ కేమరా (Pen Camera) ద్వారా తీసిన వీడియోని పరీషిలిస్తాడు. ఏమైన క్లూ దొరుకుతుంది ఏమోనని. 

ఆ వీడియోలొ ఒక చోట ఒక నల్లటి ఆకారం కనిపిస్తుంది. అది ఎవరా అని మరింత పరిషీలించి చూసాడు. 

ఎవరో మనిషి కత్తి పట్టుకొని నించోని ఉండడం చూస్తాడు. సరిగ్గా ఆ పోగ వల్ల రామ్మోహన్ మాయమైనప్పుడె ఇతను కూడా మాయం అయ్యాడు. 

ఈ సారి మళ్ళి వీడియొ ని వెనక్కి తిప్పి (Rewind) చూస్తాడు. ఆ నల్ల ని ఆకారం లొని వ్యక్తి ఎవరు అనేది కనబడలేదు కాని అతని చేతికి ఉన్నా కడియం మాత్రం మెరిస్తూ కనిపించింది. ఆ వీడియొ ని అపి (Pause) ఆ బొమ్మను పెద్దది (Zoom) చేసి చూస్తాడు. 

"ఆ కడియాన్నీ ఎక్కడో చూసినట్టుందె" అని వంశి అనుకుంటాడు. 

"ఆఆ గుర్తొచ్చిది ఈ కడియాన్నీ నేను అతని చేతికే చూసాను"