Read Kalinga Rahasyam - 8 by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 8

Part - VIII

బెంగాల్ లొని రాబర్ట క్లీవ్ (Robert clive) మరియు మిగిలిన ఈస్ట ఇండియా కంపెని అధికారులు (Company officers) అంతా వీరఘాతకుడు ఎలా బ్రతికి వచ్చాడా అని అర్ధం కాకా తలలు పట్టుకొని కూర్చుంటారు. 

ఆ సమయం లొ గవర్నర్ బంగళాకు ఒక లేఖ ను తీసుకొని ఒకడు వస్తాడు. బంగళా బయట కాపలా కాస్తున్న వాళ్ళ కు తాను కళింగ రాజ్యం నుంచి వచ్చాను అని గవర్నర్ రాబర్ట క్లీవ్ (Robert clive) కోసం ఒక సందేశాన్నీ తెచ్చాను అంటు. లోపలికి వెళ్ళడానికి అనుమతి కోరుతాడు.

అప్పుడు అక్కడ ఉన్న కాపలాదారుల్లొ ఒకడు లోపలికి వెళ్ళి వాళ్ళ రక్షణ అధికారి (Security officer) కి ఈ విషయం చెబుతాడు. అతడు గవర్నర్ ఉన్న గదికి వెళతాడు.

రక్షణ అధికారి (Security officer) : అంతరాయానికి క్షమించాలి (Sorry to disturb) సార్ నేను మీకు ఒక విషయం చెప్పడానికి రావలిసి వచ్చింది. 

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఏంటి ఆ విషయం?

రక్షణ అధికారి (Security officer) : కళింగ రాజ్యం నుంచి ఏదొ లేఖ తీసుకొని ఒకడు వచ్చాడు మిమల్ని కలవడానికి అనుమతి అడుగుతున్నారు. లోపలికి పంపించమంటారా?

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : కళింగ రాజ్యం నుంచా? 

రక్షణ అధికారి (Security officer) : అవును సార్

రాబర్ట క్లీవ్ (Robert clive) : సరే పంపించు.

రక్షణ అధికారి (Security officer) : అలాగె సార్.

అని చెప్పి ఆ రక్షణ అధికారి (Security officer) అక్కడ నుంచి వెళ్ళి కాసేపటికి ఆ లేఖ ను తీసుకు వచ్చిన రాయభారిని లోపలికి పంపిస్తాడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎవరు నువ్వు? కళింగ రాజ్యం నుంచి నీ చేత ఆ లేఖ ను ఎవరు పంపించారు.?

కళింగ రాజ్యం రాయభారి : అది మీరె ఈ లేఖ ని చదివి తెలుసుకోండి.

అని చెప్పి అతను ముందు తాను తెచ్చిన లేఖ ని ఉంచుతాడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : వారన్ (Warren) ఆ లేఖ ఏంటొ చూడు.

అని చెప్పగానె వారన్ హాస్టింగ్స (Warren Hastings) ఆ లేఖ ని తీసుకొని చదువు మొదలుపెడతాడు.

" ఈస్ట్ ఇండియా కంపని గవర్నర్ రాబర్ట క్లీవ్ (Robert clive) కి మీ స్నేహం కోరి ఈ లేఖ ను వ్రాస్తున్నాను. ఆ వీరఘాతకుడి తొ మీకు ఉన్న గతం మరియు అతని పై మీకు ఉన్న పగ ఏంటొ మాకు తెలుసు. 

అతను మాకు కూడా శత్రువె ఆ వీరఘాతకుడి గురించి కావలిసిన పూర్తి వివరాలు మీకు నేను ఇస్తాను. మాతొ గనక చేతులు కలిపితె మనం కలిసి ఆ వీరఘాతకుడిని అంతం చేయచ్చు.
ఈ ప్రతిపాదన (Proposal) మీకు నచ్చితె మిమ్మల్ని నేను రహస్యంగా కలుస్తాను. 
అప్పటి వరకు మీ జవాబు కోసం ఎదురు చూస్తాను. "

అని వారన్ హాస్టింగ్స (Warren Hastings) ఆ లేఖ ని చదవడం ముగిస్తాడు.

కళింగ రాజ్యం రాయభారి : మీ సందేషం ఏంటి అని తెలుపమంటారు. ?

రాబర్ట క్లీవ్ (Robert clive) : మాకు కొంత వ్యవధి కావాలి అంత వరకు నువ్వు బయట వేచి ఉండు. మళ్ళి పిలుస్తాము.

అని చెప్పి ఆ రాయభారిని కొంచెంసేపు బయటకి పంపిస్తారు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఏం వారన్ (Warren) ఏం అనుకుంటున్నావు అతను చెప్పిన దాని గురించి? నీ సలహా ఏంటి?

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : నా ఉద్దేష్యం అతనిని ఒకసారి కలిస్తె మంచింది. ఆ వీరఘాతకుని గురించి ఏం చెప్తాడొ విందాం. మనకు ఏమైనా పనికొస్తుందేమొ. 

రాబర్ట క్లీవ్ (Robert clive) : నేను అదె అనుకుంటున్నా. కాని ఒకవేళ ఇది మనల్ని దెబ్బకొట్టడానికి వేసిన ఉచ్చు అయితె? మనం చాలా జాగ్రతగా ఉండాలి

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అయితె మనం అతనిని మన బ్యారెక్స (Barracks) కె పిలుద్దాము. ఒక్కడినె రమ్మని చెబుదాం. ఇక్కడైతే మన వాళ్ళందరు ఉంటారు కనుక అతను ఏమి చెయ్యలేడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : సరే. 

కాసేపటికి బయట ఉన్న రాయభారిని లోపలికి పిలుస్తారు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : మేము ఆయనను కలవాలడానికి ఒప్పుకున్నాము చెప్పు. కాని ఆయన ఇక్కడికె రావాలి అది ఒంటరి గా. అలా అయితెనె కలుస్తాము అని చెప్పు

కళింగ రాజ్యం రాయభారి : సరె అలాగె చెబుతాను.

అని చెప్పి కళింగ రాజ్యానికి తిరిగి వెళ్ళి నేరుగా కోటలోని ఒకరి గది కి వెళతాడు. ఆ గది లొ రాజు ఇంద్ర వర్మ బావమరిది వజ్రహస్తుడు ఉంటాడు. రాయభారి అతని వద్దకు వెళతాడు.

వజ్రహస్తుడు : చేప్పు వెళ్ళిన పని ఏమైంది?

రాయభారి : కలవడానికి ఒప్పుకున్నారు కాని ఒంటరి గా వాళ్ళ చోటికె రమ్మన్నారు. 

వజ్రహస్తుడు : సరె. అలాగె కలుద్దాం. ఇంత కి నువ్వు ఎవరికి అనుమానం రాకుండానె వెళ్ళి వచ్చావు కదా?

రాయభారి : ఎవరి కి అనుమానం రాలేదు ప్రభు. 

2 రోజులు తరువాత వజ్రహస్తుడు ఒక్కడె వెళ్ళి రాబర్ట క్లీవ్ (Robert clive) ని కలుస్తాడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : చెప్పండి మీరు ఆ వీరఘాతకుని గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు.?

వజ్రహస్తుడు : ఆ వీరఘాతకుడు మీరు ఊహించిన దానికంటె చాలా శక్తిమంతుడు. అతనిని అంతం చేయడం అంత సులభం కాదు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : అది నువ్వు ఎలా చెప్పగలవు?

వజ్రహస్తుడు : దేవకొట్టయి లొ మీరు అతనిని ఉరి తీసి చంపినా కూడా తిరిగి బ్రతికి వచ్చాడు. దీని బట్టి తెలియదా వాడు ఎంత శక్తిమంతుడొ. పైగా వాడు మీకు చావుని పరిచయం చేసాడు కదా.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఇదంతా నీకు ఎలా తెలుసు?

వజ్రహస్తుడు : నాకు అంతా తెలుసు. అంతె కాదు వాడు తిరిగి ఎలా బ్రతికి వచ్చాడు కూడా నాకు తెలుసు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎలా బ్రతికాడు.?

వజ్రహస్తుడు : దానికంటె ముందు ఒక విషయం చెప్పండి ఉరితీసిన తరువాత వాడు చనిపోయాడు అని ఎలా మీరు నిర్ధారించారు.?

రాబర్ట క్లీవ్ (Robert clive) : నా ముందె ఆ వీరఘాతకుడికి ని ఉరితీసారు. సుమారు ఒక 30 నిమిషాల పాటు వాడిని ఉరికంబానికి అలాగె వేలాడదీసి ఉంచారు. తరువాత మా వైద్యులు చేత అతని శ్వాస, గుండె మరియు నాడీ లని పరిక్షించి చూసి వాడు చచ్చాడు అని నిర్ధారించుకున్నాక వాడి శవాన్నీ ఒక గుడ్డ లొ చుట్టి దానికి రాయి కట్టి నది లొ పడేశాము. కాని వాడు ఎలా బ్రతికాడొ అర్ధం కావడం లేదు.

వజ్రహస్తుడు : అదె ఆ వీరఘాతకుని గొప్పతనం. ఇప్పటి వరకు మీరు మీ కళ్ళు తొ చూసింది చెప్పారు. కాని అక్కడ జరిగింది మరొకటి.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఏం జరిగింది?

వజ్రహస్తుడు : చెబుతాను కాని అంతకంటె ముందు ఆ వీరఘాతకుని గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. నిజానికి వీరఘాతకుని జన్మ రహస్యం ఎవ్వరికి తెలియదు మహారాజుకి తప్ప. అతను వీరఘాతకుడు పసిపిల్లాడు గా ఉన్నప్పుడె కళింగ రాజ్యానికి తీసుకువచ్చాడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : మీరు ఎవరు ఆ పిల్లవాడు ఎక్కడనుంచి వచ్చాడు అని మీ మహారాజు ని అడగలేదా?

వజ్రహస్తుడు : చాలా సార్లు అడిగి చూసాము ఎప్పడు అడిగినా అతని కి ఎవరులేరని. అందుకె తెచ్చి పెంచుకుంటున్నా అని చెప్పెవాడు అంతె

రాబర్ట క్లీవ్ (Robert clive) : మరీ మహారాజు భార్య. అదె మీ చెల్లి లీలావతి ఏమనలేదా? 

వజ్రహస్తుడు : తను కూడా ఏమనేది కాదు. పైగా ఆ వీరఘాతకుడిని కన్నకొడుకులా చూసుకునేది. దానికి తోడు ఎన్నో సంవత్సరాలు తరువాత మహారాణి గర్భవతి అయ్యింది. ఇది వాడు రాజ్యం లొ అడుగుపెట్టడం తరువాతె కావడంతొ. వాడు రావడం వల్లె జరిగింది అని అదృష్టంగా భావించేది.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఇదంతా మాకెందుకు? అసలు వాడు ఎలా బ్రతికాడొ అది చెప్పు.

వజ్రహస్తుడు : అది అర్ధం కావడానికె ముందు ఆ వీరఘాతకుని గతం తెలియాలి అని చెబుతున్నా. వాడి గురించి పూర్తి గా మీరు తెలుసుకుంటేనె ఎలా బ్రతికాడొ తెలుస్తుంది.

రాబర్ట క్లీవ్ (Robert clive) : సరే చెప్పండి.

వజ్రహస్తుడు : వీరఘాతకుడు పెరిగి పెద్ద అవుతున్న కొద్ది విద్యాబ్యాసం లొ చాలా చురుకుగా ఉండెవాడు. 13 సంవత్సరాలు లొ నేర్చుకోవలసిన విద్యబ్యాసం అంతా కేవలం 4 సంవత్సరాలలొ నేర్చుకున్నాడు. అప్పటికె వీరఘాతకుడికి 12 సంవత్సరాలు అతను మరింత విద్య నేర్చుకోవడం కోసం ఒక్కడె హిమాలయాలకు వెళ్ళాడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : హిమాలయాల కా? అక్కడ ఎవరు ఉన్నారు. ?

వజ్రహస్తుడు : ఎందరొ మహిమగల సాధువులు మరియు ఎంతొ శక్తివంతమైన సిద్దులు ఉన్నారు. వాళ్ళ వద్ద 10 సంవత్సరాల పాటు కఠోర శిక్షణ పొంది ప్రాచీన యోగ విద్యలు, ప్రాణాయామాలూ, శరీర నియంత్రణ విధానాలు నేర్చుకున్నాడు. వాటిలొ ముఖ్యమైనివి 

కేవల కుంభక :
శ్వాసను పూర్తిగా ఆపేసే స్థితి. ఈ స్థితిలో శరీరం శ్వాసించదు, కానీ అంతర్గత జీవ శక్తి మిగిలి ఉంటుంది. 

హృదయ స్థంభన :
గుండె కొట్టుకునె వేగాన్నీ తగ్గించి చాలా నెమ్మదిగా కొట్టుకునే లా చేయడం. అసలు గుండె కొట్టుకునట్టు అనిపించదు

జల సంస్కార శక్తి :
నీటి అడుగున ఉంటూనె దానిలోని చల్లదనాన్నీ గ్రహించి శరీరం కాలనాశనాన్నీ (Decompose) ఎదుర్కోనెలా చేయడం (Hebernation). యోగశక్తితొ శరీరం తద్విరూపంగా నిలుస్తుంది – జీవ శక్తిని నిలుపుకుంటుంది

ధ్యానం – సమాధి స్థితి:
తాను శరీరంచేత గాని శ్వాస చేత గాని పరిమితుడుని కాదు అనుకుంటాడు. ఈ బోధనతో సమాధిలోకి ప్రవేశిస్తాడు. కొన్ని సంవత్సరాలపాటు అతడు "జీవంగా – చలనం లేని" స్థితిలో ఉండగలడు కూడా.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : ఏంటి ఇలాంటి విద్యలంటు ఉంటాయా?

వజ్రహస్తుడు : ఉంటాయి. ఇవన్నీ మీ పాశ్చాత్యులకు అర్ధంకావు మరియు తెలియవు కూడా. వాటితొ పాటు ఇంకా చాలా విద్యలు నేర్చుకున్నాడు. కాని వీటి గురించి మాత్రమే చెప్పడానికి ముఖ్యకారణం ఏంటొ తెలుసా?

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఏంటి ఆ కారణం?

వజ్రహస్తుడు : ఈ విద్యల తోనె ఆ వీరఘాతకుడు బ్రతికాడు కాబట్టి.

రాబర్ట క్లీవ్ (Robert clive) : అంటె ?

వజ్రహస్తుడు : అర్ధంకాలేదు కదా? వీరఘాతుకుడిని ఉరితీస్తునప్పుడు అక్కడ మీరంతా చూసింది ఒకటి కాని అక్కడ జరిగింది ఏంటొ చెబుతాను వినండి

రాబర్ట క్లీవ్ (Robert clive) : చెప్పండి

వజ్రహస్తుడు : ఉరి తీసె ముందె ఆ వీరఘాతకుడు కేవల కుంభక విద్య ద్వారా తన శ్వాసను నియంత్రించుకున్నాడు.

తరువాత హృదయ స్థంభన విద్య ద్వారా తన గుండె ని అతి స్వల్పంగా కొట్టుకునేలా చేశాడు. దాంతొ మీ వైద్యులు చూసినప్పుడు అతని గుండె అగిపోయిందని అనుకున్నారు

తరువాత మీరు నది లొ పడేసిన తరువాత జలసంస్కార శక్తి ని ఉపయోగించి ద్యానం తొ సమాధి స్థితి లొ చెరుకుని నీటి అడుగులోనె ఉన్నాడు. 

దీనంతటికి ముందె మీ ఎవ్వరికి తెలియకుండా  కొళ్ళిధామ్ నది వద్ద తన మనిషిని కాపలాగా ఉంచాడు. మరుసటి రొజు ఉదయం అతను నది లో దూకి సమాధి స్థితి లొ ఉన్న వీరఘాతకుడిని బయటకు తీసాడు.

వజ్రహస్టుడు చెప్పనదంతా విన్న ఆంగ్లేయులంతా ఆశ్చర్యం తొ స్తబ్దులు అయ్యి నిలబడిపోయారు.

వారన్ హాస్టింగ్స (Warren Hastings) : అయితె ఇన్నీ విద్యలు తెలిసిన వాడిని చంపడం చాలా కష్టం.

వజ్రహస్తుడు : కష్టమే కాని అసాద్యం కాదు. వీరఘాతకుడిని చంపె ఆయుధం ఒక్కటె నమ్మకద్రోహం.

రాబర్ట క్లీవ్ (Robert clive) : అలాంటి ద్రోహం చేసేవాడు ఎక్కడ ఉన్నాడు

వజ్రహస్తుడు : రాజ కుటుంబం లొనె ఉన్నాడు.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎవరు అతను ?

వజ్రహస్తుడు : మహారాజు ఇంద్ర వర్మ కుమారుడు మరియు నా మేనల్లడు అనంత వర్మ. నిజానికి ఆ లేఖ రాసింది నన్ను ఇక్కడికి పంపింది కూడా తనె.

రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎందుకు? అతనికి ఏంటి అవసరం?

వజ్రహస్తుడు : కళింగ రాజ్య సింహాసనం.