Part-XI
శవపంచనామ (Body Postmortem) రిపోర్టు ని మార్చమని డాక్టర్ విరించి ని బెదిరించింది తన పెద్దనాన్న గురుమూర్తి అని తెలియగానె వంశి స్తబ్దుడు అయిపోతాడు.
వంశి : ఏంటి? డాక్టర్ చేత రీపోర్టు మార్చి వ్రాయించింది మా పెద్దనాన్న? నేను నమ్మలేకపోతున్నా.
(SIT) ధనుంజయ్ : నేను కూడా ముందు నమ్మలేదు వంశి కాని మనవాళ్ళు ఆ ఫోన్ నంబర్ ద్వారా దర్యాప్తు చేసి తెలుసుకున్న వివరాలు మరియు సేకరించిన ఆధారాలు చూసాక నమ్మక తప్పలేదు.
వంశి : అసలు మా పెద్దనాన్న కి ఇదంతా చేయ్యాల్సిన అవసరం ఏంటి? అదీ కాకుండా ఆయన కి కూడా ఈ హత్యల్లొ భాగం ఉంటె మరి నాన్న ఎందుకు ఆ రోజు ఊరి గుడి పూజారి తొ పాటు పెద్దనాన్న ని కూడా చంపాలి అనుకున్నారు.?
(SIT) ధనుంజయ్ : నీకు వచ్చిన అనుమానాలె నాకు కూడా వచ్చాయి వంశి. అందుకోసమె మీ పెద్ద నాన్న ని కూడా అదుపులోకి తీసుకొని విచారించాలి. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్తితి బాగానె ఉందిగా?
వంశి : బాగుంది. ఇంకాసేపటి లో ఆయన్నీ డిస్చార్జ్ చేయబోతున్నారు.
(SIT) ధనుంజయ్ : అయితె మనం వెంటనె వెళ్ళి ఆయన్నీ అదుపులోకి తీసుకోవాలి. ముందు నువ్వు హాస్పెటల్ కి వెళ్ళి అక్కడె ఉండు. ఈ లోపు నేను అరేస్ట వారెంట్ తీసుకొని అక్కడికె వస్తా.
వంశి : సరే సార్.
అనుకున్నట్టు గానె వాళ్ళు హాస్పెటల్ లొ ఉన్న గురుమూర్తి ని తమ అదుపు లోకి తీసుకున్నారు.
తనని కూడా తన తమ్ముడు నారాయణమూర్తి ని ఉంచిన చోటనె మరొక గది లొ ఉంచారు.
వంశి : పెద్దనాన్న ఏంటి ఇదంతా? మీరు నాన్న కలిసి ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దయచేసి చెప్పండి?
గురుమూర్తి : ఏం మీ నాన్న నీకు ఏమి చెప్పలేదా?
అని చెప్పి వెటకారంగా నవ్వుతాడు.
దాంతొ వంశి కి చాలా కోపం వస్తుంది. చివాలున లేచి తాను కూర్చున్న కుర్చిని కాలి తొ తంతాడు.
వంశి : పెద్ద నాన్న మీరు నాన్న కలిసి నా సహనాన్నీ పరీక్షిస్తున్నారు. అక్కడ నాన్న ఏమొ వీరఘాతకుడి కొడుకుని అంటారు ఇక్కడ మీరేమొ వెటకారంగా మాట్లాడుతున్నారు. అసలు మీరిద్దరు ఎందుకు ఇదంతా చేస్తున్నారొ చెబుతారా చెప్పరా?
గురుమూర్తి : నేను నోరు విప్పాలి అంటె నా తమ్ముడు కూడా ఇక్కడికి రావాలి. లేదంటె ఇలాగె ఉంటాను.
అని గురుమూర్తి అనగానె వంశి గది బయట నించున్న (SIT) ధనుంజయ్ వంక చూస్తాడు.
(SIT) ధనుంజయ్ తనని బయటకి రమ్మని సైగ చేస్తాడు.
వంశి : ఏం చేద్దాం సార్ ?
(SIT) ధనుంజయ్ : ఏం పరవలేదు మీ నాన్న గారిని కూడా ఇక్కడికె తీసుకువచ్చి మీ పెద్దనాన్న గారిని ఎదురు గా కూర్చొపెట్టి ఇద్దరిని ఒకేసారి విచారిద్దాం. మీ నాన్న గారు ఉంటె చెబుతా అన్నారు గా. విందాం మీ పెద్ద నాన్న ఏం చెబుతారొ.
కొంచెంసేపటికి నారాయణమూర్తిని కూడా గురుమూర్తి ఉన్న గదికి తీసుకువచ్చి తన ఎదురుగా కూర్చొపెడతారు.
(SIT) ధనుంజయ్ : మీరు అడిగినట్టె మీ తమ్ముడిని తీసుకువచ్చాం. ఇప్పటికైనా చెబుతారా?
గురుమూర్తి : రేయ్ నారాయణ మన వాడికి ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది రా. కాబట్టి ముందు నువ్వు మొదలుబెట్టు.
గురుమూర్తి తన తమ్ముడు నారాయణ మూర్తి ని నిజం ఏంటొ చెప్పమని అనగానె. అందరు నారాయణ మూర్తి వైపు చూస్తున్నారు తను ఏం చెప్తాడా అని.
నారాయణ మూర్తి మౌనంగా ఉన్నాడు. గది మొత్తం నిశ్శబ్దం అలవరించి ఉంది. కొంచెం సేపటికి నారాయణ మూర్తి మాట్లడడం మొదలు పెట్టాడు.
నారాయణ మూర్తి : మీరంతా అనుకున్నట్టు చనిపోయిన ఆ 9 మంది అమాయకులు కాదు. మా తల్లిదండ్రుల హత్యకు పాత్రులు.
(SIT) ధనుంజయ్ : ఏంటి ? ఇది ఇంకొక కట్టు కధ?
గురుమూర్తి : కాదు నిజం. మా తల్లిదండ్రుల హత్య కు వాళ్ళంతా బాద్యులు అందుకె చంపాము.
(SIT) ధనుంజయ్ : ఎలా? అసలు వాళ్ళకి మీ తల్లి దండ్రుల కి ఏంటి సంబంధం ? వాళ్ళకి మీ అమ్మ నాన్న ని చంపాల్సిన అవసరం ఏంటి?
నారాయణ మూర్తి : మా నాన్న సూర్య మూర్తి ఒక పురావస్తు శాస్త్రవేత్త (Archeologist). కళింగ రాజ్యాన్నీ పాలించిన రాజ వంశీయుల పై ఆయన పరిశోధన చేసెవారు. అలా ఆయన కళింగ రాజ్యాన్నీ ఆఖరున పరిపాలించిన తూర్పు గంగా వంశం (Eastern Ganga Dynasty) గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఒక రహస్య నేలమాళిగ (Mysterious tunnel) గురించి తెలిసంది. దాంట్లొ కళింగ రాజ్య అపార సంపద ఉంది. కాని మా నాన్న గారికి దృష్టి ని ఆకర్షంచింది మాత్రం అదె నేలమాళిగ (Tunnel) లొ ఉన్న ఎంతొ శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన నీలమణి (Sapphire Stone).
వంశి : అంత ప్రత్యెకత ఏముంది ఆ నీలమణి (Sapphire Stone) లొ ?
గురుమూర్తి : ఆ నీలమణి (Sapphire Stone) ని ఒక రోజంతా సూర్యుని వెలుగులొ ఉంచితె అది సూర్య కిరణాల ను గ్రహించి తన లొ దాచుకుంటుంది. ఒక్కసారి సూర్యుని వెలుగు పడడం ఆగిపోయి చీకటి కమ్మగానె గ్రహించిన కిరణాల ద్వారా ఆ నీలమణి (Sapphire Stone) నీలి కాంతులతొ సౌరశక్తిని ఉత్పత్తి చెస్తుంది.
(SIT) ధనుంజయ్ : ఆ సౌరశక్తి ఉత్పత్తి చేసె నీలమణి (Sapphire Stone) ని అప్పట్లొ విద్యుత్ కేంద్రంగా వాడేవారా?
నారాయణ మూర్తి : కాదు సౌరశక్తి ని ఉత్పత్తి చేసె ఆ నీలమణి (Sapphire Stone) ని ఋషులు వంశధారా నది అడుగు భాగాంలొ అమర్చెవారు.
వంశి : ఎందుకు ?
నారాయణ మూర్తి : ఎందుకంటె ఆ సౌరశక్తి లొ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతె ఆ నీలమణి (Sapphire Stone) ని నది అడుగు భాగాన ఉంచుతారొ ఆ సౌరశక్తి వల్ల అప్పుడు ఆ నది లొని నీరంతా ఔషధం గా మారి ఆ నీళ్ళు త్రాగిన ప్రజల కి ఎంటువంటి వ్యాధులైన నయం అయ్యేలా చెస్తుంది. ఒంటి పైన గాయాలు, పుండ్లు ఏమైన ఉంటె అవి తగ్గేలా చేస్తాయి.
గురుమూర్తి : కాని ఆ నీలమణి (Sapphire Stone) గురించి దానితొ పాటు ఆ నేలమాళిగ లొని అపార సంపద గురించి ఆంగ్లేయులకు తెలిసిపోయింది. ఇవేమి వారి చేతికి చిక్క కూడదు అనె ఉద్దేష్యం తొ దానిని ఈ నేవమాళిగ లొ రహస్యంగా దాచారు.
(SIT) ధనుంజయ్ : సరే దీనికి మీ తల్లిదండ్రులు చనిపోడానికి సంబంధం ఏంటి?
గురుమూర్తి : సంబంధం ఉంది.
(SIT) ధనుంజయ్ : ఏంటి అది?
గురుమూర్తి : మా నాన్న గారు ఆ రహస్య నేలమాళిగ (Secret Underground) ను ఎక్కడుందొ కనుక్కున్నారు. ఆ విషయం ప్రభుత్వం లోని కొంతమంది పెద్ద లకు వాళ్ళ ద్వారా బడా వ్యాపారవేత్తలకు తెలిసిపోయింది.
నారాయణ మూర్తి : ఆ బడా వ్యాపార వేత్త ల్లొ ఒకడె తూర్పు గంగా వంశానికి చెందిన ఇప్పటి వారసుడు మహేంద్ర వర్మ. వాడు ఆ చనిపోయిన ఆ 9 మంది ద్వారా మా తల్లిదండ్రుల ను చంపించాడు.
(SIT) ధనుంజయ్ : ఏంటి? మహేంద్ర వర్మ మీ అమ్మ నాన్న లను చంపించాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు.?
గురుమూర్తి : నిజం మాట్లాడుతున్నాం.
(SIT) ధనుంజయ్ : మీరు చేసిన హత్యలను కప్పిపుచ్చడానికి మహేంద్ర వర్మ పై ఆధారాలు మరియు సాక్ష్యాలు లేని నిందలు వేస్తున్నారా?
గురుమూర్తి : ఆధారాలు మరియు సాక్ష్యాలు లేవని ఎవరన్నారు. ఉన్నాయి కాబట్టె వాడు మా తల్లిదండ్రులను చంపిన విషయం తెలిసింది.
(SIT) ధనుంజయ్ : ఏంటి ఆ ఆధారాలు? ఎవరా సాక్ష్యులు? పైగా 35 సంవత్సరాల క్రితం జరిగిన మీ తల్లిదండ్రుల మరణాల కి వాళ్ళ తొ సంబంధం ఉందని ఎలా నిరూపించగలరు.?
నారాయణ మూర్తి : మా అమ్మ నాన్న చనిపోయిన 6 నెలల తరువాత. అప్పుడు మా ఇంటిని మేము సద్దుతున్నాము. మా ఇంట్లొ మా నాన్న గారి ఆఫీసు పని కోసం అని వేరుగా ఒక గది ఉండేది. ఆ గదిలోకి ఎవరిని పెద్దగా ఆయన రానిచ్చేవారు కాదు. ఆయన చనిపోయిన తరువాత మేమిద్దరం ఆ గదిని సద్దడానికి అని వెళ్ళాము. అలా సద్దతున్నప్పుడు బీరువా వెనకాల ఒక చిన్న గది తలుపు కనిపించింది.
గురుమూర్తి : ఏంటా అని మేమిద్దరం ఆ బీరువాని పక్కకి జరిపి ఆ తలుపు ని తెరచి చూస్తె లోపల ఏదొ ఫైల్ మరియు ఒక విడియె కాసెట్ ఉంది దానిపై నా పేరు వ్రాసి ఉంది. ఆ ఫైల్ పైన వీరఘాతక అని పేరు వ్రాసి ఉంది. తెరిచి చూస్తె ఏదో సంస్కృత భాష లొ వ్రాసి ఉన్న కొన్నీ కాగితాలు కనిపించాయి అందులొ ఈ నీలమణి బొమ్మ గీసి ఉంది.
నారాయణ మూర్తి : మాకు అందులొ ఏమి అర్ధం కాలేదు. తరువాత ఆ వీడియొ కాసెట్ లొ ఏముందొ వి.సి.అర్ లొ పెట్టి చూసాము. అది మా నాన్న గారి వీడియె అందులొ ఆయన ఇలా చెప్పారు
సూర్య మూర్తి (వీడియొ లొ) :
"ఈ వీడియె నువ్వు చూస్తున్నావంటె అప్పిటికె నేను చనిపాయుంటాను. కాని ఈ వీడియొ రికార్డ చేయడానికి గల కారణం చాలా సంవత్సరాలు గా నేను నా బృందం కలిసి కళింగ రాజ్యం గురించి తెలుసుకోడానికి ఎంతొ పరిశోధన చేసాం. అలా ఆ పరిశోధన లొ మాకు కళింగ రాజ్యం యొక్క అపార సంపద మరియు దాంతొ పాటు అత్యంత శక్తివంతమైన నీలమణిని ఒక రహస్య నేలమాళిగ (Secret underground) లొ దాచినట్టు తెలిసింది. అది ఎక్కడిందొ మరియు అందులోకి ఎలా వెళ్ళాలొ అంతా ఆ ఫైల్ లొ ఉంది. ఈ ఫైల్ కోసం నా వెంట చాలా పెద్ద పెద్ద వాళ్ళు పడుతున్నారు అందులొ ముఖ్యమైన వాళ్ళు కళింగ రాజ్య ఆఖరి వంశానికి చెందిన మహేంద్ర వర్మ మరియు వాడి తండ్రి అచ్యుతవర్మ. వీళ్ళ తొ పాటు ఈ ఊరి ఎం.ఎల్.యె ఆనంద రాజు ఉన్నారు. మన దేశానికి చెందవలసిన ఈ అపార సంపద ను వాళ్ళ చేతికి దొరక కూడదు. నేను చనిపోతె నా చావుకి కారణం వీళ్ళె".
గురుమూర్తి : అని మా నాన్న గారు చనిపోయె ఒక వారం ముందు ఈ వీడియొ రికార్డ్ చేశారు.
అని చెప్పి గురుమూర్తి తన ఇంటి లొ భద్రంగా దాచిన ఆ వీడియొ కాసెట్ పోలీసుల చేత తెప్పించి వాళ్ళ కి ఆ వీడియో చూపించాడు.
(SIT) ధనుంజయ్ ఆ వీడియొ కాసెట్ ని ఫారెన్ సిక్ లాబ్ కు పంపించి అందులొ ఉన్న వీడియో అసలా లేక నకిలిదా అని తెలుసు కోమని తన అసిస్టెంట్ కి ఇచ్చి పంపింస్తాడు.
(SIT) ధనుంజయ్ : సరె కాని ఈ వీడియొ లొ మీ నాన్న గారు కేవలం అనుమానం మాత్రమె వ్యక్తం చేసారు కదా.
గురుమూర్తి : అందుకె నేను మా నాన్న తొ పని చేసిన వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు తెలుసు కోవాలి అని వెళ్ళాము. కాని వాళ్ళు అప్పటికె ప్రాణ భయం తో వేరు వేరు ఊళ్ళకి వెళ్ళిపోయారు.
(SIT) ధనుంజయ్ : మరి ఆ తరువాత ఏం చేశారు.?
గురుమూర్తి : 6 ఏళ్ళ పాటు ఎవ్వరికి అనుమానం రాకుండా మేము వాళ్ళని వెతికాము. చివరికి నా తమ్ముడి స్నేహితుడైన మహేష్ ద్వారా మా నాన్న గారితొ కలిసి పని చేసిన ఈశ్వర్ రావు గారి జాడాను తెలుసుకున్నాము.
నారాయణ మూర్తి : ఆ ఈశ్వర్ రావు గారు ఎవరోకాదు నా స్నేహితుడు మహేష్ వాళ్ళ నాన్న గారు. ఆయన బరంపురం లొ ఉన్నారు అని తెలిసి వెళ్ళి ఆయనను కలిసాము. అతను మా అమ్మ నాన్న లని చంపడం కళ్ళారా చూసారు. ముందు చూపుతొ మేము ఆయన వాంగ్మూలాన్నీ కూడా వీడియొ తీసి పెట్టాము అది కూడా మీరు తీసుకు వెళ్ళిన కాసెట్ లోనె ఉంది.
గురుమూర్తి : మా అమ్మ నాన్న లది యాక్సిడెంట్ అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ వీరించి కూడా ఒక ముఖ్యమైన సాక్షి.
(SIT) ధనుంజయ్ : అన్నీ తెలిసాక ఇన్నీ సంవత్సరాలు ఎందుక ఆగారు? దేని కోసం?
గురుమూర్తి : అన్నీ తెలిసిన ఇన్నీ సంవత్సరాలు ఏమి చేయకుండా ఉండడానికి కారణం ఆ నిధి కోసమె. అది వాళ్ళ లాంటి స్వార్ధపరులు కు చిక్కకూడదని.
(SIT) ధనుంజయ్ : మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు.?
నారాయణ మూర్తి : ఆ నిధి ఉన్న రహస్య నేలమాళిగ ప్రతి 120 సంవత్సరాలకు ఒకసారి అశ్విని, పుష్యమి, మాఘం నక్షత్రాలు ఒకే రేఖలో కనపడె "త్రివేణి నక్షత్ర యోగం" లొ మాత్రమె కనిపిస్తుంది. అది ఇంకొ వారం రోజుల్లో రాబొతుంది. దీని అంతటి గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళం నేను మరియు నా స్నెహితుడు మహేష్ మాత్రమె.
(SIT) ధనుంజయ్ : ఎందుకంటె మీరిద్దరు కూడా పురావస్తు శాస్త్రవెత్తలు. అందుకె మీ పై కూడా హత్యాయత్నం క్రింద 2 నెలల క్రితం మీరు వెళుతున్న కారు ను ఒక లారితొ గుద్దించారు. అందులోంచి మీరు కొన ఊపిరి తొ బయటపడగా మీ భార్య శాంతగారు మాత్రం అక్కడె చనిపోయారు. తరువాత మీరు హాస్పెటల్ లొ చనిపోయినట్టు నాటకం ఆడి మీ అన్నయ్య గురుమూర్తి మరియు మీ స్నేహితుడు మహేష్ సహాయంతొ తప్పించుకున్నారు. కాని మీరు బ్రతికి ఉన్నట్టు తెలియని మీ శత్రువులు మీ స్నేహితుడు మహేష్ ని బంధించి ఆ నిధి గురించి అతనిని వేధిస్తున్నారు.
నారాయణమూర్తి : అవును. అదె జరిగింది.
వంశి : మరి ఇన్నీ ఆధారాలు ఉన్నప్పుడు నాకు చెప్పచ్చు కద నాన్న చట్ట పరంగా వాళ్ళ కి శిక్ష పడేలా చేసెవాడిని అంతెగాని చట్టాన్నీ మీ చేతులొ తీసుకుంటారా? ఎందుకు?
గురమూర్తి : ఎందుకంటె మీ బాస్ (SIT) ధనుంజయ్ కూడా వాళ్ళ మనిషె కాబట్టి.
వంశి : ఏం మాట్లడుతున్నారు పెద్దనాన్న ? (SIT) ధనుంజయ్ సార్ మహేంద్ర వర్మ మనిషా?
గురమూర్తి : అవును మరి లేకపోతె మీ నాన్న స్నేహితుడు మహేష్ ని బంధించిన విషయం వాడికి ఎలా తెలుసు?
అని గురుమూర్తి అన్న మాట వినగానె షాక్ తిన్న వంశి తన బాస్ (SIT) ధనుంజయ్ వైపు తిరిగి చూస్తాడు.
(SIT) ధనుంజయ్ : నన్ను క్షమించు వంశి. ఈ హత్యలన్నీ చేయిస్తుంది మీ నాన్నె అని నాకు తెలుసు. అందుకె ఈ దర్యాప్తు లొ నిన్ను ఎంచుకున్నా.
అని చెప్పి వంశి కి తెలిసె లోపు తన తొ పాటు వాళ్ళ నాన్న మరియు పెద్దనాన్న ఉన్న ఆ గది తలుపు ని మూసేస్తాడు.