Read Kalinga Rahasyam - 10 by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 10

Part - X

మహరాజు కుమారుడు అనంత వర్మ సింహాసనం కోసం వీరఘాతకుడిని చంపడానికి చూస్తున్నాడన్న మాట వినగానె రాబర్ట క్లీవ్ (Robert clive) మరియు అక్కడ ఉన్న మిగిలిన వారంతా అర్ధం కాక తెల్లమొహాలు వేశారు
వారన్ హాస్టింగ్స (Warren Hastings) : మహారాజు ఇంద్ర వర్మ కి అతను ఒక్కడ గా తన వారసుడు. తననె గా తన తరువాతి రాజు గా చేసేది. మరి అలాంటప్పుడు సింహాసనం కోసం తనని చంపాల్సిన అవసరం ఏంటి.?
వజ్రహస్తుడు : అవును మీరు చెప్పింది నిజమె కాని మా మహారాజు తన కుమారుడు అనంత వర్మ ని కాకుండా వీరఘాతకుడిని తన తరువాతి రాజు గా చెయ్యాలి అనుకుంటున్నాడు.
రాబర్ట క్లీవ్ (Robert clive) : ఎందుకు?
వజ్రహస్తుడు : ఎందకంటె వీరఘాతుకుడి ని మా మహారాజు తన పెద్ద కుమారుడు గా భావిస్తున్నారు కాబట్టి.  అంతెకాకుండా తన కుమారుడు అనంతవర్మ ప్రవర్తన పట్ల ఆయనకు అనుమానం ఉంది. అతనొక స్వార్ధపరుడు అని మరియు ప్రజల పట్ల అతని తీరు అస్సలు బాగోలేదని ఆయన ఉద్దేష్యం. 
వారన్ హాస్టింగ్స (Warren Hastings) : సరే ఇప్పుడు మా తరుపునుంచి మీకు ఏ విధమైన సహాయం కావాలి. ?
అని అడగగానే వజ్రహస్తుడు తను మరియు రాజకుమారుడు అనంత వర్మ ఆలోచించి ఉంచిన పథకాన్నీ వాళ్ళకి వివిరించి చెబుతాడు.
రాబర్ట క్లీవ్ (Robert clive) : మీకు సహాయం చేస్తె మాకేంటి లాభం?
వజ్రహస్తుడు : అనంతవర్మ మహారాజు అవ్వగనె కళింగ రాజ్య అపార సంపద లొ మీకు సగ భాగం వస్తుంది.
రాబర్ట క్లీవ్ (Robert clive) : మాకు ఒక రోజు వ్యవధి కావాలి. అప్పటి వరకు మీరు మా అతిధి గృహంలొ ఉండండి.
వజ్రహస్తుడు : సరె రేపు కలుద్దాం. మీరు తీసుకునే నిర్ణయం మన ఇరువురి కి అనుకూలంగా ఉంటుంది అని ఆశిస్తున్నా.
అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పోతాడు. తరువాత రాబర్ట్ క్లీవ్ (Robert Clive) తన అధికారులందరితొ సుధీర్ఘంగా చర్చిస్తాడు మరియు ఈ వజ్రహస్తుడు చెప్పినది ఎంత వరకు నిజమొ తెలుసుకోడానికి తన వద్ద పని చేసె ఇద్దరు బెంగాలి వాళ్ళ ను రహస్యంగా కళింగ రాజ్యం రాజధాని దంతపురానికి పంపిస్తాడు. వాళ్ళు అక్కడ పూర్తి గా విచారించి అన్నీ వివరాలు తెలుసుకొని తిరిగి బెంగాల్ లొ ఉన్న బెరక్స కు చెరుకుని రాబర్ట్ క్లీవ్ (Robert Clive) కి అంతా వివరించి వజ్రహస్తుడు చెప్పింది నిజమె అని అంటారు.
మరుసటి రోజు సాయంకాలం వజ్రహస్తుడను పిలిచి 
రాబర్ట్ క్లీవ్ (Robert Clive) : మీతొ చేతులు కలపడానికి మేము అంగీకరిస్తున్నాం. అంతేకాదు అనంతవర్మ ను మహారాజు ని చేయడానికి మా వంతు సహకరిస్తాం కూడా.
వజ్రహస్తుడు : సంతోషం. అనుకున్న పథకం ప్రకారం మీరు మీ వైపు నుండి పని ప్రారంభించండి. మిగిలింది మేము చూసుకుంటాం.
అని చెప్పి తాను కళింగ రాజ్యానికి వెళ్ళి పోతాడు.
కొన్నీ రాజుల తరువాత రాజుకుమారుడు అనంతవర్మ తాను విహారయాత్రకు వెళ్ళాని అనుకుంటున్నట్టు చెప్తాడు. 
వీరఘాతకుడు తన రక్షణ కోసం శక్తివంతులైన మరియు ఎంతొ నమ్మకస్తులైన ఒక 100 మంది సైనికులను అనంతవర్మ రక్షణ కోసం పంపిస్తాడు.
రాజ్యం దాటి చాలా దూరం ప్రయాణించాక హఠాత్తుగా ఆంగ్లేయులు సైన్యం వాళ్ళ పై దాడి చేస్తుంది. కాని కళింగ సైన్యం వాళ్ళ పై యుద్దం చేయకుండానె రక్తం కక్కుకొని అక్కడికక్కడె చనిపోతారు. తరువాత అనంతవర్మ ను ఆంగ్లేయులు బంధి గా తీసుకువెళతారు.
అక్కడ బ్రతికిన ఒక సైనికుడు అతి కష్టం మీద కళింగ రాజ్యం చేరుకొని జరిగినదంతా మహారాజు ఇంద్రవర్మ కి చెబుతాడు. అది విన్న మహారాజు కంగారు పడి వీరఘాతకుడి వైపు తిరిగి చూస్తాడు. 
వీరఘాతకుడు తను వెళ్ళి అనంతవర్మ విడిపించుకు తీసుకువస్తాను చెప్పి పెద్ద సైన్యాం తొ వెళతాడు.
అక్కడికి చేరుకోగానె వీరఘకతకుడు అతి సులువుగా యుద్దం లొ గెలిచి అనంతవర్మ ని రక్షిస్తాడు. తరువాత సురక్షితంగా తనని తీసుకొని కళింగ రాజ్యనికి బయలుదేరుతాడు. 
దారి లొ వీరఘాతకుడు కి ఎందుకో ఏదొ జరుగుతోంది అని అనుమానం కలుగుతుంది. కాని ఏం అర్ధం కాకా  ఊరుకుంటాడు.
ఇక్కడ కళింగ రాజ్యం లొ వీరఘాతకుడు యువరాజు ని తీసుకురాడానికి వెళ్ళిన మరుసటి రోజు కోటలొ వజ్రహస్తుడు మహారాజుతొ 
వజ్రహస్తుడు : మహారాజా మీరు ఏం కంగారు పడకండి. అనంత వర్మ కి ఏం కాదు. 
మహారాజు ఇంద్ర వర్మ : ఏం కాకూడదు అనె కోరుకుంటున్నా.
వజ్రహస్తుడు : అయిన మన అనంతవర్మ విహారయాత్ర కు వెళుతున్నట్టు ఆ ఆంగ్లేయుల కు ఎలా తెలిసింది. అది కాకా సరిగ్గ వాళ్ళు దాడి చేసినప్పుడె మన సైనికులంతా విషప్రయోగం వలన చనిపోవడం ఏంటి. ఇందంతా చూస్తుంటె మనలోనె ఎవరొ వాళ్ళ కి సహాయం చేస్తున్నట్టు నా అనుమానం.
మహారాజు ఇంద్ర వర్మ : నువ్వు చెప్తుంటె నాకూ అలాగె అనిపిస్తుంది. అయిన ఎవరై ఉంటారు.?
వజ్రహస్తుడు : ఏమొ మహారాజా నాకు తెలియదు. అయిన రాజకుటుంబీకుల రక్షణ మరియు వారి ఆహారం అంతా మన వీరఘాతకుడే గా చూసుకునేది. అయిన అలా ఎలా జరిగిందొ.?
మహారాజు ఇంద్ర వర్మ : అంటె నీ ఉద్ధేషం? వీరఘాతకుడినె అనుమానిస్తున్నావా?
వజ్రహస్తుడు : నా ఉద్దేష్యం అది కాదు మహారాజా. తను ఉండగా కూడా ఇలా జరిగింది ఏంటా అని అంతె. అయిన ముందు మన అనంతవర్మ క్షేమంగా రానివ్వండి తరువాత మనం రహస్యంగా విచారిద్దాం.
ఈలోపు అనంతవర్మ ని తీసుకొని వీరఘాతకుడు రాజధాని దంతపురానికి చేరుకుంటాడు. అనంతవర్మ  ని చూడగానె మహారాజు కాస్త కుదుటపడతాడు. 
అలా కొన్నీ రోజులు గడిచిన తరువాత ఈసారి అనంతవర్మ కి ఇచ్చే ఆహారం లొ విషప్రయోగం జరుగుతుంది. కాని వైద్యులు అతనిని కాపాడుతారు. 
ఇది చూసి మహారాజు "కోటలోనె ఎవరొ ఇదంతా చేస్తున్నారని" గ్రహించి రహస్యంగా విచారణ చేయిస్తాడు. 
విచారణ లొ అనంతవర్మ కి భోజనం పంపించిన వ్యక్తి ని ప్రశ్నిస్తారు. అతను భోజనం పంపించె ముందు వీరఘాతకుడె స్వయంగా పరిక్షించి అనంతవర్మ కి పంపినట్టు చెబుతాడు. 
దీంతొ మహారాజు కి వీరఘాతకుడి పై అనుమానం మొదలు అవుతుంది. అదే రోజు మహారాజు తన గది దగ్గర మేడ మీద ఉండగా దూరం నుంచి ఎవరొ వస్తున్నట్టు గ్రహిస్తాడు.
ఎవరై ఉంటాడా అని మహారాజు తన వద్ద ఉన్న దుర్భిణి (Telescope) లొ అతనిని చూస్తాడు ఆ వచ్చేది ఒక ఆంగ్లేయుడు అని గుర్తిస్తాడు. అక్కడె మరొ వ్యక్తి చీకటి లొ అతనిని కలుస్తాడు. వాళ్ళ మద్య కొంత సేపు ఏదొ సంభాషణ జరిగినట్టు కనిపిస్తుంది.
కాసేపటికి ఆ ఆంగ్లేయుడు వెళ్ళిపోగానె అతను కూడా తిరిగి వెళతాడు. అప్పుడు మహారాజు తన దుర్భిణి (Telescope) లొ అతను ఎటువైపు వెళుతున్నాడొ చూస్తాడు. అతడు నేరుగా వీరఘాతకుడి ఇంటి వైపుకి వెళుతున్నాడు. అలా ఒక చోట అతని ముఖం పై కాస్త వెలుతురు పడగానె ఆ వ్యక్తి వీరఘాతకుడు అని గుర్తిస్తాడు
మహారాజు ఇంద్ర వర్మ : ఇంత రాత్ర వేళ వీరఘాతకుడు ఎందుకు ఆ ఆంగ్లేయుడని రహస్యంగా కలిసాడు.? అసలు ఆ ఆంగ్లేయుడు ఈ రాజ్యం లోకి ఎలా వచ్చాడు.?
అని అనుకుంటాడు. 
మరుసటి రోజు రాత్రి అనంతవర్మ గది లొ తన పై దాడి జరుగుతుంది. ఈ సారి అనంతవర్మ తప్పించుకొని తన రక్షక భటుల ద్వారా వాళ్ళ ని పట్టుకుంటాడు. పట్టుకుని మహారాజు వద్దకు తీసుకువెళతాడు. 
వాళ్ళ లొ ఒకడి ముసుగు తీయగానె అతను "ముందు రోజు రాత్రి వీరఘాతకుడి ని కలిసిన ఆంగ్ల వ్యక్తి " అని మహారాజు గుర్తిస్తాడు. 
మహారాజు ఇంద్రవర్మ : నువ్వె కదా నిన్న రాత్రి వీరఘాతకుడిని కలిసావు 
అని ఆ ఆంగ్లేయుడిని ని ప్రశ్నిస్తాడు.
ఆంగ్ల వ్యక్తి : అవును ఆయన చెప్తేనె మేము ఈ దాడి చేశాము.
మహారాజు ఇంద్రవర్మ : వీరఘాతకుడు అనంతవర్మ పై దాడి చేయమన్నాడా?
ఆంగ్ల వ్యక్తి : అవును. కొన్ని రోజుల క్రితం అతను మా పైనున్న ఆంగ్లేయ అధికారులు ను కలిసాడు. వాళ్ళు నాకు ఇతను చెప్పినట్టి చేయమన్నారు. కేవలం ఇదే కాదు. అనంత వర్మ యొక్క వీహారయాత్ర సమాచారము ఇచ్చి సైనికులకు విష ప్రయొగం చేసింది మరియు అనంతవర్మ ఆహారం లొ విషం కలిపింది కూడా ఆయనె. 
మహారాజు ఇంద్రవర్మ : తను ఎందుకు చంపాలి అని చూస్తున్నాడు?
ఆంగ్ల వ్యక్తి : కళింగ రాజ్య సింహాసనం కోసం. అనంత వర్మ చనిపోతె తాను యువరాజు కావచ్చు అని. అందుకె మా ఆంగ్లేయుల మద్దతు అడిగాడు. ఈ సహాయం చేస్తె తాను మహారాజు అయిన మరుక్షణం మా ఈస్ట్ ఇండియా కంపనికి కళింగ రాజ్య సంపద లొ సగ భాగం ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నాడు.
దాంతొ మహారాజు కోపోద్రిక్తుడై ఆ రోజు ఉదయమె రాజ్య పర్యటనకై బయలుదేరిన వీరఘాతకుడిని బంధించి తీసుకు రమ్మని భటులను ఆదేశిస్తాడు. 
తనని తీసుకు వచ్చాక శత్రువుల తొ కలిసి కళింగ రాజ్యాన్నీ చేజిక్కించుకోవాలని చూసినందుకు రాజద్రోహం నేరం క్రింద వీరఘాతకుడిని బహిరంగంగా చెట్టుకు కట్టి వేలాడదీసి సజీవ దహనం చేసి చంపేస్తారు. 
"నిజానికి ఆ రోజు రాత్రి మహారాజు చూసింది వీరఘాతకుడి దుస్తుల్లో ఉన్న అనంత వర్మ ని.
గత కొన్నీ రోజులు గా మహారాజు తినే ఆహారం లొ "సోమరసం" అనె ద్రవం కలిపి ఇస్తున్నారు. ముందునుంచి అతనికి వీరఘాతకుడి పై అనుమానం వచ్చేలా చేసి తన మెదడుని పూర్తి గా వాళ్ళు తమ వశపరుచుకుంటారు
ఆ  సోమరసం ప్రభావం వల్ల ఆ రోజు దుర్భిణి లోంచి తాను చూసింది వీరఘాతకుడినె అని మహారాజు భ్రమిస్తాడు. అందుకె రాజద్రోహం చేసాడు అని నమ్మి తనకి మరణ శిక్ష విధిస్తాడు. 
యొగిక శక్తులు కలవాడు కాబట్టి ఉరితీస్తె ఛావడని గ్రహించి సజీవదహనం చేసాడు. "
కాని వీరఘాతకుడు చనిపోయిన కొన్నీ రోజుల కి తన కుమారుడు అనంతవర్మ చేసిన కుట్రని మహారాజు తెలుసుకుంటాడు. 
ఇదేంటి అని మహారాజు రాజకుమారుడు అనంతవర్మ ను ప్రశ్నించినందుకు తనని మరియు తన తల్లి మహారాణి లీలావతి ని, రాజు కు నమ్మకంగా ఉండె మంత్రిని వీరఘాతకుడి యొక్క ఖడ్గం తొ నరికి చంపి వీరఘాతకుడి ఆత్మే ఇదంతా చేసింది అని లోకాన్నీ నమ్మిస్తాడు. అందుకు గాను కొంతమంది రాజ్య ప్రజలను కూడా అదె విధంగా చంపుతాడు. 
తరువాత దంతపురం నడి బొడ్డులొ వీరఘాతకుని విగ్రహం పెట్టి శాంతి హోమం చేసినట్టు నటించి. తరువాత తన ఆత్మ శాతించిందని రాజ్య ప్రజలను నమ్మిస్తాడు.