Read Kalinga Rahasyam - 4 by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 4

ఆ రోజు రాత్రి 9 ఏళ్ళ అనిరుద్ కి వీరఘాతకుడి కధ చెప్పి శాంతి నిద్రపుచ్చి తరువాత తాను కూడా నిద్రపోతుంది. 

కొంచెం సేపటికి ఎవరో ఆ ఇంటి తలుపు కొడతారు. గాఢనిద్ర లొ ఉండడం వల్ల చాలా సేపటికి తనకు మెలకువ వచ్చి లేస్తుంది

"ఈ సమయం లొ ఎవరై ఉంటారు?" అనుకుంటుంది శాంతి.

"శాంతి..... శాంతి ..... నేనూ..... తలుపు తీయ్యు" అని బయట నుంచి పిలుపు వినబడుతుంది

ఆ గొంతు విని వచ్చింది తన భర్తె అని గ్రహించి వెళ్ళి తలుపు తీస్తుంది. తలుపు తీయగానె ఎదురుగా తన భర్త ఎదొ కంగారు పడుతున్నట్టు కనిపిస్తాడు.

శాంతి : మీరా? పని మీద ఎవిరి నొ కలవడానికి బరంపురం వెళ్ళాలి అన్నారు? అప్పుడె వచ్చేసారె.?

శాంతి భర్త : ఏమి లేదు ప్రయాణం రద్దు (Cancel) అయ్యింది

శాంతి : ఎందుకని ?

శాంతి భర్త : అవన్నీ నీకు ఇప్పుడు చెప్పలేను వదిలెయ్యి.

శాంతి : సరే ఎమైన తింటారా? తీసుకురానా?

శాంతి భర్త : నాకు ఆకలి గా లేదు ఇప్పుడు ఏమి వద్దు నువ్వు వెళ్ళి పడుకొ.

భర్త ఎందుకో ఖంగారు పడుతున్నట్టు శాంతి గమనించింది. కాని ఇప్పుడు తను అడిగితె చెప్పే స్తిథి లొ భర్త లేడని వెళ్ళి నిద్రపోతుంది.

శాంతి భర్త కి ఒక కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంది. భయపడుతూనె సెల్ఫోన్ (Cell phone) తీసి మాట్లడతాడు. 

"హలో ఎవరు ?"

"ఏం నారాయణమూర్తి తప్పించుకున్నావని సంతోషపడుతున్నట్టు ఉన్నావు" అని అవతలి వ్యక్తి అంటాడు.

"ఎవరు మాట్లాడేది?

"అది ఇప్పుడు అనవసరం. ముందు నేను చెప్పినట్టు చెయ్యి లేదంటె మా దగ్గర బంధీ గా ఉన్న నీ స్నేహితుడు మహేష్ ప్రాణాలతొ ఉండడు" అని ఆ అవతలి వ్యక్తి అనేసరికి

నారాయణమూర్తి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు. 

"మహేష్ మీ దగ్గర ఉండడం ఏంటి?. ఇందాకలె కదా తనను నేను బరంపురం వెళ్ళె ట్రైను ఎక్కించివచ్చాను" అని నారాయణమూర్తి అంటాడు. 

"మా దగ్గర నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. కావాలంటె నీ స్నేహితుడికి కాల్ చేసి చూసుకొ" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

వెంటనె నారాయణమూర్తి తన సెల్ ఫోన్ నుంచి మహేషు కి కాల్ చేస్తాడు

"హలో నారాయణ మూర్తి" అని ఇందాక మాట్లడిన వ్యక్తె మహేష్ ఫోన్ లో నుంచి మాట్లాడుతాడు.

"ఇప్పటికైనా నమ్ముతావ?. నేను చెప్పినట్టు ఆ ఫైల్ తీసుకొచ్చి మాకిచ్చి నీ స్నేహితుడిని తీసుకెళ్ళు. లేదంటె వాడు ప్రాణాలతొ ఉండడు

" అంతేకాదు ఆ మహేష్ ని చంపితె ఆ నేరం నీ మీదకె వస్తుంది, కాదు కాదు వచ్చేలా చేస్తా. దాంతొ నువ్వు జైలు కు ఆ తరువాత ఉరి కంబానికి." 

"అప్పుడు నీ భర్యా పిల్లలు ఆనాధలు అవుతారు". 

"అంతె కాదు అక్కడ దంతపురం లొ ఉన్న మీ అన్న గురుమూర్తి కి కూడా ఈ హత్య తొ సంబంధం ఉందని తనకి కూడా శిక్ష పడుతుంది. అవసరమా ఇవన్నీ? చెప్పు నారాయణ మూర్తి?" అని అవతలి వ్యక్తి నారాయణ మూర్తిని బెదిరించేసరికి.

"వద్దు వద్డు అలా చెయ్యద్దు నువ్వు చెప్పినట్టు ఆ ఫైల్ తీసుకొచ్చి నీకిస్తాను. ఎక్కడికి రావాలొ చెప్పు?" అని నారాయణ అడిగితె.

అవతలి వ్యక్తి ఎక్కడికి రావాలొ చెబుతాడు. 
వెంటనె నారాయణ మూర్తి బట్టలు మార్చుకొని తన బ్యాగు లొ ఉన్న ఫైల్ తీసి బయలుదేరుతాడు.

వెళ్ళే ముందు తన భార్య శాంత కి చెబుదామనుకుంటాడు కాని చెప్తె ఎక్కడి కి ఈ సమయంలొ అని ఆరాతీస్తుంది. అందుకె తనని నిద్ర లేపకుండా బయటనుంచి తాళం వేసుకొని వెళ్ళిపోతాడు.

కాసేపటికి అతను చెప్పిన చోటికి చేరుకుంటాడు. కారు దిగి చుట్టూ చూస్తాడు అది కొండ పైన ఒక నిర్మానుష్యమైన ప్రదేశం. 

కాసేపటికి మళ్ళి తనకు ఓ కాల్ వస్తుంది. ఎత్తి మాట్లాడతాడు. 

నారాయణమూర్తి: హలో నువ్వన్నట్టే నేను ఫైల్ తీసుకువచ్చా ఇప్పుడు ఏం చెయ్యాలి    .

ఫోన్లోని వ్యక్తి: కొంచెం దూరంలొ నీకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుందా?

నారాయణమూర్తి: హా కనిపిస్తుంది  

ఫోన్లోని వ్యక్తి: ఆ ఫైల్ తీసుకెళ్ళు ఆ చెట్టు దగ్గర పెట్టు.

అని చెప్పగానె నారాయణమూర్తి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఫైల్ అక్కడ పెడతాడు.

నారాయణమూర్తి : పెట్టాను మహేష్ ఎక్కడా?

ఫోన్లోని వ్యక్తి : వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపొ మహేష్ కనిపిస్తాడు. 

అని చెప్పగానె.

నారాయణ మూర్తి పరిగెత్తుకెళ్ళి తన కారు తలుపు తీసి చూస్తాడు. లోపల వెనక సీట్లొ మహేష్ ఉంటాడు. తన కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాష్టరేసి ఉంటుంది. 

వెంటనె ఆ చెట్టు వైపు తిరిగి చూస్తాడు గాని అక్కడ ఫైల్ ఉండదు.

ముందు తను మహేష్ కట్లు విప్పి కూర్చోపెడతాడు. 

తరువాత కార్ స్టార్ట చేసి అక్కడ నుంచి బయలుదేరిపోతారు. కాసేపటికి నారాయణ మూర్తి కార్ నడుపుతూ మహేష్ వైపు తిరిగి

నారాయణ మూర్తి : నన్ను క్షమించరా ఆ వీరఘాతకుడికి సంబంధించిన ఫైల్ నిన్ను కాపాడడం కోసం వాళ్ళకి ఇచ్చాయల్సి వచ్చింది. 

మహేష్ : అసలు ఆ పరిషోధనా పత్రాల (Research documents) గురించి వాళ్ళ కి ఎలా తెలిసింది రా?

నారాయణ మూర్తి : పోనీలే రా ఆ ఫైల్ లొ ఉన్నది వాళ్ళు కనుక్కోవాలి అంటె కచ్చితంగా 20 ఏళ్ళ పైనె పడుతుంది. దాంతొ చిరాకు వచ్చి వాళ్ళె వదిలేస్తారు 

నారాయణ మూర్తి అన్నదానికి ఇద్దరు నవ్వుతారు.
...........................................................................

దంతపురం లొ వంశి అలియాస్ అనిరుద్ క్రిష్ణ వంశి. తన గది లొ కూర్చొని ఆలొచిస్తూ

వంశి : రాత్రి మఱ్ఱి చెట్టు దగ్గర ఉన్న నల్లని ఆకారంలొ ఉన్నది ఎవరా అనేది చేతి కడియం ద్వారా తెలిసింది

వంశి : కాని ఈ చావుల వెనుక అతనొక్కడె ఉన్నాడా? లేక అతను వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఉంటె ఎంత మంది ఉండచ్చు?. 

వంశి : అసలు ఇదంతా కాదు నిజంగా ఇతనికి ఈ చావుల కి సంబంధం ఉందా?

ఇలా ఆలోచిస్తూ తరువాత ఒక నిర్ణయానికి వస్తాడు

వంశి : ఇవన్ని తెలుసుకోవాలి అంటె. కొన్నిరోజులు పాటు అతను ఎవరొ తెలియనట్టు ఉండి తనకి తెలియకుండానె అతనిని గమినించి అసలు నిజం ఏంటొ తెలుసుకోవాలి.

అని నిర్ణయించుకుంటాడు.

ఈ లోపు తన గది కి గురుమూర్తి వస్తాడు. 

గురుమూర్తి : ఏరా వంశి ఒక్కడివె కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు?

వంశి : ఏమి లేదు పెద్దనాన్న అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు. వాళ్ళ గురించె ఆలొచిస్తున్నా.

గురుమూర్తి : వాళ్ళ పోయి 2 నెలలె అవుతుంది కదా ఆ మాత్రం గుర్తుకు వస్తారులె. సరె నువ్వు భోజనానికి రా.

అని వంశి భుజం పై చెయ్యి వేస్తాడు. 

అప్పుడు అతని చేతికి ఉన్న కడియం కిటికి లోంచి వచ్చె ఎండ వల్ల మెరుస్తుంది.