Read Kalinga Rahasyam - 14 (Final Part) by Suresh Josyabhatla in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కళింగ రహస్యం - 14 (Last Part)

 Part - XIV

మహేంద్ర వర్మ మరియు తదితరులు ఆ నిధి ఉన్న చోటుకు రావడం చూసి అందరు దిగ్బ్రాంతి చెందుతారు.

గురుమూర్తి : మీరా? ఇక్కడికి ఎలా వచ్చారు?

(SIT) ధనుంజయ్ : మీ మీద నీఘా ఉంచడం కోసం మిమల్ని బంధిచిన చోటె మీ ఎవ్వరికి తెలియకుండా మా మనిషి ఒకడిని పెట్టాను. వాడు మిమ్మల్ని పలాస వరకు అనుసరించి. మీరు మహేష్ ని విడిపిస్తున్న సమయంలొ మీకు తెలియకుండా మీ కారు కి ఒక జీ.పీ.యస్ ట్రాకర్ (GPS Tracker) ని పెట్టాడు.

మహేంద్ర వర్మ : ఆ తరువాత మాకు కాల్ చేసి అంతా చెప్పాడు. తరువాత మేము ఆ జీ.పీ.యస్ ట్రాకర్ (GPS Tracker) ని అనుసరించి ఇక్కడి వరకు వచ్చాము. 

కాసేపటికి మహేంద్ర వర్మ మనుషులు వాళ్ళందరిని పెడరెక్కలు విరిచి పట్టుకుంటారు. 

మంత్రి ఆనందరాజు : అబ్బబ్బ మీ అన్నదమ్ముులు ఇద్దరు కలిసి ఎంత పెద్ద ఆట ఆడారు. ఎవరికి అనుమానం రాకుండా మా మనుషులు 9 మంది ని చంపేశారు. 

నారాయణమూర్తి : ఇప్పుడు మీ ఇద్దరు కూడా అలాగె చస్తారు.

మహేంద్ర వర్మ : ఆ అవకాశం మీకు ఇవ్వం.

అని చెప్తున్న సమయంలొ వంశి తనని పట్టుకున్నవాడి వృషణాల మీద కాలితొ తన్ని విడిపించుకొని. మహేంద్రవర్మ మరియు అతని కొడుకు విక్రమ్ మీదకు దూకుతాడు. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా అదే పద్దతి లొ విడిపించుకొని మంత్రి ఆనందరాజు ని మరియు మిగిలిన వాళ్ళని కొట్టడానికి ఉరుకుతారు.

అలా ఆ పెనుగులాట లొ (SIT) ధనుంజయ్ తన తుపాకి తొ నారాయణమూర్తి ని కాలుస్తాడు. 

------------------------------------------------------------------------

రెండు నెలల తరువాత. ఢిల్లి లోని ఒక పెద్ద ఆడిటోరియం లొని వేధిక పై వంశి ప్రసంగిస్తున్నాడు. ఆ వేధిక మద్యలొనె నీలమణి ని ఉంచారు.

వంశి : మన భారత దేశం ఒకప్పుడు సాంకేతిక శాస్త్ర పరంగా, విఙాన పరంగా మరియు ఆద్యాత్మిక పరంగా ఎంతొ పరిణితి చెంది ఉండేది. కాని గత 1000 సంవత్సరాల పరాయి పాలన లొ ఈ విఙాన శాస్త్ర ఙానాన్నీ చాలా వరకు మనం కోల్పోయాం. తరువాత ఆంగ్లేయుల పాలన లొ మన స్వంత విద్యా ఙానాన్నీ త్యజించి వాళ్ళ కి బానిసలు గా మారం. మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాల తరువాత కూడా ఇంకా మనం ఆ పరాయి వాడి విద్య మోజు లొ పడి మనల్ని మన విద్య ని తక్కువ చేసుకుంటున్నాం.

విలేఖరి - 1 : అంటె ఈ 77 సంవత్సరాల లొ మనం దేశం ఎటువంటి పురోగతి సాధించలేదు అంటారా?

వంశి : సాధించాం కాని అప్పటి విఙానం సంపద మరియు సాంకేతిక పరిఙానం తొ పోలిస్తె ఇప్పుడు మనం చాలా వెనకపడ్డాం. అధునిక విద్య కి నేను వ్యతిరేకం కాదు. కాని మన మూలాలు మనం మర్చిపోకూడదు.

విలేఖరి - 2 : ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెబుతున్నారొ తెలుసుకోవచ్చా?

వంశి : ఇందంతా ఈ నీలమణి కోసమె చెబుతున్నా. ఈ నీలమణి ఒకప్పటి మన సాంకేతిక పరిఙానానికి మరియు వైద్యశాస్త్రానికి ప్రతీక. ఈ నీలమణి ద్వారా మనం ఎన్నో రోగాలను నయం చేయచ్చు. కలుషితమైన నీటిని బాగుచేయచ్చు. మన దేశ శాస్త్రావేత్తలకి నేను కోరుకునేది ఒక్కటె. ఈ నీలమణి పై సంపూర్ణ అద్యయనం చేసి ఇటువంటివి మరెన్నో తయ్యారు చేసి మన దేశ ప్రజలకు ఉపయోగపడేలా చెయ్యాలి. అలా జరిగేలా చూడమని మన గౌరవనీయలైన మన దేశ మంత్రులనందరికి విన్నవిస్తున్నా. 

అని చెప్పి వంశి తన ప్రసంగాన్నీ ముగిస్తాడు. తరువాత ఇద్దరు వ్యక్తులు సాయంతొ తాను వేదిక మీద నుంచి క్రిందకు దిగి నారాయణమూర్తి వద్దకు వెళ్ళి కౌగిలించుకుంటాడు. తరువాత వంశిని వీల్చైర్ (wheel chair) మీద కూర్చొబెట్టి నారాయణమూర్తి తీసుకువెళతాడు.

ఆడిటోరియం నుంచి బయటకు వచ్చాక అక్కడ  నాదీర్ మరియు అల్తాఫ్ ఇద్దరు వాళ్ళ వద్దకు వస్తారు.

నారాయణమూర్తి : ఏమైంది? అన్నయ్య కి ఎలా ఉంది.?

అల్తాఫ్ : గురుమూర్తి గారు చనిపోయారు. 

అది విన్న నారాయణమూర్తి మరియు వంశి ఇద్దరు రోధిస్తారు. వెంటనె కారులొ ఏర్పోర్టు కి (Airport) కి బయలుదేరి. విశాఖపట్టణం వెళ్ళె విమానం ఎక్కుతారు. విమానం లొ కూర్చున్న వంశి గతం లోకి వెళతాడు.

"నిజానికి ఆ రోజు (SIT) ధనుంజయ్ నారాయణమూర్తి ని తుపాకి తొ పెల్చగానె ఆ గుండు (Bullet) తనకి తగలకుండా వంశి వచ్చి అడ్డుగా నించుంటాడు. దాంతొ ఆ గుండు (Bullet) వంశి వెన్ను పై తగిలి తను కూలబడిపోతాడు. 

అది చూసి వెంటనె గురుమూర్తి (SIT) ధనుంజయ్ మీద పడి తన చేతులొ ఉన్న తుపాకి ని లాక్కొని (SIT) ధనుంజయ్ మీద కాలుస్తాడు. అది తన కుడి జెబ్బకి తగిలి కూలబడతాడు. 

ఇంతలొ సిమిలి ఊరి ప్రజలు అక్కడికి వస్తారు. గొడవ మద్యలొ ఉన్నప్పుడె సిమిలి గ్రామ పెద్ద కొడుకు రామ్ వెళ్ళి వాళ్ళని తీసుకువస్తాడు. అందరు కలిసి మహేంద్ర వర్మ ని, తన కొడుకు విక్రమ్ ని, మంత్రి ఆనందరాజు ని, (SIT) ధనుంజయ్ మరియు మిగిలిన వాళ్ళందరిని ఆ గ్రామ ప్రజలు తాడ్ల తొ కట్టి బంధిస్తారు. 

మంత్రి ఆనందరాజు పర్సనెల్ అసిస్టెంట్ మధుసూదన్ సహాయం తొ వీళ్ళ అక్రమాలు అన్నీ ముఖ్యమంత్రి కి తెలిసేలా చేస్తారు.  వాళ్ళ దగ్గర ఉన్న సాక్షాధారలతొ నారాయణమూర్తి తల్లిదండ్రులను మరియు తన భార్య శాంత ని చంపించింది వీళ్ళె అని నిరుపిస్తారు.

అంతెకాదు దంతపురంలొ చనిపోయిన ఆ 9 మంది చావు కి కారణం కూడా మంత్రి ఆనందరాజు మరియు మహేంద్ర వర్మ తదితరులు అని శవపంచనామ (Post mortem) చేసిన డాక్టర్ వీరించి ద్వారా తప్పుడు సాక్ష్యం చెప్పించి మంత్రి ఆనందరాజు పర్సనెల్ అసిస్టెంట్ మధుసూదన్ సహాయం తొ వీళ్ళపై ఆ నేరం వెళ్ళే లా చేస్తారు. 

తరువాత ఆంధ్ర ముఖ్యమంత్రి మరియు ఒరిస్సా ముఖ్యమంత్రు ల ద్వారా కళింగ రాజ్య అపార సంపద ను మరియు నీలమణిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తారు. 

ప్రమాదం గాయపడ్డ వంశి ని ఆ సమయంలొ సిమిలి గ్రామం నుంచి దగ్గర లొ ఉన్న హాస్పెటల్ కి చేరుస్తారు కాని ఆ గుండు వెన్నుముక్క లోపలకి చేరుకోడంతొ తనని విశాఖపట్టణం హాస్పెటల్ కి తరలిస్తారు. అక్కడికి చేరుకో గానె వంశి పరిస్తితి మరింత విషమిస్తుంది. తన వెన్నెముక్క ఎముకలలో తూటా గుండు లోతుగా దిగడం వల్ల తన బోన్ మారో (Bone marrow) దెబ్బతింటుంది

దీని ఫలితంగా రక్త కణాల ఉత్పత్తి నిలిచిపోయి ఇన్ఫెక్షన్ చేరింది. తన రోగ నిరోధక వ్యవస్థ తిరగబడింది.

బోన్ మారో పూర్తిగా దెబ్బతినడంతొ, రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు మరియు ప్లేట్లెట్లు తగ్గిపోయాయి (pancytopenia).

డాక్టర్లు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అవసరం అని. రక్తసంబంధీకులు తనకి బోన్ మారో  దానం చెస్తె బ్రతికె అవకాశం ఉంది అని చెబుతారు.

అది విన్న నారాయణమూర్తి తన అన్న గురుమూర్తి వైపు తిరిగి చూసి ఏడుస్తాడు.

కాసేపటికి నారాయణమూర్తి వంశి వద్దకు వస్తాడు. 

వంశి : ఏం నాన్న బాధపడుతున్నారు? డాక్టర్లు నాకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చెయ్యాలి అన్న దానికా?. మీరు ఇడియోపాథిక్ మైలోఫైబ్రోసిస్ (Idiopathic Myelofibrosis) అనే వ్యాధి తొ బాధపడుతున్నారు కాబట్టి మీ బోన్ మారో పనిచేయదు అని చెప్పారా.? 

నారాయణమూర్తి మౌనంగా ఏడుస్తుంటాడు.

వంశి : ఏడ్వకండి నాన్న. నేను చనిపోతున్న తాతాగారి చివరి కోరిక తీర్చాను అనె తృప్తి తొ పోతున్నాను.

కొంచెంసేపటికి డాక్టర్లు వచ్చి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ కి వంశి ని తీసుకెళ్ళబోతారు.

వంశి నారాయణమూర్తి వంక అయొమయంగా చూస్తాడు. 

నారాయణమూర్తి : అన్నయ్య నీకు బోన్ మారో దానం చేస్తున్నాడు రా.

వంశి : అదేంటి ? పెద్దనాన్న ఇవ్వడం ఏంటి?

నారాయణమూర్తి : నేను నీ అసలు తండ్రి ని కాను రా. నువ్వు నా అన్న గురుమూర్తి కొడుకువి.

వంశి : ఏం మాట్లడుతున్నావు నాన్న? మీరు నా తండ్రి కాదా? 

నారాయణమూర్తి : అవును రా వంశి. నా పెళ్ళి కాకముందు నా వల్ల జరిగిన కారు ప్రమాదం లొ మీ అమ్మ తన గర్భసంచి కోల్పోయింది. ఇక తనకి పిల్లలు పుట్టరు అని డాక్టర్లు చెప్పారు. నా వల్ల మీ అమ్మ జీవతం నాశనం కాకూడదని తనని పెళ్ళి చేసుకున్నా. దీనివల్లె అన్నయ్య నా మీద కొప్పడ్డాడు. కాని తరువాత నన్ను అర్ధంచేసుకొని క్షమించాడు.

మా పెళ్ళి అయిన సంవత్సరానికి నువ్వు పుట్టావు. పుట్టగానె మా వదిన అదె నిన్ను కన్న నీ అసలు తల్లి చనిపోయింది.  పిల్లలు లేని మీ అమ్మ శాంత నిన్ను చూసి. తనకిమ్మని మా అన్నయ్య ని అడిగంది. నీకు తల్లి ప్రేమ దక్కాలనె ఉద్దేష్యం తొ నిన్ను మాకు దత్తత ఇచ్చాడు. ఈ విషయం నీకు చెప్పద్దని మాట కూడా తీసుకున్నాడు.

ఇది విన్న వంశి ఏడుస్తూనె ఆపరేషన్ కి వెళతాడు. 

ఆపరేషన్ తరువాత వంశి కోలుకుంటాడు. కాని గురుమూర్తి మాత్రం కోలుకోడు. 
ఈలోపు తాను ఢిల్లి కి వెళ్ళవలసి వస్తుంది."

అలా వంశి తన ఆలోచనలనించి నారాయణమూర్తి పిలుపు కి బయటకి వస్తాడు. విశాఖపట్టణం లొ దిగి నేరుగా హాస్పెటల్ కి వెళతారు. 

అక్కడ గురుమూర్తి శవాన్నీ తీసుకొని నేరుగా స్మశానానికి వెళ్ళి అంత్యక్రియలు చేసి తిరిగివస్తున్నప్పుడు. వంశి ఒక కవర్ లోంచి ఏదొ రిపోర్టు తీస్తాడు. ఆ రీపోర్టు హాస్పెటల్ లొ ఉన్నప్పుడు డాక్టర్ వీరించి వంశి కి ఇస్తాడు. 

ఆ రీపోర్టు లొ తన కన్న తండ్రి గురుమూర్తి వయసు నిర్ధారించి ఉంది.

నిజానికి ఆ రోజు ఎప్పుడైతె వంశి చెయ్యి పడగానె ఆ నేలమాళిగ ద్వారం తెరుచుకుంటుందొ. అప్పుడు తాను వీరఘాతకుడి వారసుడు అనె అనుమానం తనకు వస్తుంది. కాని జరిగిన సంఘటనల వల్ల అది మర్చిపోతాడు. 

కాని మళ్ళి తన కన్నతండ్రి గురుమూర్తి అని తెలిసినప్పుడు. తాను వీరఘాతకుడి వారసుడిని అని సంగతి తనకు మళ్ళి గుర్తుకు వస్తుంది. 

అనుమానం వచ్చి తన తాతగారు మాట్లాడిన వీడియె కాసెట్ తెప్పించి చూస్తాడు. వీడియొ లొ కొంత భాగం లేదు. 

ఆ విషయం గురించి నారాయణమూర్తి ని అడుగుతాడు. 

నారాయణమూర్తి : ఇప్పుడు అవన్నీ ఎందుకు రా?

వంశి : లేదు మీరు చెప్పండి. పూర్తి వీడియొ లొ తాతగారు ఏం చెప్పారు.?

నారాయణమూర్తి : అందులొ అన్నయ్య తన సొంత కొడుకు కాదు అని తాతగారు చెప్పారు రా. తనకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఖళ్ళికోటె అడివిలొ తనకి దొరికాడు అంటా. స్పృహ తప్పి పడి ఉన్న తనని ఇంటికి తీసుకువచ్చి పెంచుకున్నారు. తాను వచ్చిన సంవత్సరానికి నేను  పుట్టాను.

ఇది విన్న వంశి కి ఆనుమానం వస్తుంది. దాంతొ గురుమూర్తి  వయసు నిర్ధారించె పరీక్ష కోసం డాక్టర్ వీరించి ని సంప్రదిస్తాడు. 

గురుమూర్తి చనిపోయాక తన శవాన్నీ డాక్టర్ వీరించి తీసుకు వెళ్ళి గురుమూర్తి కంటి పొరలపై ఉన్న ప్రోటీన్ ని తీసి దాన్నీ కార్బన్ డేటింగ్ చేస్తాడు. ఆ కార్బన్ డేటింగ వల్ల తన వయసు 246 సంవత్సరాలు అని తెలుస్తుంది.
------------------------------------------------------------------------

సిద్దసాధువు తన కొడుకు ఎక్కడ అని వీరఘాతకుడిని అడిగితె.

తన వెనుక దాంకొని ఉన్న 6 సంవత్సరాల అనిరుద్ కృష్ణ వంశి ని ముందుకు పిలిచి ఆ సిద్దసాధువు ముందు నించొబెడతాడు.

వీరఘాతక : నాన్న అనిరుద్ వెళ్ళి గురువుగారి కాళ్ళ కు నమస్కారం చెయ్యి.

అని చెప్పగానె తన కొడుకు వెళ్ళి నమస్కరిస్తాడు.

సిద్దసాధువు : చిరంజీవా. లే నాయన.

వీరఘాతక : గురువుగారు నా వారసుడు తల్లి లేని నా కొడుకు ని మీకు అప్పగిస్తున్నాను. నా ప్రాణం పోయిన ఆ నీలమణిని మరియు ఆ సంపదని శత్రువులకు దక్కనివ్వను కాని వాళ్ళ కి వీడు చిక్కకూడదు. మీరె వీడిని రక్షించాలి.

సిద్దసాధువు : తప్పకుండా నాయన నేను చూసుకుంటాను.

కాసేపటికి వీరఘాతకుడు తన కొడుకిని నిద్రపుచ్చి ఆ పిల్లవాడి బుగ్గ పై ముద్దు పెట్టి అక్కడె తనని వదిలేసి వెళ్ళిపోతాడు.

తరువాత ఆ సిద్దసాధువు తన శిష్యుల తొ కలిసి వేద విజ్ఞానం ఆధారంగా ఒక ప్రత్యేక యంత్రాన్ని రూపొందించి, వీరఘాతకుడి కొడుకును “యోగనిద్ర” స్థితిలో ఉంచుతారు.  ఇది శబ్ద శక్తి, ప్రాణ శక్తి, మరియు కంచిక శిలల సహాయంతో పని చేస్తుంది. ప్రాచీన వాస్తు మరియు తంత్ర శాస్త్ర ఆధారంగా ఎంచుకున్న ప్రాంతం కాలాన్ని నిలిపేసే సామర్థ్యంతో ఉంటుంది. 

దీని ద్వారా ఆ పిల్లవాడి వయసు పెరగకుండా ఆపుతుంది. 

అలా వాళ్ళు ఆ పిల్లవాడిని బంధించి 190 సంవత్సరాలు తరువాత ఆ యంత్రం విఛిన్నం అయ్యెలా తయ్యారు చేసి జాగ్రత్త పరుస్తారు.
---------------------------------------------------------------------‐--
2 నెలల తరువాత మంత్రి ఆనందరాజు తన పలుకుబడిని ఉపయొగించి తనకు మరియు మిగిలిన వాళ్ళకి బైల్ తెప్పించుకొని బయటికి వస్తారు. 

ఆ రోజు అర్ధరాత్రి మహేంద్ర వర్మ మరియు మంత్రి ఆనందరాజు ఒకే కారు లొ దంతపురానికి వస్తున్నప్పుడు. సరిగ్గ ఊరి పొలిమేరకు చేరుకోగానె వాళ్ళ కారు ఆగిపోతుంది. డ్రైవర్ కారు దిగి ఏమైంది అని చూస్తాడు. 

మహేంద్ర వర్మ : ఏమైంది డ్రైవర్ ?

డ్రైవర్ : రిపేర్ అనుకుంటా సార్. నేను ఊరిలోకి వెళ్ళి మెకానిక్ ని తీసుకువస్తా.

మహేంద్రవర్మ : సరే వెళ్ళి త్వరగా రా

డ్రైవర్ వెళ్ళిన కాసేపటికి వాళ్ళు కారు దిగి బయట సిగిరెట్ వెలిగించుకుంటారు.

మహేంద్ర వర్మ : ఛా 35 ఏళ్ళుగా ఎదురుచూసా చివరికి ఆ నిధి దక్కకుండా పోయింది. జైలు కు వెళ్ళడంతొ నా పరువు మొత్తంపోయింది. దీనంతటికి కారణం ఆ నారాయణమూర్తి వాడి కొడుకు వంశి వాళ్ళ ని వదలకూడదు.

మంత్రి ఆనందరాజు : అవును వాళ్ళ ని వదలద్దు. నా మంత్రి పదివి పోయి ఇకమీదట ఎన్నికల్లొ పోటిచేయకుండా నా మీద అనర్హత వేటుపడింది. నా రాజకీయ జీవితం నాశనం అయ్యింది వాళ్ళ వల్లె.

ఇలా వాళ్ళు మాట్లాడుతున్న సమయం లొ వాళ్ళకి చిన్నగా ఏదొ చప్పుడు వినిపిస్తుంది. నెమ్మదిగా ఆ చప్పుడు మరింత ఎక్కువుగా వినిపించడం మొదలైంది. అది అచ్చం గుఱ్ఱపు డెక్కల చప్పుడు లా ఉంటుంది. కాసేపటికి ఆ చప్పుడు ఆగిపోతుంది.  

ఒక్కసారిగా మహేంద్రవర్మ వీపు పై ఎవరో కత్తి తొ దాడి చేస్తారు. దాంతొ మహేంద్ర వర్మ అరుస్తాడు. 

ఆ అరుపు విని మంత్రి ఆనందరాజు ఒక్కసారిగా ఝడుసుకుంటాడు. తరువాత తన పై కూడా ఎవరొ కత్తి తొ దాడి చేస్తారు.

భయంతొ వాళ్ళిద్దరు అక్కడ నుంచి పరుగులు పెట్టి ఆ పొలిమేర దగ్గర ఉన్న గుట్టపై ఎక్కుతారు. కాసేపటికి వాళ్ళు ఆయాసపడుతు ఒక చెట్టు దగ్గర చితికిలబడిపోతారు.

ఆ చెట్టు ఏంటా అని చూస్తె అది వీరఘాతకుడుని తగలబెట్టి చంపిన మఱ్ఱి చెట్టు.

ఈసారి మళ్ళి గుఱ్ఱపు డెక్కల చప్పుడు వినిపిస్తుంది. 

దూరంగా నడిచి వస్తున్న వాళ్ళ డ్రైవర్ కి వాళ్ళిద్దరి చావు కేకలు వినిపిస్తాయి.

-------------------------------సమాప్తం---------------------------