Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 14

శైలుని మాట్లాడించడానికి వెళ్లి న గీతికకి ప్రభ ఎదురుపడేసరికి జరిగిన ఆ సంఘటనతో ఇంటికి రాగా తాతయ్య జేజీ ల మాటలు విని నేను మీరు అనుకున్నట్టు ఎప్పటికీ ఉండను నాకు నచ్చిన విధంగానే నేను ఉంటానని నిర్ణయించుకుని జాబ్ చేయడానికి  మనసుని సిద్ధం చేసుకుంది గీతిక.

 ఉదయం అలారం మ్రోగించినట్టు తన మనసు 5 గంటలకి మేలుకువరానిచ్చేసరికి లేచి , తల స్నానం చేసి, గదిలోకొచ్చి బెడ్ పై తీసిపెట్టిన రెండు జతల డ్రస్సులలో ఇదా , అదా ఏది వేసుకోను?  అసలే అవసరం   ఇవాళ మొదటిసారి జాబ్ కి వెళ్తున్నాను  అంటూ పెదవి మీద చూపుడువేలు పెట్టి క్షణం ఆలోచించి గ్రీన్ రంగు డ్రెస్ సెలెక్ట్ చేసి వేసుకుని,  అద్దం ముందు నిలబడి  సింపుల్గా రెడీ అయి, చిన్న బొట్టు పెట్టి జుట్టుదువ్వుతూ కురులని వదులుగా వేసుకొని ఓ క్లిప్ పెట్టాలా , లేదా పోనీ ఇలా రబ్బర్ బ్యాండ్ వేయాలా. వద్దు,  ప్రొఫెషన్ కదా జుట్టుకు మెడ దగ్గర రబ్బర్ బ్యాండ్ వదులుగా వేసి ఒకసారి తన డ్రెస్ వైపు చూసుకొని మళ్లీ తల పైకెత్తి అద్దంలో చూసి చిన్నగా నవ్వి అటు,  ఇటు తిరుగుతుంటే  " గీతిక ఈరోజు ఎంత హుందాగా కనిపిస్తున్నావు "   అంటూ జేజి లోపలికి వచ్చేసరికి " అవును , జేజి ఈరోజు నుండి నేను నా  పని ప్రయాణం మొదలు పెడుతున్న "   ఇందులో సక్సెస్ అవ్వాలి అంది గీతిక నవ్వుతూ

  నువ్వెక్కడికెళ్లినా , ఏం చేసినా,  మంచి మనసుతో చేస్తావ్ కాబట్టి కచ్చితంగా సక్సెస్ అవుతావు సరేనా!  ముందు టిఫిన్ చేసి వెళ్ళు హడావిడిలో మర్చిపోయేవు. అని జేజి గుర్తు చేసి వెళ్లడంతో ఐదు నిమిషాలు నా బ్యాగ్  సర్ది వచ్చేస్తా . అని చెప్పి బ్యాగ్  సర్ది  టిఫిన్ తిని తాతయ్య కోసం  దక్షిణం వైపు ఉన్న వాకిలి తీసి బయటికి వచ్చింది గీతిక.

  రాత్రి ఆలస్యంగా పడుకున్న ప్రభని చూసి న,  పప్పు   "  బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు పడుకొనిలే "  అనుకొని వెళుతూ ఉండగా  హు -హు అని ములుగుతూ అటు, ఇటు తిరిగి బోర్లా పడుకుని,  మళ్ళీ వెల్లకిలా తిరుగుతుంటే ఇదేంట్రా!  లేవడానికి ఇన్ని పాట్లు పడుతున్నావ్.  ఒకసారి లేచి కిటికీ వైపు చూడు , " ఆ భానుడి వచ్చి తట్టి  లేపుతున్న నీకు మెలకువ రాలేదంటే నువ్వు ఎంత డీప్ స్లీప్ లో ఉన్నావు నాకు అర్థం అవుతుంది "  అని పప్పు అనేసరికి సరే రా లేస్తున్నాగా అనడంతో పప్పు ఫ్రెష్ అవ్వడానికి బాత్రూ మ్ వైపుకి వెళ్ళాడు.

 ఒళ్ళు విరుస్తూ ఆ..ఆవులిస్తూ , చిటికె వేస్తూ అలా సగం లేచి మోకాళ్ళ మీద కూర్చుని భానుడిని చూడగా 'భానుడు కళ్ళు తెరిచి చాలా సేపయిందే 'అనుకొని కిటికీ కమ్మి పట్టుకుని లేస్తుండగా గీత బయటికి రావడం చూసిన ప్రభ బిస్కెట్ రంగు డ్రెస్ కు సూర్యకాంతి పడడం వల్లనేమో ఆమె ముఖం   మెరిసిపోతూ ఉంది .ప్రభ  కమ్మీ పక్కన రెండు మోచేతులు అన్చి  అలాగే చూస్తుండి పోయాడు . "  గీతిక!  నిన్ను చూస్తే నాకు చాలా  జాలేస్తుంది కానీ   కోపం అస్సలు రాదు.  చూడు లేడీ పిల్లలా చెంగుచెంగుమని గెంతుతూ దేనికోసమో ఎలా వెతుకుతున్నావో  " అనుకుంటూ ఉండగా తాతయ్య అటువైపు రావడంతో గీతిక తాతయ్యని తీసుకొని లోపలికి వెళ్ళింది.

 అంతలోభానుడి కిరణాల ప్రభావం పెరగడంతో కళ్ళు మూసి తెరుస్తూ పైకి  లేచి వెళ్ళాడు ప్రభ.

 గీతిక మొదటి రోజు తను జాయిన్ అవ్వాల్సిన కంపెనీకి వచ్చి వెయిట్ చేస్తుండగా వాళ్ళు పిలిచేసరికి తన హెడ్ మేనేజర్ ఉన్న గాజు గది   దగ్గరికిచ్చి లోపల ఉన్న మేనేజర్ " ఆడా లేదా మగా  "అని తొంగి చూస్తే చేయిర్   ఖాళీగా ఉంది . అరే!  లోపల ఎవరూ లేరు మరి నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారు అనుకొని ఇంకొకసారి అటు చూసేసరికి  చైర్  అటువైపు తిప్పి ఉంది ఎవరో కాలి మీద కాలు వేసుకుని ఊగుతూ ఉన్నట్టుగా అనిపించడంతో  ఒక్క అడుగు వెనక్కి వేచి నిలబడిన గీతికని లోపలి నుంచి ఒక వ్యక్తి వచ్చి  'మేడం పిలుస్తున్నారు ' అని చెప్పడంతో  " హమ్మయ్య!  మేడం అంటే లేడీ. సో ఐ యాం హ్యాపీ లేదంటే ఆ మగవాళ్ళతో వద్దులే నీ హ్యాపీ మూడ్లో అవన్నీ ఎందుకు "  అనుకొని డోర్ ప్రెస్ చేసి " మే  ఐ కమ్  ఇన్  మేడం ? "అని పర్మిషన్ అడుగుతూనే లోపలి నుంచి "  ఎస్,  కమ్ ఇన్ "  అని మేనేజర్ చెప్పడంతో సర్టిఫికెట్స్ పట్టుకొని లోపలికి వెళ్లి నిలబడి 'గుడ్ మార్నింగ్ మేడం 'అని చెప్పింది గీతిక.
వెరీ గుడ్ మార్నింగ్ 'అంది మేనేజర్ సర్టిఫికెట్స్   ఇవ్వమన్నట్లు చెయ్యి చాచి. 

 సర్టిఫికెట్స్ మేనేజర్ చేతికిచ్చిన గీతిక ఇంతకీ మానేజర్ పేరేంటి?  అని బోర్డు వైపు చూస్తుండగా ' మహారాణి' అని కనిపించడంతో మేనేజర్ వైపు ఒకసారి పైనుంచి కిందికి చూసి నిజంగా మహారాణినే అని ఇంకా ఏదో అనుకుంటూ ఉండగా " ఏంటి ! నీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నావ్ ." అంది  మహారాణి గీతికని చూస్తూ.

 ఏం లేదు మేడం అని బుద్దిగా నిలుచుంది గీతిక.

 రాణి సర్టిఫికెట్స్ ని ఒక్కొక్కటి పేపర్ తిప్పుతూ ఉంటే గీతిక ఏం చెప్తుందో ఏమో అని కొంచెం దిగులుగా ఉన్న  ముఖంలో అలాంటి భావాలు చూపించకుండా యాక్టివ్ గా ఉన్నట్లు నటిస్తోంది.

 ఓకే!  సర్టిఫికెట్స్ మార్క్స్ అన్ని బాగానే వచ్చినట్టు ఉన్నాయి అయితే ఒక కండిషన్

 ఆ మాట వినగానే ఒకపక్క సంతోషం మరొక భయం ఏం కండిషనో  ఏమో  అనుకుని ' చెప్పండి మేడం ' అంది చిన్న స్వరంతో గీతిక.

 నువ్వు రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. ఒక ఒరిజినల్ సర్టిఫికెట్ మాతో మాకు ఇవ్వాలి అంది మహారాణి.

 అది విని హతాషురాలై  గీతిక ఇదెక్కడి జాబ్ రా బాబు అనుకొని ఓణీని రెండు చేతులతో పట్టుకొని నలుపుతూ ఉండడం చూసిన రాణి ఏంటి సమాధానం లేకుండా ఓణీ నలుపుతున్నావ్ అని గీతిక వైపు చూసి అడగడంతో 'మేడం ఒక్క నిమిషం మేడం అంది  గీతిక.'

 ఏంటి!  ఆలోచించుకోవాలా , ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్లు ఈ మాట నీతో చెప్పలేదా? 

 ఊ..అన్నట్టు ఊహు..అన్నట్టు తలూపింది గీతిక.

 అయితే ఒక పని చెయ్ కాసేపు బయటికి వెళ్లి ఆలోచించుకొని ఆ తర్వాతే నీ నిర్ణయం చెప్పు అంది రాణి.

 అ .. అలాగే మేడం అని చెప్పి బయటకు వచ్చి అటు,ఇటు తిరుగుతూ , ఒకసారి వేలు నోటిలో పెట్టి గోరు కొరుకుతూ ఎన్నో విధాలా ఆలోచించినా తన మనసు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు . ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తే మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం లేదా మరొక సమస్య వస్తే!  ఒకవేళ జాబ్ని రిజైన్ చేస్తే,  నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సర్టిఫికెట్స్ వృధా అవుతాయి . ఒకవేళ నాన్నకు కాల్ చేస్తే,  అమ్మో!  వద్దు, ఇప్పటికే అబద్ధం చెప్పి ఎలాగో అలా తప్పించుకున్నా ఇప్పుడు ఈ జాబ్ కూడా చేయకపోతే ఎలా ?  అబ్బా! బుర్ర వేడెక్కిపోతుంది. అయినా నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. "  అనుభవం వస్తేనే నెంబర్ వన్ కంపెనీకి వెళ్ళొచ్చని నాన్న అన్నారు "  కాబట్టి ఇక్కడ పనిచేస్తే రెండేళ్లు అనుభవం వస్తుంది ఆ తర్వాత పనిచేయడం ఇష్టం లేకపోతే వేరే కంపెనీలో జాయిన్ కావచ్చు అయినా " ఎంత కష్టమైనా,  బోర్ కొట్టినా ఎట్టి పరిస్థితులను నేను రెండు సంవత్సరాలు జాబ్ ని వదులుకోను." ఇదే  నా  తుది నిర్ణయం  అని మనస్సులో  నిర్ధారించుకుని లోపలికి వెళ్ళింది గీతిక.

 'గీతిక ! కండిషన్స్ ఓకేనా' అడిగింది రాణి.

  ఓకే!  మేడం అంటూ చిరునవ్వు నవ్వింది గీతిక. 

గీతిక ఎస్ ఎస్  సి  మార్క్స్ కార్డు   తీసుకుని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంది రాణి.

 అమ్మయ్య ! ఎలాగూ జాబ్ కి జాయిన్ అయిపోయాను. అని గీతిక సంతోషించి థాంక్యూ మేడం అంత గీతిక. 

 బయట డోర్  దగ్గర నిలిచిన బాయ్ నీ పిలిచి ఈ అమ్మాయికి తన క్యాబిన్ చూపించు అని రాణి చెప్పడంతో  ఆ అబ్బాయి, గీతిక  కదులుతుండగా ,  గీతిక ! అన్న రాణి మాట వినిపించడంతో వెనుదిరిగింది గీతిక.

  "ఈరోజు అదే క్యాబిన్లో కూర్చుని వర్క్ చేయి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత  ఒక సెక్టార్ కి పంపిస్తాను. "అని రాణి చెప్పడంతో అలాగే మేడం అంటూ  బయటికి వెళ్ళాక ఆ అబ్బాయి క్యాబిన్ చూపించడంతో వెళ్లి కూర్చుంది గీతిక.

ప్రభ నీకు డైరీ కి వెళ్లాలని వస్తూ ఉండగా గీతిక జాబ్ కి వెళ్ళిన విషయం ప్రభతో చెప్పి   తాతయ్య జేజేలు చాలా సంతోషిస్తారు. 
అక్కడి నుంచి మిల్క్ డైరీ కి వెళ్లాలని వస్తున్న ప్రభుకి అరణ్యకు జాబ్ ఎలా ఉందో ఒకసారి ఫోన్ చేయాలని చేస్తే రీచ్ కాలేదు ఇక తను డైరీ ఫార్మ్ కి వెళతాడు.

***
కదిరినాడులో 
అరణ్య మీటింగ్ ఉన్నందువలన త్వరగా బయలుదేరి ఆఫీస్ కి వెళ్లి కార్ పార్క్ చేసి ఆఫీసు లోపల స్టాఫ్ మీటింగ్ జరిగే హాల్ కి వెళ్లి చూస్తే ఎవరు కనిపించలేదు. అరే!  హయ్యర్ ఆఫీసర్   మీటింగ్ ఉందని చెప్పి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎవరూ లేరే అనుకుని ఆఫీస్ బాయ్ వచ్చేసరికి ఆఫీస్ లో ఎవరూ లేరేంటి ? ఇంకా ఎవరూ రాలేదా ? అడిగింది అరణ్య.

 "సర్   వాళ్ళందరూ ఇంతకుముందే వచ్చారు మేడం వాళ్ళందరూ ఏదో స్పెషల్ మీటింగ్ ఉందని ఈ ఊరి చివర్లో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్తాము. మీరు వచ్చిన తర్వాత అక్కడికి రమ్మని చెప్పమని చెప్పారు." అని ఆఫీస్ బాయ్ చెప్పడంతో ఎం.ఈ.ఓ , ఎం.డి. ఓ ఇంకా ఏ. ఇ. ఓ వీళ్ళందరూ వెళ్లారంటే ఏదైనా కొత్త పథకాల గురించి, చిన్న సన్న కారు రైతుల గురించి ఏమైనా చర్చిస్తారో ఏమో అనుకొని ఆఫీస్ బాయ్ రాముని పిలిచి రాము!   ఇక్కడి నుండి దగ్గరేనా అడిగింది అరణ్య.

 'దగ్గరoటే దగ్గరేం కాదు మేడం ఊరి చివరన ఉంది .'అని చెప్పడంతో సరే నీ స్కూటీలో  అక్కడకి వదిలి వస్తావా?  అడిగింది అరణ్య.

 అలాగే మేడం.  అని రాము అరణ్యని సచివాలయం దగ్గరికి వదిలి  'మేడం మీకు స్కూటీ అవసరమైతే ఇక్కడే ఉంటుంది నేను నా ఫ్రెండ్ వస్తా  'అన్నాడు వానితో పాటు వెళ్తాను మీటింగ్ తర్వాత అయిపోయిన తర్వాత తీసుకురండి అని చెప్పి వెళ్తాడు రాము.

 సచివాలయం లోపలికి వెళ్లడంతో అక్కడున్న సిబ్బంది విష్ చేయగా తను విష్ చేసి అటు,  ఇటు రూముల్లో, హాల్లో అలా ఒకసారి చూసి వచ్చి ఎవరు కనిపించకపోయేసరికి   ఎలాగో వచ్చాను కదా మీటింగ్ గురించి  ఏమీ అడగకుండా ఒకసారి వాళ్ళ పనితనం గురించి అడిగి తే విజిట్ కొచ్చానని అనుకుంటారని అలా ఒకసారి రిజిస్టర్లు చూసి సరే వెళ్తాను అని చెప్పి బయటకొచ్చి చూస్తే ఎక్కడ ఒక భవనం లాంటిది కానీ ఏమీ కనిపించలేదు. ఏం చేయాలి వెనక్కి వెళదామా అనుకొని స్కూటీ ఎక్కుతుండగా కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే  Meo ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో!  అండి అరణ్య.

 మీరు ఇప్పుడు సచివాలయం దగ్గర ఉన్నారు కదా అక్కడి నుంచి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇక్కడికి రండి  అంటూ లొకేషన్ పెట్టేసరికి స్కూటీ స్టార్ట్ చేసి ఈ  శారి ఒకటి హాయిగా డ్రెస్ వేసుకొని వచ్చేదాన్ని ఏదో మీటింగ్ అంటే ఏమో అనుకున్నా అని విసుక్కుంటూ స్కూటీని రైడ్ చేస్తూ వెళుతుండగా ముందు వెనక ఏ ఒక్క వెహికల్ కానీ మనుషులు కానీ రావట్లేదు. దారి రొడ్ అయినా నిర్మానుస్యంగా ఉంది. అటు, ఇటు చెట్లు ఉన్నాయి. చూడబోతే ఒక చిన్న అడవిలా  ఉంది. రోడ్లకి ఇరువైపులా అక్కడక్కడ పచ్చని చెట్లు వీస్తున్న గాలి కూడా ఎండకి వేడిగా అనిపిస్తోంది. అరణ్యకి. ముందే ఇలా తెలిసి ఉంటే డైరెక్ట్   ఇక్కడికే వచ్చేదాన్ని కదా . షార్ట్ డిస్టెన్స్ అయినా ఎండ మండిపోతుంది. ప్రయాణమే కష్టం అనిపిస్తుంది అనుకుంటూ నుదుట పైనుండి చెవి కిందికి జారుతున్న చెమట బొట్టును తుడుచుకుంటూ ముందుకెళుతూ ఉండగా ఏదో పెద్ద శబ్దం వినబడడంతో అటు, ఇటు చూసిన ఏమీ కనిపించకపోయేసరికి కాస్త దడ పెరిగింది. బండి స్పీడును కూడా పెంచి ఇంకాస్త ముందుకు వెళితే ఆ ప్రదేశం బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది.

 చూడబోతే అది ఒక గెస్ట్ హౌస్ లా ఉంది  అనుకొని స్కూటీని పక్కన పెట్టి లాక్ చేసి తాళం పర్సులో వేసి అడుగు పెడుతుంటే నిజంగా చూడడానికి ' ఒక బృందావనమేమో అనిపించేలా ఉంది .' అక్కడక్కడ అశోక్ వృక్షాలు , అందులోనే తారు రోడ్ లో ఉన్నాయి. కొన్ని కాలిబాటలకు బండలు పరిచారు. మరికొన్ని సిమెంట్ రోడ్డు వేశారు . రోడ్ల పక్కన రంగురంగుల పూల మొక్కలతో చూడడానికి అలంకరించినట్టుగా ఉంది. వావ్ ! అనుకుంది పూలను తడుముతూ అరణ్య. తలపైకి ఎత్తి చూస్తే ఆకాశమంత ఎత్తుందేమో అనిపించింది ఆ భవనం.  ఇంతకీ ఇంటి బోర్డ ముందో అని చూస్తే బోర్డు ఎక్కడ కనిపించలేదు . అయితే ఇంటిపై అంతస్తు మూలన ఉన్నా ఓ చిన్న రూమ్ కట్టిన ఎదురుగా కనిపించే గోడ పై నంది బొమ్మ కనిపించింది. ఇదేంటి నేను ఇంతవరకు ఇలాంటి బొమ్మని ఇంటి పై చూడలేదు.  ఇదేదో ప్రత్యేకంగా అనిపిస్తుంది అనుకుని భవనం ఎంట్రన్స్ లో గడప దగ్గరికి వెళ్లి అటు ఇటు చూసి కుడికాలు ముందర పెట్టి లోపలి కడుగు పెడితే ఇంతసేపు అనిపించిన వేడి పూర్తిగా మాయమైపోయినట్టుంది. బహుశా ఏసి ఉందేమో అందుకే ఇంత చల్లగా ఉంది అనుకొని వెళుతుంటే ఒక వ్యక్తి ఎదురొచ్చి రండి మేడం మీటింగ్ ఇంకో భవనంలో జరుగుతుంది అనడంతో మరి ఇదేంటి?  అన్న  అరణ్య ప్రశ్నకు ఇది కేవలం ఎంట్రెన్స్   మాత్రమే మేడం. సర్ వాళ్ళు అటువైపు ఉన్నారు అని తీసుకెళ్లాడు ఆ వ్యక్తి.

 అరణ్య లోపలికి అడుగుపెడుతూ ఇదేంటమ్మా నేను ఫ్రెంచ్ విప్లవం గురించి తెలుసుకునేటప్పుడు అద్దాల భవనం గురించి విన్నాను . నిజంగా ఇప్పుడు దాన్నే చూసినట్టుంది అనుకొని లోపలికి అడుగుపెట్టగా మిగిలిన ఆఫీసర్స్ వారి వారి సింహాసనం లాంటి ఆసనాల మీద కూర్చొని ఉండడం చూసిన అరణ్య " శుభ మధ్యాహ్నం " అని చెప్పేసరికి వారు కూడా విష్ చేస్తూ అరణ్య సీట్ చూపించగా వెళ్లి కూర్చుంది అరణ్య .