పని ముగించుకుని గదిలో పలికి వెళ్ళిన ప్రియా మాదేవి బంగారంని ఒడిలోకి కూర్చోబెట్టుకొని ఉండడం చూసి తన కళ్ళలోనే బాధను వ్యక్తం చేస్తోంది.
అయినా ఒక్క చిన్న పొరపాటు అది నేను చూడలేదు చూసి ఉంటే ఆ రోజు తమ్ముడిని నేను బయటికి తీసే దాన్ని కానీ ఆ చిన్న పొరపాటు వలన అదే నేను చూడకపోవడం వల్ల జరిగిన సంఘటన కోసం నన్ను అంత ప్రేమగా చూస్తున్న అమ్మ రోజు రోజుకినన్ను అవాయిడ్ చేస్తూ వస్తోంది. నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చేది అమ్మ నన్ను మాట్లాడిస్తుందన్న ఆశతోనే. తను నన్ను కనీసం తిడుతూ అయినా మాట్లాడించింది అలాగైనా నాతో మాటలని తగ్గించలేదు. అంతవరకయినా నాకు ఆనందమే" అనుకుంటూ కళ్ళ తుడుచుకుంటూ వెళ్లి ఇంటికి అవతల వైపున ఉన్న తన గదికి వెళ్లి పడుకునేటప్పుడు తన చేతిని తలకింద పెట్టగా ఎప్పుడు తలకు ఒత్తుకునే బ్రేస్లెట్ ఇప్పుడు గుచ్చుకోకపోవడంతో చేతిని అలా తీసి చూస్తే బంగారు బ్రేస్లెట్ లేదు ఇది తన తమ్ముడు బంగారం డబ్బులను కూడ పెట్టుకుని తన బర్త్డే కని కొని ఇచ్చిన గుర్తు. కానీ అది ఎక్కడ పడిందో! ఆ గాలిపటాలు ఎగిరేసి చోట ఏమైనా పడిందా! ఇప్పుడు వెతకడానికి బయటకి వెళ్తే అమ్మ నన్ను ఇంకా గట్టిగా అరుస్తుంది ఏం చేయాలి రేపు వెళ్లాలన్నా అమ్మ ఊరికి వచ్చింది ఇప్పుడు ఎలా? అని ఆందోళన పడుతూ ఎలాగైనా మా నాన్న తో చెప్పి వెళ్లి వెతుకుతాను అని కళ్ళు మూసుకున్న, తన కంటికి నిద్ర రావట్లేదు ఆలోచిస్తూ ఎప్పటికో కనురెప్పలు అలా మూతపడ్డాయి.
ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్నా నారాయణకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఒక అయ్యవారింటికి పంపే వరకు నాకు ఈ బాధ అయితే తప్పదు ఎప్పటికైనా నా భార్య మారుతుందేమోనని చాలా ఆశ పడ్డాను కానీ మార్పు అనేది ఇంతవరకు రాలేదు. చూద్దాం ఇది కూడా ఎన్నాళ్ళు ఉంటుందో అనుకుంటూ వెళ్లి పడుకుంటాడు
రాత్రికి ఇంటికి వచ్చిన ప్రభ తన గది కెళ్ళి అలా బెడ్ మీద వాలి తన ప్యాంటు జేబులోని బ్రేస్లెట్ తీసి " ఒక ప్రాణం ఉన్న బొమ్మ చేతిలోని అందాల బ్రేస్లెట్. ఆగాలిపటం ఎగరవేస్తుంటే నీ చేతికి ఎంత అందంగా కనిపించిందో తెలుసా! చూడు ఈ డిజైన్ ఎంత బాగుందో! నీ సెలెక్షన్ సూపర్ అనుకో, ఇంతకీ నీ పేరేంటి? నీదేవూరు? నిన్ను చూసి కొన్ని నిమిషాలైనా యుగముల పరిచయమేమో అనిపిస్తుంది. మెరిసే ఆ నక్షత్రాల్లాoటి ఆ కళ్ళు, పూదోటలో పువ్వులా వికసించిన నీ నవ్వు నా హృదయానికి వసంతo అనుకో " అంటూ చిరునవ్వుతో గుండె మీద చెయ్యి పెట్టి అలా తీసి" పైకి లేచి మరొక్కసారి అలా బోర్లా పడుకొని బ్రెస్లెట్ ని చేతిలో పట్టుకుంటూ "అయినా ఈ బ్రాస్లెట్ ఇవ్వాలని ఎన్నిసార్లు నీకు కనిపించిన నువ్వే నా వైపు కూడా చూడలేదు. పోనీ దగ్గరకొచ్చి ఇద్దామనుకునే సరికి అక్కడ నీవు లేనే లేవు. పోనీలే ఇది నా చేతితోనే నీకు తొడగాలని రాసిందేమో! అదే గనక జరిగితే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది" అంటూ ఒక్కసారి అలా పెదవుల దగ్గరికి తీసుకుని మళ్ళీ వెనక్కి తీసి వద్దులే అని తల తిప్పుకొని తన అలమరాలో ఉంచి వెల్లకిలా పడుకొని రెండు అరచేతులను తలకింద ఉంచి లేడి పిల్లలా చెంగుచెంగున ఎగురుతూ పతంగుల పోటీకి వస్తూ ఉంటే , ఘల్లు ఘల్లుమని వస్తున్న కాలు మువ్వలు చప్పుడు చెవి సొoపుగా ఉండినదనుకో ఆ ముఖంలోని తేజస్సు చూస్తుంటే దివి నుంచి నాకోసమే దిగివచ్చిన దేవకన్య అనిపిస్తుంది సుమా "అని తననే తలచుకుంటూ అలా ఎప్పటికో నిద్రపోతాడు ప్రభ.
ఉదయం డైరీ ఫార్మ్ కి వెళ్ళిన ప్రభ తనకిచ్చిన పని తాను చేసుకుంటూ ఓనర్ చెప్పినట్టు కాస్త పరిశీలన చేయడం ప్రారంభించాడు. అయినా నేను ఇక్కడ ఎక్కువ రోజులు పని చేయను కాబట్టి అంతగా ఓనర్ చెప్పిన కూడా పట్టించుకోకూడదు అని మనసులో అనుకున్న జీతం ఇస్తాడు కాబట్టి తప్పదు అన్నట్టు చూస్తూ ఉంటే కొత్త జనాల పరిచయంతో అక్కడక్కడ కొన్ని విషయాలు తెలియడం ప్రారంభించిన తనకి ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు అయినా వాటి వలన ఓనర్ కి చాలా నష్టమే జరగవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ జరిగి ఒకటి రెండు తప్పులను ఓనర్ కి అని తెలుసుకునేలా చేసేసరికి ఓనర్ మేనేజర్నీ మందలించేసరికి ఇంకాస్త బాధ్యత పెరిగింది. నేను తన మీద ఎలాంటి అనుమానం రాకుండా తన పనిని మాత్రమే తాను చూసుకుంటున్నట్టు చూస్తున్నాడు. అదే రోజు పప్పు కనిపించడంతో అతడిని కూడా అక్కడ పనిలోకి చేరేలా చేస్తాడు. పప్పు పనిచేస్తూ ఉంటే పాల ప్యాకింగ్ దగ్గర నిలబడిన ప్రభ "అరణ్య మొదటి రోజు కదిరినాడుకు జాయిన్ అవ్వడానికి వెళుతోంది పెద్దాయన అరణ్యతో వెళ్లాలని చెప్పారు కాబట్టి ఓనర్ తో కూడా మాట్లాడాను. నేను వెళ్ళొస్తాను," అని చెప్పి అక్కడ నుంచి రామాపురం బయలుదేరి వెళ్ళగా అరణ్య అప్పటికే రెడీ గా ఉండడంతో పతంగి,ప్రభ కారు ఎక్కగా అరణ్య పెద్దాయన నిలుచున్న చోటికి వెళ్లి కాలికి మొక్కుతుంది.
పెద్దాయన అరణ్యని "ఆశీర్వదిస్తూ ఇప్పుడు వెళుతున్నది ప్రొఫెషన్ కి నువ్వు చదివిన చదువును ఉపయోగిస్తూ సమాజాన్ని చదువుతూ సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించి ఒకరి వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంటే ఎప్పటికీ నువ్వు ముందడుగు వేస్తావు కదిరినాడులో కాస్త జాగ్రత్త "అని చెప్పి కార్ ఎక్క మనీ అంటూ ఉండగా మరొక్కసారి అరన్య పెద్దాయన వైపు చూసేసరికి "చిట్టితల్లి నువ్వు భయపడకు ప్రభ ఉన్నాడంటే నేను ఉన్నట్టే అయినా ఎవరూ లేకున్నా నీకు నువ్వే ధైర్యంగా బతకడం అలవాటు చేసుకోవాలి.ఎందుకంటే ఎవరికి ఎవరు శాశ్వతం అయితే కాదు ధైర్యంగా ముందుకు వెళ్ళు సరేనా "అని చెప్పగా అలాగే అని చెప్పి కారులోకి అరణ్య ఎక్కడంతో ముగ్గురు కారులోకి ఎక్కడంతో ముగ్గురు కదిరినాడుకు చేరగానే అరణ్యని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర నుంచి వీళ్లిద్దరూ బయట ఉండడంతో తను వెళ్లి జాయిన్ అవుతుంది.
ప్రభ అక్కడ నిలుచుని బోర్ అనిపించడంతో అలా ఊరిని చూసొద్దామని అది అడవి పక్కన ఉందని తెలిసి పతంగితో చెప్పి బయలుదేరుతాడు. ఊరికి ఒకవైపున అడవి చాలా పచ్చగా కనిపిస్తోంది కానీ ఊరు మాత్రం అంతగా అభివృద్ధి అనిపించడం లేదు. అక్కడక్కడ కొన్ని జీవితాలు బాగానే ఉన్నాయి అనిపించినా కొన్నిచోట్ల ఇంకా పాత జీవితాలు అలాగే ఉన్నాయి అనిపిస్తోంది. అలా వెళుతూ ఉంటే అక్కడ ఒక ఇల్లు తనని ఎందుకో ఆకట్టుకున్నట్టు అనిపించడంతో అటు వెళ్దాం అనుకునే లోగా పతంగి పిలవడంతో వెనక్కి వచ్చి అరణ్య ని పిలుచు కొని రామా పురం వదులుతాడు.
"అరణ్య కదిరినాడు చూసి వచ్చాను ఊరిలో అభివృద్ధి అనేది చాలా వరకు లేదు నువ్వు మాత్రం ఏ మాత్రం ప్రయత్నం చేయకు ఈ ఊరి గురించి ఎక్కువగా ఆలోచించకు" అని చెప్పి అక్కడి నుంచి తన ఫ్యాక్టరీ కి వచ్చేసరికి మేనేజర్ సమస్యలో బాధపడుతూ ఉంటే ఆ సమస్యని పరిష్కరించేందుకు ప్రభా కాస్త రిస్క్ తీసుకున్నందుకు మేనేజర్ ప్రభ కి థాంక్స్ చెప్పి" ప్రభ నేను కూడా ఈ మేనేజర్ పోస్టులో కేవలం ఓనర్ కొడుకు వచ్చే వరకే మాత్రమే ఉంటానని తెలుసు.కానీ ఆ విషయాన్ని కుర్చీలో కూర్చున్న తర్వాత మరచిపోయానేమో అనిపిస్తుంది నన్ను క్షమించమని" అడిగేసరికి" పెద్దవారు మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అలా మాట్లాడకండి" అని చెప్పి తన పని చేసుకోవడానికి వెళ్తాడు.
తర్వాత రోజు కదిరినాడుకు వెళ్లిన అరణ్య తన ఆఫీసులో పనిచేస్తున్న రాముని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంది.అక్కడి నుంచి ఆఫీస్ వాళ్ళ పరిచయంతో ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటుంది అయినా అక్కడ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ "చూడు అరణ్య మన పని వరకు మాత్రమే ఉండాలి ఏమాత్రం అజాగ్రత్త వహించిన మన ఉద్యోగానికి ప్రాణానికి కూడా హాని కలుగుతుంది ఎందుకంటే కొత్తగా చేరావు కాబట్టి చెబుతున్నాను లేదంటే తీసుకుని వెళ్లి ఏ కొండ ప్రాంతానికి వేస్తారు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా "అని చెప్పడంతో "అలాగే సార్" అని చెప్పి తన కుర్చీలో కూర్చుని తన పనిని ప్రారంభిస్తుంది అరణ్య.
ప్రభ డై్రీ నుండి బయట వెళుతుంటే కనిపిస్తాడు చిన్ననాటి క్లాస్మేట్ పరమేశం.
వీడితో మాట్లాడేది ఎందుకులే వాడు ఏ ఒక్కటి సొంత ఆలోచన నిర్ణయం మీద తీసుకునేవాడు కాదు మాటలు కూడా అలాగే వస్తాయి పోనీ ఏదైనా తిట్టినా మళ్లీ వాడే మాట్లాడిస్తాడు ఇక వాడి బిల్డప్ చెప్పలేము కాబట్టి వాడితో మాట్లాడకుండా ఉంటే మేలు అనుకుని ప్రభా ఊరికే పోతున్న క్లాసుమేట్ ఊరికే ఉండ కుండా ఏరా ! ప్రభ అనేసరికి ఆగుతాడు.
రిజల్ట్ సంగతే oటి అన్నాడు పరమేష్.
ఏంట్రా నువ్వు కావాలని అడుగుతున్నావా లేదా వెటకారంగా అడుగుతున్నావా ఎంతైనా నీ చిన్నప్పటి బుద్ధులు ఇంకా మానుకోలేదా అడిగాడు ప్రభ.
నా బుద్ధికి ఏం అలాగే ఉంది కానీ నా లెవెల్ మారింది కదా కాలర్ ఎగరేస్తూ చెప్పాడు పరమేష్.
కాంట్రాక్ట్ జాబ్ అది డబ్బిచ్చి తీసుకున్న జాబ్ దానికి అంత బిల్డప్ అవసరమా కొంచెం ఆలస్యం కావచ్చు నీకంటే బెస్ట్ పొజిషన్ కి వెళ్తానేమో అన్నాడు ప్రభ.
అయితే అది చూద్దాంలే అంటూ చాలెంజింగ్ గా చెప్పాడు పరమేష్.
సరే చూద్దాం అని ప్రభ చెప్పాగా వెళ్తాడు పరమేష్.
ప్రభా , పరమేశ్ లు ఇద్దరు ఒకే ఒకే క్లాస్మేట్స్. ఇద్దరూ కలిసి కూర్చొని కలిసి చదువుకునే వాళ్ళు ప్రభకి ఒక రెండు మార్కులు ఎక్కువ వచ్చిన పరమేష్ ఓర్చుకునేవాడు కాదు రాత్రంతా పడుకోవడం లేయడం చేసి చదువుకున్నా కూడా మార్కులు తక్కువ వచ్చేవి కానీ ప్రభా తను చదివింది పక్కాగా నేర్చుకోవడం వల్ల తనకి కరెక్ట్ మార్కులు వచ్చేవి అలా మార్కుల విషయంలో అలిగిన పరమేశు అప్పటినుంచి ప్రభు కంటే ముందుగానే తను జాబ్ లో జాయిన్ అవ్వాలని తెగ కష్టపడి చదివాడు తన నాన్న కొంచెం రాజకీయంలో పలుకుబడి ఉండడం వలన వాళ్లకి రికమండేషన్ అనేది ఉండడంతో కోర్సు చేయడానికి కరస్పాండెంట్ గా డబ్బు కట్టి పూర్తి చేసుకున్నాడు ఎలాగో వాళ్ళ నాన్నకి తెలిసిన వారిని కాళ్ళ వేలపడి ఏడు లక్షలు డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ జాబ్ వచ్చేలా చేశాడు.
నాకా అమ్మ సపోర్ట్ తప్ప వేరే దిక్కులేదు అమ్మ చదివింది తక్కువే అయినా ఎంత కష్టపడి నాకోసం కావలసిన డబ్బుని సమకూర్చగలిగింది ఎంతో కష్టపడి నన్ను ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివేలా చేసి ప్రోత్సహించింది అందుకే నేను తన నమ్మకం చేయకుండా ఉద్యోగం సంపాదించాలి ఆ రిజల్ట్స్ విడుదల అయితే వాడు నా అసిస్టెంట్ గా ఉండాలి అలా నాకు ఉద్యోగం రావాలి వస్తుందని నాకు నమ్మకం. వెధవ , డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ పోస్ట్ తీసుకొని ఎన్ని మాటలు ఆడాడు అని తిట్టుకొని ఇంటికి వెళ్లి డైరీ ఫామ్ కి దగ్గరగా ఒక రూమ్ తీసుకుని నేను పప్పు ఉంటామని చెప్పడంతో ఆమె ఒప్పుకోగా పప్పు ప్రభ లిద్దరూ వచ్చి చూశాక అక్కడే ఉండాలని అనుకుంటారు.