Featured Books
  • ప్రణయ గీతిక - 6

    ట్రైనింగ్ ముగించి వచ్చిన ప్రభ అమ్మకు తాను కూడా సాయం చేయాలని...

  • ఆత్మశాంతి

    జిల్లా గ్రంథాలయం వెనుకనున్న పాత బంగ్లాలో ప్రముఖ న్యాయవాది వి...

  • వెంటాడే నీడలు - 18

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • రక్తపు రుణం

    అది ఊరి చివరన ఒంటరిగా ఉన్న ఒక పాతకాలపు పెంకుటిల్లు. గోడల నిం...

  • నైవేద్యం

    కార్తీకమాసం ఆరంభమైన తొలి సోమవారం. పల్లె చివరనున్న చిన్న శివా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 6

ట్రైనింగ్ ముగించి వచ్చిన ప్రభ అమ్మకు తాను కూడా సాయం చేయాలని ఆలోచించి ఏదైనా పని చూసుకోవాలని అనుకొని గోవిందుతోపాటు అలా టౌన్ కి వెళ్లి బైక్ రేస్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లేసరికి "నైనా "అనే అమ్మాయి తనకు వస్తానని చెప్పిన రైడర్ రాకపోవడంతో ప్రభని అడగగా తనకు రైడింగ్ చేయడం ఇష్టం కాబట్టి ఒప్పుకొని బైక్ రైడింగ్ లో మొదటి స్థానంలో నిలిచి ఆమె ఇచ్చిన కొంత అమౌంట్ తీసుకొని వచ్చి అమ్మకి ఇవ్వబోగా" ఇది ఎక్కడిది "అని అడిగేసరికి తడబడుతూ"   బై "బైక్ రేస్ కి వెళ్ళాను "అని చెప్పడంతో చంపచళ్ళు మనిపించింది గౌరీ. 

అమ్మ ఎందుకు కొట్టిందో అర్థం కాక ప్రభ మరి మాట్లాడకుండా డబ్బుని ఆమె ముట్టుకోకపోవడం తో తన గదికి వెళతాడు.

అమ్మ నన్ను ఎందుకు కొట్టిందో!  నాకు బైక్ రైడింగ్ ఇష్టమని వెళ్లాను కానీ చిన్నప్పటి నుంచి నన్ను ఏ రోజు ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు అలాంటిది ఇవ్వాళ కొట్టిందంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుందని" ప్రభ అనుకొని అలా బెడ్ పై వాలి కళ్ళు మూసుకుని ఉండగా కాసేపటికి గౌరీ గది లో పలికి వచ్చి వంగి చూడగా కొడుకు నిద్రపోతున్నాడు అనుకుని దగ్గరికి వెళ్లి అతని చంపనీ మృదువుగా తడుముతుంటే ఆమె కళ్ళలోని కన్నీటి చుక్క ప్రభ నుదుటి పై పడటంతో మెలకువగా ఉన్న కూడా తను కళ్ళు తెరవకుండా అమ్మ పడుతున్న బాధను గమనిస్తున్నాడు. 

"ఇంకెప్పుడు అమ్మను ఇలా ఇబ్బంది పెట్టకూడదు" అని నిర్ణయించుకుని అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోయేసరికి గౌరీ తన గదికి వెళుతుంది.

ఉదయం లేచి వచ్చిన ప్రభ అమ్మ కిచెన్లో ఉంటే వచ్చి అమ్మ కాఫీ కలిపి గ్లాసులో  పోస్తూ ఉండగా  తను కూడా  గ్లాసు చేతిలో పట్టుకోవడంతో గౌరీ కొడుకుని చూసి " నాన్న నామీద కోపం లేదా? "అంటూ అడుగుతూ తనను  చూసేసరికి "నీ మీద నాకెందుకు కోపం ఉంటుందమ్మా.బహుశా నేను తప్పు చేశానేమో!  అందుకే నీ చెయ్యి పైకి లేచినట్టుంది ఇంకెప్పుడు ఇలాంటి పనిచేయను.
పైగా నోటిఫికేషన్ విడుదలైనది నేను వెళ్లి చదువుకుంటాను. ఎగ్జామ్ రాసిన తర్వాత వేరే ఆలోచన చేస్తాను" అని చెప్పడంతో గౌరీ సంతోషం ఇచ్చి చదువుకోడానికి పంపిస్తుంది.

టౌన్ కి వెళ్ళిన ప్రభ  ఎగ్జామ్ రెండు నెలల వ్యవధి లో  ఉన్నందుకు హాస్టల్లో ఉండి చదువుదామని వెళితే   ఎంబీఏ, ఎంసీఏ స్టూడెంట్స్ కాస్త ఇబ్బంది చేసేసరికి అక్కడి నుంచి బయటికి వెళ్దాము అనుకుంటూ ఉండగా చరిత ఫోన్ చేస్తుంది. 

  "ప్రభ నువ్వు ఎక్కువగా ఆలోచించకు కేవలం సమయం తక్కువగానే ఉన్నది కాబట్టి నువ్వు ఉన్న హాస్టల్ లో ఫీజు తక్కువ ఇక చదువుకునేకి స్టడీ హాల్ కి మేము వస్తాము అక్కడికిరా దాని ఫీజు నేనే కడతాను నువ్వు దాని గురించి ఆలోచించకు ముందు లైఫ్ సెటిల్ చేసుకునేది చూసుకో" అని చెప్పేసరికి ప్రభ అలాగే చేసి చరిత ,ప్రభలు కంబైన్ స్టడీ చేస్తూ ఎగ్జామ్ ముగించుకుని  ఎవరింటికి వాళ్లు వెళతారు .

ఎగ్జామ్ రాసి వచ్చిన కొడుకుని చూసి చాలా సంతోషిస్తుంది గౌరీ.అలాగే చరిత చేసిన సాయాన్ని కి చాలా ఆనందపడుతుంది. ఎలాగైనా తన డబ్బుల్ని తిరిగి ఇచ్చి వేయాలని అనుకుంటుంది. 

అప్పుడే ప్రభ గౌరీ తో అమ్మ నాకు   తెలిసిన ఒక అన్న ఉన్నాడు అతని దగ్గరికి కొన్ని రోజులు రిజల్ట్స్ వచ్చేవరకు పనికి వెళతానని చెప్పడంతో ఇక కాదనలేక వెళ్ళమని చెబుతుంది గౌరీ.

అర్జున్ ఉన్న చోటికి వెళ్లిన ప్రభ సాయంత్రం అర్జున్ కి  తెలిసిన గుణేష్ ఉన్న రూమ్ కి వెళతారు ఇద్దరూ.

 "గుణేష్ ! నేను చెప్పానుగా ఒక కుర్రాడికి పని కావాలని ఇదిగో వీడే ప్రభ" అని చూపిస్తూ  చెప్తాడు అర్జున్.

 ప్రభని చూసిన గుణేష్ "సరే   అర్జున్ రేపు పది గంటలకి ఆఫీస్ కి  రమ్మను మేనేజర్ తో మాట్లాడతాను కానీ  ఓ 4 నెలలేని వారితో చెప్పకూడదు" అన్నాడు గుణేష్.

 అలాగే అని తలూపుతూ ఇద్దరూ రూమ్ కి వెళతారు అర్జున్  మరియు ప్రభలు.

 ఉదయం 11 గంటలకు ఆఫీస్ కి వస్తాడు ప్రభ. అటు ఇటు చూసినా గుణేష్ కనబడలేదు అయినా మేనేజర్ పిలుస్తున్నారని వాచ్మెన్ వచ్చి  చెప్పడంతో లోపలికి వెళ్తాడు ప్రభ.

 కొన్ని ప్రశ్నలు అడిగి, తరువాత కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా ఓ రెండు తప్ప మిగిలిన వాటికి సరైన జవాబులు ఇస్తాడు ప్రభ.

 "ఓకే ! నువ్వు వెళ్లి  శ్యామ్ అనే వ్యక్తికి అసిస్టెంట్ గా ఉండు "అని చెప్పేసరికి మేఘశ్యామ్ ఉన్న రూమ్ కి వెళ్లి విష్ చేసి నిలబడతాడు ప్రభ.

విష్  చేసి  నిలబడి 15 నిమిషాలైనా  కూర్చోమని కూడా చెప్పలేదు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు ప్రభ మళ్ళీ ఏదైనా పని చెప్తాడేమో అని నిలబడిన కాళ్లు నొప్పి పెట్టిన ఏం మాట్లాడలేదు పనై  పోగానే "తన లాప్టాప్ మిగిలిన వస్తువుల్ని తీసుకొని రా "అన్నట్టు  కళ్ళతో  సైగ చేసి చేతితో చూపించి   వెళతాడు మేఘశ్యామ్ . ప్రభ మారు మాట్లాడక బ్యాగ్  తీసుకుని వెళ్లి కారులో పెడతాడు.

 మేఘశ్యాం వెళ్లిపోయిన తర్వాత  ప్రభ కళ్లు  గుణేష్ కోసమే వెతుకుతూ ఉన్నాయి .ఎక్కడ కనిపించక పోయేసరికి వాచ్మెన్ ని  అడగ్గా  అతను ఈరోజు లీవ్ పెట్టాడు అని చెప్పడంతో ఫోన్ నెంబర్ తీసుకుని రూమ్ కి వెళతాడు ప్రభ.

 అప్పటికే అర్జున్ తో పాటు మాట్లాడుతూ కూర్చున్న గుణేష్ ని చూసి "గుడ్ ఈవెనింగ్ సార్ "అని చెప్పాడు ప్రభ.

 గుడ్ ఈవెనింగ్ యంగ్ బాయ్  మేనేజర్ పని ఇచ్చారుగా   ఇంతకీ ఇచ్చిన పని,ఆఫీస్ ఎలా ఉంది అడిగాడు గుణేష్.

 బాగానే ఉంది సార్ కానీ నన్ను చాలా ముక్కోపికి అసిస్టెంట్ గా ఉండమన్నారు అన్నాడు బాధపడుతూ ప్రభ.



 అతను అంతేలే కాస్త దురుసుగానే ఉంటాడు జాగ్రత్తగా మాలుకో  అన్నాడు గుణేష్.

 చాల్లెండ్రా మీ ఆఫీస్ గురించి ఇంకెన్ని మాట్లాడతారు మిగిలినవి రేపు ఆఫీసులో మాట్లాడుకుందురు గాని  చీకటి పడుతుంది ముందు రూమ్ కి వెళ్లు చెప్పాడు అర్జున్  గుణేష్ తో.

 అవును మాటల్లోనే మరిచిపోయాను వెళ్లొస్తా అని బయలుదేరబోయాడు గుణేష్.

 "ప్రభ!  వెళ్లి గుణేష్  ని రూమ్ కి వదిలి రా   వాడికి హెల్త్ బాలేదు అందుకే ఈరోజు లీవ్ పెట్టేసాడు" అని అర్జున్ చెప్పడంతో ప్రభ బండిలోతీసుకెళ్తాడు గుణేష్ ని.

  లోపలికి వెళ్ళిన గణేష్ తల తిరిగి కింద పడిపోయిన శబ్దం రావడంతో గడప బయట నిల్చున్న ప్రభకి వినిపించగా పరిగెత్తి పైకెత్తి సోఫా మీద కూర్చోబెట్టి ఇంత  నీళ్లు ముఖమ్   మీద చెల్లాడు. అలాగే కాస్త నిమ్మరసం ఇచ్చేసరికి తేరుకున్నాడు గుణేష్.

 "నేను ఎక్కడున్నాను"  అంటూ తనంతట తానే ప్రశ్నించుకున్నాడు గుణేష్.

" సార్ మీరు మీ రూమ్ లోనే ఉన్నారు ముందు సోఫా మీద పడుకొండి మీరు చాలా నీరసంగా ఉన్నారు అన్నం తీసుకొస్తాను" అని కిచెన్ లోకి వెళ్లి చూడగా ఏమీ లేకపోవడంతో చకచకా కొంచెం అన్నం చేసి అక్కడున్న చట్నీ పొడి వేసుకొని వచ్చి సర్ అన్నం తినండి అన్నాడు ప్రభ.

అన్నం తినాలా ! ఎందుకు తినాలి  అన్నం తినను   కంచం ముందు కూర్చుని వడ్డించే  వాళ్ళు వెళ్ళిపోయారు. తిన్నావా? అని అడిగేవాళ్లు లేకపోయారు .  ఇంక నువ్వు తినమని చెప్తున్నావా ఈరోజు నేను తినేది లేదు ఇలాగే పడుకుంటాను" అని ఎంత లేపినా లేపకపోగా ప్రభ ముద్ద చేతికి తీసుకోవడంతో  చేతిలోని ప్లేట్ ని గట్టిగా కొట్టడంతో అన్నమంతా కింద పడిపోయింది అయినా  చాలా ఓపికతో  పడిన అన్నం మెతుకులు అంతా ఎత్తి పక్కన పెట్టి అతన్ని సోఫా మీద పడుకోబెట్టి వెనుతిరుగుతాడు ప్రభ.

 ఉదయం ఆఫీసులో కనిపించిన గుణేష్                    "సారీరా  !  రాత్రి….. " అని  ఇంకా ఏదో చెప్పబోతుంటే   నో ప్రాబ్లం సార్ నేను ఏమనుకోను అని చెప్పి శ్యామ్ కూర్చున్న చోటికి వెళ్తాడు ప్రభ.

  "వాడు నీకు ముందే తెలుసా "అడిగాడు  శ్యామ్.

 లేదు సర్ అతను ఇప్పుడే పరిచయం బదిలిచ్చాడు ప్రభ

 వాడితో జాగ్రత్త చెప్తాడు శ్యామ్

 మీతోనే ఏగలేకపోతున్నాను అతని మీద చాడీలు వేరే అనుకుంటాడు మనసులో ప్రభ.

 "ఏంట్రా అలా చూస్తున్నావ్ "అని ముఖం చిట్లించాడు  శ్యామ్

   ఏం లేదు సార్  మీరు చెప్పినట్లే ఉండాలని అనుకుంటున్నాను చెప్పాడు ప్రభ.

 సరే ఈ ఫైల్ లోని కొన్ని పేజీలు టైప్ చేసి వెళ్ళు అని చెప్పగా పని గంటలు ముగిసిపోయిన ఒక గంట ఎక్స్ట్రా పనిచేసి ఫినిష్ చేశాడు ప్రభ  .   ప్రభ పని ఫినిష్ అయ్యేవరకు గుణేష్ కూడా అక్కడే ఉండి ఇద్దరు బయలుదేరుతారు.

 ప్రభ , గుణేష్  అలా బైకు మీద వెళుతూ ఉంటే  టర్నింగ్ రావడంతో కాస్త బైక్ని స్లో చేయగా వెనక కూర్చున్న గుణేష్ అమ్మా ! అని అనడంతో ఎవరో వెనుకనుండి బలంగా కొట్టినట్టు అనిపించింది ప్రభాకి వెంటనే బైక్ దిగాలని  ట్రై  చేయగానే  బైక్ అదుపుతప్పి ఇద్దరు కింద పడేసరికి శామ్ తో పాటు ఇద్దరు వచ్చి ఈ నిలబడ్డారు ఎదురుగా.

 "సార్ మీరా?" అన్నాడు ప్రభ.

 నువ్వెందుకు వాడ్ని బైక్ మీద  తీసుకెళుతున్నావ్ అని గుణేష్ వైపు చూస్తూ  "  ఏరా!  నీకంటే  సిన్సియర్ని నాకంటే రెండు ఆకులు ఎక్కువ చదివి మేనేజర్ తో మాటలు కలిపి ప్రమోషన్ కొట్టిందే కాక నన్ను అవమానిస్తావా" అన్నాడు శ్యామ్.

 తలపట్టుకుని   లేదు అన్నట్లు తలపుతూ ఇంకా ఏదో చెప్పుబోగా మాట్లాడడానికి రాకపోవడంతో తల పట్టుకుని బాధపడుతున్నాడు గుణేష్.. అంతలో శామ్ పక్కన ఉన్న ఇద్దరు  మరో రెండు దెబ్బలు గుణేష్ ని  కొట్టబోయారు.

 రేయ్ ఆపండ్రా  అతని ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పి శాంవైపు తిరిగి "సార్ అతనికి నాలెడ్జ్ ఉంది          హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి అతని పనితనాన్ని  మేనేజర్ మెచ్చుకున్నాడు అతను రెండాకులు ఎక్కువ చదివాడు కాబట్టే   ప్రమోషన్ తీసుకున్నాడు అతనిలో సిన్సియారిటీ ఉంది కాబట్టి ముందుకెళుతున్నాడు మీకు రెండు లేవు అందుకే ఎక్కడున్నావని అక్కడే ఉన్నారు  "అన్నాడు ప్రభ.

 "ఏంటి మాటలు పెరుగుతున్నాయి నిన్నగాక మొన్న వచ్చిన వాడివి   నన్నింతలాస్టడీ చేసావా?" అన్నాడు కోపంతో శ్యామ్.

 ఆఫీసులోకి వచ్చి విష్ చేసి  నిలబడితే గంటసేపు కాళ్ళ   నొప్పి పుట్టేలాగా నిలబెట్టారు చూడు అప్పుడే అర్థమైంది మీరు ఒక సైకో అని చెప్పాడు ప్రభ.,

 "వీడితో మాటలు ఏంట్రా ముందు  ఇద్దరినీ కొట్టండి" అని శ్యామ్  చెప్పడంతో ప్రభ వెను తిరిగి  ముగ్గురికి బుద్ధి చెప్పి పోలీసులకి ఫోన్ చేసి పట్టించాడు .

 గుణేష్ ని  అర్జున్ రూమ్ కి తీసుకెళ్లి తలకు కట్టు కట్టి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టగా ఓ గంటసేపు నిద్రపోయి మెలకువ రావడంతో గుణేష్ ప్రభ వైపు చూస్తూ ఉండడం గమనించిన" ప్రభ ఏంటి సర్ అలా చూస్తున్నారు" అని ప్రశ్నించాడు ప్రభ.

 నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావ్   అసలు నువ్వు ఎవరు ?  నేను కోపగించుకున్నా ,చిరాకు పడిన నీ ముఖంలో ఇంత బాధ కూడా కనిపించలేదు ఎంత ఓపికరా  నీకు "అని మనసులో అనుకుంటూ ప్రభ వైపు చేస్తాడు గుణేష్..

 సర్ ఏంటి ఆలోచిస్తున్నారు మీరు నాకు పని చూపించారుగా ఇంత  మాత్రం సేవ చేయడం తప్పేం కాదులే మీరు పడుకోండి చిరునవ్వుతో చెప్పాడు ప్రభ.

 ఉదయం ఐదు గంటలకి గుణేష్ కంప్యూటర్లో ఏదో వర్క్ చేస్తు0డడం చూసిన ప్రభ" ఏంటి సార్ నిద్ర రాలేదా మీరు ఇంతగా హెల్త్ ప్రాబ్లం ఉన్న ఇంతగా పనిచేయడం ఏంటి ముందు రెస్ట్ తీసుకోండి" చెప్పాడు  ప్రభ.       

పని అయి పోయిందిలే ప్రభ నన్ను కాస్త రూమ్ కి వదిలి పెట్టావా అని అడిగాడు గుణేష్.

  గుణేష్ ని   అతని రూమ్ కి వదిలి వచ్చిన ప్రభ అర్జునుని ఏదో అడగాలని అనుకుంటూ ఉండగా అర్జున్ ఇవాళ ఉదయం తొందరగా వెళ్ళాలి అని చెప్పి ముందుగానే వెళ్ళిపోయేసరికి అడగలేక పోతాడు ప్రభ.