Featured Books
  • ప్రణయ గీతిక - 2

    ప్రభ, గోవిందు ' సారంగ్ లు ప్రిన్సిపల్ గది వైపు నడుస్తూ ఉ...

  • ఎవరు....? - 16

    Part - 16 సమయం : సాయంత్రం 6:45 గంటలువిజయవాడకు వస్తున్న SIT వ...

  • వెంటాడే నీడలు - 14

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ప్రణయ గీతిక - 1

    ఉషోదయాన భానుడి లేలేత కిరణాలు పడుతూ ఉండగా పొగ మంచు మెల్లమెల్ల...

  • వెంటాడే నీడలు - 13

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 2

ప్రభ, గోవిందు ' సారంగ్ లు ప్రిన్సిపల్ గది వైపు నడుస్తూ ఉండగా గోవిందు మొదట వెళతాడు.



 "మే ఐ కమ్ ఇన్ సార్"  అడిగాడు గోవిందు ప్రిన్సిపాల్ సర్ ని చూసి.



 "ఎస్ కమ్ ఇన్" అని ప్రిన్సిపల్ అనేసరికి వినయంగా నిలబడతాడు గోవిందు లోపలికి వచ్చి.



 ఇంతకీ కింగ్ ఎక్కడ ?  పుస్తకంలో ఏదో రాస్తూ అడుగుతారు ప్రిన్సిపాల్.



 అదిగో వచ్చేసాడు సార్ అని డోర్ వైపు చూపిస్తూ చెప్తాడు గోవిందు.



 వాడెప్పుడూ లేటే అయినా లేటెస్ట్ అనుకో అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా



 "మే ఐ కమ్ ఇన్  సర్ "అడుగుతాడు ప్రభ.



  "ఎస్ కమ్ ఇన్ " అని పిలిచి ఇలా లేట్ చేస్తే నీ రాజ్యాన్ని ఆక్రమించే వాళ్ళు చాలామంది ఉంటారు  "ఐ ఆల్వేస్ లివ్ లైక్ ఎ కింగ్ "అనిరాసుకుంటే సరిపోదు రాజుకి సమయపాలన అనేది కచ్చితంగా ఉండాలి అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటే ప్రభ ప్రిన్సిపల్స్ సర్వైపు చూస్తాడు

" మై డియర్ స్టూడెంట్స్ అందరూ ట్రైనింగ్ ని సజావుగా పూర్తి చేసుకుని రండి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నంతవరకు స్టూడెంట్ లైఫ్ కాబట్టి మీరేం చేసినా ఓర్చుకునే పేరెంట్స్ లాంటి లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్స్ ఉన్నారు.  కానీ ఇప్పుడు మీరు వెళుతున్నది ప్రొఫెషనల్ లైఫ్ కి కాబట్టి స్టూడెంట్ గా కాకుండా ప్రొఫెషనల్ గా ఉండి అథారిటీని ఇబ్బంది పెట్టకుండా మీ ట్రైనింగ్ ని పూర్తి చేసుకొని రండి.
కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి"  మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎదిగినా మనిషిని ఆశయాన్ని చేర్చేది ఒక్క క్రమశిక్షణ మాత్రమే "  అని చెప్పిన ప్రిన్సిపల్ సర్ తో  స్టూడెంట్స్ అందరూ  "అలాగే సార్" అని చెప్పి బయటకు వస్తారు.

 ఇంతకీ ఇంతసేపు మాట్లాడింది మన ప్రిన్సిపల్ సారేనా !  కాలేజ్ డేస్ అంత కూడా ఎంత.  స్ట్రిక్ట్  గా ఉండేవాళ్ళు ఈరోజు ఎంత ఫ్రీగా మాట్లాడి ఎన్ని విషయాలు చెప్తున్నారు నిజంగా గురువు అన్న పదానికి అర్థం ఈరోజు తెలిసినట్టు అయిందిరా  అని చెప్తాడు ప్రభ

 అవును , నాకు కూడా అలాగే అనిపిస్తుంది చెప్పాడు గోవిందు.

 సరే వెళ్దాం పద బస్సు కి టైం అవుతుంది అని చెప్పి
గోవింద్,  ప్రబలిద్దరూ బస్సు ఎక్కారు

.బస్సు రామాపురం దగ్గర ఆగడంతో గోవిందు ,ప్రభ లిద్దరూ బస్సు దిగి  నడుస్తూ ప్రభా ఇంతకీ మన   నివాసం ఎక్కడ?" గోవిందు ప్రశ్న.

మన వీరభద్ర సార్ చెప్పారు కదా ఖచ్చితంగా సర్పంచ్ మాకు సాయం చేస్తాడు. 

ప్రిన్సిపాల్ సర్ చెప్పినట్టు ఆ మనిషి మాకు     ఆశ్రయమిస్తాడoటావా? అంటూ సందేహాన్ని వెలిబుచ్చాడు గోవిందు.

   చూద్దాం పద అని మాట్లాడతుంటే పక్కన ఉన్న వ్యక్తితో గోవిందు ," సర్ రామాపురం ఇక్కడికి ఎంత దూరం? "అని అడిగాడు గోవిందు   .  
                 వాకబుల్ డిస్టెన్స్ నడిచి వెళ్లొచ్చు దగ్గరే అని చెప్పాడతను  .                                                                   ఇద్దరు అలా నడిచి వెళుతూ ఉండగా ఒక వ్యక్తి బుల్లెట్లో వైట్ షర్ట్ వైట్ పంచే వేసి మెడకి కండువా వేసి సౌండ్ చేసుకుంటూ దర్జాగా వెళుతూ ఉంటే గోవిందు ఎవరితడు   చూడబోతే ఏదో ఊరి పెద్దల ఉన్నట్టు కనిపిస్తున్నాడు అది బుల్లెట్లో వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉండగా ప్రభా చేయి అడ్డం పెట్టి" సార్ మీరు వెళుతున్నది రామాపురం వైపేనా  కాస్త లిఫ్ట్ ఇస్తారా  ప్లీజ్ "  అడుగుతాడు .

 అవును  బాబు నేను రామాపురమే వెళుతున్నాను ఎక్కండి అని  చెప్పేసరికి ఇద్దరు బండి మీద ఎక్కారు.                                                                       బండి ముందుకు వెళుతుంటే"  సర్ మీకు రామాపురం సర్పంచి తెలుసా "అని అడుగుతాడు గోవిందు.

 అరేయ్ నువ్వు ఊరికే కూర్చోవా  ఏంటి అలా అడుగుతున్నావు   అని గోవింద్  భుజం తడుతూ చెప్తాడు ప్రభ 

 ఇంతకీ సర్పంచ్ తో మీకేం పని అడుగుతాడతను.

 వీరభద్ర సర్ సర్పంచ్ని కలవమని  చెప్పారు  అందుకే అడుగుతున్నాము అంటూ ఇద్దరు  బదులు చెబుతారు.

 అవునా! వీరభద్ర సర్ పంపించింది   మిమ్మల్నేనా అయితే నేనే  ఆ ఊరి సర్పంచిని రండి  డైరెక్ట్ గా ఇంటికి వెళ్దామని బండి ఇంటి ముందు నిలుపుతాడు సర్పంచ్ సీతాపతి.

 ఇంకా  గడప దాటాలని మెట్లు ఎక్కుతుంటే లోపలి నుంచి వచ్చింది భూదేవి " ఎవరు వీళ్లు?" అడిగింది గట్టిగానే 

 "అంటే.,..వీళ్లని వీరభద్ర సారు పంపించారు" అని ఏదో సర్పంచ్ చెప్పబోతుంటే 

 ఆ! పంపిస్తే  ముక్కు మొహం తెలీని వాళ్ళని తెచ్చి  ఇంట్లో పెడతావా  ఏంటి!  ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉందని  తెలియదా,  అయినా మీకు ఎంత చెప్పినా అంతేలే ముందు  వీళ్ళని ఇక్కడి నుంచి పంపించెయ్"  అని అరుస్తుంది భూదేవి.

అది కాదు దేవి అని సర్పంచ్ ఏదో మాట్లాడబోతుండగా ఇక మీరు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పింది వినే ఉంటే ఆ పని చేయండి అని చెప్పి తలుపు గట్టిగా మోస లోపలికి వెళుతుంది భూదేవి.

 అది విన్న ప్రభ "సార్  మా నుంచి మీరు ఎందుకు ఇబ్బంది పడతారు  "అని చెప్పి అలా వెళ్ళిపోతుండగా  వెనకే వచ్చి" ఆగండి" అంటాడు సర్పంచ్.

 చూడు బాబు నేను ఇక్కడ హెల్ప్ చేయకపోయినా మీరు ఏమనుకోవద్దు  మా ఆవిడ అంతే . కాబట్టి మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. అక్కడికి వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడున్నది చాలా మంచి వ్యక్తి అని చెప్పి పంపిస్తాడు సర్పంచ్.

ప్రభ ఆ సర్పంచ్ భార్య పేరు భూదేవి కదా తనకి ఆ పేరు అస్సలు సెట్ కాలేదు అన్నాడు గోవిందు అడుగులు వేస్తూ. 

పేర్లేం చేస్తాయి మనిషి నైజం బాగుంటే అన్నీ బాగుంటాయి అదిగో సర్పంచ్ చెప్పినా ఫార్మ్ హౌస్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో! పట్నం అయితే ఏదో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళం పల్లెటూరు కాబట్టి ఈ తిప్పలు తప్పవు అనుకుంటా అని మాట్లాడుతూ ప్రభా గోవిందులిద్దరూ కొంచెం ఎత్తు ప్రదేశానికి అలా వెళుతూ ఉంటే  'పెద్ద ఫామ్ హౌస్' చుట్టూ కలయ చూస్తే ఎవ్వరు కనిపించకపోయేసరికి ఇంకాస్త ముందుకెళ్లి చూస్తే చాలా పరిశుభ్రంగా పూల చెట్లతో ఇల్లు కళకళలాడుతోంది.

" ఇంట్లో ఎవరండీ "డోర్ తడుతూ పిలిచాడు ప్రభ.

 ఎవరు మాట్లాడకపోయేసరికి మరొక్కసారి గోవిందు డోర్ తట్టి "ఎవరండీ ఇంట్లో  డోర్ తెరవండి" అని గట్టిగా అరుస్తాడు గోవిందు

 అంతలో లోపలి నుంచి ఒక వ్యక్తి బయటకి వచ్చి ఓ!  మీరేనా సర్పంచ్ పంపించిన అబ్బాయిలు నా పేరు పతంగి అనేసరికి ఇద్దరు ఒకరి ముఖం ఒ ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా.

 సర్పంచ్  ,మా పెద్దాయన  ఇద్దరు   మీరు వస్తే  గది చూపించమని చెప్పారు. పదండి మీ రూమ్   అటువైపు ఉంది అని చూపించి చూశారుగా ఎంత శుభ్రంగా ఉందో ప్రతిరోజు ఇలాగే ఉండాలి ముందు పరిశుభ్రత  ఆ తర్వాత ఆరోగ్యం మా పెద్దాయన సూత్రం అర్థమైందా'' అనడంతో ఇద్దరూ అర్థమైంది అన్నట్లు తలువుపారు

" ఇంతకీ పెద్దాయన ఎవరు ఎక్కడికెళ్లారు" అని అడగాలనిపించింది ప్రభకి అయినా అడగలేక పోతాడు. ఇంకా ఇప్పుడొచ్చాము కదా కాస్త పరిచయం తర్వాత అడగడం మంచిదని ఊరుకున్నాడు ప్రభ.

 ఇద్దరూ రూమ్ కెళ్ళి  రాత్రి కావడంతో బ్యాగులు సర్దేసి పడుకోవడానికి కార్పెట్లు పరుచుకుంటారు.

" నేను అమ్మకి ఫోన్ చేసి వస్తాను" అని చెప్పి బయటకి వెళ్తాడు ప్రభ. ఇంకా ఫోన్ ఆన్ చేద్దామని చూస్తూ ఉండంగా గోవిందు అరవడంతో పరిగెత్తుకొచ్చాడు ప్రభ లోపలికి 

 తీరా లోపలికి వచ్చి చూసేసరికి పళ్లికిలిస్తూ, "హి  హి  హి "అంటూ  నవ్వుతూ తాడు వైపు చేయి చూపిస్తూ" ప్రభ నేను పొరపాటున దీన్ని పాము అనుకున్నాను రా సారీ" అంటుంటే "నీ అపోహాలు నువ్వు  "అంటూ మొట్టికాయ  వేయబోయి "ఎందుకురా అంత మైమరిచి ఏం ఆలోచిస్తున్నావు తాడును చూసి పాము అని భయపడినావెందుకు"  అని ప్రశ్నిస్తాడు  ప్రభ.

" అమ్మో  !  చెబితే బాగోదు" అని బెడ్ షీట్  తీసుకోబోయాడు గోవిందు.

ముందు చెప్పరా మరొక్కసారి డిస్టర్బ్ చేసావ్ అనుకో ఇది ముందే సింగిల్ హౌస్ అన్నాడు ప్రభ                          వద్దు వద్దు చెప్పేస్తాను అంటాడు గురు గోవిందం.

 అదేరా ఆ సర్పంచ్ ఇంటికి వెళితే అతని భార్య ఏదో అంది కదా అంటే ఆడపిల్ల ఉన్న ఇల్లు అని ఆ పిల్ల ఎలా ఉందో అని కలలో చూస్తుంటే చేయి పక్కకు చాపగా ఈ తాడు తగిలింది అని చెప్పాడు గోవిందు

     మహంకాళిని చూసావుగా కూతురు జోలికి వెళ్తే తొక్కి పారేస్తుంది నోరు మూసుకొని పడుకో అని గద్దించాడు ప్రభ

 ఇక మాట్లాడకుండా  పడుకున్నాడు  గోవిందు

ఉదయం 7 గంటల సమయం గురు గోవిందంకి కొత్త ప్లేస్ అయినందువల్ల నిద్ర రాలేదు. తొందరగా లేచి ప్రభావైపు చూసి అమ్మో వీడిని నిద్ర లేపడమా!  వద్దు అదేమో అన్నిట్లోనూ కరెక్టుగా ఉంటాడు గాని ఉదయం మాత్రం తొందరగా నిద్ర లేవడు. లేపితే చంపచళ్ళు మనిపిస్తాడు లేపకపోతే ఎందుకు లేపలేదంటాడు ఏం చేయాలి అనుకొని సతమతమవుతూ  ఉంటాడు గోవిందు.

 అంతలో పతంగి వచ్చి డోర్ తట్టడంతో  లేస్తాడు ప్రభ

 ఏంటి బాబులు ఇంత సేపయినా నిద్ర లేవ లేదు మా పెద్దాయన ఉంటే ఇలా పడుకుంటే కచ్చితంగా పాఠం చెప్తారు అన్నాడు పతంగి

 ఇదిగో అన్న ఇప్పుడే లేస్తున్నాం,   చక చక పనులు కూడా చేసేసుకుంటాం. అని ఇద్దరు చెప్పేసరికి అక్కడినుంచి వెళ్తాడు పతంగి.

" గోవిందు, ఏంట్రా టైం 8:00 అవుతుంది నిద్ర లేపలేదు .ఈరోజు ఫస్ట్ డే కదా ట్రైనింగ్ కి పొరుగూరు వెళ్లాలి "అని ప్రభా అంటుంటే చెంపని అరచేతిలో మూసి ఏడుపు ముఖం పెట్టిన గోవిందుని చూసి "సారీ రా ఎప్పుడో జరిగిన దాన్ని అలాగే గుర్తుపెట్టుకున్నావా? పద హాస్పిటల్ కి  వెళ్దాం " అని రెడీ  అయి గోవిందుని వాకబుల్ డిస్టెన్స్ లో దింపి వెనక్కి వెళ్లి కాస్త ఆలస్యంగా వస్తాడు ప్రభ

 హాస్పిటల్కు వచ్చిన ప్రభ గబగబా లోపలికి వస్తూ "ఏరా డాక్టర్ వచ్చారా?" అడిగాడు గోవిందుని

 ఇంకా రాలేదు అని  చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు ప్రభ.