ప్రభ గీసిచ్చిన డ్రాయింగ్ చూసిన గీతిక ముఖంలో మార్పు రావడం గమనించిన జేజి, తాతయ్యలు చాలా సంతోషిస్తారు.
ఆదివారం కావడంతో తర్వాత జరగబోయే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో జాగ్రత్తగా చూసుకుంటోoది గీతిక. తన స్నేహితురాలు అయిన హిత విప్రో కంపెనీలో కొత్తగా జాయిన్ అయింది కాబట్టి తను ఎలాంటి సహాయం చేయడానికి సిద్ధంగా లేదని అర్థం చేసుకుని తనే జాగ్రత్తగా విషయాలను చదువుకుంటోoది. అయినా తన సూపర్ సీనియర్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండడం వలన తను రికమండేషన్ చేస్తానని చెప్పడం గుర్తుకు రావడంతో వెళుతుంది గీతిక.
కంపెనీ కాంపౌండ్ గేటు దాటి లోపలికి వెళ్ళిన గీతిక చుట్టూ చూస్తే అతను అక్కడికి రెండు అడుగుల దూరంలో ఒక అమ్మాయి తో మాట్లాడుతూ కనిపించగా కాస్త వెనక్కి నిలబడుతుంది గీతిక.
సూపర్ సీనియర్ దగ్గర నిలబడిన అమ్మాయి "ఏరా! ఆ గీతిక అంటే నీకు అంత ఇదా...." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, "అంత లేదు ఇంత లేదు నా చెల్లికి తను తెలుసు. అది ఎవరూ లేని అనామిక అని , తనకు కాస్త సాయం చేయమని చెల్లి చెప్పినందుకు సరే అన్నాను అంతేకానీ" కొట్లాస్తికి వారసులారైన ఈ యువరాణిని ఎవరైనా వదులుకుంటారా" అని మనసులో అనుకుని" నీలాంటి అందమైన అమ్మాయిని ఎవరైనా వదులుకుని ఆనాథ వెంట పడతానని ఎలా అనుకున్నావ్ చెప్పు ఎప్పటికీ "నా నువ్వే"అంటూ అమ్మాయి ముఖాన్ని అరచేతులతో పట్టుకొని ప్రేమగా చెబుతూ ఉండడం చూస్తుంది గీతిక.
అక్కడ ఒక క్షణం నిలవకుండా ఇంటర్వ్యూ కి కూడా వెళ్లకుండా బయటికి వచ్చి తన క్లాస్మేట్ కి ఫోన్ చేసి " ఏమే! నేను రికమండేషన్ కావాలని నిన్ను అడిగానా ? నువ్వు నన్ను అనాధ అని అతనితో చెప్పావు .అసలు నిన్ను నేను ఏమనుకోవాలి? నువ్వు కూడా నన్ను అనాధలా చూస్తున్నావు అనా? లేదా నీకు నామీద ద్వేషముండి అలా చెప్పావా" అని గీతిక అడుగుతుంటే అవతలి గొంతు మూగబోయింది. ఇక ఇటువంటి వారితో ఫ్రెండ్షిప్ కూడా ఉండకూడదు అనుకొని ఆ రోజు నుంచి ఫ్రెండ్షిప్ కట్ చేసి "ఈ టౌన్ లో ఉన్నది అదొక కంపెనీనా? చాలా ఉన్నాయి ఎక్కడో ఒకచోట కచ్చితంగా ఉద్యోగం అయితే సంపాదించాలి అని నిర్ణయించుకుని పట్టుదలగా చదువుకుంటుంది. వచ్చిన డౌట్ లను కంప్యూటర్లో చూసి తెలుసుకుంటుంది అప్పుడే వచ్చిన జేజి పిలవడంతో లోపలికి వెళుతుంది.
ఆరోజు ఆదివారం కావడంతో "ప్రభ ఈరోజు అలా బయటికి వెళ్దామా అని అడుగుతాడు పప్పు
ఓహో అయ్యగారికి జీతం వచ్చిందని ఏదైనా షాపింగ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారా ఏంటి అంటూ ప్రభ వచ్చి కూర్చుంటాడు
అవును, ఈరోజు ఓ రెండు జతలు బట్టలు కొనాలి అని మాట్లాడుకుని ఇద్దరూ షాపింగ్ కి బయలుదేరుతారు.
"పప్పు, ఈరోజు ఆదివారం కదా షోరూమ్స్ మూసి ఉంటారేమో!"అని డ్రైవ్ చేస్తూ చెబుతాడు ప్రభ.
పెద్ద షాపులు మూసివేస్తే ఏంటి చిన్న షాపులో అక్కడక్కడ ఉంటాయి కదా నాకు అక్కడ కొనేటంత సీన్ లేదు చిన్న షాపులోనే తీసుకుందాం అని మాట్లాడుతూ "సంపంగి" అనే చిన్న షాపు దగ్గరికి వెళ్లి రెండు జతల బట్టలు కొనాలని అనుకుని షాప్ కీపర్ గా ఉన్న అమ్మాయిని "సిస్టర్ నీ పేరేంటి?" అని అడుగుతాడు పప్పు.
సహన అంటూ బదులిచ్చింది ఆ అమ్మాయి .
"నైస్ నేమ్ సిస్టర్ "అని చెప్పి మీ షాప్ లో షర్ట్ అండ్ పాంట్స్ చూపిస్తారా ఉంటూ లోపలికి వెళ్తాడు.
సహన దాదాపు తమ షాపులోని అన్ని షర్ట్స్ ,పాంట్స్ డిజైన్స్ ని చూపిస్తుంది. అయినా ఆ కలర్ బాగాలేదని ఈ డిజైన్ బాగోలేదని చెప్పేస్తున్నాడు తప్ప అందులో నుంచి ఇది నచ్చిందని ఏది తీసుకోలేదు.
"సర్ మీ కలర్ కి ఇక్కడున్న ఏ కలర్ సూటబుల్గా లేదా ఒక్కటీ సెలెక్ట్ చేయలేదు" అడుగుతుంది సహన.
నా పర్సనాలిటీకి తగిన డ్రెస్ కావాలి కదా , ఒక్క నిమిషం అంటూ బట్టలన్నీ మడతలు విప్పి పక్కన పడేస్తున్నాడు.
అది చూసిన సహన పక్కన ఉన్న అమ్మాయి "ఈరోజు షాపుకి మనుషులు వచ్చినట్టు లేదు వనం నుంచి కోతి వచ్చినట్టుంది. అందుకే బట్టలు అన్నిటిని గుట్టలుగా తయారు చేసింది చూడు "అని నవ్వుతుంది.
అవునే ,నాక్కూడా అలాగే అనిపిస్తుంది అని సహన చెబుతూ ఉండగా ఆ మాటలు ఏమీ వినపడకపోయేసరికి వాళ్ళిద్దరూ అట్టు చూస్తూ ఉండగా పప్పు ఓ రెండు జతల బట్టల్ని తక్కువ ధరకు ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని సహన వైపు చూస్తాడు.
సర్, ఏవైనా మీకు నచ్చాయా? అడిగింది సహన.
ఇవెందుకు నచ్చవు "చీఫ్ అండ్ బెస్ట్" నేను ఎప్పుడూ అవే సెలెక్ట్ చేసుకుంటా అనేసరికి సరేలే అని మూతి తిప్పుకుంటూ గుట్టలుగా పడేసిన బట్టలని మడత వేస్తూ "ఇలాంటి వాళ్ళు ముగ్గురు వస్తే చాలు ఇల్లు పీకి పందిరి వేస్తారు" అని మనసులో అనుకుంది సహన.
"ఏవో మాటలు వినిపించినట్టు అవడంతో సిస్టర్ మీరు ఏదో అంటున్నారు"అని అని బ్యాగ్ చేతిలో పట్టుకొని అడుగుతున్న పప్పును చూసి "ఏం లేదండి ఆ డ్రెస్ నీకు కరెక్ట్ గా అవుతాయో లేదో ఒకసారి ట్రైలర్ రూమ్ కి వెళ్లి ట్రై చేయండి లేదంటే.." అని ఏదో చెప్పబోయి ట్రైలర్ రూమ్ వైపు చేయి చూపిస్తూ" నువ్వు మళ్ళీ ఈ డ్రెస్ నాకు సరిపోదని వచ్చి మరో డ్రస్సు చూస్తానని చెబితే నాకు మడతపెట్టి ఓపిక లేదు బాబు" అని మనసులో అనుకుంటుంది.
బ్యాగు తీసుకుని ట్రైలర్ రూమ్ లోకి వెళుతున్న పప్పును మరొక అమ్మాయి చూస్తున్నట్టు అనిపించడంతో అటు తిరిగిన కనిపించకపోయేసరికి ట్రైలర్ రూమ్ కి వెళతాడు.
బట్టల్ని వేసుకుని కొత్తవి వేసుకుని పాతవి బ్యాగ్ లో పెట్టి బయటకి వస్తూ సహన నిలుచునే ఉండడం చూసి సిస్టర్ ఒకసారి నీ వెనకాల నిలబడిన ఆ అమ్మాయిని ఇటు పిలుస్తారా? అంటూ అద్దంలో డ్రెస్ తనకు ఎలా ఉందో చూసుకుంటున్నాడు.
అంతలో తను పెట్టిన బట్టల బ్యాగు కూడా అక్కడ కనిపించకపోవడంతో నా బట్టలు నా బ్యాగు అంటే వేసుకున్న కొత్త బట్టలతోనే బయటికి రావడంతో అక్కడ ఉన్న జనాలు వింతగా చూస్తారు. అంతలో షాప్ యజమాని "హలో !ఇంకా తీసుకున్న బట్టలకి డబ్బులు కూడా ఇవ్వలేదు అప్పుడే వేసుకుని పరిగెత్తుతున్నావేంటి ముందు లోపలికి రా "అని పిలుస్తాడు.
సార్ బట్టలు వేసుకున్నంత మాత్రాన మీకు డబ్బులు ఇవ్వకుండా పోడు ఈ పప్పు అక్కడ చూడండి నా బ్యాగ్ ఒక అమ్మాయితో ఉంది అంటూ చూపిస్తాడు.
"ముందు డబ్బులు ఇచ్చి వెళ్ళు "అని అతను చెప్పడంతో తను తీసుకున్న డ్రెస్ కి అమౌంట్ ఇచ్చి" దొంగ పిల్ల "అంటూ తీరా దగ్గరికి వచ్చి చూస్తే ప్రభతో మాట్లాడుతోంది.
దొంగ పిల్ల అన్న మాట విన్న అమ్మాయి" ఏరా నన్ను దొంగ పిల్ల అంటావా "అన్న ఆ గొంతు విని వెనక్కి తగ్గుతాడు పప్పు.
ఏరా నేను దొంగ పిల్లనా? దొంగనైతే ఈ బ్యాగ్ ఏ బ్యాగ్ తీసుకుని పరిగెత్తాలి గాని ఇక్కడ ఎందుకు నిలుచుకుంటాం ఇక్కడ ఎందుకు నిలబడతాను అసలు ఈ బ్యాగ్ నా చేతికి ఎలా వచ్చిందో తెలుసా అంటూ చూస్తుంది చామంతి.
ఎలాగంటే నువ్వు అద్దంలో చూసి దువ్విన తలనే దువ్వుతూ లేని మీసాన్ని ఒత్తుకుంటూ నా వైపు చూస్తుండడం నేను గమనించలేదనుకున్నావా" అన్న చామంతి మాటలకి "ఓ నువ్వు చూసేసావా "అంటూ సిగ్గుపడతాడు.
నీ మొఖానికి సిగ్గు ఒకటి నువ్వు అద్దంలో చూసుకుంటున్నప్పుడు వేరే వాళ్లు నీ బ్యాగ్ తీసుకు వెళుతుంటే నేనే వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇదిగో ఇక్కడ నిలబడ్డాను.
అయితే "థాంక్యూ "అని చేయి చేస్తూ ఉండగా ఇద్దరి సంభాషణ చూసి చిరునవ్వు నవ్వుకుని ప్రభా పక్కకి వెళతాడు.
"ఒరేయ్ ముద్దపప్పు" అన్న మాటలు విని "చామంతి" అన్నాడు ఆమె వైపు గుర్తుపట్టి చేయి చూపిస్తూ.
సారీ చామంతి నువ్వు ముద్దపప్పు అంటే కానీ నువ్వు నీ పేరు గుర్తుకు రాలేదు.
నీ బ్యాగు తీసుకో అని చెప్పి చామంతి ఇస్తూ
అమ్మయ్య ఆ చీమిడి ముక్కు, దురద పెడితే కోతిలాగోకే అలవాట్లు కాస్త తగినట్టు ఉన్నాయి లే ,కొత్త బట్టలు వేసి బాగానే కనిపిస్తున్నావు
ఎలాగూ ప్రభ అన్న దగ్గరికి వచ్చావు కదా తప్పకుండా బాగుంటావని అనుకుంటున్నా" అని చెప్పి ప్రభావైపు చూస్తుంది.
"తప్పకుండా ,వాడు స్థిరపడతాడు" అని ప్రభ చెప్పగానే అవునన్నట్టు తల పప్పు తల ఊపేసరికి వెళ్తుంది చామంతి.
బట్టల షాపు నుంచి ప్రభ పప్పులిద్దరూ తమ రూమ్ వైపు వస్తూ ఉండగా పప్పు ఒక పూల బండిని చూసి బైకును కాస్త మెల్లగా పోనిస్తాడు.
ఇదేంట్రా పూల బండి దగ్గర బండి నిలుపుతున్నావ్ పూలేమైనా కొనాలా ,? ఏంటి అన్నది ప్రభ ప్రశ్న .
"అవును, మల్లెపూలు కొనాలి" అంటూ బండి వైపు చూస్తాడు పప్పు.
"ఆ! మల్లెపూలా ! ఎవరికి "అంటూ ప్రభ చూస్తూ ఉంటే" అలా తెల్లబోయే చూడకురా నాయనా, ఇవి నాకు కాదు మన పక్కింటి ఆంటీ చెబితే కొనాలని నిలబెట్టాను అంతే.
అంతేనా లేదా ....
అంతేరా బాబు , నువ్వేదో ప్రేమలోకంలో ఉండి నీ కంటికి అన్ని అటువంటి ప్రపంచాలే కనిపిస్తున్నాయి అనుకుంటా అన్నాడు చిరునవ్వుతో పప్పు.
అది కాదు ఈమధ్య యూత్ కాస్త ఆంటీలపై ఓ కన్నా పెడుతున్నారని విన్నాను .
"ఛీ !ఛీ! ఏం మాట్లాడుతున్నావ్రా , నన్నేమైనా అను నా క్యారెక్టర్ ని మాత్రం టచ్ చేయకు , నా జీవితంలో నేను చూసింది చామంతిని ఇష్టపడింది చామంతిని మాత్రమే " అని పప్పు ప్రభు వైపు తిరుగుతాడు .
లేదు లేరా నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ అని నాకు తెలుసు .కానీ మల్లెపూలు కొంటానని అంటూ ఉంటే అలా అన్నాను అంతే .సరే సరే ఆ మల్లెపూల సంగతి చూడు అంటూ బండి వైపు చూస్తూ పప్పు భుజం మీద చేయించి చూస్తుంటే చక్రాల మధ్యలో సింపుల్ డిజైన్ స్లిప్పర్స్ తో కదులుతున్న పాదాలను చూసి ఆశ్చర్యపోతాడు ప్రభ.
"ఇదేంటి ఇంత మృదువైన పాదాలకు తన బొటన వేలు పక్కన రెండు అతుక్కుని ఉన్నాయి. ఇలా నేను ఎవరికీ చూడలేదు "అనుకుని అలా తలని పైకెత్తి చూస్తూ ఉండగా గులాబీ రంగు వోణి చూడొద్దన్నట్టు కిందికి జారడంతో " పప్పు పదరా మల్లెపూలు అన్నావుగా" అని ప్రభ చెప్పేసరికి బండికి కాస్త దగ్గరగా పోనిస్తాడు పప్పు.