లతీకని ఇంటికి వదిలి వచ్చిన తర్వాత ప్రభ ఫామ్ హౌస్ కి వచ్చి నిద్రపోయి ఉదయం లేచి బయటికి వచ్చి చూస్తే పతంగి చాలా సంతోషంతో కనిపిస్తూ ఉన్నాడు.
పతంగి అన్నయ్య లో ఈరోజు ఇంత హుషారేంటి? ప్రశ్నిస్తాడు ప్రభ
"ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి వస్తోంది " అని చెప్పి లోపలికి వెళ్ళాడు.
ఆ మాట విన్న ప్రభకి ఓ ! పెద్దాయన చిన్న పాపతో ఈ ఊరికి వచ్చారని పతంగి అన్నయ్య చెప్పారుగా తను ఆ అమ్మాయే అయి ఉంటుంది" అయ్యో! తన పేరు అడగడం మర్చిపోయాను సరేలే వచ్చినాకైనా తెలుస్తుంది తను మేము ట్రైనింగ్ క్లాస్ కి వెళ్ళకముందే వస్తే బాగుండు తను ఎలా ఉందో ఒకసారి చూడాలనిపిస్తుంది" అనుకొని ట్రైనింగ్ క్లాస్ కి వెళ్లాలని రెడీ అవుతూ ఉండగా పెద్దాయన కారు డోరు ఓపెన్ చేయడం చూసిన ప్రభా కిటికి నుంచి తొంగి చూస్తే తెల్లని రంగు నిండుదనమున్న డ్రస్సులో దిగిన ఆ అమ్మాయిని చూసేసరికి "బాపు బొమ్మలా ఉంది అనుకున్నాడు మనసులో . అయినా తన కళ్ళు ఒక్క క్షణం అక్కడ నిలబడలేక పోతున్నాయి.
ఆ సందర్భంలో అప్పుడే బయట నుంచి వచ్చిన గోవిందు "ఏంటి యువరాజుగారు కిటికీ నుంచి తొంగి చూస్తున్నారు " అంటూ తను కిటికీ దగ్గరికి వచ్చి అరణ్య దిగుతూ ఉండడం చూసి "పెద్దాయన వాళ్ళ అమ్మాయి వచ్చినట్టుంది "అని ప్రభా ముఖం చూసి చిరునవ్వు నవ్వుతూ తను రెడీ అవ్వడానికి వెళ్తాడు.
గోవిందు హాస్పిటల్ కి వెళ్ళాలని బయటికి వస్తున్న కూడా ప్రభ ఇంకా కదలకుండా ఉండడం చూసి "ఈరోజు గాని మనం ఆలస్యంగావెళ్లామంటే మళ్ళీ పనిష్మెంట్ అయితే తప్పదు.మేడం సీరియస్ అయ్యారు గుర్తుందిగా" అన్న గోవిందు మాటలు వినిపించగానే సరే సరే అంటూ చెప్పి ఇద్దరూ బయటికి వస్తూ ఉండగానే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడి నుండి ఇద్దరు డైరెక్టుగా క్యాంప్ కు రాగా ఆల్రెడీ చరిత, అశ్విన్లు వచ్చి పని చేస్తూ ఉన్నారు డాక్టరమ్మ సూచనలతో.
రైతులు వస్తున్నారు వెళ్తున్నారు అందులో ఒక పెద్దాయన వీళ్ళ పనితనం చూసి" యూత్ అంటే ఇలా ఉండాలబ్బా "అన్నాడు .
గోవిందు , నవ్వుతూ చూడరా! అన్నట్టు ప్రభావైపు చూసేసరికి అలాగే అంటూ నవ్వుతూ తలూపాడు ప్రభ. అంతలో పొడుగాటి వ్యక్తి ఆవు తోలుకొచ్చాడు . చూడ్డానికి ఎత్తు, లావు బాగానే ఉంది ఆవు . అప్పుడే వచ్చిన డాక్టర్ ఆవుని చూస్తూ లోపలికి వెళ్ళింది . సుకేసిని వెళ్లిన పది నిమిషాలకే ఆవు కుప్ప కూలింది. పక్కనే ఉన్న ప్రభ గాబరాగా లేపుతున్న అది లేవలేదు చేతిలో సిరంజి పట్టుకున్నాడు. ఆ చేతితోనే ఆవుని తట్టేటప్పుడు ఆవుకి తగలడం చూసిన రైతు "వీడే ఏదో ఇంజక్షన్ వేసి చంపాడని' అరవడంతో అందరూ గుమీగూడారు. ఆ ఆరుపులు విన్న సుకేషిని బయటికి వచ్చి చూసేసరికి కొంతమంది రైతులు ప్రభ కాలర్ని పట్టుకొని కొట్టడానికి వెళుతుండగా"
ఆగండి ! ఎందుకలా అరుస్తున్నారు? అసలు ఏం జరిగిందో విషయం తెలుసా! ఊరి నుంచి వస్తూ ఉండగానే ఇతను ఆవుని పరిగెత్తిస్తూ తోలుకొంటూ వస్తున్నాడు.అది ఇక్కడికి రాగానే ఎక్కువ దప్పి వేయడంతో పోయి నీళ్లు గబగబా తాగేసింది.అందుకే ఇలా అయింది అని చెప్పింది సుకేషిని . "మరి మీకు తెలిసి ఎందుకు ఏమి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు?"అడిగాడు లాంగ్ మెన్.
" నీ ఆవు ఇంకొద్దిసేపు నీళ్లు తాగకుండా నిలబడి ఉంటే దానికి ఏమీ అయ్యేది కాదు కానీ నువ్వే తప్పు చేసావ్ అని చెప్పింది సుకేశిని. ఏమంత తొందర నిదానంగా రావచ్చుగా" అని సుకేషని అనడంతో రైతులందరూ వెనక్కి తగ్గారు.
" మేడం ! మీరే ఏదో ఒకటి చేయండి. నా ఆవుని చాలా డబ్బులు పెట్టి కొన్నాను" అని ఏడ్చాడు రైతు . ప్రభ కూడా దీనంగా మేడం వైపు చూసేసరికి "సరేలే రైతుకు ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తాను" అని చెప్పడంతో వెళ్ళాడు రైతు .
"ప్రభా, దిగులు పడకు ఇందులో నీ తప్పేమీ లేదు ఏమంటే రైతులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి . టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఆవుని ముట్టుకోవడం వల్ల అతను నిందించాడు.హెల్ప్ చేయడంలోనూ జాగ్రత్త పడాలి. డాక్టర్ అయిన తర్వాత ఇవన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి ఆలోచించి అడుగు వేయాలి. లేదంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి . అని చెప్పి జనాల వైపు తిరుగుతూ.క్యాంపు ముగిసింది ఇక మీరంతా వెళ్లొచ్చు" అని సుకేషని చెప్పేసరికి అందరూ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లారు. చరిత వచ్చి ప్రభ ! బాధపడకు రా డాక్టర్ అన్న తర్వాత ఇవన్నీ కామన్. ముందు రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకో చెప్పింది చరిత .
ప్రభ , గోవిందులు మధ్యాహ్నం మూడు గంటలకి క్యాంప్ నుంచి ఇంటికి వచ్చాక సుకేశిని ఫోన్ చేసి నాలుగు రోజులు ఉండనని హాస్పిటల్ కి రావద్దని చెప్పడంతో కాస్త నెమ్మది అనిపించింది ప్రభా మనసుకి.
చాలా డల్ గా కనిపిస్తున్న ప్రభ ని చూడడంతో విషయం తెలుసుకున్న పెద్దాయన " సృష్టిలో ప్రతి జీవి మరణించడం సత్యం.ఉన్నంతవరకు మనం సర్వ్ చేయాలి అంతేకానీ ఇలా డల్ అయితే ఏ పని కూడా మనం శ్రద్ధగా చేయలేము "అని ధైర్యం చెప్పడంతో కాస్త మనసు కుదుటపడింది ప్రభాకి.
అక్కడి నుంచి పెద్దాయన పతంగులు పొలం వైపు వెళ్ళగా ప్రభ మనసుకు కాస్త బేజారు అనిపించడంతో ఇంటికి వెళ్లి అమ్మతో మాట్లాడాలని వెళతాడు .
గోవిందు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు
ఇంటికి వచ్చిన ప్రభ గౌరీ సోఫా మీద కూర్చుని ఉండగా వెళ్లి ఆమె ఒడిలో పడుకుంటాడు. అది గమనించిన గౌరీ ప్రభ చూస్తూ తల నిమురుతూ "ప్రభ తలనొప్పిగా ఉందా అంటూ ప్రబా నుదుటిని ముట్టుకుంటుంది.
అమ్మ , నేను బాగానే ఉన్నాను కానీ నిన్న క్యాంపులో... అంటూ జరిగిన విషయం చెబుతూ అమ్మ చేతి వేళ్లను అలా ముట్టుకుంటూ అమ్మని చూస్తాడు.
ప్రభ ఒక వృత్తిని చేసేటప్పుడు ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాలి. అందులో ఏమాత్రం తప్పటడుగు వేసిన ఆశయం అనేది దూరం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనిషికి ధైర్యం, ధారాళo అనేవి చాలా అవసరం. ధైర్యం మనకు దేవుడైతే ధారాళం దారి చూపిస్తుంది. అప్పుడే మనసు అడుగును ముందుకు వేయిస్తుంది "అంటూ ఇద్దరు మాట్లాడాక ప్రభకి తన చేతితో అన్నం వడ్డిస్తుంది. జాగ్రత్తలు చెప్పి తన కొడుకుని చూస్తూ "నా కొడుకు ఎప్పటికైనా తను అనుకున్నది సాధించాలని "ఆమె మనసు తపిస్తుంది . అందుకే కొడుకుకు జాగ్రత్తలు చెప్పి రామాపురం పొమ్మని చెబుతుంది . గోవిందతోపాటు ప్రభ ఇద్దరూ కలిసి రామాపురం చేరుతారు.
గోవిందు రూమ్ లోకి వెళ్లడంతో ప్రభ కళ్ళు మాత్రం ఆ అమ్మాయిని వెతుకుతున్నాయి. అంతలో కూని రాగం తీస్తూ చేతిలో పుస్తకాన్ని పట్టుకొని అలా బయటకు వస్తున్న అరణ్య వైపు ఒకసారి చూడకుండా ఉండలేకపోయాడు. తను ఎదురుగానే రావడంతో హలో!అoదామని మనసు లోపల ఉన్న పెదవులు మాత్రమే మూవ్ అవుతున్నాయి బయటికి వాయిస్ వినిపించలేదు తను అర్థం చేసుకుందో ఏమో ప్రభ వైపు చూస్తూ" ఇక్కడ వెటర్నరీ ట్రైనింగ్ వచ్చినది మీరేనా "అని హుషారుగా అడిగేసరికి అవునన్నట్టు తలుపుతాడు.
మా గురించి.... అని ప్రభ ఏదో చెప్పబోగా "మీ గురించి పతంగి అన్నయ్య చెప్పాడు. ట్రైనింగ్ చాలా చక్కగా చేస్తున్నారంట కదా గుడ్ "అని చెబుతూ ఉంటే "ఈ అమ్మాయి ఎంత గలగల మాట్లాడుతుంది" అని మనసులో అనుకుంటూ ఉండగానే తను పుస్తకాన్ని తీసుకొని అలా కట్టమీదకి వెళ్ళిపోయింది.
ప్రభ తనను మరొక్కసారి చూస్తూ చిరునవ్వు నవ్వుకుంటూ రూమ్ కి వెళతాడు.
***
మరుసటి ఉదయాన్నే లేచి చూస్తే అమ్మాయి కనిపించలేదు. ఇక ఉండబట్టలేక అటుగా వెళుతూ ఉంటే ఎదురుగా వచ్చిన పతంగి ని "అన్నయ్య ఎక్కడినుంచి వస్తున్నారు?"అని ప్రభ ప్రశ్న అడిగేసరికి" అరణ్యకి పరీక్ష ఉంది అందుకే అరణ్యని, పెద్దాయన బస్సు ఎక్కించి వస్తున్నా "అని సమాధానం ఇచ్చేసరికి అవునా "ఏం పరీక్ష?" అన్నది ప్రభ ప్రశ్న
" అదేదో నాకు తెలియదు ప్రభ ఏదో పెద్ద ఉద్యోగానిదే అనుకుంటా' అన్న పతంగితో ఇక అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అన్నయ్య అని చెప్పి గోవిందు, తాను హాస్పిటల్ వైపు వెళ్తారు.
చరిత ,అశ్విన్ ,ప్రభా మరియు గోవిందులు మాట్లాడుతూ ఉండగా వాళ్లతో పాటు భీముడు కూడా కూర్చొని ఉంటాడు.
"అక్క ట్రైనింగ్ రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయనిపిస్తుంది అంటూ చరితవైపు చూస్తాడు ప్రభ.
అవునురా, నువ్వు చెప్పేది నిజమే రోజులు అనేవి ఎంత త్వరగా గడిచిపోయాయో. మన ట్రైనింగ్ ఇంత త్వరగా అయిపోతుంది అనిపించలేదు. బహుశా మీరంతా ఉన్నందుకేనెమో అన్నది చరిత.
అక్క ,నిజంగా చెప్పాలంటే సుకేసిని మేడం చాలా మంచివారు కాబట్టి మాకు ట్రైనింగ్ త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అని చెబుతాడు గోవిందు కల్పించుకుని .
" యు ఆర్ కరెక్ట్ గోవిందు "అని నలుగురు మాట్లాడుకుంటూ మేడం మాకు ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి ఒక చిన్న ట్రీట్ అయినా ఇవ్వాలని మాట్లాడుకుంటూ ఉండగా విన్న సుకేషిని వద్దని చెప్పినా వాళ్ళు వినకుండా బాబును, సార్ ని కూడా తీసుకురమ్మని చెప్పడంతో పార్టీ కొద్దిగా స్వీట్ మరికొంత హాట్ తో సాగిపోయింది. చేతులు కడుక్కోవడానికి వెళ్లిన చరిత ఎందుకో కళ్ళు తుడుచుకుంటూ ఉండడం గమనించిన ప్రభ "అక్కకి ఏ సమస్య ఉంది ఎందుకలా డల్ గా ఉంది.ఇన్నాళ్లు ట్రైనింగ్ లో ఎంత ఆనందంగా ఉంది తనకిప్పుడు ఏమయింది "అని మనసులో అనుకొని చరితకు కనిపించకుండా పార్టీ ముగియడంతో చరిత,అశ్విన్, డాక్టర్స్ ఎవరెంతవరకు వాళ్ళు వెళ్ళగా గోవిందు ప్రబలిద్దరూ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి పెద్దాయన గోవిందులతో మాట్లాడి "అరణ్య , బ్యూటిఫుల్ నేమ్ తను నేను కొత్తవాడినైనా ఎంత బాగా పలకరించింది అంటే అందరితో బాగా కలిసి మెలిసి ఉంటుంది. తను పరీక్ష రాసి ఎప్పుడు వస్తుందో ఏమో అడిగి ఉంటే బాగుండేది ఒకసారి వచ్చి పలకరించవచ్చు అని మనసులో అనుకున్న కొత్తగా ఉన్నప్పుడు సర్పంచ్ భార్య అన్న మాటలు గుర్తుకు రావడం అంటే ఇక పతంగిని ఏమీ అడగకుండా గోవిందతో కలిసి ఊరికి వెళతాడు ప్రభ.