ప్రభా గొర్రెల కాపరి పిలవడంతో గొర్రె కి నాటు వైద్యం చేసిన వ్యక్తి నీ చూసి ఈ కాలంలో కూడా నాటు వైద్యం బతికి ఉన్నట్టే గ్రీటే అని గోవిందతో చెబుతూ పదం వెళ్దాం నీకు బాగా ఆకలిగా ఉందేమో" అని మాట్లాడుకుని ప్రభా గోవిందులు ఇద్దరు హోటల్ కి వెళ్లి లంచ్ చేసి ఫామ్ హౌస్ కి రాగా గోవిందు రూమ్ కి వెళతాడు.
ప్రభ ఫామ్ హౌస్ కి ఇంటి ముందు ఆరు బయట కుర్చీలో అటు తిరిగి కూర్చున్న వ్యక్తిని కాస్త దగ్గరకెళ్ళి చూసి "నమస్తే అండి" అన్నాడు ప్రభ.
" ఆ నమస్తే" అంటూ అతను ఇటు తిరగడంతో "అరే! అక్కడ గొర్రెకి నాటువైద్యం చేసిన వ్యక్తి .అంటే ఇతనే పెద్దాయన నా అంచనా కరెక్ట్ అయింది అనుకున్నాడు మనసులో ప్రభ.
"ట్రైనింగ్ కోసం వచ్చింది మీరేనా?"అడిగాడు పెద్దాయన.
"అవునండి" అంటూ తలపాడు ప్రభ.
ఇక్కడ సౌకర్యంగానే ఉందా?మరొక్కసారి ప్రశ్నించాడు పెద్దాయన.
ఆ,చాలా బాగుందండి చెప్పాడు ప్రభ.
సరే బుద్ధిగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని వెళ్ళండి అన్నాడు పెద్దాయన.
అలాగేనండి అంటూ తలూపుతూ రూమ్ కి వెళ్ళాడు ప్రభ.
ఉదయం 10 గంటలైనా గోవిందుకి కడుపులో తిప్పడం విరేచనం కంట్రోల్ కాలేదు. హాస్పిటల్ కి టైం కి వెళ్ళకపోతే ఆ డాక్టర్ తో తిట్లు తప్పవు. "కడుపుకి సరిపడా తినరా అంటే వింటాడా వినడు ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగో లేట్ అయింది కదా ముందు నిన్ను హాస్పిటల్ కి చూపించి నేను వెళతాను "చెప్పాడు ప్రభ.
దూరం నుంచి వీళ్ళ సమస్యని పరిశీలిస్తున్న పతంగి లోపలికి వచ్చి" కడుపు కాళీ అయింది లే ఈ గలాసు మజ్జిగ తాగి ఓ పూట అన్నం తినొద్దని చెప్పు ఆ కక్కుర్తి వెదవకి, ఏం చేయలేము" అంటూ మజ్జిగ నందించగా ప్రభ,గోవిందు చేతికి ఇవ్వడంతో తాగి పడుకుంటాడు గోవిందు.
"సరే అలాగే కాసేపు పడుకో తగ్గుతుంది" అని చెప్పి ప్రభ హాస్పిటల్ కి వెళతాడు.
ప్రభ హాస్పిటల్ కి వస్తూనే మేడం ఎవరినో గట్టిగా తిడుతోంది. ఈరోజు నాకు కూడా తిట్లు తప్పవు అనుకుని లోపలికి వెళ్లి విష్ చేయగా తను విష్ని అంగీకరించినట్లు తలాడించడంతో "అమ్మయ్య" అని అనుకున్నాడు ప్రభ.
అక్కడి నుంచి వెంటనే చరిత వాళ్ళు ఉన్న రూమ్ కి వెళతాడు ప్రభ.
అక్క!అంటూ పలకరించగా
ఏంటి ఇంత లేటు అడిగింది చరిత.
ఏముంది ఆ గురు గాడు నిన్న ఆకలేస్తుందని బాగా తిని నాకు పని పెట్టాడు వాడు ఎప్పటికీ మారడు వాడింకా చిన్న పిల్లడా ఏంటి?
వాడంతే కాని ఈ పుస్తకం తీసి మెడిసిన్ కి సంబంధించినవి చదువుకోవాలని మేడం చెప్పారు నువ్వు చదువుకో చెప్పింది పుస్తకం తిరిగేస్తూ చరిత.
ప్రభ పుస్తకం తెరచి ఇంకా ఒక పేజీ తిప్పేలోగా బలభీముడు వచ్చి "ప్రభా మేడం పిలుస్తున్నారు" అని పిలిచాడు.
అక్క, ఆడవాళ్లు స్ట్రిక్ట్ అని విన్నాను కానీ ఇంత స్ట్రిక్ట్ అనబోతుంటే" ముందు వెళ్ళారా "చెప్పింది చరిత.
సరే వెళ్తున్నా అంటూ లోపలికి పోయి నిలబడ్డాడు ప్రభ.
"థాంక్యూ ప్రభా" అన్న మేడం మాటలు విని ఆశ్చర్యపోయాడు ప్రభ.
" మొన్న లేటుగా వచ్చినందుకు అరిచాను కానీ నా కొడుకుని టైం కి కరెక్ట్ గా హాస్పిటల్స్ చేర్పించి వాడిని సేవ్ చేసావు "అని చెబుతుంటే వింతగా చూస్తాడు ప్రభ.
నిజం నువ్వు సేవ్ చేసింది నా కొడుకుని. మా ఆయన చెప్పారు" వెటర్నరీ ట్రైనింగ్ అబ్బాయి" అని చెప్పాడు అందుకే నువ్వు అని అనుకున్నాను.
"ఇట్స్ ఓకే మేడం ""అని చెప్పి మళ్ళీ చరిత కూర్చున్న దగ్గరికి వెళ్లి పుస్తకం తిరిగేస్తూ ఉన్నాడు ప్రభా.
"ఏరా ముఖం చిరునవ్వుతో చిందిస్తోంది తిట్టలేదా ఏంటి "అడుగుతుంది చరిత.
అదేం లేదు మొన్న చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడ గాయపడింది వాళ్ళ కొడుకేనంట వాడ్ని నేను హాస్పిటల్ కి తీసుకెళ్లాను అందుకే థాంక్స్ చెప్పింది .
అలాగా! సరేలే అనుకుంటూ మళ్లీ పుస్తకం చదవసాగింది చరిత.
హాస్పిటల్ వర్కింగ్ టైం అయిపోవడంతో అందరూ ఇంటికి బయలుదేరాలని బయటికి వస్తారు.
ఏరా నీకంటే రెండు నెలలు పెద్దదాన్ని కాలేజీలో కాలేజ్ డేస్ లో అక్క అని పిలవమన్న పిలిచే వాడివి కాదు "చెర్రీ చెర్రీ "అంటూ చెవి పగిలేలా అరిచే వాడివి ఇప్పుడు ఎందుకు 'అక్క 'అని కొత్తగా పిలుస్తున్నావు ప్రశ్నించింది చరిత.
"అప్పుడంటే నువ్వు అన్ మ్యారీడ్ వి కానీ ఇప్పుడు మ్యారీడ్ కదా అందుకే అలా పిలవాలని ఫిక్స్ అయిపోయా" నవ్వుతూ చెప్పాడు ప్రభ.
ప్రభా,చరిత మాట్లాడడం చూసి వీళ్ళు అటు తిరగగానే బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళాడు అశ్విన్.
వీడేంటి అక్క ఇంత సైలెంట్ గా ఉంటాడు అడిగాడు ప్రభ.
అశ్విన్ మా పక్కింటి అబ్బాయి . చిన్నప్పటి నుంచి అంతే ముందు మనుషుల్ని స్టడీ చేసి ఆ తర్వాత మాటలు మొదలు పెడతాడు. చాలా యాక్టివ్ గా ఉంటాడు కొత్త ప్లేస్ కాబట్టి అలా ఉన్నాడు. సరే రా నాకు కూడా కాస్త పనుంది త్వరగా వెళ్లాలి "అని చెప్పి బయలుదేరింది చరిత.
"గోవిందు ఎలా ఉన్నాడో ఏమో తెలుసుకోవాలని ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ అయింది అయితే త్వరగా బయలుదేరి వెళ్లాలి "అని చెప్పి ప్రభ ఫామ్ హౌస్ కి వెళ్లేసరికి గుర్రు పెట్టి నిద్రపోతున్న గురూని చూసి కాస్త మనసు కుదుటపడినట్లుంది ప్రభాకి.
డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత డోర్ వైపు చూడడంతో పెద్దాయన నిలుచున్న పొజిషన్ చూసి"ఏం టీవీ! ఏం గంభీరం!ఎలాగైనా కానీ పెద్దాయనతో పరిచయం చేసుకొని ఆ నాటు వైద్యం తెలుసుకోవాలి. నాకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది "అనుకుంటూ బయటికి వచ్చి మళ్ళీ అడుగు వెనక్కి వేశాడు. అతని గురించి కాస్తైనా తెలుసుకోకుండా ముందుకు వెళ్లడం సబబు కాదని వచ్చి అమ్మతో మాట్లాడాలని పించి ఫోన్ కలిపి "హలో! అమ్మ బాగున్నావా మేమున్న ప్లేస్ కూడా బాగుంది" అని కాసేపు ప్రభ అమ్మతో మాట్లాడి మసక చీకటిలో ఊరిలోకి వెళ్లాల్సిన పని పడడంతో బండిలో వెళుతుంటే ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం రావడంతో అటుగా వెళ్లి చూస్తే లతిక బాటిల్లో ఏదో తాగడానికి ప్రయత్నిస్తున్నట్లుంది తాగలేక ఏడుస్తోంది అది చూసిన ప్రభ అక్కడికి వెళ్లేసరికి దాచుకుంది డబ్బాని.
లతిక! ఏం చేస్తున్నావ్ ? అని లతిక చేతిలో ఉన్న డబ్బాను తీసుకొని దూరంగావిసిరేస్తాడు ప్రభ.
ఏం జరిగింది ? ఇంతకీ నీ సమస్య ఏంటి ? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావ్ అడిగాడు ప్రభ.
ఏం చెప్పాలి మా అమ్మే నాకు శాపంగా మారింది ఆరోజు మిమ్మల్ని అవమానించింది ఈరోజు నన్ను కూడా అలాగే చేస్తుంది ఒకటే కూతుర్ని చిన్నప్పటి నుంచి బాగా తినడానికి పెట్టి ఎంత బొద్దుగా ఉండేటట్టు చేసింది ఇప్పుడేమో పెళ్లి వయసు రాగానే పెళ్లి చూపులకి వచ్చిన పెళ్ళికొడుకు పిల్ల లావుగా ఉంది అని చెప్పడంతో చడా మడా తిట్టేసింది. ఆరోజు నుంచి అన్నం పెట్టడo తగ్గించింది. ఒక రూమ్ కేసి బంధించింది లోపల ఎంత నరకంగా ఉందో నాకు తెలుసు కనీసం సన్నగా కావడానికి చిట్కాలు కోసం మొబైల్ లేదా టీవీ చూద్దామన్న అవకాశం లేకుండా పోయింది తనకి మరి అంత కోపం ఎందుకు ప్రభ అర్థం చేసుకోవాలి లేదా అర్థం అయ్యేలా చెప్పాలి నాకూ బయటి ప్రపంచం తెలుసా అంటే నాకు చదువు అబ్బలేదు చదవడం రాయడం మాత్రమే వచ్చు ఇప్పుడు దానికి కూడా అరుస్తుంది నేనేం చేయాలి 'మొక్కై వంగనిది మానై వంగుతుందా ' అన్నట్లు సడన్గా ఇలాంటి పరిస్థితి వస్తే నేనేం చేయలేను నిదానంగా అయితే నేను సన్నగా అవ్వడానికి ట్రై చేస్తాను కొడితే ఒక దెబ్బ కొట్టించుకోవచ్చు కానీ మాటలు పడలేము అని చెబుతూ ఏడ్చింది లతిక. " ఆవేశం అనార్హుతం ఆలోచన ఉత్తమం "అని ఆమెకి తెలిసినట్లు లేదు నోటికి ఎదొస్తే అది వాగేయడమే ఎ ప్పుడు చూసినదే కదా ఎందుకంత బాధపడతావ్ నువ్వే అర్థం చేసుకోవాలి మీ నాన్న ఉన్నారుగా సమస్యని నాన్నతో చెప్పు అన్నాడు ప్రభ.
నాన్న ఉన్నంతవరకు నన్ను ఏమనదు నాన్న బయటికి వెళ్ళగానే ఇలా చేస్తుంది నాకు చాలా బాధగా ఉంది అసలు కన్నతల్లా! కసాయి తల్లా! అని వాపోయింది లతికా.
సరేలే జరిగిందేదో జరిగిపోయింది నేను కూడా చెప్తాను ముందు నువ్వు ఏడ్వడం ఆపేయ్ . ఒక్క నిమిషం ఆగు వస్తాను అని చెప్పి ఒక రెండు అడుగులు ముందుకు వేసి" నేనే లతికని పొరపాటున ఇంటికి తీసుకెళ్తే ఆ గయ్యాళి నా మీద కూడా లేనిపోని అనుమానాలు అంటగడుతుంది కాబట్టి ఏం చేయాలి" అని అటు ఇటు రెండు సార్లు నడిచి చూసి లతీకని చూసి సర్పంచికి ఫోన్ చేశాడు ప్రభ.
హలో ! సర్ నేను ప్రభాని అని చెప్పి సర్పంచికి విషయం వివరించి వెంటనే రమ్మంటాడు ప్రభ .
సర్పంచ్ ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేసరికి లతికకి ధైర్యం చెప్పి సన్నగా అవ్వడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పి సర్పంచ్ తో పాటు ఇంటికి పంపించి తను పనిని అయిపోగొట్టుకొని ఫామ్ హౌస్ కి వస్తాడు ప్రభ
లతికా రావడం చూసి భూదేవి " ఏంటే ! ఇంతసేపు ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ ?"ప్రభ నువ్వు నిలబడి మాట్లాడుతున్నారంట ఎవరో చెప్పారు నాకు . ట్రైనింగ్ పిల్లాడితో నీకేం పని ఇంతకీ చీకట్లో ఏం మాట్లాడుతున్నావ్ వాడితో అనీ కొట్టబోయింది భూదేవి.
ఈ విషయం ఇంత త్వరగా ఎలా తెలిసిందబ్బా అనుకున్న లతిక" ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్ మాట్లాడడానికి ఒక హద్దు ఉండాలి నీ కన్న కూతురు మీద నమ్మకం లేదా" అని గట్టిగానే మాట్లాడింది లతిక.
ఈసారి భూదేవి నిజంగా చంపకి కొట్టబోతుంటే వచ్చి అడ్డుపడతాడు సర్పంచ్. ఆమెకు ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కొడతాడు సర్పంచ్.
"ఎందుకలా కొడతావ్ తప్పు చేసిందని దాన్ని కొట్టాల్సింది పోయి నన్ను కొడతారా" అని అరిచేసరికి "నేను ఈ దెబ్బని నేను ఎప్పుడో కొట్టాల్సింది ఇంతవరకు వదలడం నాకు బుద్ధి తక్కువ , అసలు నువ్వు పెట్టే టార్చర్ కి భరించలేక నా కూతురు గత కొద్ది క్షణాల్లో పరలోకానికి పోయేది. ప్రభ వచ్చాడు కాబట్టే మన కూతురు మనకు దక్కింది సంతోషించు. అబ్బాయిలు ఎలాగో లేరు కనీసం ఉన్న ఒక అమ్మాయిని మనం టార్చర్ పెడితే అది ఎక్కడ పోవాలి అసలు తను లేకుండా నువ్వు బతకగలవా? నీ చేత అవుతుందా తనంటే నీకు ప్రాణం అని తెలుసు అలాగే తన మీద అంత ప్రేమతో తనని టార్చర్ పెట్టొద్దు పిల్లల్ని తిట్టేటప్పుడు తిట్టాలి కొట్టే సమయంలో కొట్టాలి . బు జ్జగించే సమయంలో బుజ్జగించాలి అంతేకానీ ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు అర్థం చేసుకుని ముందు ఏం చేయాలో ఆలోచించు నోటి దురుసు ఎలా వస్తే ఎలా మాట్లాడేదేనా ముందు నీ నోటి దూలని అణకువ చేసుకొని అమ్మాయికి ఎలా ఉండాలో నేర్పించు ముందు నువ్వు నేర్చుకో తర్వాత దానికదే వస్తుంది" అని చెప్పాడు సర్పంచ్.
అవునా! అంత పని చేసిందా నన్ను క్షమించండి నా బంగారు తల్లిని నేను చంపాలని అనుకోలేదు తనకి చదువు అబ్బలేదు కనీసం ఒక మంచి ఇంటికైనా కోడల్ని చేయాలన్న తపనతో కొంచెం కఠినంగా ప్రవర్తిస్తే తను అలా సన్నగా అవుతుందేమో అనుకున్నాను. సారీ లతిక నన్ను క్షమించు ఇంకెప్పుడూ ఇలా చేయను , నేనే ఆరోజు కూడా ఆ అబ్బాయిని దుడుకుతనంతో నానా మాటలు అన్నాను. నా నోటి దూల పడేయ ఇంకెప్పుడు అలా మాట్లాడను. తను వచ్చాడు కాబట్టి నీవు నాకు దక్కావు లేకపోతే నేనేమైపోయేదాన్ని ప్రభ నా కూతురికి పునర్జన్మ ఇచ్చిన దేవుడు .వాడు కనిపిస్తే చేతులెత్తి మొక్కాలని ఉంది ఇంకెప్పుడూ ఇటువంటి పని చేయను. ఇక నుండి నువ్వు సంతోషంగా ఉండొచ్చు "అని చెప్పింది భూదేవి.