Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 8

అరణ్యకి  ఎమ్మార్వో జాబ్ వచ్చిందని చాలా సంతోషిస్తాడు పెద్దాయన.
  పెద్దాయన " అరణ్య మొదటి రోజు కదిరినాడుకు వెళ్లేటప్పుడు తోడుగా నువ్వు కూడా వెళ్ళమని" ప్రభ కి చెప్పడంతో అలాగే అని చెప్పి వెళతాడు ప్రభ.

ప్రభా రామాపురం నుంచి వస్తుoటే బసవయ్య మాటలే గుర్తుకు వస్తున్నాయి "ఏంటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడినంత మాత్రాన అలా మాట్లాడతాడా  ? ఈ సమాజంలో ఆడ ,మగా మాట్లాడితేనే ఇలాంటి మాటలు అంటగడతారు. ఎప్పుడు మారుతుందో ఈ సమాజం అని నేను అనుకున్నా సమాజం ఏం చేయగలదు ..అందులో అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చేసుకోని వాళ్ళు కూడా ఉంటారు ఇలా బసవయ్యలా, అయినా ఎవరేమనుకుంటే మాకేంటి మాకు నచ్చినట్టు మేము బతకాలి అప్పుడే మరణించే వరకు కాస్త ఆనందంగానైనా ఉన్నట్టు అవుతుంది" అని ఆలోచించుకుంటూ బండిని రైడ్ చేస్తూ ఉండగా  జనాలు గుమిగూడి  ఉండడం చూసిన ప్రభ దూరంగా అలా వెళుతూ ఎవరినో అడిగేసరికి "బసవయ్య కుమారుడు పెళ్లి చూపులకని వస్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది" అని చెప్పడంతో బహుశా బసవయ్య అరణ్య ని చూడడానికి రమ్మని చెప్పాడేమో "అని మనసులో అనుకుంటూ ఉండగానే "కొడుకు మరణ వార్త విని బసవయ్య గుండె ఆగి చనిపోయాడని" మరొకడు పరిగెత్తుకొని రావడంతో  "  ఎవరు ఎవరికి రాసి పెట్టి ఉంటారనేది విధి రాత దానిని ఎవరు తప్పించలేరు " అనుకుని అక్కడి నుంచి  మిల్క్ డైరీ ప్లాంట్ కి వెళ్తాడు.

బయట మిల్క్ డైరీ పేరు" శ్రేష్ట "అని చదివిన తర్వాత పేరు మాత్రం చాలా బాగుంది కానీ లోపల అంత శ్రేష్టంగా ఉందో లేదో లోపలికితే కదా తెలిసేది అనుకుని వెయిటింగ్ చాoబర్ లోకి వెళ్లి కూర్చోగా మేనేజర్ ఇంటర్వ్యూ కి పిలవడం తో లోపలికి వెళ్ళినప్పుడు అతను అడిగిన ప్రశ్నకి ఒక ప్రశ్న తప్ప మిగిలిన వాటికి సమాధానం సరిగ్గా ఉండడంతో ప్రభని " నువ్వు ఈ ఉద్యోగానికి ఓకే" అని చెప్పి ప్రభాకు అలాట్ చేసిన చోటికి తీసుకుపొమ్మని అక్కడున్న ఒక వ్యక్తికి చెప్పేసరికి ప్రభాని మిల్క్ ప్రొడక్షన్ దగ్గరికి వదులుతారు." అక్కడ  పని మిల్క్ ని ప్యాక్ చేయడం అలాంటివేమో అనుకున్న కాదు  వెన్న  వడగట్టే ప్రదేశానికి తీసుకుని పోగా ఇదేంటిది ఏదో కౌంటింగ్ అలాంటివి వేస్తారు అనుకుంటే తెచ్చి ఇక్కడ వేశారు.  సరే కొన్నాళ్లు తప్పదు కాబట్టి చేద్దాం" అనుకొని అక్కడ ఉన్న వ్యక్తులతో పరిచయం చేసుకొని అన్నిపరిచయం చేసుకొని పనిని ప్రారంభిస్తాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత గౌరీ "నాన్న ఫ్యాక్టరీలో నీకు పని అడ్జస్ట్ అయిందా" అని అడిగేసరికి"  అవునమ్మా నేను కచ్చితంగా పని చేస్తాను "అని చెప్పి పడుకుందామని వెళుతుంటే గణేష్ కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసి "హలో" అనేసరికి అలా ఉంది అవతలి గొంతు.

"ప్రభ కొత్తగా  జాబ్ లోకి జాయిన్ అయినావని విన్నాను "అని అడుగుతాడు గణేష్.

అవును బావ ఈరోజు జాయిన్ అయి వస్తున్నాను ఏమంటే  రేపు సంక్రాంతి కాబట్టి సెలవు ఉంది.

అయితే మా ఊరిలో సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటాము పండక్కి  రా రా" అని పిలుస్తాడు గణేష్.
సరే బావ తప్పకుండా వస్తాను అని చెప్పి ఉదయాన్నే లేచి అమ్మతో ఒక మాట చెప్పి చరిత వాళ్ళ ఊరికి వెళతాడు. అలా చరిత వాళ్ళ ఇంటి దగ్గరికి నడుస్తూ వెళుతూ ఉంటే ముంగిట  ముగ్గు ముచ్చట   గొలుపుతున్నాయి. గొబ్బెమ్మలతో రంగురంగుల రంగవల్లికలు వాకిలికి పూల తోరణాలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ చిన్న పిల్లలు రవికా పావడతో చాలా అందంగా ముస్తాబయి  బొద్దుగా ముద్దుగా కనిపిస్తున్నారు. చూస్తూ ఉంటే చాలా సందడిగా ఉన్నట్టుంది సంక్రాంతి బాగానే జరుపుతున్నట్టున్నారు. అదిగో డూ డూ బసవన్నలు కూడా వస్తూఉన్నాయి. అలంకరించిన బసవన్నలను ముందుకు నడిపిస్తూ వారి మెడలో కట్టిన గంటలు “డు డు” అంటూ మ్రోగుతుంటే, ఆ శబ్దమే పండుగ వచ్చినట్లు ప్రకటిస్తున్నట్టుoది. రంగురంగుల వస్త్రాలు, పూల దండలు, కుంకుమ తిలకాలు బసవన్నలపై పండుగ శోభను తెస్తున్నట్టున్నాయి .
బసవన్నలు వీధివీధిన తిరుగుతుంటే పిల్లలు, పెద్దలు ఆసక్తిగా చూస్తూ ఆనందిస్తున్నారు. ఇళ్ల ముంగిట ఆడవాళ్లు ధాన్యం, బియ్యం, పండ్లు బసవన్నలకు దానం చేస్తున్నారు. రైతుల జీవితంలో పశువుల ప్రాధాన్యతను గుర్తు చేసే ఈ సంప్రదాయం భక్తి, కృతజ్ఞతలతో నిండిఉంటుంద నీ మా అమ్మ చెప్పేది .
ఇదిగో హరిదాసు మరోవైపు , వీధివీధిన వినిపించే రామదాసు పాటలు పండుగ వాతావరణానికి భక్తి రసాన్ని జోడిస్తాయి. “రామదాసు” నాట్యగీతాలు పాడుతూ కొందరు యువకులు, పెద్దలు ఊరంతా తిరుగుతుంటారు. వారి పాటల్లో భక్తి, సంప్రదాయం, ఆనందం కలిసి పండుగను మరింత ఘనంగా చేస్తాయి.అని అనుకుంటూ ముందుకు వెళుతున్న ప్రభ చరిత ఇల్లు కనిపించడంతో ప్రభ ని గణేష్,చరితలు  పలకరించి లోపలికి ఆహ్వానిస్తారు. కాసేపు మాట్లాడి న తర్వాత పిండి వంటలు ఆరగించి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయని అలా ఊరి లోకి వెళతారు.

ఊరంతా సంబరాలతో అంబరాన్ని తాకుతుంటే ప్రభ , గనేష్  లు అందరికంటే ముందుగా వెళ్లి పొట్టేలు పోటీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. పోటీ హోరా హోరీగా జరుగుతూ ఉంది పక్కన నిలుచున్న వ్యక్తుల్ని చూస్తే బెట్టింగ్ రారాజులు బెట్టు వేసుకుంటున్నారు.అది కూడా లక్షల్లో ! అది చూసిన ప్రభ "ఎంత డబ్బు  బెట్  కడుతున్నారు బావ"  అనుకుని గణేష్ వైపు చూస్తే గణేష్  పొట్టేలు పోటీ చూస్తూ ఎగురుతూ కొట్టు కొట్టు అంటూ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఆనందం అనిపించింది ప్రభకి. నల్ల పొట్టేలు ఒక తెల్ల పొట్టేలు పోటీ బాగా జరుగుతూ ఉండగా తెల్ల  పొట్టేలుని   కింద  పడేసింది నల్ల పొట్టేలు. అయినా తెల్ల పొట్టేలు తిరిగి ఊపందుకొని నల్ల పొట్టేలుని ఓడించడంతో పొట్టేలు పోటీ ముగిసింది.

 అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చి ఇంకా ఏ పోటీలు జరుగుతున్నాయో అని చూస్తూ ముందుకు వస్తూండగా పతంగం ఎగిరేసే పోటీ కనిపించడంతో ఒక గాలిపటాన్ని కొనుక్కున్నాడు ప్రభ.

 గాలిపటం తీసుకొని అలా ముందుకు వస్తుంటే  ఘల్లు  ఘల్లు మని గజ్జల సవ్వడితో అడుగులు వినిపించడంతో అటుకేసి చూశాడు ప్రభ. 

 అద్దాల పరికిణిలో చాలా అందంగా కనిపిస్తుంది అమ్మాయి. తను పావడాని నడుముకి ఒకవైపు చెక్కిచ్చి పరిగెత్తుతూ గాలిపటాన్ని  ఎగిరేస్తుంటే స్నేహితురాండ్రు కూడా   పోటీ పడుతున్నారు
పటం ఆకాశంలో ఎగిరిన కొద్దీ ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దారం చేతిలో జారిపోతుందేమో అన్న చిన్న భయం, పైకి ఎగిరిన పటం చూసిన సంతోషం కలిసి ఆమె భావాలను మరింత గాఢం చేశాయి. ఇతర పటాలతో పోటీ పడుతున్నప్పుడు గెలవాలన్న ఆశ, తన శ్రమ ఫలించాలన్న కోరిక ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించాయి.అలా  గాలిపటాన్ని ఎగిరేస్తూ ఎగిరేస్తూ ప్రభ కూడా గాలిపటం మాoజాని కొద్ది దూరమెక్కువ వదలడంతో వాళ్ల గాలిపటాలు ఉన్న వైపు ఎగర సాగింది  ప్రభ ఒక్కడే కాదు  కొంతమంది అబ్బాయిలు కూడా ఎగర వేస్తున్నారు ఒకవైపు  .కాని ప్రభ గాలిపటం వైపు ఆ అమ్మాయి గాలిపటం కూడా  రావడంతో అమ్మాయి గాలిపటం  ప్రభ గాలిపటానికి చిక్కుకుంది.వెంటనే అమ్మాయి ఇది గానపటం ఎవరిది అని చూసేసరికి ప్రభ కాస్త కనపడకుండా నిలబడతాడు ఇక ఆలస్యం చేస్తే బాగోదని వెంటనే 
అడుగు ఇంకొంచెం ముందుకు వేసి మంజాని లాగడంతో అది ఇంకా చిక్కుకుపోయింది. అంతలో దూరాన నిలబడ్డ  నారాయణ,   బుజ్జి !  గాలిపటం బయటికితీ  నీ  గాలిపటం గెలవాలి అని అరవడం చూసిన ప్రభ  " బహుశా అతను వాళ్ళ తండ్రి అయి ఉండొచ్చు తన కూతురిని ఎంత బాగా ప్రోత్సహిస్తున్నాడు "    చూడు అని అనుకుంటూ  మరొక్కసారి చూసి  ముసిగా  నవ్వుతూ తన యొక్క గాలిపటం మాంజానీ కట్ చేశాడు. అంతే ఆ అమ్మాయి  గాలిపటం గెలవడంతో  నవ్వుతూ పరిగెత్తుకొచ్చి నారాయణ ముందు నిలబడి    " జాతరకి తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ నాన్న "అని చేతులు పట్టుకొని తిప్పినంత  పని చేసింది. తన కళ్ళలోని ఆనందాన్ని పెదవులపై చిరునవ్వుని చూస్తూ ఉంటే ప్రభ కళ్ళలో తన ప్రతిమ పూర్తిగా ముద్రించుకు పోయింది . మరొక్కసారి అమ్మాయి వైపు చూద్దామని అనుకుంటూ ఉండగా తను అంత దూరంలో వెళుతూ     ఎంతో హుషారుగా ఎవరికోసమో వెతుకుతున్నట్టనిపి స్తుంది.అలా తను రెండు అడుగులు వేసి మరోవైపు వెళ్ళ గా ప్రభ కూడా అలా తననే చూస్తా తనకి కనిపించేలా    నిలబడాలని ప్రయత్నించిన  ఆ అమ్మాయి తన పావడాని చేతిలో పట్టుకొని అలా వెళుతూ ఉంటే ప్రభ ఈసారి ఎదురుగా  వస్తాడు   తను ఆటే వస్తూ ప్రబా తనికి అడ్డం అనిపించడంతో  " సైడ్ ప్లీజ్ "అని ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగా అంత దగ్గరగా తనని చూస్తూ ఉంటే అడ్డు తీయాలని అనిపించట్లేదు ప్రభాకి. అంతటితో తమ్ముడు బంగారం రావడంతో  అలా తమ్ముడు చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ వెళుతున్న అమ్మాయిని చూస్తుంటే ఎన్నడూ లేనట్టుగా తన గుండె సవ్వడి అలా తనలోని మృదువైన వీణ తీగలను మీటినట్టనిపిస్తుంది ఎన్నడూ లేని భావనలు తనలో కలుగుతున్నట్టు  అనిపించింది. ఆలోచన నుంచి  తీరుకునే లోగా  ఆ అమ్మాయి ఒకసారి     ఇటు తిరిగి చూస్తుందేమో అనుకుంటే చూడకుండా  వెళ్లడంతో ప్రభ చరిత ఇంటికి వెళ్లి చరిత కోసం చూస్తే తను వచ్చిన బంధువులకి చేసిన పిండి వంటలు వడ్డిస్తూ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. అక్క కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటే గమనించిన  గుణేష్ దాదాపు చుట్టాలు వెళ్లిపోవడం తో చరితను పిలుస్తాడు. 

చరిత నీ తమ్ముడు అప్పటినుంచి నీకోసం  చూస్తున్నాడు వాడు ఏదో నీతో చెప్పాలని అనుకుంటున్నాడు. నువ్వు లోపలికి వెళ్లు నేను వడ్డిస్తాను అని చెప్పడంతో చరిత కిచెన్ లోపలికి వెళ్తే ప్రభ వెనకే వస్తాడు.

ప్రభ ఏంటి సంక్రాంతి సంబరాలకి వెళ్లి వచ్చిన తర్వాత నీ కళ్ళల్లో ఏదో కొత్త కాంతి క నిపిస్తుంది అని చరిత అడుగుతుంటే ప్రభా చిరునవ్వుతాడు.

నీ నవ్వు చూస్తుంటే ఏదో పువ్వు కనిపించినట్టుంది అని కనుబొమ్మలు ఎగరేస్తూ ప్రభ ని ప్రశ్నిస్తుంది చరిత.

అక్క , నువ్వు చెప్పేది నిజమే నేను ఒక అందమైన పువ్వు ని చూశాను అది నిజంగా దేవలోకంలోని పారిజాతమేమో అనుకో అంటూ చరిత పక్కన కూర్చుంటాడు. 

ఏరా కవిలాగ బాగానే వర్ణిస్తున్నావు  తను అంతగా నచ్చిందా ఏంటి 
అవును అన్నట్టు అక్కవైపు చూస్తూ సిగ్గుపడతాడు.

ఇంతకీ ఎవరు ఆ అదృష్టవంతురాలు 

ఎవరో పేరు నాకు తెలియదు గానీ వాళ్ళ నాన్న ప్రియా అని పిలవడం అయితే విన్నాను

ఓ! ఆ అమ్మాయా అని చరిత ఇంకా మాటలు చెబుతూ ఉండగానే అక్క నీకు ఆ అమ్మాయి తెలుసా అని  అడుగుతాడు . 
పర్లేదు మన్మధ  బాణం కాస్త గురిచూసి వేసినట్టు న్నావు .

అక్క ప్లీజ్ అని తనెవరో తెలుసుకోవాలని అత్రంగా అడుగుతూ ఉంటే సరే చెప్తాను  అంటూ ఆ అమ్మాయి  పేరు ప్రియ గీతిక. తను నారాయణ , మా దేవి వాళ్ళకి కన్న కూతురైతే కాదు పెంచిన కూతురు. మొదట్లో తనని బాగా చూసుకునేది . ఒక కొడుకు పుట్టిన తర్వాత ఒకసారి ఆ అబ్బాయి పెద్ద నీళ్ల టబ్బులో పడిపోయినప్పుడు గీతిక చిన్న పిల్ల ఇంకా ఆడుకుంటూ ఉండగా పరిగెత్తుకొచ్చి  మా దేవి కొడుకుని బయటికి తీసుకొని గీతిక ని రెండు చెంపలకి కొట్టి అప్పటి నుండి ఒక పని మనిషి లాగా చూస్తోంది. వాళ్ల నాన్న మాత్రం బాగా చూసుకుంటాడు. అమ్మాయికి కాస్త బుద్ధి వచ్చినప్పటి నుంచి హాస్టల్లో వదిలి చదివించాడు  . కేవలం సెలవులకు మాత్రమే ఇక్కడికి వస్తుంది. బహుశా చదువు పూర్తయింది అనుకుంటా.ఈ సంక్రాంతి సంబరాలకి వచ్చినట్టుంది. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది నాకు తెలిసి తనని పొందాలంటే నీకు కూడా అంత ఈజీ కాదని అనిపిస్తుంది .
కృషి ఉంటే  మనుషులు ఋషులవుతారు అన్న నానుడి తెలుసు కదా అలాగే అనుకుంటే సాధించలేనిది ఏది లేదు ప్రయత్నిద్దాం 

నువ్వు అనుకున్నట్టు జరిగితే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఒక మంచి అమ్మాయికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. 

అలాగే  తప్పకుండా తనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తా అని చెప్పి ఇంటికి వెళతాడు..

***
ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసరికి భూదేవి కళ్ళు పెద్దవి చేస్తూ"  ఇటు రా "అని పిలవగానే చేతులు ముడుచుకొని వెళ్లి నిలబడుతుంది ప్రియ.

"ఏంటే నేను ఊర్లో లేనని మీ నాన్నని పిలుచుకుని గజ్జల గుర్రంలా గెంతి వస్తావా చెప్పానుగా వెళ్లొద్దని అని మాదేవి అరుస్తుంది.

" అమ్మ, ఈరోజు సంక్రాంతి పండుగ అని "అందామని మనసులో అనుకున్న కూడా తను అనలేకపోతోంది. కళ్ళలో నీళ్లు మాత్రమే తిరుగుతున్నాయి అది గమనించకపోలేదు బంగారం. అంతలో నారాయణ అక్కడికి రావడంతో భార్యకి   "తను ససేమిరా రానంది కానీ నేనే బలవంతంతో తీసుకెళ్లాను అయినా నీకు  తెలుసుగా తను పండగ రోజు తప్ప వేరే రోజు అసలు ఇంటికి కూడా రాదు. నేను కూడా తీసుకురాను అలాంటిది పండగ అని  వస్తే ఎందుకు నువ్వు ఇంత రాజ్యాంతం చేస్తావు "  అంటూ నారాయణ మాట్లాడతాడు.

అవునులే దానిని వెనకేసుకు రావడం మీకు అలవాటే కదా అలా వదిలే నా కొడుకుని....అని మాదేవి అంటూ ఉంటే"" ఎందుకే ఏదో పొరపాటున జరిగిన దానికి పదేపదే దాన్నే మాట్లాడి హింసిస్తావు ఇంకొన్నాళ్ళు  ఓపిక పట్టు.... "అని నారాయణ బాధపడుతూ ఉండగా ప్రియా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసి వచ్చి యధావిధిగా తన పనిని కొనసాగించుతోంది. నారాయణ మాత్రం కూతురిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడతాడు.

"అసలు ఆడదానికి ఆడదే శత్రువా ? మొదటలో ఎంతో బాగా చూసుకునే దానివి ఇప్పుడేమైంది ఏదో చిన్న పొరపాటు జరగడం వలన ఆ చిట్టి గుండెకి ఇంత శిక్ష విధిస్తే ఎలా ?  ఇక ముందు జరగనివ్వకూడదు అని నేను అనుకున్న తను వదలదు కాబట్టి ఆలోచిస్తాను " అనుకొని లోపలికి వెళ్తాడు.
భర్త మాటలు విన్న మాదేవికి చాలా కోపం వస్తుంది.   "ఎవరో కని పారేసిన దాన్ని,    తీసుకువచ్చి పెంచితే నా కొడుకు నీటి టబ్బులో పడినప్పుడు ఆటలో పడి నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చినా నా కొడుకు నాకు దక్కేవాడు కాదు .అయినా తన అంతకు తను ఆడుకుంటోoది . అదే తన సొంత అక్క అయితే అలా చేసేదా అందుకే ఈరోజు కాదు ఎప్పటికీ దానిని నాకూతురుగ నేను అంగీకరించను.అది కేవలం పని మనిషిలా ఉండి బయటకి పోవాల్సిందే" అనుకుంటూ ప్రియా చేస్తున్న పనులను పరిశీలిస్తూ  బంగారంని దగ్గరికి తీసుకుంటుంది.