ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటర్వ్యూ మిస్ కాకూడదని నిర్ణయించుకున్న గీతిక బాగా ప్రిపేర్ అయి తీరా బయలుదేరిలోగా వెళ్లాల్సిన వెహికల్ మిస్ అవ్వడంతో తాతయ్య వెళ్లి ప్రభ తో మాట్లాడి విషయం చెప్పడంతో తను హెల్మెట్ తలకి పెట్టుకొని రావడంతో గీతిక సంశయిస్తుంది.
"తను మాకు తెలిసిన అబ్బాయి నీకేం భయం లేదు తనతో వెళ్ళు ఈరోజు నీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పావు కదా" అని ఇద్దరూ చెప్పేసరికి మీరు ఈరోజు మిస్ అయితే ఇక నాకు కష్టమవుతుంది నాన్న కచ్చితంగా ఈ వారంలో గ వస్తారు కాబట్టి వెళ్లి తీరాలి అనుకుని బండి ఎక్కిన గీతికని బండిని కాస్త వేగంగా పోనిచ్చి బస్సు ని క్యాచ్ చేయిస్తాడు ప్రభ.
సాయంత్రం హుషారుగా వచ్చిన గీతికని చూసి తను బండి ఎక్కేటప్పుడు " ఈరోజు ఎలాగైనా నేను ఇంటర్వ్యూ పాస్ అయి ఉద్యోగం సాధించాలి అన్న మాటలు గుర్తుకు వస్తాయి. "అంటే ఇంతకుముందు తనకు ఉద్యోగం రాలేదన్న మాట వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పినట్టుంది పాపం తనకు ఏ కష్టం కలిగిందో ఏమో అనుకుంటూ గార్డెన్ హౌస్ వైఫ్ చూడగా తమ్ముడు, నాన్న వచ్చిన సంతోషంలో తన ముఖంలో నవ్వును చూసి ఆనందిస్తాడు ప్రభ.
తమ్ముడు నాన్నలతో మాట్లాడి తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో తనే వంట చేసి అందరికీ వడ్డిస్తుంది.
రాత్రి రూమ్ కి వెళ్ళిన గీతిక తమ్ముడు పడుకుని ఉంటే తలనిమురుతూ " బంగారం ! రేపు వెళ్ళిపోతావు కదా మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో ఏంటో ? అంటూ దిగులుపడుతూ తమ్ముడి నుడదుటి మీద ముద్దు పెట్టి, రగ్గు కప్పి పడుకుందామని తలవాల్చేలోగా మెసేజ్ రావడంతో చూసి " యాహూ అనుకుని సంతోషంతో మొబైల్ ని ఎదపై ఉంచి రెండు చేతులతో పట్టుకొని అటు ఇటు ఊగుతూ " ఫోన్ పక్కన పెట్టి వెల్లకిలా పడుకొని " నన్ను క్షమించు నాన్న ! ఆరోజు తప్పని పరిస్థితిలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇదిగో! ఇప్పుడు నేను సాధించాను మీరు చాలా సంతోషిస్తారని నాకు తెలుసు " అనుకొని ఫోన్ తీసి నాన్నకి చెప్పేదా? వద్దు, రేపు ఎలాగూ తమ్ముడిని తీసుకెళ్లడానికి వస్తారుగా అప్పుడు సర్ప్రైజ్ గా చెబుతాను అనుకొని పడుకుంది గీతిక.
మరుసటి రోజు మధ్యాహ్నం ఏదో పని ఉండి ప్రభ బయటికి వెళ్తే ఫోన్ పదే పదే మోగుతూ ఉండడంతో ఫోన్ ని బయటికి తీసి చూస్తే " తాము ఉన్న గదికి ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో గది కి కొత్తగా దిగిన ఒక ' కొత్త జంట ' ఉన్న రూమ్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా అందుకే కాల్ చేసినట్టున్నారు నాకు ఈ చిన్న చిన్న కరెంటు రిపేరీలు నేర్చుకోకుంటే బాగుండు తెలిస్తే చాలు ఓనర్లు ఆ పని కూడా నాకే చెప్పేస్తున్నాను " అనుకొని పప్పు కి ఫోన్ చేయబోయి అయ్యో! మర్చిపోయాను వాడు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వాళ్ళ నాన్నతో కలిసి వెళ్ళాడు కదా ! అనుకొని అపార్ట్మెంట్ కి తనే వచ్చి గబగబా వెళ్లి డోర్ బెల్ కొట్టేసరికి ఒక వ్యక్తి వచ్చి ఓపెన్ చేయగా లోపలికి వెళ్లి చూస్తే " బల్బు వెలగట్లేదు " అని చెప్పడంతో ఒక్కొక్క రూమ్ లోని వైర్లు, ప్లగ్ లన్ని ఒక్కొక్కటిగా చెక్ చేస్తూ హాల్లో మూల్లో ఉన్న దేవుని రూమ్ కి లైట్ వెలగడం లేదని చూస్తూ ఉండగా శైలు భర్త వచ్చి పక్కన నిలబడ్డాడు.
" హాయ్ ! శైలు ఎలా ఉన్నావు? ఎన్నాళ్లయిందే నిన్ను చూసి" అంటూ వచ్చి రాగానే అమాంతంగా కౌగిలించుకుంది గీతిక.
గీతిక మాటలు వినపడగానే తిరిగి చూద్దామనుకుంటే పక్కన శైలు భర్త ఉండడంతో అలా చూస్తే బాగుండదు అనుకొని వైర్ కట్ చేస్తూ మెల్లగా కంటి చూపుని గీతిక వైపు మరల్చగా గీతికా అటువైపు తిరిగి కూర్చుంది. శైలు ఎదురుగా కనిపించడంతో టక్కన చూపు డైరెక్షన్ ని మార్చి తన పని చేయసాగాడు ప్రభ.
" ఇంకేం గీతికా సంగతులు! జాబ్ కి జాయిన్ కావాలన్నావుకదా ! ఇక నుండి బిజీ అయిపోతావఅన్నమాట అంది శైలు జ్యూస్ అందిస్తూ.
" నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకో బిజీ లైఫ్ కి వచ్చేసావుగా ! " అంది గీతిక.
అవును , " ఈ బిజీ లైఫ్ కోసం మా నాన్నతో మూడేళ్లు యుద్ధం చేసినట్టయ్యింది " అంటూ శైలు జ్యూస్ గ్లాస్ భర్తకి ఇచ్చి ప్రభకి ఇవ్వబోగా నోటిలో టెస్టర్ పట్టుకున్న ప్రభ వద్దన్నట్లు తలూపడంతో ' పర్లేదు తీసుకోండి' అని బలవంతం చేసేసరికి తీసుకొని జ్యూస్ తాగుతూ గీతికపై ఓ కన్నుంచాడు ప్రభ. తాగిన గ్లాసులను తీసుకుని పక్కన పెట్టి మళ్ళీ గీతిక పక్కన కూర్చుంది శైలు.
అదేంటే! " మీది అరేంజ్ మ్యారేజ్ అన్నావు కదా, యుద్ధం ఏంటి ? "అంది గీతిక అర్థం కానట్టు.
ఓ ! నువ్వు ఇంటర్ వరకే నాతో ఉన్నావు కదా , ఆ తర్వాత నీ ఫోన్ నెంబర్ మిస్ అయి నేనెప్పుడూ ఫోన్ చేయలేదు . ఇప్పుడు ఎదురుగా కనిపిస్తే నిన్ను చూడగలిగాను . మాది లవ్ కం అరేంజ్ మ్యారేజ్.
అవునా!
అవును , నేను లవ్ చేసినా నేను జాబ్ కి జాయిన్ అయిన తర్వాత మా నాన్న పెళ్లి చేయాలని అడిగితే అప్పుడు చెప్పాను. అంతే ! ఆ మాట విని మా నాన్న ఉగ్రోడైనాడు. రెండు సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత ఆలోచించి " ఇన్నాళ్లు నేను చెప్పినట్టు నువ్వు విని నీ చదువును పూర్తి చేసి ఒక స్థాయికి చేరావు . అనుకోకుండా ప్రేమ అన్న పదం నీ నోటి వెంట వచ్చేసరికి నాలో కోపం, బాధ రెండు ఏకమై నీమీద అరిచి, అలిగేటట్లు చేశాయి. కానీ నువ్వు సెలెక్ట్ చేసిన అబ్బాయి నీకు సరితూగుతాడా ? లేదా? అన్న విషయం నేను తెలుసుకోవడానికి రెండేళ్లు పట్టింది. " అని నాన్న చెప్పేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది . ఆ తర్వాత మా నాన్న ఇద్దరికీ పెళ్లి చేశారు .అని చెప్పుకొచ్చింది శైలు.
నిజంగా మీ నాన్న చాలా గ్రేట్ అంది గీతిక.
అవును, " నిజంగా గ్రేట్! అలాంటి నాన్న ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ". అవును, ఇంతకీ నీ సంగతి ఏంటి? జాబ్ కి జాయిన్ అవ్వాలని చెప్పావు కదా ! ఇకనైనా పెళ్లి ఉద్దేశం ఉందా ? లేదా? అడిగింది శైలు.
" లేదు, పెళ్లి గురించి నా మనసులో ఎటువంటి ఆలోచన లేదు అంది ." అని చెప్పేసింది గీతిక.
పోనీ ఎవరినైనా ప్రేమించావా? ఏంటి?
" లేదు, లేదు, లవ్ అనే కాన్సెప్ట్ నాకు వద్దనుకున్నాను. దగ్గరైన అమ్మ ప్రేమకి దూరమయ్యాను ఇక మిగిలిన ప్రేమతో నాకేం పని అందుకే నా జీవితంలో అలాంటి వాటికి చోటే లేదు. " అని గీతిక ఖచ్చితంగా చెప్పడంతో అది విన్న ప్రభ నిట్టూర్పుతో చేతిలో ఉన్న హోల్డర్ ని జార విడిచడంతో అది కాస్త పగిలిపోయింది. " ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయింది. " అయినా తనను తాను కంట్రోల్ చేసుకుని వేరే ఓల్డర్ వేసి పగిలిన ఓల్డర్ని వంగి తీసుకొని విసరుగా బయటకి వెళ్ళాడు ప్రభ.
సరే, శైలు తాతయ్య , జేజిలు లు ఎదురు చూస్తుంటారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాలే అని చెప్పి గబగబా నడుస్తూ దాదాపు మెట్లు దిగే చోటుకొస్తుండగా కిందికి జారుతున్న వొణీని విసురుగా వేసుకుంటూ ఉండగా మెట్ల దగ్గర పక్కన దిగడానికి అనుకూలంగా వేసిన స్టీల్ పైపుని పట్టుకుని నిలబడిన ప్రభ మెడ దగ్గర తగలడంతో అది గమనించని గీతిక విసురుగా లాగితే ప్రభని ఒక చుట్టు తిరిగేలా తిప్పేసరికి ఇక కింద పడిపోతానేమో అనుకొని కమ్మి పైకి కాలు పెట్టగానే సర్రున జారుడు బండపై పిల్లలు జారినట్టు జారుతూ మెట్ల చివర కిందికి పడకుండా గీతిక ఎక్కడ కింద పడుతుందో నని అనుకుంటూ తన రెండు చేతులు గోడకి అంచి ఉండగా మధ్యలో గీతిక గోడకి అతుక్కుపోయినట్టు నిలబడి ఉంటుంది .
వెంటనే తన చేతికి చుట్టుకున్న ఓనీ ని తీసి మెల్లగా ఆమె భుజం వైపు వేసాక. క్షణంలో తన ఎక్కడ ఉందో అర్థం కాక ఒక్కసారి కళ్ళు మూసిన గీతిక తెరుస్తూ ఉండడంతో ఎదురుగా అంత దగ్గరగా ఒక వెచ్చని శ్వాస తగులుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంటే, ప్రభ మరోవైపు చూసి చిరునవ్వు నవ్వుకుంటూ అమ్మాయి కి ఇక సమస్య లేదని పడదని తెలిసిన తర్వాత మెల్లగా చేతులు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.
హలో ఏంటిది? అన్న గీతిక మాటలకి ఆశ్చర్యపోయి చూస్తాడు
హలో మేడం ఆ మాట నేను అడగాలి
"నువ్వు అడగడం ఏంటి అసలు ఎందుకిలా జరిగింది ఇంతకీ ఏం జరిగింది "అని గీతిక అడుగుతూ ఉంటే హలో ! చేసిందంతా చేసి నన్ను అడుగుతావేంటి మెట్లపై కాస్త ముందు చూసి నడవాలి కదా నువ్వు నీ వోణీ ని విసురుగా నీ భుజం మీద వేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది నా మెడకు చుట్టుకుని పిల్లలు జారుడుబండ జారినట్టు జారీనాను సరిపోయింది. లేదంటే నా బాడీలో ఏదో ఒక పార్ట్ కచ్చితంగా విరిగేది. అన్న ప్రభ మాటలకు విస్తుబోయి చూస్తుంది.
అవునా! అయితే ఏమీ కాలేదుగా
ముందు నీకెలా ఉందో చెప్పు అని ప్రభ తన కళ్ళలోకి చూస్తుంటే నేను బాగానే ఉన్నాను అంటూ తన చూపుని మరల్చి అక్కడి నుంచి వెళుతుంది గీతిక.
వెళుతున్న గీతికని చూస్తూ వాట్ ఎ అన్ఎక్స్పెక్టెడ్ స్వీట్ మెమోరీ గీతిక. నాకేం కాకపోయినా నా మనసుకి ఏదో అయింది అని నవ్వుకుంటూ తన గతికి వెళతాడు.
అక్కడినుంచి ఇంటికి వెళ్ళిన గీతిక తాతయ్య జేజిల మాటలు వినిపించడంతో గడప దగ్గర నిలబడి వినసాగింది.
"ఏమండీ ! ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు ప్రభ మన బంగారాన్ని పిలుచుకువచ్చి మంచి పని చేశాడు గీతిక చాలా సంతోషించిందనుకోండి అని జేజి చెబుతోంది.
అవును లేదంటే గీతిక మళ్ళీ సమస్యలు పడేది భూదేవి మనిద్దరం ఉన్నామని బంగారం నీ ఇక్కడ వదిలి వెళ్ళేలా చేసింది ఒక గీతికైతే వెళ్ళిన ఇచ్చేది కాదు ఇట్లు ప్రభ మంచి పని చేశాడు అని చెబుతాడు తాతయ్య.
ఏమండీ! ప్రభనీ ఎప్పుడైనా గమనించారా?
అదేంటి ప్రభ గురించి ఈ రోజు కొత్తగా అడుగుతున్నావ్.
ప్రభ ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఆరోజు మల్లెపూలు కొనేటప్పుడు తను గీతికని చూస్తున్నాడని నాకర్థమైంది.
అవును, ఎగ్జిబిషన్ నుండి కారులో వచ్చేటప్పుడు అద్దంలో మన అమ్మాయిని ఓరగా చూడడం నేను గమనించాను . అలాగే తను ఆరిన బట్టల్ని తీసేటప్పుడు కూడా టెర్రస్ పై నిలబడి తన వైపే చూస్తుండడం చూసాను అన్నాడు తాతయ్య.
అంటే దీన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయి గీతికని ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. పైగా బంగారం అతనితో చాలా దగ్గరగా కలిసిపోయి మాట్లాడుతున్నాడు. అని ఇద్దరు మాట్లాడుతుంటే గీతికకి ఆ మాటలు విని అమ్మో ! వీళ్లిద్దరేంటి ఇలా మాట్లాడుతున్నారు. అంటే నేను వేసే ప్రతి అడుగు , నా ఆలోచనని గమనిస్తున్నారని నాకు అర్థం అవుతోంది. అనుకుంటూ ఏమి తెలియనట్లు గట్టిగా జేజి అని పిలవగానే జేజి రా గీతిక అని లోపలికి పిలిచేసరికి వెళ్లి పక్కన కూర్చోగా పర్స్ ఇచ్చి , బంగారం వెళ్ళినప్పటినుండి మళ్ళీ డల్ గా కనిపిస్తున్నావు. అలా డల్ గా ఉండకమ్మ , "మనకు ఎంత కష్టమొచ్చినా, సుఖమొచ్చిన సమస్యని పరిష్కరించుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి అప్పుడే మన ఎదుగుదల ఆకాశం అంత ఎత్తుకుంటుంది." అన్న జేజి మాటలు విని చిరునవ్వు నవ్వి అలాగే చేసే అని చెప్పి రూమ్ కి వెళ్ళింది గీతిక.
రాత్రి 11 అయినా నిద్ర రావట్లేదు . తాతయ్య జేజీలు ఏంటి అలా మాట్లాడుతున్నారు కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు జేజి నాతో చెప్పిన మాటలు గుర్తున్నాయి .నాకు డ్రాయింగ్ వేసి ఇచ్చినది నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్లినది కూడా తనేనని నాతో చెప్పింది ఇప్పుడు నా తమ్ముడిని సేవ్ చేశాడని నేను ఒక థాంక్స్ చెప్పాను అంతే . నేను మనిషికి మనిషికి సాయం చేశాడని ఆలోచించాను కానీ ఒక మనిషి ఇంకొక మనిషికి సాయం చేయడం అనేది కచ్చితంగా ఏదో ఒకటి ఆశించేనని తాతయ్య జేజిల మాటలు విన్న తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతుంది " నేనేం చిన్నపిల్లని కాదు మా తాతయ్య జేజీలు అనుకున్నట్టు జరగడానికి నేను చాలా స్థిరత్వమున్న మనిషిని ." తప్పకుండా నేననుకున్నట్టే ఉంటాను . కానీ వాడు పోయి పోయి పక్కనే ఉంటున్నాడే! అయినా నాకేం భయం లేదు. నేను చాలా కాన్ఫిడెంట్ అన్న అమ్మాయిని అనుకొని " గీతికా పడుకో, రేపటి నుండి డ్యూటీ ఉంది. అదీ మొదటి రోజు మర్చిపోయావా, ఏంటి ? అని తనని తానే ప్రశ్నించుకుంటూ నిద్రపోయింది గీతిక.
ప్రభ కి మధ్య రాత్రిలో మెలకువ రావడంతో గీతిక గుర్తుకొస్తుంది తను నా వంక చూడాలన్న ఆశ మొదలవుతుంది. కిటికీలో కనిపిస్తున్న చందమామని చూసి గీతిక నీ మనసు నాకు తెలుసు "ఆ చందమామలో అయినామచ్చ ఉంది కానీ నీ చల్లని మనస్సు చాలా స్వచ్ఛమైనదని నాకు తెలుసు.అయితే ఓ నల్లని మబ్బు అడ్డం రావడంతో నీ వెన్నెల కాంతి నా మనసుని చూడలేక పోతుంది ." అయినా నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నీ చల్లని మనసుని మలినం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా ఇష్టం మీద నాకు నమ్మకం ఉంది . ఆ ఒక్కటి చాలు నిన్ను చేరడానికి. అని అనుకొని వచ్చి పడుకున్నాడు ప్రభ.