Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రణయ గీతిక - 12

పప్పు మల్లెపూలు కొనాలని చెప్పడంతో ముందు మల్లెపూలు ఎందుకు అని   ప్రశ్నించిన ప్రభ పూల బండి చక్రాల మధ్యలో నుంచి ఒక అమ్మాయి మృదువైన పాదాలు కనిపించడంతో చూడాలనికుతూహలంగా మనసు  తపించడంతో బండి దగ్గరికి వెళ్ళమంటాడు. 

"అన్నా ఒక మోర పూలు ఎంత ?," ప్రశ్నిస్తాడు పప్పు. 

పూలమ్మే వ్యక్తి మరోవైపుకు మాట్లాడుతూ ఉండడంతో హ్యాండిల్ మీద చెయ్యి పెట్టి అతని వైపు చూస్తున్నాడు.

వెనక కూర్చున్న ప్రభ మాత్రం ఆ మృదుసదనని చూడాలని కాస్త అలా అతని చూపుని ముందుకు పోనివ్వగా రకరకాల పూల హారాలు చంకీ దారాలతో చుట్టి  ఉండగా తను కనిపించలేదు పైగా ఏదో చీర అలా గాలికి కొంగు ఎగిరినట్టు అనిపించడంతో  అవాక్కయ్యాడు ప్రభ.

"అమ్మాయే కాదు తనతో పాటు మరొకరు ఎవరో ఉన్నట్టున్నారు" అనుకుని సంపంగి పూలతో అల్లిన పూల హారం నుంచి చూడాలని అలా  తొంగి చూస్తూ తన చేతి వేళ్ళని పప్పు భుజం మీద పెట్టి అలా తడుతూ ఉంటే  "ఏంట్రా అలా గోక్కుతున్నావ్ సరిగ్గా కూర్చోలేవా ఏంటి  "అన్న పప్పు మాటలు కూడా వినిపించుకోలేదు. 

ఈసారి ప్రభ పూలదడ గురించి ఆలోచించకుండా తనని చూడాలని పూలదండని కాస్త వెడల్పు  చేయగా వదులుగా ఉన్న కురులు కాస్త ముఖం మీదకి జరిగిసరికి దండని వెడల్పు చేస్తుంటే గులాబీ తో అల్లిన  పూదండ జారగానే అందులోని పసుపు రంగు గులాబీ ఆమె చెవి దగ్గరికి పడేసరికి అది కాస్త ఒదిగినట్టు అనిపించి ఆ కురలకి చక్కగా అలంకరించినట్టు కనిపిస్తోంది. ఆ నిరీక్షణని  తాళలేక  "ఓ !  కుసుమ కుమారి నాతో దోబూచులాడుతున్నావా నాతో ఇలాంటి ఆటలు ఆడాల్సింది ఇప్పుడు కాదు. చామంతి పూబంతి మీరైనా చెప్పండి అంటూ దీనంగా చూస్తూ ఉండగా చీర కట్టిన లేడీ కిందికి  వంగుతుంది.

నిలబడిన అమ్మాయి తన కుడి చేతి వేళ్ళతో  ముంగురులని సవరిస్తూ ఉండగా  కొంచెం కొంచెం గా కనిపిస్తున్న ఆ అమ్మాయి ముఖాన్ని చూస్తూ"సంపెంగ పువ్వు లాంటి ముక్కు, లేత గులాబీ రేకుల్ని పరచినట్టున్న పెదవులు, మందార పూరకు అంచు లా వున్న  బుల్లి గడ్డం అంటూ తన చూపుని కాస్త ఆమె కళ్ళ వైపు పోనిస్తూ వికసిస్తున్న సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఆ కళ్ళు, వాటికి వక్రంగా తిరిగిన పువ్వు తొడిమ లాంటి కనుబొమ్మలు "  వావ్ యువర్ లైక్ ఎ బ్లూమింగ్ ఫ్లవర్ " అనుకుంటూ ఆ అమ్మాయి ముఖాన్ని పూర్తిగా చూడగానే స్వర్గంలో తేలినట్టు అవుతుంది. ఆ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. అంతలో పూలమ్మ వ్యక్తి ఏదో అడిగితే తను చిరునవ్వుతో సమాధానం చెబుతూ ఉండగా ఆ క్షణం తన నుంచి ఒక కవి నిద్రలేచి"సౌగంధిక  పరిమళాలు వెదజల్లే అందమైన  పూదోటలో  మకరందాన్ని వెదజల్లుతూ  ప్రియ సఖులు తమ పూరేకులని ఆసనoగా మలచి ఆహ్వానిస్తుంటే పువ్వుల రాణి అందాల రోజా మన్మధుని ఆకర్షించినట్టు ,కలువలా వికసించిన నీ నవ్వు నా హృదయ తలాన్ని ఆక్రమించింది.*ఎదలోతులో కూరుకుపోయిన ఈయన ప్రేమకి ఎప్పుడు చిగురు తొడుగుతావో! ఆ ప్రేమ ఎప్పుడు పువ్వులా వికసిస్తుందో! అంటూ కవిత అల్లుతూ పూలదండని దగ్గరగా జరిపి" మై స్వీట్ హార్ట్ నీ నవ్వులో ఏదో లాజిక్కు ఉంది. ఎందుకో తెలుసా నీ పెదవులు హృదయకాలంలో ఉండి ఆ నవ్వు ప్రేమకు చిహ్నమేమో అనిపిస్తుంది పోనీలే నీవు నీ బాధ నుంచి బయటికి వచ్చి సంతోషంగా ఉన్నావు అనిపిస్తోంది అంతే చాలు అని మనసులో అనుకొని మరొక్కసారి తనని చూడాలని అలా ముందుకి జరుగుతూ ఉంటే "వీడేంటి కుదరగా కూర్చోకుండా బండిని ఇలా కదుపుతున్నాడు "అనుకొని ప్రభను గమనించగా ఓహో మేటర్ అదన్నమాట అని అనుకుంటూ ఉండగానే ప్రభ పట్టుకున్న పూలదండ దారం తెగి కింద పడుతుంది. అది గమనించిన పూలమ్మ వ్యక్తి వెంటనే ఇటు తిరిగి ఎవరు అరే పూలదండలు దారం తెగినట్టు ఉంటే పూలన్నీ కింద పడిపోతున్నాయి అసలు ఎవరు దారం తెంచింది నా భార్య రాత్రి 12 గంటల వరకు కష్టపడి ఈ దండాలని తయారు చేసింది అని అంటూ ఉండగానే "ఎవడ్రా అది "అంటూ జేజి ఇటువైపు వచ్చేసరికి ఎదురుగా ప్రభా, పప్పులు కనిపిస్తారు. జేజి నీ చూసిన ప్రభ నేను కాదన్నట్టు తల ఊపడంతో పప్పు ని చూస్తూ " ఈ పని చేసింది మాత్రం తప్పకుండా వీడే అయి ఉంటాడు ముందు డబ్బులు వసూలు చేయి" అని చెబుతూ ఉంటే ప్రభావైపు చూస్తాడు పప్పు. 

ఏంట్రా ఆలోచిస్తున్నావ్ దండని పట్టుకున్నది నేనే అయినా ....'అని ప్రభ ఇంకా ఏదో చెప్పబోతుంటే "అరే ! దండను పట్టుకున్నంత మాత్రాన దారం తెగిపోతుందా ఎవరో కావాలని లాగితేనే పుట్టుకమని ఉంటుంది "అంటూ మరొకసారి పప్పును చూసేసరికి ఏరా అన్నట్టు కంటి చూపుతో అడుగుతాడు ప్రభ .

"అమ్మ  ! ముసలి ఎంత కరెక్టుగా చెబుతున్నావే నువ్వు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేంత ముసలి దానివి "అని వైపు చూస్తూ ఉంటే" ఏంట్రా ఆలోచిస్తున్నావ్ నీ మౌనమే చెప్తుంది కదా అర్ధాంగికారమని ముందు బండి దిగరా" అని జేజి కాస్త గట్టిగానే చెప్పేసరికి పప్పు బండి దిగుతాడు.

నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా ఏదో ఒకటి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటావు .సరే ఆ దండ కి.... అని ప్రభా దండ కు ఎంత వెల అని అడగబోతుంటే "వద్దులే బాబు ఆ వెధవకి బుద్ధి చెప్పు నేను సరిచేసి ఇస్తానని" తెగిన దారం కాస్త కట్టి సరిచేసి ఇచ్చేసరికి థాంక్స్ జేజి అని చెప్పి ఇద్దరూ బయలుదేరుతూ రే నువ్వు వెనక్కి కూర్చో ఈసారి బండిని నేను నడుపుతాను అని ప్రభ కూర్చోబోతాడు.

నాయనా ! ప్రభ నువ్వు ముందరకి కూర్చుంటే ఆ అమ్మాయి కి రిటన్ లుక్  ఎవరిస్తారబ్బా అలుక్కు లేకపోతే కిక్ ఉండదు కాబట్టి నువ్వు వెనక్కి కూర్చో నేను రైడ్ చేస్తానని ముందు కూర్చుంటాడు. 

ఆ మాటలు విన్న ప్రభ నీకు పప్పు  అన్న పేరును ఎవరో తెలియక పెట్టారు నీకు చాలా తెలుసురా అంటూ ప్రభావ వెనక్కి కూర్చుంటూ ఉండగా తీసుకున్న మల్లెపూలు ముందర హ్యాండిల్ కి తగిలిస్తూ ఆంటీ ఆశించడం మల్లెపూలు ఎంత కథ నడిపాయి అని తనలోనే నవ్వుకుంటూ పప్పు బండిని స్టార్ట్ చేస్తాడు.

పూలమ్మే వ్యక్తి బండిని పక్కకు తోసుకు వెళుతూ ఉండగా "  గీతిక" అని జేజే పిలవడంతో అటు తిరుగుతుంది. 

గీతిక నాది మీ తాత ఏది డ్రాయింగ్ వేసినది ఎవరో తెలుసా అదిగో ఆ బండిలో వెనక కూర్చున్నాడు చూడు ఆ అబ్బాయి అని చూపుడువేలుతో అలా చూపిస్తూ ఉంటే గీతిక ఆటు చూస్తూ ఉండగానే ప్రభ వెనక్కి తిరుగుతాడు. అంతలోగేది కాదు తన కాలికి ఏదో  తగిలినట్టు అవడంతో కాస్త వంగుతుంది. అది గమనించిన పప్పు" బాగుంది వన్ సైడ్ లవ్ "అని కాస్త ప్రభకి వినపడేలాగే అంటాడు. 

"ఏరా ఏదో అన్నావ్ "అని ప్రభా పప్పు భుజం మీద చేయి వేసి అడుగుతుంటే బహుశా వినపడలేదేమో అనుకొని అదేరా నువ్వు పూల మీద కవితలు ఎంత బాగా చెబుతున్నావు నీలో కవి కూడా ఉన్నాడా అనిపించింది 

అవును గుర్తొచ్చింది ఎందుకు నువ్వు పూలదండ దారాన్ని తెంచావు పట్టుకున్నది నేను కదా అడిగాడు ప్రభు సందేహంగా 

మరి నువ్వు  పూబంతి,చేమంతి అంటూ కవితలు చెబుతూ ఉంటే వాళ్ల అక్కడినుంచి పూలు తీసుకుని వెళ్ళిపోతారు అప్పుడు నువ్వెలా చూస్తావు అందుకే ఆధారాన్ని తెంచేసాను.

ఏమో అనుకున్నాను రా నీకు చాలానే నీ అని ప్రభ ఇంక ఏదో చెప్పబోతుంటే  " అరే మనం మన రూమ్ గేటు దగ్గర ఉన్నాము ముందు లోపలికి వెళ్దాం పద" అంటూ ఇద్దరు బండి దిగి లోపలికి వెళ్తారు.

అలా బెడ్ మీద వాలిన ప్రభ కి గీతిక గుర్తుకొస్తుంది. మై స్వీట్ హార్ట్ తాతయ్య ఈ గార్డెన్ హౌస్ లో ఉన్న అమ్మాయి బాధగా ఉంది తను చాలా డల్ గా ఉంది అని చెప్పినప్పుడు నువ్వే ఉండొచ్చు అని నాకు అనిపించింది ఎందుకంటే సంక్రాంతి సంబరాలకు చరితక్క ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్న చూసిన తర్వాత అక్క నాకు నీ గురించి కొన్ని విషయాలు చెప్పింది. నీ పేరు ప్రియ గీతికా అని నారాయణ కు కన్న కూతురివి కాదని నిన్ను పెంచుకున్నారని అలాగే ఆ ఇంట్లో నీ పిన్ని గురించి కూడా కొన్ని విషయాలు నాతో చెప్పింది. ఎలాగో ఆ ఇంటి నుంచి ప్రకృతి లాంటి ఈ గార్డెన్ హౌస్ కి వచ్చావు పైగా జేజి తాతయ్యలు కూడా తోడుగా ఉన్నారు నువ్వు ఎప్పుడు దిగులు పడకుండా సంతోషంగా ఉండాలి అందుకే నేను తాతయ్య జేజేలు డ్రాయింగ్ వేసి ఇచ్చాను ఇంకెప్పుడూ నిన్ను సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను అంటూ గుర్తు చేసుకుంటాడు ప్రభ .

జేజి గీతికలిద్దరూ వస్తూ ఉండగా నువ్వు పని చేసి చోట ఇబ్బంది అయితే ఏమీ లేదు కదమ్మా అని జేజే అడిగిన దానికి లేదంటూ సమాధానం ఇస్తుంది గీతిక. 

తన గదికి వెళ్లన తర్వాత జేజి తాతయ్యల డ్రాయింగ్ వేసి ఇచ్చిన వ్యక్తిని చూపించింది. అతను ఆ డ్రాయింగ్ ని ఎందుకలా వేశాడు. ఇంతకీ అతనికి డ్రాయింగ్ వచ్చా లేదా వచ్చి అలా వేశాడు ఇంతకీ తాతయ్య జేజీలకు అతని ఎలా పరిచయం తను ఎక్కడ ఉంటాడు అన్న ప్రశ్నలు మధ్యలో మెదిలిన అరే నేనెందుకు వేరే వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను అతను ఎవరైతే నాకేంటి నేను నేను అనుకున్నది సాధించాలి అనుకొని తనే కంప్యూటర్ని ఓపెన్ చేసి డెమో వీడియో తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసేసరికి గీతిక వెల్డన్ అని కంప్యూటర్  మూసివేసినిద్ర ముంచుకొచ్చేసరికి బెడ్ మీద వాలుతుంది. 

కుసుమ కమారి అలా రావా నా దరికి అంటూ ప్రభ చేతులు చాస్తూ ఉండగా మెలకువ వచ్చిన పప్పు కళ్ళు తెరిచి చూసి ఇదేంటి వీడు ప్రేమ ముదురులా మారిపోయాడు అయినా కాలేజీ లైఫ్ లో  ఏ అమ్మాయిని తను కన్నెత్తి కూడా చూడలేదు పాపం అమ్మాయి అంటే తనకు ఇష్టం లా ఉంది తన దొరకాలి సుమా అని తనలోని నవ్వుకుంటూ పక్కన ఉన్న మరొక బెడ్ పైకి వెళతాడు.