Read Ventaade Needalu - 12 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 12

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • మైత్రి వనం - 4

    ఎపిసోడ్ 4: పితృ హృదయం – రహస్య సొరంగం!   భాగం 1: అలకనంద నిష్క...

  • వెంటాడే నీడలు - 11

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 15

    Part - 15సమయం - ఉదయం 10:30 గంటలుమోరీస్పేట, తెనాలి.ఒక టీ కొట్...

  • మైత్రి వనం - 3

    ఎపిసోడ్ 3: రహస్య వ్యూహం - సవతి చూపుల కరకుదనం!భాగం 1: మహారాజు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 12

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

సమీర అలా మాట్లాడుతూ ఉంటే, తన కుడిచేతిని అలాగే తన పిరుదుల వరకూ దింపాడు అరవింద్. ఆ పిరుదులని అలాగే తన కుడిచేత్తో మసాజ్ చేస్తూ, ఆ నున్నదానాన్ని అనుభవిస్తూ అన్నాడు. "ఎస్, ఆ భుజంగరావు తో నాకూ బిజినెస్ రిలేషన్స్ వున్నాయి. మాకిద్దరికీ పరిచయం వుంది."

"ఆ విషయమూ నాకు తెలుసును. ఒకసారి నువ్వు చెప్పావు." నవ్వింది సమీర.

"కానీ అతనికి ఒక అమ్మాయి ఉందని నాకు తెలియదు. అందులోనూ ఆమె ఎదో సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతూండడం ఆశ్చర్యంగానే వుంది."

"ఈ సైకలాజికల్ ప్రొబ్లెమ్స్ ఎవరికన్నా రావచ్చును. ఫిజికల్ డిసీజెస్ ఎంత కామనో ఇవీ అంత కామన్." అన్నాక అరవింద్ పెదవుల మీద ముద్దుపెట్టుకుంది సమీర. "గుడ్ నైట్. తక్కిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నాకు నిద్రవస్తూంది." అని అరవింద్ ని గట్టిగా కౌగలించుకుని కళ్ళు మూసుకుంది.

సమీర పిరుదుల నున్నదనాన్ని అలా కుడిచేత్తో అనుభవిస్తూన్న క్రమంలో, ఇంకా నగ్నంగా వున్న తన శరీరం తన శరీరానికి హత్తుకుని ఉండడం వల్ల తన మగతనం మళ్ళీ బాగా లేచినిలబడింది. మరొకసారి తన మీదకి ఎక్కి కోరిక తీర్చుకోవాలనిపించింది. కానీ తను వేగంగా లేచి, తెమిలి మెంటల్ కేర్ కి వెళ్ళాలి. ఇంకా తమ డెవిల్ లేచిందంటే తనకి ముందే విశ్రాంతి ఉండదు. దీర్ఘంగా నిట్టూర్చి, తన రెండు పిరుదుల మధ్య వున్న కాలువలో తన కుడిచేతిని అదిమి తనూ నిద్రలోకి జారిపోయాడు అరవింద్.

&&&

మాట ఇచ్చినట్టుగానే ఆదివారం ఉదయం పదిగంటలకల్లా భుజంగరావు ఇంటికివెళ్ళింది సమీర. భుజంగరావు ఇంట్లో సమీర ని అందరూ చాలా వార్మ్ గా రిసీవ్ చేసుకున్నారు.

"నా హస్బెండ్ కి మీరు తెలుసును. మీ ఇద్దరికీ బిజినెస్ రిలేషన్షిప్ ఇంకా పరిచయం వుందని అయన చెప్పారు." హాల్లో అందరూ కుర్చీల్లో సెటిల్ అయ్యాక, ఇచ్చిన కాఫీ ని సిప్ చేస్తూ అంది సమీర.

"అరవింద్ గారు నాకూ బాగానే తెలుసును. మా ఇద్దరికీ బిజినెస్ ట్రాన్సక్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ తన వైఫ్ ఒక సైకియాట్రిస్ట్ అని మాత్రం తెలియదు." చిరునవ్వుతో అన్నాడు భుజంగరావు.

"ఇట్స్ ఆల్రైట్." తనూ చిరునవ్వుతో అని అక్కడే వున్న ప్రమీల మొహం లోకి అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ చూస్తూ అంది. "ప్రమీలా నువ్వు నన్ను ఈ రోజు ఇక్కడకి ఇన్వైట్ చేసిన కారణం నీకు గుర్తుందనుకుంటా."

"ఎస్, డాక్టర్. దట్ గర్ల్ ఈజ్ దిస్ గర్ల్." తన పక్కనే కూచున్న సారిక భుజాలచుట్టూ తన కుడిచేతిని వేసి అంది ప్రమీల.

"ఎస్, దట్ అన్ఫార్చునేట్ గర్ల్ ఈజ్ ఐ." చిరునవ్వుతో అంది సారిక. "ప్రస్తుతం సైకలాజికల్ ప్రొబ్లెమ్స్ తో సఫర్ అవుతూ వున్నది నేనే."

"అలాగ ఎప్పుడూ ఆలోచించవలసిన అవసరం లేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అంది సమీర. "బాడీ కి డిసీజెస్ ఎంత నేచురలో, మైండ్ కి డిసార్డర్స్ కూడా అంతే నేచురల్. వాటిని మనం యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా నయం అవుతాయి. వేరే ఏ ఆలోచనా లేకుండా అసలు ప్రోబ్లం ఏమిటో చెప్పు."           

"ముందుగా నేను మాట్లాడడం బావుంటుందనుకుంటా" మాట్లాడటం ప్రారంభిస్తూ అంది మాలతి. "చిన్నప్పటినుండీ తన బిహేవియర్ లో కొంచెం అబ్నార్మాలిటీ వుంది. ఉన్నట్టుండి ఒకోసారి చాలా మూడీ గా అయిపోతుంది. చాలా కోపం తెచ్చుకుంటుంది." అంటూ ఆగింది.

నవ్వింది సమీర. "ఇది సైకలాజికల్ డిజార్డర్ అనలేం. కొంతమందిలో బిహేవియర్ అలా ఉంటూ ఉంటుంది."

"నేనింకా మీకు పూర్తిగా చెప్పలేదు. ఒకోసారి తను సడన్ గా తనకి ఊపిరి ఆడటం లేదు, చాలా సఫోకేటింగ్ గా ఉందంటుంది. అలాంటి  సెన్సేషన్ తనకి ఒక నిముషం అలా ఉంటూ ఉంటుంది."

"ఇది కొంచెం స్లీప్ పెరాలిసిస్ లా వుంది. ఇది కూడా కొంతమంది పేస్ చేసేదే. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు."

"ఈ   స్లీప్ పెరాలిసిస్ ఏమిటి?" ఆశ్చర్యంగా అన్నాడు వంశీ. "నేను మొదటిసారిగా వింటున్నాను."

"అది మనం నిద్ర ఇంకా మెలకువ బోర్డర్ లో వున్నప్పుడు వస్తూంటుంది. అందరూ ఇది పేస్ చేయకపోవచ్చు, కానీ కొంతమంది అనుభవం లో ఉంటుంది. అప్పుడు మనం మన బాడీని అసలు కదపలేము. చాలా అన్-కంఫర్టబుల్ గా ఉంటుంది."

"అలా ఎందుకు జరుగుతుంది?"

"కొన్ని సమయాల్లో  మన మైండ్ కి ముందుగా మెలకువ వస్తుంది, కానీ బాడీ కి రాదు. అటువంటి సమయాల్లో మనకి సరౌండింగ్స్ లో జరుగుతూన్నవి తెలుస్తూ కూడా ఉంటాయి, కానీ మనం మన శరీరాన్ని కదపలేము. ఇదే స్లీప్ పెరాలిసిస్ అంటే." ఎక్ష్ప్లైన్ చేసింది సమీర. "ఇది ముఖ్యంగా తెల్లవారుతూన్న సమయం లో వస్తూవుంటుంది."

"ఇది నాకు తెల్లవారుతూన్న సమయం లోనే వస్తూ ఉంటుంది. బహుశా స్లీప్ పెరాలిసిస్ అయివుండొచ్చు." సారిక అంది

"ఇంకేమన్నా తన బిహేవియర్ లో అబ్నార్మాలిటీ ఉందా?"

"తను అప్పుడప్పుడు ఒంటె తలతో వున్న న్యూడ్ మగమనిషి బొమ్మ గీస్తూ ఉంటుంది. తనేమీ ఆర్టిస్ట్ కాదు, బొమ్మలు గియ్యాలన్న ఆసక్తి కూడా తనకి లేదు. కానీ అప్పుడప్పుడు ఆ ఒక్క బొమ్మ మాత్రం గీస్తూ ఉంటుంది."

"నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ బొమ్మ గీస్తాను." సారిక అంది.

"నీకు ఎందుకు ఆ బొమ్మ గియ్యాలనిపిస్తుంది? అది గీసేముందు నీకేమన్నా ఫీలింగ్ ఉంటుందా?" సమీర అడిగింది.

"లేదు. సడన్ గా నన్నేదో ఆవహించినట్టుగా అవుతుంది. దానితో పేపర్, పెన్ను తీసుకుని నేనా బొమ్మ గీస్తాను."

"అలా గీసిన ఆ బొమ్మలేమన్నాదాచివుంచావా?"

"లేదు. గీసిన తరువాత చూసుకుంటే నాకు అవి చాలా ఏవగింపుగా అనిపిస్తాయి. సో, వాటిని ఎప్పటికప్పుడు చింపి పారేస్తాను." సారిక అంది.

"కానీ ఇప్పటినుండి అలా చెయ్యకు. ఆ బొమ్మ మళ్ళీ అలా గీస్తే దాచివుంచు. నాకవి చూపించు. మనకేదన్నా క్లూ దొరికే అవకాశం వుంది." సమీర సజెస్ట్ చేసింది.

"ఒకే డాక్టర్. అలాగే చేస్తాను." అంగీకరించింది సారిక.

దీర్ఘం గా నిట్టూర్చి నవ్వింది సమీర. "ఇప్పటివరకూ విన్న వాటిల్లో ఒక్క ఈ ఒంటె తల మనిషి బొమ్మ మాత్రమే అర్ధం చేసుకోవడానికి కాస్త టిపికల్ గా వుంది. ఎనీ హౌ ఇవేవీ కూడా తను ఒక సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతోంది అని చెప్పేంత పెద్దగా లేవు."  

"డాక్టర్ సమీరా, నా కూతురు లో అబ్నార్మాలిటీ కేవలం ఇవి మాత్రమే అయితే మిమ్మల్ని ఈ రోజు ఇలా మేము ఇబ్బంది పెట్టి వుండేవాళ్ళమే కాదు. అసలు చెప్పవలసిన ముఖ్యవిషయాలు ఇంకా చెప్పలేదు మేము." భుజంగరావు అలా అన్నాక ఎలా సారిక మాలతిని, ఓబులేసు ని చంపడానికి ట్రై చేసిందో వివరంగా చెప్పాడు.

"అలా నేనెందుకు బిహేవ్ చేసానో నాకస్సలు బోధపడడం లేదు. ఆ సమయం లో నన్నేదో ఆవహించినట్టుగా అయింది. ఎదో నిద్రలో చేసినట్టుగా వుంది." విచారం, ఆశ్చర్యం నిండిన మొహంతో అంది సారిక.

"ఆ సమయం లో నా కూతురు బలం చాలా విపరీతంగా వుంది. నేనెంత ప్రయత్నించినా తన పట్టునుండి విడిపించుకోలేకపోయాను. ఎదో కారణం వాళ్ళ తను ఆ స్పెల్ నుండి బయటకి రావడం వల్ల నేను బతికి బయటపడ్డాను కానీ లేకపోతె తన చేతుల్లో చచ్చేదాన్ని. ఓబులేసు కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసాడు." భయం నిండిన మొహం తో అంది మాలతి.

"ఆ ఓబులేసు చాలా కాలంగా, తను పుట్టడానికి ఇంచుమించులో పాతిక సంవత్సరాల ముందునుండీ పనిచేస్తూవున్నాడు. తనకి సారిక అంటే చాలా అభిమానం." భుజంగరావు అన్నాడు.

"నిజానికి నేనేం అడిగినా, కావాలన్నా కూడా చేస్తుంటాడు. అలాంటి వాడిని నేను ఎందుకు చంపాలనుకున్నానో బోధపడడం లేదు." విచారం గా అంది సారిక. "నన్ను ప్రేమించి, అభిమానించే వాళ్ళని నేనేందుకు టార్గెట్ చేస్తున్నాను?"

"అన్నిటికన్నా మా భయం.........." ఒక భయం తో నిండిన ఎక్స్ప్రెషన్ తో అంది మాలతి. "............ మాకయితే చనిపోతామేమోనని భయం లేదు. కానీ తను మమ్మల్నెవరినన్నాచంపి జైలు కెల్తుందేమోనని."

ఎందుకనో నవ్వకుండా వుండలేకపోయింది సమీర. "సారీ. ఎనీహౌ మీరలా భయపడడం లో తప్పులేదు."

"డాక్టర్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? సారిక మరోసారి అలా బిహేవ్ చెయ్యదని గ్యారంటీ లేదు. ఈ సారి ఎవర్ని టార్గెట్ చేస్తుందో కూడా చెప్పలేం. తను ప్రతిరోజూ కాలేజ్ కి కూడా వెళుతూ వుంది." ప్రమీల కూడా భయం గా అంది.

"ఎస్, డాక్టర్. మీరెలాంటి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేసినా తప్పులేదు. కానీ నేను ఈ డిజార్డర్ నుండి బయటపడాలి. లేకపోతె నేనెవర్ని చంపి జైలు కెళ్తానో అని నాకూ భయంగానే వుంది." సారిక మొహం కూడా భయం తో నిండింది.

"నిన్ను ట్రీట్ చెయ్యాలి అంటే నువ్వే డిజార్డర్ తో సఫర్ అవుతున్నావు అన్నది ముందు ఐడెంటిఫై చేయగలగాలి." సాలోచనగా అంది సారిక.

"ఇది స్ప్లిట్ పెర్సనాలిటీ కాదంటారా?" ప్రమీల అడిగింది.

"కాస్త డిఫెరెంట్ బిహేవియర్ వున్నప్రతీదాన్నీ మనం స్ప్లిట్ పెర్సనాలిటీ కింద బ్రాండ్ చెయ్యలేం. ఇంకొంచెం లోతుకి వెళ్లి మనం ఒక అవగాహనకి రావాలి." సమీర అంది. "ఇది కాక ఇప్పటివరకూ మీరు చెప్పిన తన అబ్నార్మల్ బిహేవియర్ దీనితో కనెక్ట్ చెయ్యకపోతే మరీ సీరియస్ గా తీసుకోవలసిన విషయం కాదు. కానీ ఈ బిహేవియర్ కి ఆ బిహేవియర్ కి ఏదో ఒక కనెక్షన్ ఉందనిపిస్తోంది."

"మీరు నా డాటర్ని ఎలాగన్నా పూర్తి నార్మల్ గా చెయ్యండి. అందుకు ఎంత ఖర్చయినా పర్లేదు." భుజంగరావు వేడుకోలుగా అన్నాడు.

"ఈ విషయమై మీరు ఆదుర్దా పడకండి. మీ డాటర్నిపూర్తి నార్మల్ గా చేస్తాను." హామీ ఇచ్చింది సమీర.

"నేను ఈ విషయమై మీ మెంటల్ కేర్ లో కొన్ని రోజులు ఉండాల్సివచ్చినా కూడా అభ్యంతరం లేదు. కానీ ఈ అబ్నార్మల్ బిహేవియర్ నుండి నేను బయటపడాలి." సారిక అంది.

"ఇక్కడ బాగా సంతోషించాల్సిన విషయం నువ్వు నీ  అబ్నార్మల్ బిహేవియర్ ని ఎకనాలెడ్జ్ చేసావు, అందులోనుండి బయటపడాలని ధృడ సంకల్పం తో వున్నావ్. ఎక్కడన్నా సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్న వాళ్ళు తాము మానసిక సమస్య తో బాధపడుతున్నామని అంగీకరిస్తే వాళ్ళని క్యూర్ చెయ్యడం తేలికే అవుతుంది." సమీర అంది. "నేను ఈ విషయాన్ని నా సీనియర్ తో కూడా డిస్కస్ చేసాక తనకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నవిషయం లో ఒక నిర్ణయానికి రాగలను. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ విషయం నేను నా సీనియర్ తో మాట్లాడి మేం ఏం డిసైడ్ చేశామన్నది మీకు చెప్తాను, ఇంక నేను వెళ్ళిరానా?" వెళ్ళడానికి సిద్ధపడుతూ అడిగింది సమీర.

"ఈ రోజు మీరు మా ఇంట్లో భోజనం చేసివెళ్లాలన్నది మా కోరిక." మాలతి అంది.

"మరెప్పుడైనా. ఈ రోజు మాత్రం కాదు, ప్లీజ్." అంటూ కుర్చీలోనుండి లేచింది సమీర.

ఇంక సమీర ని బలవంతపెట్టడం ఇష్టం లేక ఊరుకుంది మాలతి. సమీర తో పాటుగా అందరూ లేచినిలబడ్డారు.

"డాక్టర్ సమీరా, మీరేమనుకోకపోతే నేను మీతో పర్సనల్ గా చెప్పాల్సిన విషయం ఒకటివుంది." కొంచెం అనీజీ ఎక్స్ప్రెషన్ తో అంది సారిక.    

"ఓహ్, స్యూర్. తప్పకుండా. మనం ఎక్కడ మాట్లాడుకుందాం?" ఆసక్తిగా అడిగింది సమీర.

"నా రూమ్ లో." అంటూ అక్కడనుండి నడిచింది సారిక.

అక్కడ అందరికీ సారిక ఏం మాట్లాడబోతూందో అర్ధం కాకపోయినా, ప్రమీల మాత్రం కొంచెం వూహించగలిగింది.      

&&&

"నా ప్రెజెంట్ సిట్యుయేషన్ తో దీనికి ఎమన్నా రిలేషన్షిప్ ఉందేమోనన్న అనుమానం లేకపోతె, నేనిది మీతో షేర్ చేసుకుని ఉండేదాన్ని కాదు." సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలతో చెప్పింది సారిక.

సారిక అక్కడవున్న బెడ్ మీద, సమీర ఆమెకి అపోజిట్ లో వున్నఛైర్లో సెటిల్ అయ్యాక, అనీజీగా ఫీలవుతూనే తను సెక్స్ లో తన బాయ్ ఫ్రెండ్స్ తో పార్టిసిపేట్ చేద్దామనుకున్నప్పుడు చివరివరకూ వచ్చాక ఎలా అక్కడనుండి వచ్చేసిందో, అందుకు కారణమేమిటో వివరంగా చెప్పింది.

"ఇదేదో ట్రెడిషనల్ ఫ్యామిలీ లో పెరగడం వల్ల చివరిలో సడన్ గా వచ్చిన మోరల్ కాన్షస్నెస్ వల్ల అయితే మాత్రం కాదు. అసలు ఆ మూమెంట్ వరకూ సెక్స్ పట్ల ఎలాంటి వ్యతిరేకమైన ఫీలింగ్ లేకుండా జస్ట్ ఇట్స్ ఏ నార్మల్ థింగ్ అన్నట్టుగా వుంటాను. మా ఇద్దరికీ వుండే లిటిల్ ఫోర్ ప్లే లో కూడా నాకు ఏమీ నెగటివ్ ఫీలింగ్ లేకుండా ఎంజాయ్ చేస్తాను. కానీ జస్ట్ ఆ మేజర్ థింగ్ వరకూ వచ్చేసరికి, ఎవరో నాతో బలంగా 'వద్దు, వద్దు' అని అరిచిచెప్తూన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడనుండి పారిపోయి వచ్చేస్తాను. ఇలా త్రీ టైమ్స్ నాకు జరిగింది."   

"ఇట్స్ సమ్థింగ్ ఇంటరెస్టింగ్! ఈ రోజుల్లో యూత్ మధ్య సెక్స్ మరీ అంత అన్కామన్ ఏమీ కాదు. ఫోర్ ప్లే టైం లో కూడా నీకు ఏమీ అనిపించకుండా, జస్ట్ ఆ మూమెంట్ లోనే అలా అనిపించి అక్కడనుండి వచ్చేసావంటే.............." కాస్త ఆగింది "........... ఏమైనా నీ లైఫ్ లో ఇలాంటి  అబ్నార్మాలిటీ లేకపోతె ఈ విషయాన్ని కూడా అంత సీరియస్ గా పరిగణించేదాని కాదు. కానీ ఇది కూడా తక్కిన వాటితో ఎమన్నా లింక్ అయి ఉందా అన్నది చూడాలి."

"అలా సెక్స్ లో పాల్గోలేకపోవడం కూడా నాకు చాలా అనీజీగా, అన్కంఫర్టబుల్ గా వుంది. నాలో సెక్సువల్  అర్జ్ చాలా పెరిగిపోయినట్టుగా అనిపిస్తూ వుంది."

"అర్ధం చేసుకోగలను." కుర్చీలోనుండి లేచి అంది సమీర. "బట్ బి రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. త్వరలోనే నిన్ను పూర్తి నార్మల్ గా చేసేస్తాను."

"థాంక్ యు వెరీ మచ్ డాక్టర్." అలా అన్నాక సారిక కూడా బెడ్ మీద నుండి లేచింది.

"నో మెన్షన్" అన్నాక అక్కడనుండి బయటకి నడిచింది సమీర.

సమీర వెనకాలగా నడిచింది సారిక కూడా.     

&&&

"కొన్ని ఇంటిమేట్ విషయాల్ని కూడా తన ట్రీట్మెంట్ కి అవసరమేమోనని చెప్పి సారిక నాతో షేర్ చేసుకుంది. తన డిజార్డర్ నుండి ఎలాగన్నా బయటపడాలని చాలా కోరికగా వుంది. ఇది ఒక మంచి సైన్. త్వరలోనే తన విషయం లో ఏం చేయాలన్నది డిసైడ్ చేసి చెప్తాను." అలా అన్నాక సమీర అక్కడనుండి బయటపడింది.

"ఈవిడ చాలా కాపబుల్. నాకు తెలుసు తను హండ్రెడ్ పెర్సెంట్ మన సారిక ని క్యూర్ చెయ్యగలదు." మళ్ళీ అందరూ కుర్చీల్లో సెటిల్ అయ్యాక అంది ప్రమీల.

"అదే కదా మనందరికీ కావలిసినది. ఆవిడ కాపబుల్ అనే అనిపిస్తూవుంది." భుజంగరావు నవ్వి అన్నాడు. "ఈవిడ తన భర్త ఆ ఇండస్ట్రియలిస్ట్ అరవింద్ అని చెప్పేవరకూ ఆ స్టోరీ నాకు గుర్తుకురాలేదు."

"ఏమిటది?" ఆసక్తిగా అడిగింది సారిక.

"ఈవిడ భర్త అరవింద్ ని ఒక మెంటల్ పేషేంట్ గా వీళ్ళ మెంటల్ కేర్ లోనే జాయిన్ చెయ్యడం జరిగింది. అప్పుడు అతని కేస్ ని ఈవిడకే అప్పగించడం జరిగింది. అతన్ని ఈవిడ క్యూర్ చేసే క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. భార్యాభర్తలు అయ్యారు."

"అదొక పెద్ద కధ." అంటూ అదంతా వివరంగా చెప్పాడు భుజంగరావు. "అసలు ఆ అరవింద్ అమ్మగారు తమ ఇంట్లో అంతకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న సర్వెంట్ ని కాల్చి చంపి, తననీ ఎందుకు కాల్చుకుందో ఎవరికీ తెలీదు. ఆ కుటుంబం విషయం లో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నలు చాలానే వున్నాయి."

"ఆ ప్రశ్నలు వాటికీ సమాధానాలు కాదు మనకి కావల్సినది." నిట్టూరుస్తూ అంది మాలతి. "మన సారిక పూర్తిగా క్యూర్ కావడం కావాలి."         

"ఖచ్చితంగా అదెలాగూ జరుగుతుంది, మీరనవసరంగా ఆందోళనపడకండి." ప్రమీల అంది.

తరువాత మరికొంత సేపు మాట్లాడుకున్నాక అక్కడనుండి అందరూ డిస్బర్స్ అయ్యారు. 

&&&

"మీతో కూడా డిస్కస్ చేసాక తన విషయం లో ఏం చేద్దామన్నది చెప్తానని చెప్పాను." నిరంజన్ ఛాంబర్ లో సారిక గురించి అంతా వివరించి చెప్పక, ఆఖర్లో సమీర అంది. 

"ఇప్పుడు వాళ్ళ భయమల్లా తను మరోసారి ఇంకెవరిమీదన్న మర్డర్ అటెంప్ట్ చేసి ఈసారి నిజంగానే చంపేస్తుందేమోనని, అవునా?" నిరంజన్ అడిగాడు.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)