Read Ventaade Needalu - 3 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 3

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"తను అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూంది. ఇలా ఒక మనిషి మీద డెడ్లీ అటాక్ చెయ్యడం ఇదే మొదటిసారి. మళ్ళీ ఇప్పట్లో ఇలా చేయకపోవచ్చు. నేనూ నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ లతో అలోచించి చూస్తాను. ఇప్పట్లో, మనమంతా మరోసారి ఆలోచించకుండా ఈ విషయాల్ని తన దృష్టికి తీసుకెళ్లొద్దు." భుజంగరావు అన్నాడు. "నువ్వు చెప్పినట్టుగా శ్రవణ్ ఒకసారి ప్రమీల తో కదిపి చూస్తే మంచిది. ఎంత కాదన్నా తాను సైకాలజీ తో ఎం . ఏ. చేస్తూంది కదా ."     

"నా అభిప్రాయమూ అదే. అవసరమైనప్పుడు అప్పుడప్పుడు తనెలా ఆడ్ గా బిహేవ్ చేస్తూంది తనకి చెప్దాము. ప్రస్తుతానికి కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం." మాలతి అంది.

అప్పుడు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా, తక్కిన అందరూ కొంతసేపు నిశబ్దంగా ఉండిపోయారు. ఆ నిశబ్దాన్ని బ్రేక్ చేస్తూ మళ్ళీ మాలతే అంది. "అలా బిహేవ్ చేసి మళ్ళీ తనకేం తెలియనట్టుగా నార్మల్ గా బిహేవ్ చేస్తూంది. అలా నన్ను చంపబోయింది. ఆ స్పెల్ ఎదో వదిలేసి మామూలుగా అయింది. అప్పుడు 'మామ్ ఏం జరిగింది? ఎందుకలా వున్నావ్?' అని అడిగింది.

"అప్పుడు నువ్వు 'ఏం లేదమ్మా. మెడ దగ్గర ఏదో పట్టినట్టుగా వుంటే ఇలా రుద్దుకుంటున్నాను’ అన్నావు. ఇది ఆల్రెడీ ఒకటి రెండుసార్లు చెప్పావమ్మా." చిరునవ్వుతో అన్నాడు శ్రవణ్.

"ఇందులో నాకర్ధం కానిది అసలు ఏం జరగనట్టుగా తనెలా ఉండగలిగింది? అసలు అదంతా అంత త్వరగా ఎలా మర్చిపోగలిగింది?" ఆశ్చర్యంగా అంది మాలతి.

"ఇందులో మర్చిపోవడం అంటూ ఏమీ లేదు. అసలు ఆ సమయం లో తనేం చేస్తూందో తనకి తెలీలేదు. దయ్యం పట్టినవాళ్లు చూడు ఏదేదో చేస్తూవుంటారు, కానీ వాళ్ళు చేసింది ఆ తరువాత వాళ్ళకి గుర్తుండదు." వంశీ అన్నాడు.

"అంటే తనకి ఎదో దయ్యం పట్టి ఆలా బిహేవ్ చేసిందంటావా?" మాలతి అడిగింది.

"నేనేదో ఉదాహరణకి చెప్పాను మామ్. ఈ రోజుల్లో దయ్యాలు, భూతాలు ఏమిటి? తానేదో చిన్న సైకలాజికల్ డిసార్డర్ తో సఫర్ అవుతూంది. అంతే." వంశీ అన్నాడు.

"ఒరేయ్. అదేదో సైకలాజికల్ డిసార్డర్ తో సఫర్ అవుతూంది అనుకునే కన్నా, తనకి దయ్యం పట్టిందనుకోవడమే ఎక్కువ హాయిగా ఉండేలా వుంది." నిట్టూరుస్తూ అంది మాలతి.

"మనకి నచ్చినా నచ్చకపోయినా ఫాక్ట్స్ రిమైన్ ఫాక్ట్స్ . వంశీ అన్నట్టుగా తనేదన్నాసైకాలజికల్ డిసార్డర్ తో  అలా  బిహేవ్ చేస్తూంటే, మనం అది అంగీకరించి పరిష్కారం గురించి ఆలోచించాలి." భుజంగరావు అన్నాడు. "మనం ప్రస్తుతానికి వెయిట్ చేసి చూద్దాం. మళ్ళీ తనిలా బిహేవ్ చేస్తే, అప్పుడు సీరియస్ గా ఒక పరిష్కారం గురించి ఆలోచిద్దాం. ఈలోగా శ్రవణ్ ప్రమీల తో మాట్లాడతాడు ఈ విషయం గురించి. "

అది అందరికీ నచ్చినట్టుగా అనిపించి, ఇంక ఆ విషయం గురించి ఆలోచించడం మానేశారు. కాసేపు వేరే విషయాలగురించి మాట్లాడుకున్నాక అక్కడనుండి లేచారు.

&&&

"సారిక నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను తన గురించనే నిన్ను పెళ్లిచేసుకున్నాను. లేకపోతె నువ్వంత వెంటపడ్డా నిన్ను పెళ్ళిచేసుకుని వుండే ఉద్దేశం నాకు లేదు. అసలు నీలా రఫ్ గా కాకుండా, బాగా సాఫ్ట్ గా వుండేవాళ్ళని పెళ్ళిచేసుకోవాలని నా ఆలోచన." ఆ రోజు రాత్రి బెడ్ రూమ్ లో శ్రవణ్, సారిక ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రమీల అంది.

"సరేలే. చెప్పిన విషయమే ఎన్నిసార్లు చెప్తావు? తన ఫ్రెండ్ గురించే ఇంతగా ఆలోచించే మనిషికన్నావేరే ఎవరినన్నా చేసుకుంటే బావుండేదనే నేనూ ఆలోచిస్తున్నాను."చిరాగ్గా అన్నాడు శ్రవణ్    

"అలా ఆలోచించేలా నిన్ను దేనికి నేను ఇబ్బందిపెట్టాను? ఎప్పుడు ఏది అడిగితె కాదన్నాను? ఇప్పుడు కూడా నీకు కావాల్సినట్టుగా నీ కోరిక తీర్చుకున్నాకే కదా, ఈ ప్రస్తావన ప్రారంభించావ్. మళ్ళీ కావాలంటావేమోనని డ్రెస్ కూడా చేసుకోకుండా ఇలాగె వున్నాను." దుప్పటి మీదకి లాక్కుంటూ అంది ప్రమీల.

"సరేలే నేనేమన్నా కాదన్నానా?" తనూ దుప్పట్లోకి దూరి నగ్నంగా వున్న తన శరీరాన్ని దగ్గరికి లాక్కుంటూ అన్నాడు శ్రవణ్. "నేనూ నీలాగే డ్రెస్ చేసుకోలేదు. పూర్తి న్యూడ్ గానే వున్నాను."

"ఇంకోసారి కావాలంటే త్వరగా పూర్తిచెయ్యి. నాకు నిద్రవస్తూంది. పడుకోవాలి." చెయ్యి అడ్డుపెట్టుకుని ఆవులిస్తూ అంది ప్రమీల.

"అంతేకానీ నీకూ కావాలని మాత్రం అనవు. అసలు ఇది మొదట నాకు నేర్పిందెవరు? నీ పదమూడేళ్ల వయసులో.........."

"అది సరే. నువ్వు నీ చెల్లెలి గురించి ఎదో మాట్లాడబోతూ ఆగావు, ఏమిటది?" శ్రవణ్ వైపు తిరిగి అతని మొహంలోకి చూస్తూ అడిగింది ప్రమీల.

"ఈ రోజంతా తను నీతో ఎలా బిహేవ్ చేసింది? మామూలుగానే ఉందా?"

"ఈ ప్రశ్న నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు." నిట్టూరుస్తూ అంది ప్రమీల. సారిక తన తల్లిని చంపబోయిందనే విషయం ప్రమీల కి కూడా చెప్పాడు శ్రవణ్ "చాలా నార్మల్ గా, అసలు తను రాత్రి అలా బిహేవ్ చేసిందన్న భావన ఏ కోశానా లేకుండా బిహేవ్ చేసింది. నిజానికి.........." కాస్త ఆగి మళ్ళీ అంది ప్రమీల. ".........తను అలా బిహేవ్ చేసినట్టుగా తనకి తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఏదో స్పెల్ లో వుండి అలా బిహేవ్ చేసే వాళ్ళకి, ఆ స్పెల్ నుండి బయటకి వచ్చాక వాళ్ళేం చేసింది వాళ్ళకి గుర్తువుండదు."

"కానీ తను ముందు ముందు కూడా అలా బిహేవ్ చెయ్యదని గ్యారంటీ ఏమిటి? ఈ సారి వేరే ఎవరినన్నా అలా చంపడానికి ట్రై చెయ్యొచ్చు కదా."

అది తననీ ఆలోచనలో పడసినట్టుగా కిందపెదవిని పళ్ళమధ్య బిగించి మౌనంగా ఉండిపోయింది ప్రమీల.

"నువ్వు సైకాలజీ తో ఏం.ఏ . చదువుతున్నావ్. తన సైకాలజీ లో ఏం ప్రాబ్లెమ్ వచ్చి ఇలా బిహేవ్ చేస్తూందో నువ్వు చెప్పలేవా?"

అది విని నవ్వింది ప్రమీల. "అది చెప్పడానికి నా సైకాలజీ నాలెడ్జ్ సరిపోదు. ఎవరన్నా పెద్ద సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలి."

"ఎదో కారణం వల్ల తను మా మామ్ ని ఒకసారి చంపడానికి ట్రై చేసింది. అంతమాత్రానికే తనని ఒక పిచ్చిదన్నట్టుగా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలా?" భృకుటి ముడేసాడు శ్రవణ్.

"బాడీ కి వచ్చినట్టుగానే జబ్బులు మైండ్ కీ వస్తాయి. వాటిని ఇన్ టైం లో క్యూర్ చెయ్యడం అవసరం. లేకపోతె పెద్ద ప్రమాదాలే వచ్చే అవకాశం వుంది."

"అయితే నా సిస్టర్ అంత పెద్ద మెంటల్ డిసీజ్ తో బాధపడుతూందంటావా?" భృకుటి ముడి అలాగే ఉంచి అడిగాడు శ్రవణ్.

ఇంక అలా వుండలేనట్టుగా లేచి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టింది ప్రమీల. "ఒక మనిషిని, అందులోనూ తన కన్నతల్లిని చంపడానికి ప్రయత్నించడం చిన్న విషయం కాదుకదా. ఏదన్నా సైకలాజికల్ ప్రాబ్లెమ్ లేకుండా ఎవరన్నా ఎందుకలా ట్రై చేస్తారు?"

దానికి ఏం మాట్లాడాలో తెలియనట్టుగా మౌనంగా వుండిపోయాడు శ్రవణ్.

"అంతే కాకుండా ఈ అబ్నార్మల్ బిహేవియర్ తనలో మొదటిసారి కాదు. తన చాలా చిన్ననాటినుండీ వుంది. తన నోట్ బుక్ లో ఆ పిచ్చి బొమ్మ గీసేది. టీచర్లు తిట్టేవారు. ఆంటీ కి అంకుల్ కి కంప్లైంట్ చేసేవారు కూడా."

"అవును. ఒంటె తలతో నగ్నంగా వున్న ఒక మగ మనిషి బొమ్మ. తనకేమీ డ్రాయింగ్ మీద ఆసక్తి లేదు. ఆ ఒక్క బొమ్మ తప్ప ఇంకే బొమ్మ గీసేది కాదు. కానీ ఆ ఒక్క బొమ్మ మాత్రం చాలా పెర్ఫెక్ట్ గా గీసేది."  అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుంటూ అన్నాడు శ్రవణ్.

"ఎందుకు ఆ బొమ్మ గీసేదో తనకే తెలిసేది కాదు. అడిగితె అయోమయంగా మొహం పెట్టేది. ఇప్పుడూ ఆ బొమ్మ అప్పుడప్పుడు గీస్తుంది. తరువాత చింపి పారేస్తుంది."

"యు ఆర్ రైట్." ఇంక తనకీ ఆ విషయం మీద మూడ్ పోయినట్టుగా తనూ లేచి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టాడు శ్రవణ్. "అసలు ఒక బొమ్మ అంత పెర్ఫెక్ట్ గా, ఎందుకు వేస్తూందో తనకే తెలీకుండా ఎలా వస్తూందో నాకూ బోధపడ్డం లేదు."

"నేను తనతో కలిసి పెరిగాను, మేమిద్దరం కలిసి ఆడుకున్నాం. చాలా ఇంటిమేట్ గా వున్నాం. మాకిద్దరికీ ఒకళ్ళగురించి ఒకళ్ళకి తెలిసినట్టుగా ఇంకొకళ్ళకి తెలీక పోవచ్చు. చివరికి తన మామ్ కి కూడా." బెడ్ ఎడ్జ్ మీద కూచుంటూ అంది ప్రమీల.

"ఆ విషయం నేనొప్పుకుంటాను." తనూ బెడ్ ఎడ్జ్ మీద, ప్రమీల కి కుడిపక్కన కూచుంటూ అన్నాడు శ్రవణ్.

"అయినా తన బిహేవియర్ మీద కొంచెం కూడా ఐడియా రావడం లేదు. నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టం. అందుకనే సైకాలజీ తో ఎం. ఏ . చదువుతున్నాను. అయినా తన సైకాలజీ ని కొంచెం కూడా అర్ధం చేసుకోలేకపోతున్నాను."

 "అంతగా నువ్వు అర్ధం చేసుకోవడానికి అవకాశం లేకుండా తనేం బిహేవ్ చేసింది?" భృకుటి మూడేసి అడిగాడు శ్రవణ్.

"ఉన్నట్టుండి చాలా కోపంగా మారిపోతూ ఉండేది. ఆ సమయం లో నేను తనతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే చాలా వయొలెంట్ గా బిహేవ్ చేసేది. అందుకని తను  మళ్ళీ నార్మల్ అయి నా దగ్గరికి వచ్చేవరకూ నేను తనదగ్గరికి వెళ్లేదాన్ని కాదు. అలాగే ఒకోసారి 'నాకు ఊపిరి ఆట్టం లేదు, నన్ను కాపాడు కాపాడు' అని అరిచేది. తను మామూలుగా నా పక్కనే ఉండేది. కానీ ఆలా అనేది. నేను అప్పుడు తన భుజాలు పట్టుకుని గట్టిగా ఊపేదాన్ని. అప్పుడు మామూలుగా అయ్యేది."

"ఎస్, ఈ ప్రాబ్లెమ్ తనకి ఇప్పుడు కూడా వుంది. అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట సడన్ గా లేచి నాకు ఊపిరాడ్డం లేదు, కాపాడండి, కాపాడండి అని అరుస్తుంది. మేమెవరమన్నా వెళ్లి సముదాయిస్తే మామూలుగా అవుతుంది." శ్రవణ్ అన్నాడు.  

"నేను చాలా రకాల సైకలాజికల్ ప్రొబ్లెమ్స్ గురించివున్నాను శ్రవణ్. కానీ ఇదెలాంటి  సైకలాజికల్  ప్రోబ్లమో  నాకు బోధపడ్డం లేదు. ఒక పిచిబొమ్మ గీస్తుంది. అప్పుడప్పుడు తనకి ఊపిరాడట్లేదు అంటుంది. ఇప్పుడేమో కన్నతల్లినే చంపడానికి ట్రై చేసింది. ఎక్కడా ఏదీ కనెక్ట్ కావడం లేదు." అయోమయం ఎక్స్ప్రెషన్ తో అంది ప్రమీల.

"నీ సజెషన్ ఏమిటి ఈ విషయం లో?" గట్టిగా నిట్టూర్చి అడిగాడు శ్రవణ్.

"చెప్పలేకపోతున్నా. అప్పుడప్పుడువుండే తన అబ్నార్మల్ బిహేవియర్ ని పక్కనపెట్టేస్తే, తను హండ్రెడ్ పెర్సెంట్ పెర్ఫెక్ట్. తను ఎంత మంచి మార్కులతో ఇప్పటివరకూ పాసవుతూ వచ్చిందో నీకూ తెలుసు. ఒక్క ఈ అబ్నార్మల్ బిహేవియర్ తప్ప, ఫిజికల్ గా తను చాలా హెల్తీ . తనని ఒక పిచ్చిదానిలా భావించి సైకియాట్రిస్ట్ కి చూపించమనే సలహా ఇవ్వలేకపోతున్నాను."

"మా వాళ్లంతా నువ్వు సైకాలజీ తో ఎం ఏ చదువుతున్నావు కదా, నిన్ను అడిగి చూడమన్నారు, ఏదన్న మంచి సలహా ఇస్తావేమోనని. నువ్వు ఇలా అన్నావు." నిరాశ నటిస్తూ చిరునవ్వుతో అన్నాడు శ్రవణ్.

"నా మీద నమ్మకానికి థాంక్స్." నవ్వింది ప్రమీల. "ప్రస్తుతానికి కొంతకాలం వెయిట్ చేసి చూద్దాం. ఇలాంటి ఎక్స్ట్రీమ్ అబ్నార్మల్ బిహేవియర్ మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు ఆలోచిద్దాం."

"ఎక్జాట్ గా మా ఐడియా కూడా ఇదే." అలా  అన్నాక ప్రమీల రెండు బుగ్గల మీద ముద్దుల పెట్టి, తనని బెడ్ మీద వెల్లకిలా చేసి మీదకి ఎక్కిపోయాడు శ్రవణ్. "అనవసరంగా డ్రెస్ చేసుకున్నానన్నమాట." కో-ఆపేరెట్ చేస్తూ అంది ప్రమీల     

&&&

"ఎందుకలా మూడీ గా వున్నావ్ . నువ్వెంతో ఆనందంగా, సంతోషం గా ఉండాల్సిన సమయమిది." ప్రమీల అంది సారిక తో.

"అదే అర్ధం కావట్లేదు ప్రమీ. మొన్న పుట్టినరోజు అయినదగ్గరనుండీ కూడా నాక్కొంచెం చికాగ్గానే వుంది." సారిక అంది.

"అలా ఎందుకని? పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసాయనా? నిజం చెప్పొద్దూ, మన అమ్మాయిల విషయం లో ఈ వయసు పెద్ద ప్రాబ్లమేటిక్  ఇస్స్యూ నే. వయసు పెరిగిపోతూందనే టెన్షన్ ఒకపక్క, పెళ్లి చేసేసుకోమనే పోరు ఇంకోపక్క. మా ఇంట్లో చూసావు కదా. నాకు ఇరవై దాటగానే పెళ్లి చేసేసుకోమని పోరుమొదలుపెట్టి మీ అన్నయ్యని చేసేసుకునే వరకూ ఆగలేదు."

"అయితే ఏం? నీకు నచ్చినవాడినే చేసుకున్నావు కదా." నవ్వి అంది సారిక.

"నేను కాదనడం లేదు. కాకపోతే ఇంకొంతకాలం పెళ్లిచేసుకోకుండా వుండి ఎంజాయ్ చేద్దామనుకున్నాను. పీకల మీద కూచుని పెళ్లిచేసుకుంటావా లేదా అంటే చేసుకోక ఏం చేస్తాను?" కోపంగా అంది ప్రమీల.            

"నీకూ మా అన్నయ్య కి వున్నలాంటి వెసులుబాటు ఉంటేనో , లేకపోతె ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ వుంటేనో తప్ప, అమ్మాయిలూ పెళ్లిగురించి ఆరాటపడతారు కదా." మర్మగర్భంగా నవ్వుతూ అంది సారిక.

"మరి నువ్వు? అలాంటి ఫెసిలిటీ ఏం లేదుకదా మరి, పెళ్లిగురించి ఆరాటపడుతున్నావా?" కళ్ళు చిట్లించి అడిగింది ప్రమీల.

"నీ నుండి ఈ కొశ్చిన్ ఎక్స్పెక్ట్ చేసాను." నవ్వింది సారిక. "నేనూ బిజినెస్ లో పార్టిసిపేట్ చెయ్యాలని డాడ్ కోరిక. అందుకనే డిగ్రీ పూర్తి కాగానే ఎం. బి ఏ చేసి డాడ్ కోరిక తీర్చాలన్నదే నా కోరిక. పెళ్ళివుద్దేశం ఇప్పట్లో లేదు."

"మీ డాడ్ కోరిక తీర్చడానికి పెళ్లిచేసుకోవడం మానేయాలా? నువ్వు బిజినెస్ వ్యవహారాలు చూడకుండా మీ ఆయనేమన్నా అడ్డుపడతాడా? అందులోనూ ఇల్లరికపు అల్లుడినే తెచ్చుకోవాలని మా అందరి కోరిక. ఎప్పుడూ నీతో వుంటాననే కదా నేను నీ బ్రో ని పెళ్లిచేసుకుంది." ప్రమీల అంది.

"ఓహ్, గాడ్! నీలాంటి గొప్ప ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఫ్రెండ్ తో ఉండడం కోసం ఫ్రెండ్ అన్నయ్యని చేసుకునే మొదటి ఫ్రెండ్ వి నువ్వేనేమో. నీ గురించయినా నేను ఇల్లరికం ఉండేవాడిని పెళ్లిచేసుకోవాలి." మరోసారి నవ్వింది సారిక.

"ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివి. నా ఇంట్లో లా నీ ఇంట్లో పెళ్లిచేసుకోమని తినేయడం లేదు." తనూ చిరునవ్వుతో అంది ప్రమీల. "అయినా నువ్వెందుకు గత రెండురోజులుగా ఎదో అప్సెట్ గా వున్నావ్? ఎనీ స్పెషల్ రీజన్?"

"నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నానో నాకే బోధపడడం లేదు. ఏదో అనీజీ గా వుంది. జరగరానిది ఏదో జరుగుతున్నట్టుగా, నేను చెయ్యవలిసినది ఏదో మర్చిపోయినట్టుగా ఒక ఫీలింగ్." కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అంది సారిక.

"ఎక్జాట్ గా ఈ ఫీలింగ్ ఎప్పటినుండి వుంది నీకు?" తనూ కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ అడిగింది ప్రమీల. 

  "నా పుట్టిన రోజు ముందు రోజునుండీ." సాలోచనగా అంది సారిక. "ఆ రోజు నేను, నా మామ్ తన రూమ్ లో కూచుని మాట్లాడుకుంటూ వున్నాం. సడన్గా నాకంతా బ్లాంక్ అయినట్టుగా అయింది. అంటే జస్ట్ లైక్ నేను డీప్ స్లీప్ లోకి వెళ్లినట్టుగా. నేను మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నా మామ్ మొహం లో ఎదో ఆశ్చర్యం, ఇంకా భయం. ఇంకా తన రెండుచేతులు తన మెడ చుట్టూ పెట్టుకుని వుంది. నన్నడిగితే తన మెడ ఎదో పట్టేసినట్టుగా అయిందని, అందువల్ల రబ్ చేసుకుంటున్నానని అంది." కాస్త ఆగింది సారిక. "తరువాత తనే వేరే విషయాలు మాట్లాడుతూ నా మనసు మళ్లించేసింది. నేనూ ఆ విషయం అప్పటికి మర్చిపోయాను. తరువాత బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ములిగిపోయాను. కానీ........" అంటూ ఆగింది.

"ఏంటి చెప్పు? ఏంటా కానీ?" ఎంకరేజ్ చేస్తూ అడిగింది ప్రమీల.

"ఆ రోజు నేను నా సెన్స్ లో లేని కొన్ని నిమిషాలలో నేనేదో చేసాననిపిస్తోంది. నాకు చెప్పడం ఇష్టం లేక నా మామ్ నాకది చెప్పడం లేదేమో అనుకుంటున్నా."

"మరోసారి ఆంటీనే నువ్వా విషయం అడిగితె ఎలా ఉంటుంది?" తను ఆ రోజు ఏం చెయ్యబోయిందో సారిక కి చెప్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ అంది ప్రమీల.

"నేను అప్పుడు చేసినది ఏదన్నా నాకు చెప్తే నేను బాధపడతాననిపిస్తే నా మామ్ నేను ఎన్నిసార్లు అడిగినా అది నాకు చెప్పదు. అడిగి ప్రయోజనం ఉండదు." నిట్టూరుస్తూ అంది సారిక.       

"నువ్వు బాధపడే విధంగా ఎదో చేసివుంటానని నువ్వెందుకు అనుకుంటున్నావు?"   సారిక ఆ రోజు ఏం చేసిందో తొందరపడి చెప్పదలుచుకోలేదు ప్రమీల 

"మొదటినుండి నా జీవితమే ఆలా వుంది. నేనేం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకే బోధపడడం లేదు. ఆ ఒంటె తల తో నగ్నంగా వున్న  మగ  మనిషి బొమ్మ ఎందుకు గీస్తానో నాకే తెలియదు. ఆ చిత్రమైన శబ్దాలు నేనే ఎందుకు వింటానో నాకు తెలియదు. ఉన్నట్టుండి నన్నెవరో భూమిలో పాతేసినట్టుగా, ఊపిరాడనట్టుగా అనిపించి చాలా ఇబ్బంది పడతాను. ఇదంతా ఎందుకు ఇలా? నేను మాత్రమే ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను?" ఆవేదనగా అడిగింది సారిక.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)