Read Ventaade Needalu - 2 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 2

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"మరి వెళ్ళొస్తా." వెనక్కి తిరిగి అక్కడనుండి వెళ్ళబోతూ, అకస్మాత్తుగా సింహరాజు వైపు తిరిగి, కౌగలించుకుని అతని పెదవుల మీద ముద్దుపెట్టుకుంది మల్లిక.

ఆ హఠాత్ సంఘటన కి నివ్వెరపోయాడు సింహరాజు. మల్లిక కి తన మీద అటువంటి భావం వుందని కానీ, అలా చేస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఆ ముద్దు, ఆ కౌగిలి ఎంత బావున్నా, సామమ్మ కి మాత్రం తనతో మల్లిక ప్రేమలో పడ్డం ఇష్టం ఉండదని తనకి బాగా తెలుసు. అందుకనే ఆ పట్టునుండి విడిపించుకుని దూరంగా జరగాలనుకున్నాడు.

కానీ సింహరాజు కి కూడా అలా ఓ కన్నెపిల్ల స్పర్శ అదే మొదటిసారి. ఆమె గుండ్రని వక్షోజాలు బలంగా తన గుండెలకి హత్తుకుంటూవుంటే, సిల్క్ లా మెత్తగా వున్నా ఆమె పెదాల స్పర్శ వేరే లోకంలోకి తీసుకువెళ్తూ వుంది. అందుకనే ఆమె నుండి విడివడ్డానికి బదులు, తనూ ఆమెని కౌగలించుకుని, ఆమె కిందిపెదవిని నోట్లోకి తీసుకుని సున్నితంగా చప్పరించడం మొదలుపెట్టాడు.

అదే సమయం లో తన పెదవిని విడిపించుకుని, సింహరాజు ని దూరంగా నెట్టింది మల్లిక. "అంత దుర్భరంగా వున్నపరిస్థితులలో కూడా ఎందుకో నీ గురించిన ఆలోచన నాకు ఆనందాన్ని ఇచ్చేది. నాకు అర్ధమైంది, నేను నీతో ప్రేమలో వున్నానని. అది వ్యక్తం చెయ్యడానికి మాటలకన్నా ఇలాగ బావుంటుందనిపించింది."

ఆనందంగా నవ్వాడు సింహరాజు. "ఇది ఆ కబుసా నన్ను కరుణించేడు అన్నదానికన్నా కూడా ఎక్కువ ఆనందం ఇస్తూంది. నువ్వు నన్ను ప్రేమిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. ఇంత అందంగా వున్న నువ్వు నాతో ప్రేమలో పడ్డావంటే  అది ఆ కబుసా కరుణే."

"సర్లే చాల్లే. ఇంక నేను వెళ్తాను." వెనక్కి తిరిగి నడవడం ప్రారంభించింది మల్లిక.

"నేనూ నీ కూడా వస్తాను. బాగా చీకటి పడింది." ఇంటికి  తాళం వేసి ఆమెతో పాటుగా నడవడం ప్రారంభించాడు సింహరాజు.

"అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసినందుకు ఒక్క విషయానికి మాత్రమే నాకు బాధగా వుంది." అకస్మాత్తుగా అంది మల్లిక.

"ఏమిటది?" ఆసక్తిగా అడిగాడు సింహరాజు.

"శ్రవణ్ బాబు." ఆగి సింహరాజు మొహం లోకి చూస్తూ అంది. "నాకున్న పనుల్లో ఆ బాబు ని ఆడించడం ఒకటి. నాకు బాగా చేరిక అయ్యాడు. ఎందుకో నా మనసు వాడివైపు బాగానే లాగుతూంది."

"శ్రవణ్ బాబు అంటే నీ సవతి తమ్ముడు అవునా?" నవ్వాడు సింహరాజు. "మరీ వాడిమీద నువ్వంత మమకారంగా ఆలోచించకు. ఇప్పుడు బాగా చిన్నపిల్లాడు. కానీ పెద్దయ్యాక వాడూ వాళ్లలాగే ఆలోచిస్తాడు."

"నాకలా అనిపించట్లేదు. శ్రవణ్ బాబు నా గురించి అలా ఆలోచించడు ఎప్పుడూ కూడా." ఆమె మొహం లో ఎదో నమ్మకం వుంది.

"కావచ్చు. కానీ..........." కొంచెం ఆగి అన్నాడు సింహరాజు. ".........ఆ శ్రవణ్ బాబు గురించి నువ్వు మళ్ళీ ఆ యింటికి వెళ్తావా?"

"ఆ  ప్రశ్న లేదు. వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను. ఈ సారి వెళ్తే వాళ్ళు నన్ను చంపేస్తారు." భయం కనిపించింది మల్లిక మోహంలో. "అయినా శ్రవణ్ బాబు కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. తన తల్లీ, తండ్రీ, తాత తనని చాలా ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా నాలా సేవలు చేసే సేవకులూ వున్నారు."

"మరింకేం. నువ్వా శ్రవణ్ బాబు గురించి ఆలోచించకు. నువ్విప్పటినుండి  ఆలోచించాల్సినది కబుసా గురించి. కబుసా కరణ ని సంపాదిస్తే ఎన్ని లాభాలు వున్నా, అతన్ని ప్రసన్నం చేసుకోవడం కూడా అంత తేలిక కాదు."

"సరే అయితే. పద ఇంక ఇంటికిపోదాం, నా మామ్మ నన్ను వెదుక్కుంటూ వచ్చే లోపల." మల్లిక నవ్వింది.

ఆ తరువాత కూడా ఎదో మాట్లాడుకుంటూ ఇద్దరూ మల్లిక ఇంటికి చేరుకున్నారు.       

&&&

"చాలా పెద్ద హడావిడి ముగిసింది. మీ అమ్మాయి పద్దెనిమిదో పుట్టినరోజు తన పెళ్లికన్నా కూడా ఎక్కువ హడావిడిగా చేశారు." భుజంగరావు స్నేహితుడు నందనవర్మ అన్నాడు.

ఆ సమయం లో అందరూ ఆ హాల్లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు. నిజానికి భుజంగరావు కూతురు సారిక పుట్టినరోజు హడావిడి అంతా పూర్తయి అప్పటికి అంతా వెళ్లిపోగా, బాగా కావాల్సినవాళ్లంతా ఆ ఇంట్లో వున్న ఆ హాల్లో అప్పుడు కూచుని మాట్లాడుకుంటూవున్నారు.

"నిజానికి  ఇలా హడావిడి చెయ్యడం సారిక కి ఇష్టం ఉండదు. ప్రతిసంవత్సరం తన పుట్టినరోజు ఎంత సింపుల్ గా చేస్తామో మీరూ చూస్తున్నారు కదా. కానీ ............" ఆనందంగా నవ్వాడు భుజంగరావు. ".......... ఈ సంవత్సరం మా వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కాయి. దేశం లోనే నంబర్ వన్ ఇండస్ట్రియలిస్ట్ మి అయ్యాం. ఆదిలా ఈ పుట్టినరోజులోనే సెలెబ్రేట్ చేసుకుంటే   బావుంటుందనిపించింది. అందుకనే ఈ పుట్టినరోజుని ఇంత గొప్పగా చేసాం."

"కానీ మీరెక్కడా ఆ విషయం ప్రస్తావించలేదు. కేవలం ఇది సారిక పుట్టినరోజులాగే చేశారు."

"అలాగ చెప్పాలనిపించలేదు. మా గొప్పతనం మేమే చెప్పుకోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ మేం సాధించింది ఎలాగోలా సెలెబ్రేట్ చేయాలనిపించింది. అందుకని అది ఈ పుట్టిన రోజులో చేసాం. నిజానికి ఇది మా ఆనందం కోసం మేం చేసుకున్న సెలెబ్రేషన్." భుజంగరావు అన్నాడు.

"నిజానికి మా వ్యాపారాలు కొత్త బాట పట్టింది సారిక పుట్టిన తరువాతే." మోహనరావు, భుజంగరావు మామయ్య అన్నాడు. "మా వ్యాపారాల ఇంత గా అభివృద్ధి చెందడానికి సారికే కారణం అనిపిస్తుంది." 

"నాన్నా, ఇంతకాలం మన వ్యాపారాల్ని నిలబెట్టింది, వాటిని అభివృద్ధి చేసింది మీ అల్లుడే అనేవారు. ఇప్పుడేమిటీ ఇలా రూటు మార్చారు?" అయన పక్కనే కూచున్న మాలతి చిరునవ్వుతో అడిగింది.

"నేను అదెప్పుడూ కాదనను. నష్టాల్లో వున్న మనవ్యాపారాల్ని లాభాల బాట పట్టించింది అల్లుడే కదా. కాకపోతే..........." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అన్నాడు మోహనరావు. ".........మనం కొత్త పద్ధతులు అవలంభించింది, దేశం లోనే మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది సారిక పుట్టిన తరువాతే కదా. ఇదేదో నా మనవరాలు అంటే నేను పక్షపాతంతో అంటున్న మాట కాదు."

"మీరన్నది కాదనే ఉద్దేశం మాకెవరికీ లేదు నాన్నా." నవ్వింది మాలతి.

"ఇంతకీ తనెక్కడ? పుట్టిన రోజు సెలెబ్రేషన్ ఇలా కాగానే అలా జారుకుంది. ఇవాళ నాతో మాట్లాడిందే లేదు." చిరుకోపంతో అన్నాడు మోహనరావు.

"తన స్నేహితురాలు ప్రమీల తో కలిసి ఎక్కడికో వెళ్ళింది. ఇద్దరూ ఎంత గొప్ప స్నేహితులో మీకు తెలుసును కదా. సారిక తో రిలేషన్ కోసం, తనతో ఎప్పుడూ కలిసి ఉండడం కోసం, మన శ్రవణ్ ని పెళ్లిచేసుకుంది ఆ ప్రమీల." అదే నవ్వు కంటిన్యూ చేస్తూ అంది మాలతి.

"ఇది హండ్రెడ్ పెర్సెంట్ రైట్." చిరుకోపంతో అన్నాడు శ్రవణ్. "సారిక గురించి ఆలోచించినదాంట్లో సగం కూడా నా గురించి ఆలోచించదు. ఎమన్నా అంటే తామిద్దరూ అంత మంచి స్నేహితులు అంటుంది. అలాంటప్పుడు సారిక చేసుకునేవాడినే తనూ చేసుకోవాల్సింది, నన్నెందుకు చేసుకున్నట్టో?"

అది విని అక్కడ అందరూ నవ్వారు.

"సరేలే బాబూ. రేపు నీ చెల్లెలికి పెళ్ళై వేరే ఇంటికి వెళ్తే, నా కూతురు నీ గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది." చిరునవ్వుతో అన్నాడు నందనవర్మ.

"సారిక పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళదు. తన భర్తే ఇక్కడికి వచ్చి మాతో వుంటాడు." మోహనరావు అన్నాడు. "నా అల్లుడు అలాగే కదా పెళ్లయ్యాక వచ్చి మా ఇంట్లో వున్నది."

మోహనరావు అలా అనడం భుజంగరావు కి పెద్దగా నచ్చలేదు. అందుకనే ఏం మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు.

"నా కూతురు మాలతి నా అల్లుడిని ప్రేమించాను, పెళ్లిచేసుకుంటాను అన్నప్పుడు నేను మొదట సంశయించాను. మాలతి నాకు ఒక్కగానొక్క కూతురు. నా కోబోయే అల్లుడు నా కూడానే వుండి, నా వ్యాపారాలన్నీ సంవర్ధవంతంగా నిర్వహించాలన్నది నా కోరిక. కానీ నా కూతురు కోరిక కాదనలేక అంగీకరించాను. కానీ.................." కాస్త ఆగి చిరునవ్వుతో మళ్ళీ అన్నాడు. ".................. పెళ్లయ్యాక మాతో ఉండడానికే అంగీకరించడం మాత్రమే కాకుండా, నా అంచనాల్ని నా అల్లుడు తారుమారు చేసాడు. నేను కావాలనుకున్నదానికి మూడురెట్లు ఎక్కువ సమర్ధవంతంగా మా వ్యాపారాలు నిర్వహించాడు. నష్టాల్లో ఉన్నవాటిని కూడా లాభాల్లోకి తెచ్చాడు. భుజంగరావు నా అల్లుడుగా రాకపోయివుంటే, మా వ్యాపారాలు ఈ స్థాయిలో ఉండేవి కావు ఈ రోజు." 

     "ఈ విషయాన్ని మీరు చాలా సార్లు చెప్పారు." అనీజీనెస్ తొలగిపోయి చిరునవ్వుతో అన్నాడు భుజంగరావు. "కానీ నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయివున్న బిజినెస్ లనే డెవలప్ చేసాను. వాటినలా ప్రారంభించి ఒక స్థాయికి తెచ్చిన ఘనత మాత్రం మీకే దక్కాలి."

"మామా అల్లుళ్లిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నది చాలు." అదే చిరునవ్వుతో అంది మాలతి. "అయితే మామా అల్లుళ్ళు, లేకపోతె కూతురు తప్ప ఈ అభివృద్ధి లో నా పాత్ర ఏమీ లేదా?" 

దానికి మోహనరావు ఎదో సమాధానం చెప్పబోతూవుండగా ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. "డాడ్, మిమ్మల్ని మామ్ పిలుస్తూంది. ఇంక ఇంటికి వెళదాం అంటూంది." వాళ్ళల్లో ప్రదీప్ అనబడేవాడు నందనవర్మ మొహంలోకి చూస్తూ అన్నాడు.

"అదీ నిజమే. మనం మార్నింగ్ నుండీ ఇక్కడే వున్నాం." కుర్చీలోనుండి లేస్తూ అన్నాడు నందనవర్మ. "పద మనం ఇంటికెళదాం."

నందనవర్మ, ప్రదీప్ అక్కడనుండి వెళ్ళిపోగానే, ప్రదీప్ కూడా వచ్చిన వంశీ, శ్రవణ్ పక్కనేవున్న కుర్చీలో కూలబడ్డాడు. వాళ్లిద్దరూ అక్కడనుండి వెళ్ళిపోగానే, ఆ సందర్భం కోసమే ఎదురుచూస్తూన్నట్టుగా అక్కడివాతావరణం ఒక్కసారి సీరియస్ గా మారింది.

"ఇప్పటివరకూ అందరూ ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి ఎందుకు సీరియస్ అయ్యారు?" ఆశ్చర్యపడుతూ అడిగాడు వంశీ.

"నీకు తెలీదా ఎందుకు సీరియస్ అయ్యామో." శ్రవణ్ అన్నాడు. "నా మామగారి ముందు ఆ ప్రస్తావన బావుండదని  తేలేదు. కానీ నిన్నటినుండి నేను చాలా డిస్టర్బ్ద్ గానే వున్నాను. ఉండీ ఉడిగీ సారిక ఎందుకలా ప్రవర్తిస్తూందో నాకూ బోధపడడం లేదు."

"ఈ రోజు ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నాలో డిస్టర్బన్స్ ఎవరూ కనిపెట్టకుండా చెయ్యడానికి నేనూ చాలా కష్టపడాల్సివచ్చింది. మనమందరం కూచుని దీనికి ఒక పరిష్కారం ఆలోచించే సమయం కోసమే ఎదురుచూస్తున్నాను. ఈ విషయం లో ఇంకా ఆలస్యం చెయ్యడం మంచిది కాదు." మాలతి అంది.   

"మనం మరీ ఒక చిన్న విషయాన్ని భూతద్దం లో చూడడం లేదు కదా?" వంశీ అన్నాడు. "సారిక అన్నివిధాలుగానూ పెర్ఫెక్ట్. ఇప్పటివరకూ అన్ని పరీక్షలలోనూ ఫస్ట్ రాంక్ లో పాసవుతూ వచ్చింది. తను బిజినెస్ లో అడుగుపెడితే మమ్మల్ని అందర్నీ మించిపోతుందనడం లో సందేహం ఏమీ లేదు. అలాంటిది ఏదో చిన్నవిషయానికి ఇంతగా కంగారు పడుతున్నారు."

"అది కన్నతల్లి నే చంపబోవడం ఒక చిన్న విషయం లా నీకు అనిపిస్తూందా?" వంశీ మొహంలోకి చూస్తూ అడిగింది మాలతి.

"ఏమిటమ్మా? తను నిజంగానే నిన్ను చంపబోయిందనుకుంటున్నావా? అలా అయితే నువ్వు ఎలా తప్పించుకున్నావ్?" చిరాగ్గా అడిగాడు వంశీ.

"తప్పించుకోగలను అనుకోలేదు. దానిచేతుల్లో చచ్చేననే అనుకున్నాను. కాకపోతే తనపట్టు విడిపించుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. నిజం చెప్తున్నా, నా బలం ఎక్కువయి నేను తననుండి బయటపడలేదు. సడన్ గా తనని ఆవహించినదేదో తనని వదిలేసినట్టుగా అయి, నన్ను అది వదిలేసింది. లేకపోతె మీరు నా డెడ్ బాడీ ని చూసివుండేవారు."

మాలతి మొహం లో, ఇంకా గొంతులో సీరియస్నెస్ కి అక్కడవాళ్ళెవరూ అది అబద్ధం అని అనదలుచుకోలేదు.

"ఒరేయ్ అది నా కన్న కూతురురా. మీ ఇద్దరికన్నా ఎక్కువ ప్రేమ నాకు దానిమీద వుంది. నిజంగానే నన్ను అది చంపేయాలని కోరికపడితే నేను ఆనందంగా చచ్చిపోతాను. కాకపోతే తరువాత దానిగతి ఏమవుతుంది? నన్ను చంపిన నేరానికి జైలుకి పోతుంది." మాలతి ఆందోళనగా అంది.

"నువ్వు దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, అంతకు పదిరెట్లు అది నిన్ను ప్రేమిస్తూంది. అలాంటికోరిక దానికెందుకువుంటుంది?" చిరాగ్గా అన్నాడు భుజంగరావు.

"మామూలుగా అన్నాను. ఆ విషయం నాకు తెలీదా?" మాలతి అంది. "అప్పుడప్పుడే అయినా తనెందుకు ఇలా ప్రవర్తిస్తూంది? ఇందుకు మనం కారణం తెలుసుకోవాలి."

"మామ్, ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ సిస్టర్ లో ఎంతకాలం నుండి వుంది?" వంశీ అడిగాడు.

"నిజం చెప్పాలంటే చాలా కాలంగా. ఇంచుమించులో తనకి జ్ఞానం వచ్చినప్పటినుండీ. అప్పుడప్పుడు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది." మాలతి అంది.

"అంతకాలం నుండి తనలో ఇలాంటి అబ్నార్మల్ బిహేవియర్ వుంటే, ఇప్పటివరకూ పట్టించుకోకుండా వదిలేశారా?" కోప్పడ్డాడు వంశీ.

"అబ్బా ఎప్పుడూ కాదురా. అప్పుడప్పుడు మాత్రం ఇలా బిహేవ్ చేస్తూ వుంది. ఆ మాత్రం దానికి తనకి మెంటల్ అని చెప్పి మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటావా?" చిరాకుపడింది మాలతి.

"కానీ నిన్న జరిగింది ఎక్స్ట్రీమ్. నిన్ను చంపబోయిందంటే అది సీరియస్ గానే ఆలోచించాలి. ఆ స్పెల్ ఎదో వదిలేసింది కాబట్టి నువ్వు బతికి బయటపడ్డావు, లేకపోతె  ఏమయివుండేది? నువ్వు చనిపోవడమే కాదు, నిన్నలా చంపినందుకు తనూ జైలుకెళ్లేది." భుజంగరావు అన్నాడు.

"అదే నేనూ భయపడేది, ఎదో ఆవహించి తను నన్ను చంపిందంటే కోర్ట్ వింటుందా? తను జైలు లో బాధపడుతూంటే ఏ లోకం లో వున్నానాకు శాంతి ఉంటుందా?" మాలతి భయంగా అంది.

"మామ్.......... మామ్........... నువ్వు మరీ టూ మచ్ గా ఆలోచిస్తున్నావు." నవ్వుతూ అన్నాడు శ్రవణ్.

"నువ్వలా తేలికగా తీసుకోకు. అదృష్టం బావుండబట్టికానీ నిన్న అంతపని జరిగివుండేది. అందులోనూ ఇకపైన అలా చెయ్యదనీ గ్యారంటీ లేదు." మాలతి కోపంగా అంది. "అంతేకాకుండా ఇంకెవరిమీద అలాంటి హత్యా ప్రయత్నం చెయ్యదనీ గ్యారంటీ లేదు."

"తనంటే మనందరికీ ప్రాణమే. అయినా ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. మన గురించి కాదు, ముఖ్యంగా తనగురించి." భుజంగరావు అన్నాడు.

"అయితే ఇప్పుడేంచేద్దాం? తనని ఎవరన్నా సైకియాట్రిస్ట్ కి చూపిద్దామా?" శ్రవణ్ అడిగాడు.

"నాకెంత మాత్రం తనని మనమొక పిచ్చిదానిలా చూస్తున్నామన్న ఆలోచన తనకి రావడం ఇష్టం లేదు. నేనింతకాలం తననొక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఇదే. ఇది మీ డాడ్ ఇంతకుముందే సజెస్ట్ చేశారు." మాలతి అంది.

"మరయితే ఈ సమస్యకి పరిష్కారం ఎలా మామ్? ఒక సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ దగ్గరికివెళ్ళకుండా మనం ఏదన్నా ఎలా డిసైడ్ చెయ్యగలం?" శ్రవణ్ చిరాగ్గా అన్నాడు.

"ఇది చాలా గొప్పగా వుంది. మీ ఆవిడా ఎమ్. ఏ. సైకాలజీ తో చదువుతోంది. తనని అడిగితె ఏ విషయం చెప్పలేదా?" వంశీ అన్నాడు.           

     "ఈ విషయం లో మా ఆవిడని సలహా అడగడం ఆర్. ఎం. పి. డాక్టర్ ని హార్ట్ సర్జరీ చెయ్యమన్నట్టుగా ఉంటుంది. తానేదో కాస్త ఇంటరెస్ట్ తో ఏం.ఏ. సైకాలజీ తో చదువుతూంది, అంతమాత్రం చేత తనని సలహా అడగమంటావా? తెలిసినది తెలీనిది ఏదో చెప్పి మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంది." శ్రవణ్ అన్నాడు.

అది విని అక్కడవున్న అందరూ నవ్వారు.

"ఏది ఏమైనా తను ఎం. ఏ. సైకాలజీ తో చదువుతోంది. మనకన్నా ఈ విషయం లో కొంచెం బెటర్ గానే ఆలోచిస్తూంది. తనతో ఈ విషయం ఒకసారి కదిపిచూడ్డం మంచిదే. తనేం సలహా ఇస్తుందో చూద్దాం." మోహనరావు అన్నాడు.

"అందులోనూ తను సారిక కి చాలా బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం తెలిసిందంటే, తనూ సీరియస్ గా అలోచించి ఒక మంచి సలహా ఏ ఇస్తుంది." మాలతి అంది.

"సరే అయితే. నేను తనతో అలోచించి చూస్తాను." శ్రవణ్ అన్నాడు

"ఒక ముఖ్య విషయం. తనలా బిహేవ్ చేసిందని, మనం ఇలా ఆలోచిస్తున్నామని సారిక కి తెలియనివ్వకు. తను చాలా డిస్టర్బ్ అవుతుంది." మాలతి అంది.   

"ఎంతకాలం మనం తన బిహేవియర్ గురించి తనకి తెలీకుండా దాచుతాం? తన సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే, తనెలా ప్రవర్తిస్తూందో తనకి తెలియాలి." శ్రవణ్ చిరాకుపడుతూ అన్నాడు. "మనం ఈ సమస్య కి పరిష్కారం కనిపెట్టాలని ఇప్పుడు సీరియస్ గా ఆలోచిస్తున్నాం."

"అవసరమయినప్పుడు అలాగే చేద్దాం. ప్రస్తుతానికి వద్దు. ముందు నువ్వు మీ ఆవిడతో మాట్లాడు." మాలతి అంది.

"తనేదో పెద్ద సైకియాట్రిస్ట్ అయినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నా అభిప్రాయం లో తను చెయ్యగల హెల్ప్ పెద్దగా ఏమీ ఉండదు. మనం వేరే మార్గం ఆలోచించడం మంచిది." శ్రవణ్ అన్నాడు.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)