Read Ventaade Needalu - 9 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 9

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 13

    Part - 13 సమయం : సాయంత్రం 5:15 గంటలు.ఇబ్రహీంపట్నం జిల్లా పరి...

  • THE GHOST - 4

    పూజ చివరికి వచ్చింది పుర్రెను తీసుకువచ్చి అంజు శవం తల మీద పె...

  • మైత్రి వనం - 1

    కలధౌత సౌధాలు, పారిజాత వనాలతో విరాజిల్లుతోంది దేవేంద్రుని సభ....

  • The Circle of Bonding - 2

    బ్లెస్స్ మీ​నిశ్శబ్దమైన అడవి... సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 9

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"అంటే మా డాడ్, గ్రాండ్ పా ఏదడిగినా నువ్వు చేసేస్తావా?"

"చేస్తానమ్మా, అది నా ధర్మం గా భావిస్తాను. అలాగే ఇప్పటివరకూ చాలా ముఖ్యమైన, ప్రధాన మైన పనులు చేసిపెట్టాను." అదే చిరునవ్వుతో అన్నాడు ఓబులేసు.

ఎదో అడగబోతూన్నదల్లా సడన్ గా సారిక ఎక్స్ప్రెషన్ లో కనిపెట్టలేని మార్పు వచ్చింది. కుర్చీలోనుండి ఒక్క ఉదుటున లేచి, ఓబులేసు దగ్గరికి వచ్చి, అతని మెడ చుట్టూ తన రెండు చేతులూ వేసింది.

"నేను నిన్ను బతకనివ్వను. చంపేస్తాను. చంపి తీరతాను." వాడి మెడ రెండుచేతులతో గట్టిగా పిసుకుతో అరవడం మొదలుపెట్టింది.

"ఏమిటిది......... తల్లీ? వదిలి...........పెట్టు. లేకపోతె ...... ఊపిరాడక చచ్చిపోతాను." ఆ చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఊపిరాడక అవస్థపడుతూ అంటున్నాడు ఓబులేసు.

"లేదురా. నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. ప్రాణాలతో ఉండనివ్వను." ఇంకా అలాగే అరుస్తూ వాడి గొంతు నొక్కుతూ వుంది సారిక         

ఆ హడావిడికి అక్కడికి అందరూ వచ్చారు. "సారికా, ఏం చేస్తున్నావ్? వదులు వాడిని." ఇలా అంటూ వాడిచుట్టూ వున్నతన చేతుల పట్టుని విడిపించడానికి ప్రయత్నించడం ప్రారంభించారు.

"లేదు. వీడిని వదలను. వీడిని చంపేస్తాను." హిస్టీరికల్ గా అలాగే అరుస్తూ వాడి పీకని నొక్కుతూ వుంది సారిక.  

ఓబులేసు పరిస్థితి గుడ్లు తేలేసి ప్రాణం పొయ్యేలా తయారయ్యింది. అంత మందీ ప్రయత్నిస్తూన్నా సారిక పట్టుని కొంచెం కూడా విడిపించలేకపోతూఉన్నారు. ఇంక ఆ సమయం లో మాలతి సారిక ముందుకు వచ్చి ఛెళ్ళు, ఛెళ్ళు మంటూ తన చెంపలు వాయించింది.

ఎదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఓబులేసు మెడ చుట్టూ వున్న తన చేతులు తీసేసింది సారిక. "ఏమిటిది? ఎందుకు మీరందరూ నా చుట్టూ వున్నారు?" చుట్టూ అందర్నీ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.

"ఎందుకో నీకు నిజంగా తెలియదా?" కోపంగా అడిగాడు శ్రవణ్.

"తెలిస్తే నేనేందుకు అడుగుతాను?" సారిక కూడా కోపంగానే అంది. "అసలు మీరందరూ ఎందుకు నా చుట్టూ వున్నారో నాకు బోధపడడం లేదు."

"నువ్విప్పుడు ఓబులేసు ని చంపబోయేవు తెలుసా? మేమందరం వచ్చిఉండకపోతే వాడు నీ చేతుల్లో చచ్చివుండేవాడు." వంశీ కూడా కోపంగానే వున్నాడు.

"ఓబులేశుని నేను చంపబోయేనా? వాడిని నేనెందుకు చంపాలనుకుంటాను? అయినా అదేదీ నాకెందుకు గుర్తులేదు?" షాక్ తో అంది సారిక.

"ఒక్క విషయం నాకు అర్ధం కావడం లేదు." అప్పటికి ఆ చావుపట్టునుండి విడివడి తెరిపిన పడ్డాడు ఓబులేసు. "ఒక బలమైన ఎద్దుని కూడా పోటీ పడితే క్షణం లో లొంగదీసుకోగలను. అలాంటిది ఈ తల్లి చేతులనుండి ఎందుకు విడిపించుకోలేకపోయాను? ఇంతబలం తనకి ఎలా వచ్చింది?" ఆశ్చర్యం ఓబులేసు గొంతులోనూ, మొహం లోనూ ప్రస్ఫూటంగా వుంది.

"అది నిజం. ఇంతమందిమీ కలిసి తన పట్టుని విడిపించలేకపోయాం. తను తెలివైనది కానీ తనకి ఇంతబలం ఎప్పుడూ లేదు. ఇప్పుడెలా, ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా అన్నాడు వంశీ.

ఆ విషయం అప్పుడే తట్టినట్టుగా అందరూ ఆశ్చర్యంగా మొహ, మొహాలు చూసుకున్నారు.

"నాకేమవుతూంది? నెందుకిలా బిహేవ్ చేస్తున్నాను? నాకు సడన్ గా అంత బలం ఎలా వచ్చింది?" ఆవేదనగా అడిగింది సారిక.

"రిలాక్స్. ఇందులో మనం ఆందోళన పడాల్సినది ఏమీ లేదు. కాకపోతే కూచుని ఆలోచించాల్సినది మాత్రం వుంది. మీకెవరికీ అభ్యంతరం లేకపోతె మనం నా రూమ్ లోకి వెళ్లి ఒక సమావేశం పెట్టుకుందాం." ప్రమీల అంది.

"సైకాలజిస్ట్ గారు మంచి సలహానే ఇచ్చారు. ఫాలో అవుదాం." ప్రదీప్ చిరునవ్వుతో అన్నాడు.

"నువ్వు ఈ ఫ్యామిలీ మెంబెర్ వి కాదు, కేవలం రిలేటివ్ వి మాత్రమే. అందుకని ఈ సమావేశం నుండి నిన్ను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను." ప్రమీల అంది.

"తను ఫ్యామిలీ మెంబెర్ కాకపోవచ్చు, కానీ నీలాగే నాకు మంచి ఫ్రెండ్. వుండనీ పర్లేదు." అప్పటికి షాక్ నుండి కొంతబయటపడి అంది సారిక.

"అయితే అందరూ ప్రమీల రూమ్ లోకి పదండి, అక్కడ మాట్లాడుకుందాం." మాలతి అంది.

అందరూ ప్రమీల రూమ్ లోకి నడుస్తూవుంటే ఓబులేసు దగ్గరికి వచ్చి అన్నాడు భుజంగరావు. "నువ్వేమీ అనుకోకురా. తనేం చేస్తూందో తనకే తెలీదని చెప్పింది కదా."

"భలేవారే అయ్యగారూ. నన్ను చంపడం వల్ల ఆ తల్లికి ఎమన్నా కలిసివస్తుందంటే ఆనందంగా చచ్చిపోగలను. కానీ నన్ను చంపి తను జైలుకి వెళ్లడమే నాకు ఇష్టం లేదు."

"నువ్వలాగే ఆలోచిస్తావని నాకు తెలుసురా." నిట్టూర్చిఅన్నాడు భుజంగరావు. "నీతో మాట్లాడాల్సిన విషయాలు వున్నాయి కానీ, ఇప్పుడు మాట్లాడలేను. రేపో ఎల్లుండో మళ్ళీ రా."

"దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మీరెప్పుడు రమ్మన్నా నేను వస్తాను. అయినా అన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటూనే వున్నాను. కానీ........" సడన్ గా ఒక కాషస్ ఎక్స్ప్రెషన్ వచ్చింది ఓబులేసు మొహంలోకి. "........అంతబలం ఒక్కసారి ఆ అమ్మాయికి ఎలా వచ్చింది?"

"అదే ఇప్పుడు మేమూ ఆలోచించబోతూ వున్నాం. నువ్వు దానిగురించి ఏమీ దిగులు పడకు." చిరాకుపడుతూ అన్నాడు భుజంగరావు.

"ఇది మనం అలోచించి పరిష్కరించగలిగిన సమస్య కాదు అయ్యగారూ. ఎదో ఒక భూత వైద్యుడు మాత్రమే పరిష్కరించగలిగిన సమస్య. దయ్యం లాంటిది ఎదో పట్టివుండకపోతే తనకి అంతబలం అలా వచ్చివుండేది కాదు." భయం మొహం లో ప్రస్ఫూటంఅవుతూ ఉంటే అన్నాడు ఓబులేసు.

"ఒరేయ్, నువ్వు అనవసరపు వాగుడు వాగకు. ఇది అలోచించి మేము పరిష్కరిస్తాం." ఇంకా మాట్లాడాల్సినది ఏదీ లేదన్నట్టుగా అక్కడనుండి ప్రమీల రూంవైపు వెళ్ళిపోయాడు భుజంగరావు.

ఒక హెల్ప్లెస్స్ ఎక్స్ప్రెషన్ తో భుజంగరావు వెళ్తూన్న వైపు ఒకసారి చూసి, తరువాత తలవిదిలించి అక్కడనుండి వెళ్ళిపోయాడు ఓబులేసు.   

&&&

"ఇక్కడ ఆనందించాల్సిన ఒక విషయం, సారిక కూడా టూ మచ్ గా షాక్ అవలేదు జరిగిన విషయానికి. ఎందుకంటే తను మొదటినుండి కొంచెం అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నానన్న విషయం తనకి తెలుసు. తనతో వున్న మనందరికీ కూడా ఆ విషయం తెలుసు. కాకపోతే తనని హార్ట్ చెయ్యడం, అప్సెట్ చెయ్యడం ఇష్టం లేక ఆ విషయం ఎప్పుడూ మనం ఓపెన్ గా తనతో డిస్కషన్ చెయ్యలేదు. కానీ ఇప్పుడా సమయం వచ్చిందని నాకనిపిస్తోంది."

తన రూమ్ లో అందరూ సమావేశమయ్యేక మాట్లాడడం మొదలుపెట్టింది ప్రమీల.  మాలతి, ప్రమీల, సారిక, వంశీ, శ్రవణ్ బెడ్ మీద కూచునివుంటే, మోహనరావు, ప్రదీప్ ఆ రూమ్ లోకి కుర్చీలు తెచ్చుకుని కూచున్నారు.

"నేనేదో కొంచెం తేడాగా వున్నా విషయం నాకు తెలుస్తూంది. ఆ విషయం మీకూ తెలుసన్న విషయం కూడా నాకు తెలుసు. కేవలం నన్ను హర్ట్ చెయ్యడం ఇష్టం లేక మాత్రమే ఆ విషయం మీరెప్పుడూ నాతో మాట్లాడ లేదు."

"అంతే కాకుండా అది అంత తీవ్రమైన సమస్య అనికూడా మేమెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇది ఒక తీవ్రమైన పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు." శ్రవణ్ అన్నాడు.

వాళ్ళలా మాట్లాడుకుంటూ వుంటే భుజంగరావు ఆ రూమ్ లోకి వచ్చాడు. ఆ రూమ్ లో వున్న కుర్చీలు ఆక్యుపై అయి ఉండడం తో, పైనుండి ఒక కుర్చీ తెచ్చుకుని అందులో కూచున్నాడు.

"కానీ ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్యే అని నేననుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక మనిషిని చంపబోయాను. అదృష్టవశాత్తు అలా కాలేదు." అలా అన్నాక మాలతి మొహంలోకి చూసి అంది సారిక. "మామ్, నా బర్త్ డే ముందురోజు నేను నిన్ను కూడా చంపబోయాను కదా."

మాలతి సారిక ని కౌగలించుకుని తన కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంది. "నువ్వు నన్ను చంపేసినా నాకు ఆనందమే. కానీ ఆ కారణంగా నువ్వు జైలుకెళతావనే నా భయం."

"నా ప్రశ్న కి నువ్వు సమాధానం ఇవ్వు మామ్, నేను నిన్ను ఆ రోజు చంపబోయానా లేదా?" తన తల్లిపట్టునుండి విడిపించుకుని ఆమె మొహంలోకి చూస్తూ అడిగింది సారిక.

"ఇప్పుడు ఓబులేసు కి చేసినట్టే నా మెడ చుట్టూ నీ రెండు చేతులువేసి గట్టిగా నొక్కావు. నీ చేతులనుండి విడిపించుకోవడానికి నీ బలం ముందు నా బలం సరిపోలేదు. అంతలోనే ఎదో దేముడు కరుణించి నువ్వా స్పెల్ నుండి బయటకి వచ్చావు." మాలతి అంది. 'లేకపోతె నీ చేతుల్లో నేను చచ్చివుండేదాన్ని.' అనబోయింది కానీ అనలేదు.          

"కొన్ని ఎక్స్ట్రాడినరీ సిట్యుయేషన్స్ లో అలాంటి బలం మనుషులకి వస్తుంది. ఇది మరీ అంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు." ప్రమీల అంది.

"సైకాలజిస్ట్ గారు గొప్ప విషయాన్నే సెలవిచ్చారు. ముందు ఈ విషయానికి పరిష్కారం కావాలి. ఏది ఆర్డినరీ, ఏది  ఎక్స్ట్రాడినరీ అన్నది కాదు."  శ్రవణ్ చిరాగ్గా అన్నాడు.

"ముందు విషయాన్ని పూర్తిగా డిస్కస్ చెయ్యనిస్తావా? ఇలా చర్చ మొదలుపెట్టామో లేదో అలా పరిష్కారం తెలిసిపోతుందా?" ప్రమీల కోప్పడింది.

"ప్రమీల చెప్పింది నిజం. నువ్వలా తొందరపడకు." మాలతి అంది.

అందరూ నవ్వుతూ ఉండగా "ఒకే" అంటూ సర్దుకు కూచున్నాడు శ్రవణ్

"నేను కేవలం ఒక సైకాలజిస్ట్ ని. అదీ ఇంకా చదువుతున్నా. ఈ సమస్య పరిష్కారానికి మనకి ఒక సైకియాట్రిస్ట్ అవసరముంది. "

"అంటే మనం సారికని ఒక మెంటల్ పేషేంట్ గా భావించి సైకియాట్రిస్ట్ కి చూపించాలా?" వంశీ కోపంగా అడిగాడు.

"బ్రో, నీకన్నా ఎక్కువగా నా మంచి గురించి ఆలోచించే వ్యక్తి ప్రమీ. తను ఆలోచించకుండా అలా చెప్పదు." సారిక అంది.

"థాంక్ యు సారికా నా మీద నీ నమ్మకానికి." నవ్వింది ప్రమీల. "నా కాలేజ్ కి అప్పుడప్పుడు డాక్టర్ సమీర, ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తూంటారు. నాకు ఆవిడతో కొంచెం పరిచయం వుంది. మనం సారిక ని ఆవిడకి చూపించొచ్చు."

"మనం ఇంకొంచెం కాలం వెయిట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది?" శ్రవణ్ అడిగాడు.

"ఇంకా వెయిటింగ్ మంచిదని నాకు అనిపించడం లేదు." ప్రమీల అంది. "సారిక ఇప్పటికి ఇద్దరిమీద మర్డర్ అటెంప్ట్ చేసింది. ఇంకోసారి ఇంకొకరి మీద చెయ్యదని నమ్మకం ఏమిటి? ఈ సారి అందులో సక్సెస్ అయితే?"

ప్రమీల అడిగిన ప్రశ్నలకి అందరి గుండెలు భయంతో నిండాయి సారిక తో సహా      ఇంకా ఆ భయం వాళ్ళ మొహాల్లో ప్రస్ఫూటంగా వుంది.

"ఆ సమయం లో సారిక కి అంత బలం ఎక్కడనుండి వస్తూందో నాకు బోధపడడం లేదు. తను ఎంతో సున్నితంగా, నాజూకుగా వుండే పిల్ల." మాలతి అంది.

"ఈ సందేహానికి మన ఫేమస్ సైకాలజిస్ట్ గారు ఎప్పుడో ఎక్స్ప్లనేషన్ ఇచ్చేసారు. నువ్వు సరిగా వినలేదనుకుంటా." చిరునవ్వుతో అన్నాడు శ్రవణ్.

"నిజానికి సారిక కేవలం మామ్ మీద, ఓబులేసు మీద ఎందుకు స్ట్రైక్ చేసింది? మనెవరిమీద ఎందుకు స్ట్రైక్ చెయ్యలేదు?" ప్రదీప్ అడిగాడు.

"ఏం నీ మీద చెయ్యలేదని నీకు బాధగా ఉందా? నీ మీద ట్రై చెయ్యనా?"

సారిక చిరునవ్వుతో అడిగిన దానికి అందరూ నవ్వారు, ప్రదీప్ తో సహా.

"సారిక విషయాన్నీ ఇలా లైట్ గా తీసుకోవడమే మనందరికీ కావలసింది." ప్రమీల తనూ నవ్వుతూ అంది. "ఇక్కడ మనకి సమాధానాలు దొరకని ప్రశ్నలు కొన్ని వున్నాయి. సారిక ఎందుకు ఆ ఒంటె మొహం మనిషి బొమ్మ గీస్తూ ఉంటుంది? తనెందుకు అప్పుడప్పుడు ఊపిరి ఆడటం లేదని ఫీల్ అవుతుంది? ఎందుకు స్పెసిఫిక్ గా ఆంటీ మీద, ఓబులేసు మీద మర్డర్ ఎటెంప్ట్ ......"

"నిజంగా నేను వాళ్ళని చంపాలనుకున్నానా?" ప్రమీల ని ఇంటెరెప్ట్ చేస్తూ అడిగింది సారిక.

"రిలాక్స్ డియర్. నువ్వది చేసినప్పుడు కాన్షస్ గా లేవు. నువ్వది కావాలని చేసింది కాదు. సో, డోంట్ వర్రీ." ప్రమీల అంది.

"ఎస్, సారికా, నువ్విప్పటివరకూ ఈ విషయాన్ని ఎలా లైట్ గా తీసుకున్నావో అలాగే తీసుకో. నో హెవీ ఫీలింగ్స్." భుజంగరావు అన్నాడు.

"ఒకే డాడ్." సారిక చిరునవ్వుతో తలూపి ప్రమీల మొహంలోకి చూస్తూ అంది. "ప్లీజ్ ప్రొసీడ్."

"ఇంక ప్రత్యేకంగా చెప్పడానికి డిస్కస్ చెయ్యడానికి ఏమీ లేదు. మీరంతా ఒప్పుకుంటే నేను డాక్టర్ సమీర తో మాట్లాడతాను. ఐ యాం స్యూర్, తనిక్కడకొచ్చి సారికతో, ఇంకా మనతో మాట్లాడ్డానికి ఒప్పించగలను."

అక్కడవున్న అందరూ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళని ఇంటెరెప్ట్ చేస్తూ మోహనరావు అన్నాడు.

"ఈ విషయం లో సారిక ఎలా చెప్తే అలా చేద్దాం."

"దట్స్ ద బెస్ట్ సజెషన్ ఇన్ మై ఒపీనియన్ ఆల్సో." శ్రవణ్ అన్నాడు. "తను ఇంకొంతకాలం వెయిటింగ్ చేసి చూద్దాం అంటే మనం వెయిట్ చేద్దాం."

"నో వెయిటింగ్ బ్రో, నో వెయిటింగ్ ఆబ్సల్యూట్లీ." ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అంది సారిక. "నేనంటే నాకే భయం వేస్తూ వుంది. ఈ సమస్యకి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలి. నేనా సైకియాట్రిస్ట్ ని సాధ్యమైనంత త్వరగా చూడాలి."

"ఆల్రైట్, ఆల్రైట్, ఒన్స్ వుయ్ రీచ్డ్ దిస్ డిసీజన్, ఐ డోంట్ డిలే ఎనీ మోర్." నవ్వింది ప్రమీల. "నాకు ఆవిడతో పరిచయం వున్నా, తన ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. కానీ నా కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర తప్పకుండా వుండివుంటుంది. నేను తనతో మాట్లాడతాను."

"అదేదో ఆలస్యం లేకుండా వెంటనే చెయ్యి." శ్రవణ్ అన్నాడు.

"నేను వేగంగానే చేస్తానని చెప్తున్నాను కదా, నీ ప్రామ్ప్టింగ్ అవసరం లేదు." కోపంగా అంది ప్రమీల.

అది విని అందరూ మళ్ళీ నవ్వారు అక్కడ. అలాగే మరికొంత సేపు మాట్లాడుకున్నాక, రాత్రి పదకొండు అలా అవుతూండగా,  అక్కడనుండి డిస్బర్స్ అయిపోయారు అందరూ.

&&&

"ఆ రోజు కళ్ళల్లో మెరుపు అలా చూసి, తనవైపు అలా లాగబడ్డాక మళ్ళీ ఏమీ లేదు."

ఆ రోజు ఉదయమే పదిగంటలు అలా అవుతూ ఉంటే సింహరాజు దగ్గరికి వచ్చి అంది మల్లిక.  

"నువ్వు ప్రయతిస్తూన్నది కబుసా అనుగ్రహం కోసం. అది అంత త్వరగా సాధ్యం అవుతుందని ఎందుకనుకుంటావ్? అందులోనూ నీ పద్దెనిమిదో సంవత్సరం లో తనకి నిన్ను నువ్వు సమర్పించుకునేవరకూ కబుసా నీకే శక్తులూ ప్రసాదించడు." సింహరాజు అన్నాడు.

"నాకు శక్తులు ప్రసాదించేయాల్సిన అవసరం లేదు, కానీ నేను తన దృష్టిలో వున్నట్టుగా నాకు ఎదో ప్రకారంగా తెలియచేయాలి కదా."

"అటువంటి అవసరం కబుసా కి లేదు. తను ఇష్టపడుతూన్న కన్నెపిల్లలకైనా  సరే తనకి పద్దెనిమిదో సంవత్సరం వచ్చేవరకూ కబుసా పెద్దగా పట్టించుకోడు. నీకు తెలియచేసినట్టుగా వాళ్ళకి తనువాళ్ళని ఇష్టపడుతున్నానని తెలియచేస్తాడు. అది అర్ధం చేసుకుని ఆరాధించుకున్నవాళ్ళు తమ పద్దెనిమిదో సంవత్సరంలో వాళ్ళని వాళ్ళు అర్పించుకున్నాక అనుగ్రహిస్తాడు."

"అయితే ఈ కబుసాని ఆరాధించడం నాకు ఇష్టం లేదు. నేను ఇంక ఆపేస్తాను." మొహం లో చిరాకు ద్యోతకమవుతూ వుంటె అంది మల్లిక.

"ఒకసారి ప్రారంభించిన తరువాత ఆపకూడదు. నేను ముందే చెప్పాను నీకు అన్నీ ఆలోచించుకున్న తరువాత దిగమని." సింహరాజు కోపంగా అన్నాడు. "అలా ఆపేస్తే కబుసా కి కోపం వస్తుంది. కబుసా కి కోపం తెప్పిస్తే చాలా కఠినంగా శిక్షిస్తాడు. కబుసా కి ఇష్టం లేని పనులు ముఖ్యంగా తను ఇష్టపడుతూన్న నువ్వు చెయ్యకూడదు."

"ఆ రోజు ఏదో అలా భ్రమ పడ్డాను తప్ప నిజంగా అటువంటిది ఏదీ జరగలేదన్నది నా అభిప్రాయం." మల్లిక అంది. "కబుసా, బాణామతి, చేతబడి, ఏమిటి ఇవన్నీ? మన పిచ్చి కాకపోతే. ఎందుకో ఇలాంటివాటిని నమ్మడం చాలా తెలివి తక్కువ అనిపిస్తూంది."

"అకస్మాత్తుగా చాలా తెలివైన దానివి అయిపోయావ్. అలాంటివాటిని, ముఖ్యంగా కబుసాని నమ్మాలో అక్కర్లేదు నీ మామ్మని అడుగు చెప్తుంది. తన కుటుంబం అంతా కూడా ఒకప్పుడు ఈ చెడ్డ దేవతల్ని ఆరాధించి, బాణామతి, చేతబడి లాంటివి చేసేవారు."

"నా మామ్మ ముసల్ది అయిపోయింది. ఎదో చాదస్తంగా మాట్లాడ్డం అలవాటు చేసుకుంది. తనేం చెప్పినా నేను నమ్మను. ఎందుకో ఇలాంటివాటి మీద నాకు నమ్మకం పోయింది. ఇంక కబుసా ని ఆరాధించడం కొనసాగించదలుచుకోలేదు."

"నువ్వు చాలా ప్రమాదకరం గా మాట్లాడుతున్నావు. ఇంకొద్దిరోజుల్లో ఎలాగు నీ పద్దెనిమిదో సంవత్సరం లో అడుగుపెడతావు. అప్పుడు నిన్ను నువ్వు కబుసాకి సమర్పించుకుని అతనిచ్చే శక్తులు పొందుదువు గానీ. ఆ శక్తులతో నువ్వు చేద్దామనుకుంటున్నవి చాలా వున్నాయి, మర్చిపోయావా?"

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)