Read Ventaade Needalu - 4 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 4

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • THE GHOST

    **చీకటి రాత్రి - భయానక ప్రారంభం**స్టోరీ ఓపెన్ చేస్తే... ఒక చ...

  • వెంటాడే నీడలు - 3

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 10

    Part - 10 సమయం - సాయంత్రం 5:15 నిత్యం రద్దీగా ఉండె విజయవాడ బ...

  • The Circle of Bonding

    )సీన్ ఓపెన్ చేస్తే ఒక హాస్పిటల్...నర్సులు, డాక్టర్లు అందరూ క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెంటాడే నీడలు - 4

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"రిలాక్స్ .........రిలాక్స్ ........... కంగారు పడకు." ప్రమీల అంది. "ఇప్పటికీ నువ్వు ఆ ఒంటె తల వున్న మనిషిబొమ్మ గీస్తున్నావా?"

"ఎస్, గీస్తున్నాను. ఒక్కోసారి చాలా కోరికగా అనిపిస్తుంది ఆ బొమ్మ గియ్యాలని. గీసి అలాగే చింపి పడేస్తాను. నా చిన్నప్పటిలా అందరికీ తెలిసేలా చెయ్యడం లేదు. అలాగే ఏవో వింత శబ్దాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ వుంటాయి. కాస్త రీసెర్చ్ చేసిన మీదట ఒంటెలు అలంటి శబ్దాలు చేస్తాయని తెలిసింది  నాకూ, ఒంటెలు కి వున్న సంభందం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడ్డం లేదు." ఆ ఆవేదనలో కూడా ఉండలేక నవ్వింది సారిక.

ప్రమీల కూడా నవ్వింది. "ఇది కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఒంటె బొమ్మ ఎందుకు గియ్యాలి? ఒంటె సకిలింత ఎందుకు వినాలి?"

"నాలో వున్న మరో ఏంగిల్. నేను ఇప్పటివరకూ ఎవిరితో, ఇంకా నాకెంతో క్లోజ్ అయిన నీతో కూడా షేర్ చేసుకోనిది.   అందరిలానే నాలో కూడా సెక్స్ కోరికలు ఉరకలు వేస్తూ ఉంటాయి. నేనూ నా మామ్ లా అందంగా వుంటాను కాబట్టి నా వెనకాల పడే కుర్రాళ్ళు ఎక్కువే. నేనూ చేతన్ చాలా క్లోజ్ గా ఉంటామని నీకూ తెలుసు కదా. ఒకరోజు మేమిద్దరం మా కోరిక తీర్చుకుందాం అనుకున్నాం." అంటూ ఆగింది.

"ఈ రోజుల్లో అది మరీ అంత ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. అందులోనూ నువ్వూ చేతన్ ఎంత ఇంటిమేట్ గా వుంటారో కూడా నాకు తెలుసు." కాస్త ఆగి అంది ప్రమీల. "నా అభిప్రాయం లో మీరిద్దరూ లవ్ లో వున్నారు, పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు అని."

"నేనింకా కన్ఫర్మ్ కాలేదు చేతన్ విషయం లో. ఆలా అయితే ముందు నీకే చెప్పాదాన్ని. అతనితో పెళ్ళికి కన్ఫర్మ్ కాకుండా సెక్స్ ఎలా చేద్దాం అనుకున్నావ్ అనిమాత్రం అడక్కు. కేవలం కాబోయే భర్తతో మాత్రమే సెక్స్ చెయ్యాలని, సెక్స్ చేసినవాడిని ఖచ్చితంగా పెళ్ళిచేసుకోవాలని ఆలోచించే ఆర్థోడాక్స్ మనస్తత్వం వున్న మనిషిని కాదు, నువ్వేమనుకున్నా సరే."

"నీలో ఈ రేషనల్ ఫీలింగ్ కూడా మొదటిసారి నా నాలెడ్జ్ లోకి వచ్చింది." నవ్వింది ప్రమీల. "అది తప్పా, ఒప్పా అన్న డిస్కషన్ ఇప్పుడొద్దు. అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్పు?"

"ఇది తన ఇంట్లో, తన బెడ్ రూమ్ లో. ఎవ్విరి థింగ్ ఈజ్ సెట్. మేము మేజర్ థింగ్ కి ప్రొసీడ్ అవ్వబోతూ వున్నాం. అప్పుడు ఎవరో నా చెవిలో వద్దు, వద్దు, ఆ తప్పు చెయ్యొద్దు, అని గట్టిగా అరిచిచెప్తూన్నట్టుగా అనిపించింది. ఎందుకనో ఆ ఒంటె తల వున్న మనిషి నా వైపు సకిలించుకుంటూ, పరిగెత్తుకుంటూ వస్తూన్నట్టుగా అనిపించింది. ఎందుకనో నాలో సెక్స్ కోరిక అంతా పోయి విపరీతమైన భయం కలిగింది. ఆ చేతన్ ని వెనక్కి తోసి అక్కడనుండి వచ్చేసాను."

"ఆ ఒంటె తల గాడు నిన్నెవరితోనూ సెక్స్ కూడా చెయ్యనివ్వడా? నీ మీద వాడి అధారిటీ ఏమిటి నాకు అర్ధం కావడం లేదు." చిన్నగా నవ్వుతూ అంది ప్రమీల.

"నాకు అర్ధం కానిది అదే. కేవలం చేతన్ తో మాత్రమే ఆలా ఉందేమో, వేరే వాళ్లయితే ప్రాబ్లెమ్ ఉండదేమో అని ఇంకో ఒకరిద్దరు తో నేను సెక్స్ ట్రై చేసాను. సేమ్ అదే సిట్యుయేషన్. 'వద్దు, వద్దు, ఆ తప్పు చెయ్యొద్దు.' అన్న అరుపులు వినిపించాయి. ఆ ఒంటె తలగాడు సకిలించుకుంటూ, నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చేడు. ఎప్పటిలాగే నా మనసంతా విపరీతమైన భయం తో నిండిపోయింది. పాపం వాళ్ళని విపరీతమైన నిరాశలో వదిలేసి నేనక్కడినుండి వచ్చేసాను." సారిక చెప్పింది.

"వన్ మినిట్" కుర్చీలోంచి లేచి అంది ప్రమీల. "ఈ విషయాన్ని మనం ఒకలా అనలైజ్ చెయ్యొచ్చు. నువ్వెంత ఆర్థోడాక్స్, ట్రెడిషనల్ కాదని నువ్వనుకున్నా, సబ్కాంషస్ గా నీకదే ఫీలింగ్ వుంది. నువ్వలాంటి ఫ్యామిలీ లోనే కదా పెరిగావు, పెళ్ళికి ముందు సెక్స్ చాలా తప్పు అని భావించేచోట. సరిగ్గా ఆ మూమెంట్ లో నీ సబ్కాంషస్ మైండ్ ఆ ఫీలింగ్ ని ట్రిగ్గర్ చేసివుండాలి.  అదేదో ఆ ఒంటె తల మనిషి నీతో చెప్తున్నట్టుగా అనిపించి వుండాలి.  అందుకనే నీకలాంటి ఫీలింగ్ కలిగి సెక్స్ లో పాల్గొనలేకపోయావ్."

"అప్పుడు నాక్కలిగింది తప్పనే భావం కాదు, ఎదో భయం. ఎంతమంది ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో పెరిగిన అమ్మాయిలు ఈజీ గా సెక్స్ చెయ్యడం లేదు? మరోవిషయం చెప్పనా? నన్ను ఎంత ముద్దుగా, గారాబంగా పెంచినా, నా మామ్ నన్నేమీ సెక్స్ అంటే తప్పు అని ఆలోచించేలా పెంచలేదు. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఐ మే హేవ్ ఇట్ ఆర్ నాట్ ఎట్ మై ఓన్ థింకింగ్. నిప్పుల కొలిమిలా శరీరం మండుతున్నా కోరిక తీర్చుకోలేకపోతున్నందుకు నాకు చాలా ఫ్రస్ట్రెటింగా వుంది."

"ఎస్, ఎప్పుడన్నా నీ బ్రో చాలా రోజులు అందుబాటులో లేకపోతె నాకూ అలానే అనిపిస్తుంది." ప్రమీల అంది.

"ఇదేదో నేను సెక్స్ కోరిక తీర్చుకోలేకపోతూన్నందుకు నీకు చెప్పడం లేదు. కానీ ఈ విషయం లో కూడా నేనెందుకు డిఫరెంట్ గా వున్నాను? అందరి ఆడపిల్లల్లా ఎందుకు ఉండలేకపోతున్నాను? సంథింగ్ ఈజ్ టెరిబ్లీ రాంగ్ విత్ మీ. వై ఐ యాం అన్ లక్కీ లైక్ దిస్?"    

"నీ లైఫ్ కొంచెం డిఫరెంట్ గా వున్న మాట నిజమే. కానీ నిన్ను నువ్వు అన్లక్కీ అనుకోకు. నువ్వెంతో పెద్ద వెల్తీ ఫ్యామిలీ లో పుట్టావ్. నిన్నెంతో ప్రేమించే గ్రాండ్ పా, పేరెంట్స్ ఇంకా బ్రదర్స్ వున్నారు. ఇంకా చెప్పాలంటే నువ్వంటే ప్రాణం పెట్టె నీ క్లోజ్ ఫ్రెండ్ నే నీకు వదిన గా వున్నాను." మళ్ళీ వచ్చి ఖాళీ చేసిన కుర్చీలో కూచుంది ప్రమీల.  

"ఆ విషయం నేనొప్పుకుంటాను. కానీ నేనిలా సఫర్ అవ్వాల్సినదేనా? నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ లేదా?"

"ఇన్ని సంవత్సరాలలో మొట్టమొదటిసారి నువ్వు నా ముందు ఓపెన్ అయి నీ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ అడిగావు. ఐ ప్రామిస్ యు............" నొక్కిచెప్పటానికి అన్నట్టుగా ఆగి అంది ప్రమీల. ".............. హండ్రెడ్ పెర్సెంట్ నీ ప్రాబ్లెమ్ కి నేను సొల్యూషన్ కనుక్కుంటాను. అతి త్వరలో నిన్ను మా అందరిలా మామూలుగా చేసేస్తాను."

సారిక కుర్చీలోనుండి లేచివచ్చి, ప్రమీల మెడ చుట్టూ చేతులు వేసి, తల మీద ముద్దు పెట్టుకుంది. "ఎందుకనో తెలీదు. నీ మాటల మీద నాకు నమ్మకం కలుగుతూంది. యు ఆర్ కాపబుల్ టు డు దట్."

సారిక తన చుట్టూ వేసిన చేతుల్ని అలాగే ఉంచుకుని, తనూ లేచినిలబడి, సారికని దగ్గరకి తీసుకుని అంది ప్రమీల. "హౌ ఫార్ట్యూనేట్ వుయ్ బోత్ ఆర్ టు హావ్ ఈచ్ అదర్."    

"మీరిద్దరూ చాలా ఫార్ట్యూనేట్. కానీ సప్పర్ కి రండి. మేమందరం మీకోసం చూస్తున్నాం అక్కడ." అప్పుడు ఆ రూమ్ లోకి వచ్చిన వంశీ అన్నాడు.

ఆ తరువాత ఆ రూమ్ లోనుండి బయటకి నడిచారు ముగ్గురూ .

&&&

" తను పద్దెనిమిదో సంవత్సరం లోకి  ప్రవేశించింది. కబుసా ఇష్టపడే వయసు వచ్చేసింది. తనవల్ల తప్పు జరగకుండా ఇప్పటివరకూ కబుసా ఏ చూసుకుంటూ వున్నాడు. తను కబుసా కి సమర్పించుకునేవరకూ మనం జాగ్రత్తగానే ఉండాలి." సాముదమ్మ చెప్తోంది.

"నేను జాగ్రత్తగానే వున్నాను, జాగ్రత్తగానే వుంటాను. నేను ధ్యానం లో కూచున్నప్పుడల్లా నువ్వొచ్చి నా బుర్ర తినక్కర్లేదు." కోపంగా అన్నాడు సింహరాజు.

"ఆ ఎంత జాగ్రత్తగా వున్నారో తెలిసిన విషయమే. కబుసా అనుభవించకుండా నువ్వు తనని ముట్టుకోకూడదని తెలిసి, తనని అనుభవించావు. కబుసా ఆగ్రహానికి గురయ్యారు. చివరికి ఏమయిందో చూసావు కదా." సాముదమ్మ కోపంగా అంది.

"అది కబుసా ఆగ్రహం వాళ్ళ జరగలేదు. ఆ రాక్షసులవల్ల జరిగింది. ఏదో కారణం వాళ్ళ అసక్తుడైపోయి కబుసా తనని కాపాడలేకపోయాడు. లేకపోతే అది జరగనిచ్చివుండేవాడు కాదు."

"ఆ విషయం గురించి నేను చెప్పలేను. కానీ తాను ఇష్టపడ్డ కన్నెపిల్లని మరొకళ్ళు ముందుగా అనుభవించడం కబుసా కి అసలు ఇష్టం ఉండదు. కబుసాని మొదటినుండి పూజిస్తూన్న నీకు ఆ విషయం తెలియదా?"

ఈ ప్రశ్న మొదటిసారి అడగలేదు సాముదమ్మ సింహరాజు ని. తను ఈ ప్రశ్న అడిగిన  ప్రతిసారీ ఇలాగె మౌనంగా ఉండిపోతాడు సింహరాజు.

"ఇంక ఏ దేవతలు లేనట్టు కబుసా ని ప్రసన్నం చేసుకోవడానికే తనని ప్రేరేపించావు. తను అంతగా ఇష్టపడితే వేరే ఎంతమంది లేరు? కబుసా తో ఎంత ఇబ్బందో నీకు తెలియదా?"

"సామమ్మా నీకెన్ని సార్లు చెప్పాలి? తనని కబుసా నే కాదు, ఏ చెడ్డ దేవతని ప్రసన్నం చేసుకోమనడం నా ఉద్దేశం కాదు. తనని కబుసా ఇష్టపడ్డాడు. తను కబుసా కళ్ళల్లో మెరుపు ని చూసింది. తనవైపు లాగబడింది. తనకీ కబుసాని పూజించి ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది." మళ్ళీ కోపం వచ్చింది సింహరాజు కి.  "నిజానికి కబుసా అంటే తనకీ చాలా కాలంగా ఆసక్తి వుండేది, అతని అనుగ్రహం తో శక్తులు సంపాదించాలనుకుంటూ వుండేది."

"అయినప్పటికీ కూడా, ఏ కన్నెపిల్లా తనంతట తనుగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్ప, కబుసా తన జోలికి రాలేడు. ఒకసారి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభిస్తే జన్మ, జన్మల వరకూ వదలడు. తను కబుసా ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించబట్టే కదా, తను ఇంకో జన్మ ఎత్తినా మనం తనగురించి ఇలా తాపత్రయపడాల్సి వస్తూంది." ఈ సారి సామమ్మ లో ఆందోళన వుంది.  "తను ఎంత ఇష్టం చూపించినా నువ్వు ప్రోత్సహించకుండా వారించి ఉండాల్సింది."

"నువ్వు చెప్పింది నిజమే సామమ్మా. ఈ పిల్లది మల్లికవున్న పరిస్థితి కాదు. కబుసాని ప్రసన్నం చేసుకోవడానికి మల్లిక చేసింది ఏదీ ఈ పిల్ల చెయ్యలేదు. అందులోనూ కబుసా గురించి చెప్పి ఈ పిల్లని ఒప్పించడమూ సాధ్యమయ్యేవిషయం కాదు. కబుసా ప్రసన్నం అయితే వచ్చే లాభాల గురించి ఆలోచించానే తప్ప వేరే ఏం ఆలోచించలేకపోయాను." విచారం గా అన్నాడు సింహరాజు.            

"అంతకన్నా పెద్ద పొరపాటే చేసిచచ్చారు. కబుసా కి ఎంతమాత్రం ఇష్టం ఉండదని తెలిసీ, తను అనుభవించడానికి ముందే మీరిద్దరూ శృంగారం లో పాల్గొన్నారు. ఒకవేళ మల్లిక వున్నా కబుసా తనుచేసిన పనికి  శిక్షించేవాడే కానీ కరుణించేవాడు కాదు."

"నిజం చెప్పాలంటే............" ఎదో చెప్పబోయాడు సింహరాజు.

"మల్లిక కావాలనడం వల్ల మాత్రమే అనకు. తను చిన్నపిల్ల. తనకి తెలీదు. నీకు తెలీదా? తను ఇష్టపడుతోందని కబుసా ఎంత ప్రమాదకరమైన దేముడో తెలిసి ఆరాధించడం లో సహాయం చేసావు. కబుసా కి ఎంతమాత్రం ఇష్టం ఉండదని తెలిసి తనకన్నా ముందు మల్లికని నువ్వు అనుభవించావు. కబుసా కోపం తనమీదే కాదు, నీ మీద కూడా. ఈ జన్మలోనైనా తనని ముందుగా తనకి దక్కనివ్వకపోతే ఊరుకోడు. నువ్వు ఆ అమ్మాయిని తన వశం చేస్తానని మాట  ఇవ్వబట్టే ఊరుకున్నాడు. లేకపోతె నిన్నెలా శిక్షించివుండేవాడో నేనూహించలేను."

"కానీ అదెలా చెయ్యాలో నాకు బోధపడడం లేదు. ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి, ఎలా ఈ విషయానికి సిద్ధం చెయ్యాలి? అసలు కబుసాని ఆరాధించడానికి, అతనికి సమర్పించుకోవడానికి  ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా? నేనేం చెయ్యాలి ఇప్పుడు?"

"తనని ఇష్టపడే కబుసా ఏ మార్గం చూపిస్తాడు. కబుసా ఇష్టపడే పద్దెనిమిదో సంవత్సరం లోకి ఆ అమ్మాయి ఇప్పుడే ప్రవేశించింది. కబుసా ని ప్రార్ధించి కబుసా నే అడుగు."

"అది సరే. మల్లిక కి ఆ గతి పట్టించిన రాక్షసుల గురించి నువ్వేం ఆలోచించవా? వాళ్ళని ముక్కలు, ముక్కలు గా నరకాలన్నంత కోపం నీకు రావడం లేదా?" అకస్మాత్తుగా విపరీతమైన కోపం వచ్చింది సింహరాజు కి.

వికృతంగా నవ్వింది సాముదమ్మ. "ఒక్కసారి ఆ అమ్మాయిని కబుసా కి సమర్పించుకోనీ. అప్పుడు మల్లిక మీద వున్న కోపం కబుసా కి పోతుంది. తనకి అలాంటి చావుకి కారణమైన వాళ్ళందరినీ చిత్రవధ చేసిచంపుతాడు." కాస్త ఆగింది. "కానీ ముందు ఈ అమ్మాయిని ఎలా కాపాడాలి అని ఆలోచించు. కబుసా ఇష్టపడే అతి ముఖ్యమైన పద్దెనిమిదో సంవత్సరంలోకి ఈ అమ్మాయి ప్రవేశించేసింది." మరోసారి అదే విషయం చెప్పాక సింహరాజు మస్తిష్కం లోనుండి మాయమైపోయింది సాముదమ్మ.

దీర్ఘంగా నిట్టూరుస్తూ ధ్యానం లోనుండి లేచాడు సింహరాజు. ఎదురుగా వున్న కబుసా విగ్రహానికి నమస్కారం చేసుకుని బయటకి నడిచాడు. ఎంతవద్దనుకున్నా పాత రోజులు పాత జ్ఞాపకాలు వెంటాడుతూనే వున్నాయి.           

&&&

"అందరు చెడ్డ దేవుళ్ళలోకి కొంచెం తేడాగా వుండే దేవుడు ఈ కబుసా. ఆడా, మగా అందరూ తనని పూజించి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ముఖ్యంగా కన్నెపిల్లల్ని ఇష్టపడతాడు. కబుసా ని ప్రసన్నం చేసుకుని అతనివల్ల లాభం పొందడానికి చాలామంది కన్నెపిల్లలు కూడా కబుసా ని పూజిస్తారు. కానీ తాను ప్రత్యేకంగా ఇష్టపడే కొద్దిమందికి మాత్రమే ప్రసన్నం అవుతాడు. అలా తను ఏ కన్నెపిల్లనైతే ఇష్టపడుతున్నాడో, ఆ కన్నెపిల్ల కబుసా కళ్ళల్లో మెరుపుని చూడగలుగుతుంది, తనవైపు లాగబడుతుంది, సరిగ్గా నీకు జరిగినవిధంగానే."

ఆ మర్నాడు సాయంత్రం సింహరాజు దగ్గరికి మళ్ళీ వచ్చింది మల్లిక. వస్తూనే తనకి కబుసా గురించి, అతన్ని పూజించే విధానం గురించి చెప్పమని అడిగింది. సింహరాజు చెప్తూవున్నాడు.

"నిజంగానా? అంటే నేను చాలా అదృష్టవంతురాలినన్నమాట." ఆనందంగా నవ్వుతూ అంది మల్లిక.  

"ఒకరకంగా అదృష్టవంతురాలివే. కానీ కబుసా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. తను ఇష్టపడే కన్నెపిల్ల తనని ఆరాధిస్తే, ఆమెని మొదట తనే అనుభవించాలనుకుంటాడు. అదీ ఆ కన్నెపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినతరువాత మాత్రమే. ఈ లోపున ఆ కన్నెపిల్ల ఇంకెవరితోనన్న శృంగారంలో పాల్గొంటే విపరీతంగా కోపం తెచ్చుకుని తనని శిక్షిస్తాడు."

"ఓహ్, అయితే కబుసా ఇష్టపడే అమ్మాయిలంతా పెళ్లి, పెటాకులు లేకుండా కబుసా కె కట్టుబడివుండాలా?" అప్పటికయితే అదిపెద్ద ఇబ్బందిపెట్టే నిబంధనలా అనిపించకపోయినా మల్లిక అడిగింది.

"అలాగని ఏం లేదు. ఒకసారి కబుసా చేత అనుభవించబడ్డాక ఆ కన్నెపిల్ల ఎంతమందితోనైనా శృంగారం లో పాల్గొనొచ్చు. వాళ్లతో పిల్లల్ని కనొచ్చు. కాకపోతే కబుసా తనని అనుభవించేవరకూ తనకి మగవాసన తగలకూడదు. అలాగే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవరకూ కబుసా తనని అనుభవించడు."

"బాగానే వుంది." నవ్వింది మల్లిక. "కానీ అందుకు పద్దెనిమిది సంవత్సరాలు ఎందుకు ఆగాలి?"

"నాకు తెలీదు. కానీ పద్దెనిమిది కబుసా ఇష్టపడే సంఖ్య.  మగపిల్లల్లో కూడా పద్దెనిమిది వచ్చాక కరుణిస్తాడు. నాకు ఇప్పుడే కదా పద్దెనిమిది వచ్చింది. అందుకని నాక్కూడా కబుసా అనుగ్రహం లభిస్తుందనే ఆశిస్తున్నా. కన్నెపిల్లలమీదంత కరుణ చూపకపోయినా, మగవాళ్ళని, ఆడవాళ్ళని కూడా శ్రద్ధగా ఆరాధిస్తే కబుసా అనుగ్రహిస్తాడు. కబుసా అనుగ్రహం దొరికితే మనం చాలా చెయ్యొచ్చు."

"ఏమేం చెయ్యొచ్చు?" కళ్ళు చిట్లించి ఆసక్తిగా అడిగింది.

"మనకి కొత్త శక్తులు వస్తాయి. మనం భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. మనం శత్రువుల దగ్గరకి వెళ్లకుండానే వాళ్ళమీద పగ తీర్చుకోవచ్చు. మనకొచ్చిన శక్తులతో బాగా డబ్బుకూడా సంపాదించుకోవచ్చు. తక్కిన చెడ్డ దేవుళ్ళ కన్నా మనకి కబుసా చాలా శక్తులే ఇస్తాడు."

"అయితే కబుసా ని నేను ఖచ్చితంగా ఆరాధించే తీరతాను. ఇంకా ఆలస్యం దేనికి? కబుసాని ఎలా ఆరాధించాలి, ఏ ప్రకారంగా ప్రసన్నం చేసుకోవాలో చెప్పు." ఆసక్తి ఇంకా ఎక్కువ అయిపోతూవుంటే, ఆశగా అడిగింది మల్లిక.

"ఆగు. తొందరపడకు. ఇప్పటివరకూ మనకి కబుసాలో ఉపయోగపడేవే చెప్పాను. ఇబ్బంది పెట్టేవి చెప్పలేదు. ఒకసారి మనం కబుసా వశమయ్యామంటే జన్మ, జన్మల వరకూ మనల్ని విడిచిపెట్టాడు, ఆ బంధం అలా కొనసాగాల్సిందే."

"అయితే మాత్రం మనకి వచ్చిన ఇబ్బంది ఏమిటి? మనకి చాలా శక్తులవీ ప్రసాదిస్తాడు కదా." భృకుటి ముడిచి అడిగింది మల్లిక.

"అది నిజమే. కానీ......." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికిఅన్నట్టుగా ఒక సెకండ్ ఆగాడు సింహరాజు. "........... కబుసాని పూజించేవాళ్ళు వేరే చెడ్డ దేవుళ్ళని కానీ, మంచి దేవుళ్ళని కానీ పూజించకూడదు, ఇంకా ఏ జన్మలోనైనా సరే."

"వచ్చిన సమస్య ఏముంది? నా అమ్మ కాన్సర్ తో చనిపోతూవుంటే మేము నమ్ముకున్న దేవుడు కాపాడాడా? నన్ను నా సవతి తల్లి కుటుంబం అన్ని బాధలు పెడుతూంటే మేము ప్రస్తుతం పూజిస్తూన్న దేముడు ఎమన్నా ఆదుకున్నాడా? అందరి దేముళ్ళని మర్చిపోయి కబుసా నే పూజించడానికి నాకైతే అభ్యంతరం లేదు." నిట్టూరుస్తూ అంది మల్లిక.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)