Part - II
ఆ సంఝటన జరిగిన కొన్ని రోజుల తరువాత. ఊరి ప్రజలందరు ఒక బంగళా ముందు సమావేశం అయ్యారు.
ఆ బంగళాలొంచి తెల్లటి పట్టు పంచె, లాల్చి, వేశుకొని భుజం పై కండువా తొ ఒక మిడి వయసు వ్యక్తి వస్తున్నాడు.
అతనిని చూడగానె ఊరి ప్రజలు మరియు గ్రామ పెద్దలందరు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు.
అతను ఎవరో కాదు. తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన వాడు నేటి తరం వారసుడు. రాజా మహేంద్ర వర్మ.
రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యం వచ్చిన కూడా అతని తాతలు మరియు తండ్రి లాగె నిత్యం ఆ ఊరి ప్రజల కోసం పాటు పడె వ్యక్తి.
రాజకీయాలకు దూరంగా ఉంటాడు. పదవి కాంక్ష లేదు. విదేశాల్లో చదువుకోని కూడా ఆ చదువు తన ఊరి ప్రజలకు ఉపయోగపడాలి అనె ఉద్దేష్యంతొ. దంతపురం లొనె స్థిరపడి ఆ ఊరిని ఎంతగానొ అభివృద్ది చేశాడు. ఉచిత పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు కట్టించాడు.
ఊరికి ఏ సమస్య వచ్చిన ప్రజలందరు అతనినె సంప్రదిస్తారు. ఇప్పుడు కూడా ఊరికి వచ్చిన సమస్య గురించి మాట్లాడడానికె గ్రామ పెద్దలందరు ఊరి ప్రజలతొ కలిసి వచ్చారు.
అందరికి నమస్కరించి కూర్చోమని చెప్పి తాను కూర్చున్నాడు.
"చెప్పండి అందరు ఏంటి ఇలా వచ్చారు." అని అడగగా
అప్పుడు ఆ ఊరి ప్రెసిడెంటు గురు మూర్తి "అయ్యా మీకు తెలియంది కాదు ఎప్పుడైతె ఆ వీరఝాతకుడి విగ్రహం విరిగిందొ అప్పటినుంచె ఈ ఊరిలొ సమస్యలు మొదలైయ్యాయి."
" అవునండి ఇప్పటికి ఈ ఊరిలొ 7 గురు చనిపోయారు. అందరి ఒంటిమీదా ఒకేరకమైన కత్తిగాట్లు. ఎవరు చంపుతున్నారో ఎవరికి అర్ధం కావడం లేదు" అంటు ఆ షావుకారు రామ్మోహన్ అన్నాడు.
ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ ఊరి గుడి పూజారి కల్పించుకోని " అయ్యా మీకు తెలుసు ఇది ఆ వీరఝాతకుని శాపం. మీ పూర్వికులు ఆ శాపానికి విరుగుడు గా ఈ ఊరి నడిబొడ్డున శాంతి హోమం జరిపించి. అతని విగ్రహాన్నీ పెట్టారు. ఇప్పుడు అది విరిగిపోయింది..."
"ఈ రోజుల్లో ఈ శాపాలు ఆత్మలు ఏంటి పూజారి గారు. ఇవన్నీ మూడనమ్మకాలు"
అని మహేంద్ర వర్మ అనగా
"అలా అనకండి అయ్యా ఒకసారి మళ్ళి శాంతి హోమం చేయించి కొత్త విగ్రహాన్నీ పెడదాము." అని గుడి పూజారి అన్నాడు.
"అలా కుదరదు ఇప్పుడు. ఎందుకంటె ఈ చావుల యెక్క మర్మం ఏంటని తెలుసుకోవడం కోసం. ప్రభుత్వం ఈ case గురించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ (Special Investigation team) ఏర్పాటు చేయ్యాలి అనుకుంటుంది. వాళ్ళు వచ్చి ఏంటి అనేది తేల్చేంత వరకు ఈ ఊరులొ మనం ఇటువంటి పనులు ఏమి చేయకూడదు. అలా చేయాలంటె మనం మంత్రిగారి వద్ద అనుమతి తీసుకోవాలి " అని చెప్పాడు మహేంద్రవర్మ
" మరి మీరు ఒక్కసారి మంత్రి గారి తొ మాట్లాడి చూడండి" అని పూజారి ?రియు ప్రెసిడెంట్ గురుమూర్తి అనగా
"చూద్దాం. రేపో ఎప్పడొ వెళ్ళి మాట్లాడడానికి వెళతా" అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళి పోతాడు.
కొన్ని రోజుల తరువాత వంశి అనె యువకుడు ఈ దంతపురం ఊరికి వస్తాడు. అతడు ఒక క్రైమ్ ఇన్వెష్టిగేటివ్ జర్నలిష్ట్ (Crime Investigative Journalist). ఈ ఊరిలొ జరుగుతున్న అనుమానస్పద హత్యలు (Mysterious Deaths) గురించి తెలుసుకుందామని వచ్చాడు.
కాని ఆ విషయాన్నీ దాచి ఆ ఊరి ప్రెసిడెంటు గురుమూర్తి ని కలుస్తాడు.
ప్రెసిడెంటు గురుమూర్తి వంశీని చూసి " ఎవరు బాబు నువ్వు.? ఏం కావాలి?"
"నేను వంశిని. నారాయణమూర్తిగారి అబ్బాయిని" అని అనగానె.
గురుమూర్తి కోపంగా
"ఎందుకు వచ్చావు రా మేము చచ్చామ బ్రతికున్నామ అని తెలుసుకోడానికి పంపించాడా మీ నాన్న" అని అడగగానె
వంశి ఏమి మాట్లాడకుండా మౌనంగా నించున్నాడు.
తను ఏమి మాట్లాడకపోయెసరికి. గురుమూర్తి తనవైపు చూసి. "ఏ రా ఏం మాట్లాడవు."
"ఇంకా మా నాన్న మీద కోపం పోలేదా పెద్ద నాన్న? " అని వంశి అడిగాడు
" మీ నాన్న వస్తాడని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసాను. అమ్మ నాన్న చనిపోతె నేనే వాడిని పెంచి పెద్ద చేసాను. ఆ మాత్రం కొట్టే అధికారం నాకు ఉండదా. దానికే వాడు ఇల్లు వదిలి పెట్టి వెళ్ళపోవాలా.
వాడు మీ అమ్మ ని ప్రేమించిన విషయం నాకు ముంద చెప్పకుండా. వెరొకరితొ వాడికి పెళ్ళి ఏర్పాట్లు చేసినప్పుడు. చెప్పా పెట్టకుండా మీ అమ్మని పెళ్ళి చేసుకొని తీసుకొచ్చాడు అప్పుడు నాకు కోపం రాదా చెప్పు. ఇప్పుడు కూడా వాడు రాకుండా నిన్ను మాత్రమె పంపించాడు చూడు"
"రావాలి అనుకున్నా ఇప్పుడు మా నాన్న రాలేరు పెద్ద నాన్నా"
"ఎందకంటా ?"
"ఎందుకంటె నాన్న చనిపోయాడు పెద్దనాన్న"
"ఏం మాట్లాడుతున్నావు రా?"
"అవును పెద్దనాన్న 2 నెలల క్రితం సింహీచలం నుంచి కారులొ వస్తుంటె. బ్రేకులు లేని లారి వచ్చి గుద్దడం తొ అమ్మ అక్కడె చనిపోతె. నాన్న హాస్పెటల్లొ చేరిన రెండు రోజులకి చనిపోయాడు"
ఇది విని గురుమూర్తి ఎంతో బాధ పడ్డాడు. "తన తమ్మడు చివరి చూపు కూడా తనకి దక్కలేదె" అని వంశిని పట్టుకొని ఏడ్చాడు.
కొన్ని రోజులకి గురుమూర్తి కుదుట పడ్డాడు.
వంశి తన పెద్ద నాన్న ఇంట్లోనె ఉంటు. ఈ చావులకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం మొదలు పెట్టాడు.
తాను తెలుసుకున్న వివరాల ప్రకారం ఆ 7 గురు ఒకె రకమైన కత్తిపోట్లతొ చనిపోవడమె కాకుండా చనిపోయె ముందు వాళ్ళందరు ఊరి చివర మఱ్ఱి చెట్టు దగ్గరకు వెళ్ళారు అని తెలుసుకుంటాడు
"వాళ్ళంతా అక్కడ నుంచి వచ్చాకె చనిపోయారు. కాబట్టి ఆ చెట్టు దగ్గర ఎదొ ఉంది. అది ఏంటొ తెలుసు కోవాలి." అని వంశి అనుకుంటూ ఉండగా బయట పెద్ద పెద్ద కేకలు వినబడతాయి. ఏంటి అని వంశి వెళ్ళి చూడగా
"కాపాడండి నన్ను కాపాడండి" అంటు శివయ్య అరుస్తు పరిగెడుతున్నాడు.
తన ఒంటి మీద ఎవరొ కత్తి తొ దాడి చెస్తున్నారు కాని తన వెనక ఎవరు లేరు. కాని ఒంటి మీద ఒకటి తరువాత కత్తి గాట్లు పడుతున్నాయి.
గొంత దగ్గర కూడా తెగె సరికి తీవ్ర రక్త స్రావంతొ అక్కడికి అక్కడె చనిపోయాడు.
తరువాత పోలీసులు వచ్చి శవాన్నీ శవ పరీక్ష (Post Mortem) కోసం తీసుకు వెళతారు.
వంశి వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడె ఉండి శవ పరీక్ష (Post Mortem) తాలుక రిపోర్ట వచ్చాక చూస్తాడు. ఆ రీపోర్టు లొ కత్తి పోట్ల వల్లె చనిపోయాడు అని వ్రాసి ఉంటుంది.
వంశి కి అసలు అర్ధంకాదు. శివయ్య బంధువుల మాటల ద్వారా తాను కూడా ముందు రోజు రాత్రి ఆ మఱ్ఱి చెట్టు వద్దకు వెళ్ళాడు అని తెలుస్తుకుంటాడు.
"అసలు సంగతి ఏంటో తెలియాలి అంటె ఈ రోజు రాత్రి ఎలాగైన ఆ మఱ్ఱి చెట్టు వద్దకు వెళ్ళాలి" అని వంశి అనుకుంటాడు.
ఆ రోజు రాత్రి అందరు నిద్ర పోయాక. వంశి ఎవరికి తెలియకుండా ఆ ఊరి చివర మఱ్ఱి చెట్టు వద్దకు వెళతాడు.