Read Betrayal by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నమ్మక ద్రోహం

నమ్మిన వారిని ద్రోహం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఒక వ్యక్తి మనల్ని నమ్మారంటే ఎట్టి పరిస్థితుల్లో దానిని వమ్ము చేయకూడదు. నమ్మకద్రోహం చేసిన వ్యక్తి ఎంతటి శిక్ష ఎదుర్కొంటాడో చెప్పే ఒక నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

నమ్మకం మరియు మోసం అనే అంశంపై నీతి కథ: 

ఒక రోజు ఓ వేటగాడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో అతనికి ఓ పులి కనిపిస్తుంది. పులి నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న చెట్టుపైకి ఎక్కుతాడు. అయితే అప్పటికే ఆ చెట్టుపై ఓ ఎలుగుబంటి పడుకుని ఉంటుంది. ఎలుగుబంటిని చూసిన ఆ వేటగాడు.. 'పులి నన్ను చంపాలని చూస్తోంది. దయచేసి నాకు చోటు కల్పించు' అని రెండు చేతులు జోడించి వేడుకుంటాడు. దీంతో కనుకరించిన ఎలుగుబంటి సరే అని చెప్తుంది. 

ఇంతలోనే చెట్టు కింద ఉన్న పులి, ఎలుగుబంటితో మాట్లాడుతూ.. 'ఆ మనిషి మన ఇద్దరికీ శత్రువు. అతన్ని కిందికి తొసేయ్‌ ఎంచక్కా ఇద్దరం కలిసి ఆరగిద్దాం' అని అంటుంది. అయితే ఎలుగుబంటి బదులిస్తూ.. 'లేదు నేను ఆపనిని చేయను. ఆయనను రక్షిస్తానని మాటిచ్చాను. నేను నమ్మకద్రోహం చేయను' అని చెబుతుంది. 

దీంతో పులి ఈ సారి వేటగాడిని టార్గెట్‌ చేస్తుంది. అతనితో మాట్లాడుతూ.. 'నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు ఆ ఎలుగు బంటిని కిందికి తోసేస్తే నిన్ను వదిలేస్తా. ఎంచక్కా మీ ఇంటికి వెళ్లిపోవచ్చు' అని ఆశచూపుతుంది. దీంతో వేటగాడిలోని కన్నింగ్ నెస్‌ బయటపడుతుంది. పులి చెప్పినట్లుగానే ఎలుగుబంటిని కిందికి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. 

అయితే లక్కీగా ఆ ఎలుగుబంటి చెట్టు చివరి కొమ్మను పట్టుకొని మళ్లీ పైకి వెళ్లిపోతుంది. దీన్నే ఆసరగా చేసుకున్న పులి.. 'చూశావా ఎలుగు.. మనుషులు ఎంత స్వార్థపరులో. నిన్ను మోసం చేసిన వాడిని తోసేయ్‌' అని అంటుంది. అయినా ఎలుగు మాత్రం మాట తప్పదు. అతను నన్ను మోసం చేయాలని చూసినా సరే నేను మాత్రం నా ధర్మాన్ని వీడను, ఇచ్చిన మాటను మరువను అని తేల్చి చెబుతుంది. 

దీంతో ఇది వర్కవుట్‌ అయ్యేలా లేదనుకుని పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎలుగు కూడా ఆ వేటగాడిని క్షమించేసి వెళ్లిపోతుంది. దీంతో వేటగాడికి పశ్చాతాపం మొదలవుతుంది. ఆ క్రూర జంతువుకు ఉన్న జ్ఞానం నాకు లేదని బాధపడుతూ వెళ్తుంటాడు. అయితే జీవితాంతం ఈ సంఘటన అతని మనసును వేధిస్తూనే ఉంటుంది. నమ్మకద్రోహం చేయాలని చూసిన అతని మనసును ఆ సంఘటన తొలచివేస్తూనే ఉంటుంది. 

నీతి: మనల్ని నమ్మిన వ్యక్తిని ఎప్పటికీ మోసం చేయకూడదు. ఆ క్షణంలో అది మనకు సంతోషాన్ని ఇచ్చినా జీవితాంతం ఆ బాధ మనల్ని వేధిస్తూనే ఉంటుంది.

జీవితంలో చేయకూడనివి...

నమ్మకద్రోహం, అనుబంధాలను తెంపుకోవడం, ఇచ్చిన మాట తప్పడం, ఎదుటివారి మనస్సు నొచ్చుకునేట్లు ప్రవర్తించడం... ఈ నాలుగింటినీ ఎందుకంటే చేయకూడదు. గాయపడిన హృదయం చేసే ఆక్రందన పైకి వినిపించదు, క్షోభిస్తుంది, లోలోపలే నరకయాతన అనుభవిస్తుంది. తద్వారా మనోబలం సన్నగిల్లిపోతుంది. ఇక, అసత్యాలు ఆడటం... కొందరికి ఊరికే అబద్ధాలాడటం అలవాటు. ఒక అబద్ధం ఎదుటివారి ప్రాణాలనో, కాపురాన్నో, జీవితాన్నో నిలబట్టేలా ఉండాలి కానీ, తీసేసేలా ఉండకూడదు. నమ్మకద్రోహం... అవతలివారికే కాదు, నమ్మక ద్రోహానికి పాల్పడేవారికి కూడా అపాయకరమే. మనం ఎదుటివారికి ఏమి చేస్తామో, అటువంటి ఫలం అంతకు మిక్కిలిగా మనకు లేదా మన సంతానానికి సంక్రమించి తీరుతుంది. అదేవిధంగా ఎదుటివారి మనస్సు నొచ్చుకునేటట్లు చేయడం వల్ల తాత్కాలికంగా మనకు ఆనందాన్ని ఇవ్వవచ్చునేమో కానీ, వారు ఎంతగా బాధపడతారో, తిరిగి అంత బాధనూ మనం అనుభవించవలసి వస్తుంది. ఇది కర్మసిద్ధాంతం. అనుబంధాలను తెంపుకోవడం కూడా అంతే! మనని ఇష్టపడేవారు, మన బాగోగులు కోరుకునేవారు, మనమీద ఆధారపడేవారితో అనుబంధాలను బలవంతంగా తెంచుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు.

అనుబంధాలకు విలువ ఇచ్చేవారు తమకిష్టమైనవారిలో వంద లోపాలున్నప్పటికీ, వారిని ప్రేమించడానికి ఒక్క కారణం చాలంటారు. నచ్చనప్పుడు ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. అనుబంధాలను తెంచుకున్న మనిషి సముద్రమంతటి ఒంటరితనా న్ని అనుభవించాల్సి వస్తుంది. అది వినడానికి సముద్ర ఘోష తప్ప మరెవరూ ఉండరు.

దృఢమైన నమ్మకం 

పశువులను మేపుతున్న ఒక బాలునికి చెట్టుపైనున్న గూటిలొ ఒక గ్రద్ద గుడ్డును తన ఇంటిలో పొదిగే కోడి గుడ్లలో ఉంచాడు, ఈ గద్ద గుడ్డును కోడి తన గుడ్లతో పాటు పొదిగింది గద్ద పిల్ల తాను కూడా కోడిపిల్ల అనుకుని ఇతర కోడి పిల్లలతో పాటు తిరుగసాగింది, ఆ గద్దపిల్ల తాను కోడిపిల్లనన్న విశ్వాసంతో కోడిపిల్ల లాగానే వ్యవహరిస్తూ జీవించింది, అందుకే ఆ గద్దపిల్ల ఎగరడానికి ప్రయత్నించలేక మిగతా కోడిపిల్లల మధ్య కంచె లోపలే పెరుగుతూ వచ్చింది, గద్దపిల్ల ధృఢంగా పెరిగి పెద్దదైన తరువాత తను కోడిపిల్ల కాదన్న భావంతో పైకి ఎగరాలన్న కోరికి కలిగింది, తాను ఎగరగలనన్న నమ్మకమే ఈ కోరికకు బలమైన కారణమైంది. ఒకరోజు గద్దపిల్ల తన విశాలమైన రెక్కలను విరుచుకొని ఎగిరేందుకు ప్రారంభించింది, అలా ఎగురుతూ పైపైకి పోయింది, పై ఎత్తుకు ఎగిరిన గద్ద ఎత్తైన చెట్టుపై ఉన్న తన గూటిని చేరింది, తన విధి కంచె లోపల తిరిగే కోడిపిల్లగా జీవించడం కాదన్న నమ్మకం గద్దకు కలిగింది, తన నమ్మకం కారణంగా ఆ గద్ద తన నిజమైన గట్టి శక్తిని తెలుసుకోగలిగింది, ఇప్పుడు ఆ గద్ద ఎత్తైన చెట్టుపైన నివసించే ధైర్యానికి, స్వతంత్రానికి చిహ్నంగా అమెరికా గరుడ పక్షిగా సువిశాల, వినీల ఆకాశంలొ చాలా ఎత్తుకు ఎదగ గలిగింది." 

బంతిని ఎంత బలంగా పైకి వేస్తే అంత బలంగా కిందకు వచ్చి ఢీ కొడుతుంది.

అలాగే

ఎదుటివారిపై మీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో..

నమ్మక ద్రోహం కూడా అంతే బలంగా ఉంటుంది.

Be ready for Everything..

Not having control on fear is failure, but fear isn't failure.

భయంపై నియంత్రణ లేకపోవడం వైఫల్యం కానీ భయం అనేది వైఫల్యం కాదు.