Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కలలు నీవే.. కష్టం నీదే.. ఆశలు నీవే.. ఆశయం నీదే..

కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకొంటారు. సరే అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే.. చిన్న విషయాలకే. కలలు గొప్పగా ఉంటాయి.. కానీ ప్రయత్నాలే.. మెుదలుకావు.
కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే ప్రయత్నం చేసి ఓడిపోతే.. అది ఒక పద్ధతి.. కానీ ప్రయత్నమే మెుదలుకాకుండా.. ఓడిపోయామని ఇంట్లోనే కూర్చొంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు.. అలా చేసి ఉంటే ఇంకా బాగుండు.. అంటూ.. ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే.. కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకోండి..

గద్ద చెప్పే జీవిత పాాఠం

ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది.. కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే.. మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్లు వచ్చేసరికి.. గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు.ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండు దారులే.. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం. రెండోది.. తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకుని.. భాధ కలిగినా నెమ్మదిగా వలిచి వేస్తుంది. ఆ తర్వాత.. ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి.. ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి.. ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది. గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయ్.. మళ్లీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి.. జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా.. పోరాడితే.. గెలుపు మీ కాళ్లకు దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే.. మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే.. మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. నీ రాత రాసేది ఎవరు..నీ దారి మార్చేది ఎవరు..కలలు నీవి.. కష్టం కూడా నీదే..తలిచేది నువ్వు.. తలబడేది కూడా నువ్వే..ఓటమి నీదే.. గెలుపు కూడా నీదే..నీ ప్రయత్నం.., నీ విజయం, నీ జీవితం.. అంతే..


అలసిన మనసుతో కాదు.. ప్రశాంతమైన మనసుతో ఆలోచించు..ఆలోచనలు ప్రశాంతగా ఉంటే.. నిర్ణయాలు ప్రశాంతమైనవే ఉంటాయి. అల్లకల్లోలమైన మనుసుతో ఆలోచిస్తే.. జరిగే పరిణామాలు తర్వాత వేరుగా ఉంటాయి. నిర్ణయం తీసుకున్న సమయంలో వాటి తీవ్రత అర్థం కాదు.. కొన్ని రోజులు గడిచాక.. తెలుస్తుంది. శారీరకారోగ్యం ఎంతో అవసరమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండా.. తీసుకుంటాం. తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కొవడం చాలా కష్టం. అందుకే నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. తీసుకున్నాక.. ఆలోచిస్తే.. ఏం లాభం ఉండదు. కాలం వెనక్కు రాదు.. కానీ గతంలో తీసుకున్న నిర్ణయాలే.. ప్రస్తుతం మీద ప్రభావం చూపిస్తాయి.. భవిష్యత్ ను అల్లకల్లోలం చేస్తాయి. అందుకే ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ మీద ప్రభావం ఉండకుండా చూసుకోవాలి. ఏ విషయాన్నైనా ప్రశంతంగా ఆలోచించాలి. ఇక్కడో స్టోరీ ఉంది.. మీకోసం..

ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అదంటే రైతుకు చాలా ఇష్టం. తన కొడుకు బహుమతిగా ఇచ్చింది. దాని కోసం ఎంత వెతికినా.. దొరకలేదు. ఇక పోయిందిలే అని బాధపడుతున్నాడు రైతు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్లను పిలిచి.. గడియారం వెతికి ఇస్తే.. మంచి బహుమతి ఇస్తానని చెబుతాడు. పిల్లలు ఎంత వెతికినా..దొరకదు.

ఓ పిల్లాడు వచ్చి.. నేను వెతికిస్తా.. అని చెబుతాడు. పిల్లాడి కళ్లలో రైతుకు నిజాయితీ కనిపిస్తుంది. సరే అని చెబుతాడు. కాసేపటికి పిల్లాడు గడియారం తీసుకొచ్చి రైతుకు ఇస్తాడు. ఎలా దొరికిందని.. అడుగుతాడు. మీరంతా అల్లరి చేస్తూ.. మాట్లాడుతూ.. వెతికారు. మీరు కొడుకు ఇచ్చిన గడియారం పోయిందనే బాధలో వేరో ఆలోచనల్లో ఉంటూ వెతికారు. కానీ నేను ప్రశాంతంగా చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ అని శబ్ధం వచ్చిన వైపు వెళ్లి వెతికారు. అంతే గడియారం దొరికింది అని చెప్పాడు. పిల్లాడికి రైతు బహుమతి కొని ఇచ్చాడు.అలా ప్రశాంతంగా ఉన్న మనసు తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయి. వాటితో సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే ఏవేవో ఆలోచనలతో.. ఎమోషనల్ గా తీసుకునే నిర్ణయాలతో చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తిరిగి చూస్తే.. ఏం ఉండదు. కోల్పోయిన జీవితం మిమ్మల్ని చూసి నవ్వుతుంది. తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని వెక్కిరిస్తాయి. అందుకే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

చివరిగా నీకంటూ మిగిలేది.., జీవితంలో గడచిన సంవత్సరాలు కాదు.., ఆ సంవత్సరాలలో నువ్వు ఆస్వాదించిన జీవితం..