Read mom dad by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అమ్మ నాన్న

అమ్మ నాన్నలందరికీ అంకితం
ఈ లోకంలో ఎక్కువ గా ఇష్టం అయింది ఏంటి అంటే.
దాని గురించి మనం ఎంతలానో ఆలోచిస్తాం కాని నేను మాత్రమే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒక పేరు చెప్తాను. ఆ పేరు విన్న వెంటనే నా మనసు నదిలా పొంగుతూ ఉంటుంది..అసలు ఆ పేరుకి వున్న శక్తి అలాంటిది. ఆ పేరు నాకు ఎంతో ధైర్యానికి ఇస్తుంది..


ఆ పేరు,, ఆ శక్తి ఏదో కాదు.. నాన్న.

చిన్నపాటి నుండి మన కోసం యెన్నో త్యాగాలు చేస్తారు కాని మనల్ని ప్రేమించే వ్యక్తి ఈ లోకం ఎవరైనా వున్నారు అంటే అది ఒక అమ్మా - నాన్న మాత్రమే.

మనం పుట్టిన క్షణం నుండి వాళ్ళు, వాళ్ళ సంతోషం కంటే మన సంతోషం గురించి ఆలోచిస్తారు.

మనకి ఏది కావాలి అంటే అది ఇస్తారు. వాళ్ళకి యెంత కష్టం అయినా కూడా దాని వల్ల మనకి సంతోషం కలుగుతుంది అంటే, వాళ్ళు ఆ కష్టాన్ని కూడా సంతోషంగా భావించి మన కోసం ఆ వస్తువు ఇస్తారు.

అమ్మ-నాన్నల గురించి మాటలో చెప్పినా, కవిత రూపం లో చెప్పినా కుడా అది సరిపోదు. అసలు వాళ్ళ స్థానాన్ని ఎవరూ పూర్తి చేయలేరు. నాన్న మన కోసం రేయి అనక పగలు అనక కష్టపడతారు. అమ్మ మనకి కావాల్సింది దగ్గర ఉండి మరీ చూసుకుంటుంది. వాళ్ళు మన పైన చూపించే ఈ ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించరు.అంత ఎందుకు.. ఆ దేవతలు కూడా వాళ్ళ పిల్లల పైన అంత ప్రేమ చూపిస్తారు. పార్వతి దేవి గణేశుడి పైన ఎంత ప్రేమ చూపించింది.. అలాంటి మన అమ్మ-నాన్న ల ప్రేమ ఈ లోకాన్ని మార్చిపోయేలా చేస్తుంది.


అమ్మా- నాన్నా!

మీరు లేకుండా ఒక క్షణం కూడా వుండలేను అలాంటిది ఈ 2 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను, కాని నా మనసు మాత్రమే యెల్లపుడు మిమల్ని తలుచుకుంటుంది.

నాన్నా, లవ్ యూ నాన్నా.

నేను రోడ్డు మీద అలా నడుస్తు వెళ్ళేటప్పుడు యెంతో మంది తండ్రులు వాళ్ళ కూతుర్ల మీద ప్రేమ చూపిస్తు వుంటే, ఆ క్షణం నాకు నువ్వు గుర్తు వచ్చేవాడివి నాన్నా. నువ్వు నా పైనా చూపించిన ప్రేమ గుర్తు వచ్చేది. యెందుకో తెలీదు ఆ క్షణంలో నా కళ్ళలో నుండి నీళ్ళు కూడా వచ్చేవి కాని, అవి నేను దాచి పెట్టుకునే దానిని నాన్నా.. చిరునవ్వుతో ముందుకు వెళ్లే దాని. నాన్నా! నీ ప్రేమ నన్ను ఈ లోకాన్ని మర్చిపోయేలా చేసింది.లవ్ యూ నాన్నా.. లవ్ యూ అమ్మా..
ఒక రోజు అమ్మకి ఇంకో రోజు నాన్నకి ఈరోజు అమ్మనాన్నలకి ఇది కాదు మన సంస్కృతి అమ్మ తన ప్రాణం పణంగాపెట్టి మనకి ప్రాణం పోస్తుంది..నాన్న తన జీవితాన్ని పణంగాపెట్టి మనకి జీవితాకన్ని ఇస్తారు.అలాంటి వాళ్ళని ఒక రోజు సంతోషంగా చూసుకుంటే కాదు..వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి..అదే మనం మన తల్లిదండ్రులకు ఇచ్చే కానుక..తల్లిదండ్రులు ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్నవాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి అంతే కానీ వాళ్ళని కన్నీరు పెట్టించి కాదు కాలం ఉన్నపుడే కలిసి ఉండండి కాలం దాటిపోయాక కలవరించిన కలుసుకోలేరు...జీవితం లో ఒక్కటి గుర్తు పెట్టుకో .. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు.... నాన్న ఉన్నంత వరకు భాద్యత తెలియదు ఆ ఇద్దరు లేని రోజు నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం
జీవితంలో ఎన్నడూ మరచిపోకూడని ఇద్దరు వ్యక్తులు.. మనకోసం..మన గెలుపుకోసం నిరంతరం.. కష్టపడే.. నాన్న మన ప్రతి పిలుపులోను .. ప్రతి భాదలోనూ.. తోడనైన..అమ్మ..
జీవితంలో త్యాగం చేసేది "నాన్న "జీవితాన్నే త్యాగం చేసేది "అమ్మ "
అమ్మని ప్రేమించటం గొప్ప కాదు అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూచించు తండ్రికి భయపడటం గొప్పకాదు తండ్రి నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు గురువుకు నమస్కరించడం గొప్ప కాదు గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు.
"నాన్నకు ప్రేమను ఎలా చూపించాలో తెలియదు అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో.. తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు.. వాళ్ళు ఏమి చేసినా అది మన మంచికోరే చేస్తారు.. కాబట్టి అమ్మ, నాన్నల మనసు తెలుసుకుని మెలుగుదాం.”
అమ్మానాన్న ఉంటే బంధం తెలుస్తుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది.. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది..ఇద్దరూ లేనిరోజు బ్రతుకంటే ఏమిటో తెలుస్తుంది.అమ్మ తను చూసేవన్నీ బిడ్డకు చూపించాలని చంకన కూర్చోపెట్టుకుంటుంది నాన్న తను చూడలేనివి కూడా బిడ్డకు చూపించాలని భుజం మీద ఎక్కించుకుంటాడు అమ్మగొప్పదా? నాన్న గొప్పవాడా? అంటే ఏం చెప్తాం.. ఇద్దరూ గొప్పవారే..!!నీవే రాతివై తల్లిదండ్రుల గుండెలను పిండి చేయకు మిత్రమా. తమ నోటి కూడు నీకు పెట్టి నిన్ను పెంచి పెద్ద చేశారు మిత్రమా.అన్నీ మరిచినా ఫరవాలేదు తల్లిదండ్రులను మరవద్దు మిత్రమా. నీ జన్మ కొరకు రాళ్లకు మొక్కి పూజలెన్నో చేశారు మిత్రమా. అమృతము ఇచ్చిన వారిపై విషమును చిమ్మబోకు మిత్రమా. ఎంత గారాబము చేసిరి, ఎన్ని కోరికలు తీర్చిరి, వారి కోరికలు తీర్చుట మాత్రము మరవద్దు మిత్రమా. లక్షలెన్ని సంపాదించినా గానీ తల్లిదండ్రులకంటే ఎక్కువా? సేవ లేక అంత వ్యర్ధము మిత్రమా.తాము తడినేల పడుకొని నిన్ను పొడినేల పరుండ బెట్టిన, అమ్మ అమృత కన్నుల నుండి ఎన్నడూ తడిబారనీకు మిత్రమా. నీమార్గములో ప్రతి నిముషము పూలు జల్లిన వారికి, వారి మార్గమున ఎన్నడూ నీవు ముళ్లను పరువబోకు మిత్రమా. ధనమెన్నటికైనా దొరుకును తల్లిదండ్రులు దొరకెదరా మిత్రమా? ఆ దేవతమూర్తుల కోరికను ఎన్నడూ నీవు మరవబోకు మిత్రమా. వారి ఉపకారములు ఆనంతము ఈ విషము మరవద్దు మిత్రమా.