Read Mother Son Relationship by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అమ్మమాట

అమ్మమాట
జలజలపారే నదిఒడ్డున ఉన్న ఒక్కచెట్టుపై ఒకపక్షి గూడుకట్టుకుని తన చిన్నచిన్నముగ్గురు పిల్లలతో సంతోషంగాకాలం గడుపుతున్నాయి. ఒక నాడు ఆపక్షి తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండీ తల బయటకు పెట్టి బయటి ప్రపంచం చూస్తూంది అంతలో తల్లివచ్చి ఆ పిల్లను కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడకూడదు, పొరపాటున క్రిందపడవచ్చు, లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు, మీరు పెద్ద అయిన తరువాత నాలాగే బయటకు వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది, మరునాటి ఉదయం ఆ పక్షి మేతకు వెళ్ళింది, అమ్మమాట లెక్కచేయకుండా ఆ పక్షిపిల్ల మరల గూటి అంచువరకు వచ్చి బయటి వింతలను ఆదమరచి చూస్తుంది. ఆ సమయంలో పెద్దగాలి వీయడంతో పట్టు తప్పి కాలుజారి నదిలో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు వదలింది.. వారెడ్డి ॐ
నీతి: పెద్దలమాట విననిచో ఆపదలు తప్పవు.

అమ్మ మాట
ఒక అడవిలో ఒక కోతి వుండేది.దానికో పిల్ల వుండేది.
అది చాలా అల్లరిది. అమ్మమాట అస్సలు వినేది కాదు.
ఒకరోజు పిల్ల, తల్లి రెండూ ఒక నది ఒడ్డుకు పోయాయి.
అక్కడ ఒక చెట్టు ఎక్కి పళ్ళు తినసాగాయి.
నది ఒడ్డులో ఒక చిన్న పడవ వుంది. దానిలో ఒక చిలుక, ఒక తాబేలు ఎక్కి కూచున్నాయి. అవి కోతిపిల్లను "మాతోబాటు షికారుకురా... నదిలోకి పోదాం” అని పిలిచాయి. తల్లి కోతిపిల్లతో "వద్దమ్మా పడవకు ఏదైనా జరిగితే చిలుక ఎగిరిపోతుంది. తాబేలు నదిలో ఈదుకుంటూ పోతుంది. మనకు ఏదీ చేతగాదు. వద్దు" అంది. కానీ పిల్లకోతి అమ్మమాటను లెక్కచేయలేదు.చిలుక, తాబేలుతో కలసి షికారుకు పోయింది. పడవ మధ్యలోకి పోయినపుడు ఒక పెద్దచేప వచ్చి పడవను ఢీ కొట్టింది. అంతే దానికి చిల్లుపడింది. నెమ్మదిగా నీళ్ళు లోపలికి రాసాగాయి.
అది చూసి చిలుక పడవ మునిగిపోతా వుందని భయపడి ఎగిరిపోయింది.
తాబేలు నీళ్ళలోకి దుంకి ఈదుకుంటా వెళ్ళిపోయింది.
కోతిపిల్లకు ఏం చేయాలో తోచక కేకలు పెడుతా ఏడవసాగింది. ఇది చూసి తల్లికోతి ఒక పెద్ద తాడు తీసుకోనొచ్చి పడవలోకి విసిరింది.
ఆ తాడును పిల్లకోతి గట్టిగా పట్టుకోగానే నెమ్మదిగా బైటకి లాగింది. ఆ రోజు నుంచీ పిల్లకోతి అమ్మమాటను ఎప్పుడూ జవదాటలేదు.

చల్లని తల్లి
గల్లిగల్లీకి కిళ్లీబడ్డీలు, హోటళ్లు లేని పూర్వకా లంలో గ్రామాల్లో పూటకూళ్ల పెద్దమ్మల యిండ్లే భోజనశాలలు, వసతి గృహాలుగా వుండేవి. వార్తాపత్రికలు కూడా లేని ఆకాలంలో ఆ పేద రాశి పెద్దమ్మల ఇళ్లే వార్తా కేంద్రాలుగా వుండేవి.
పేరుకు పేదరాశి పెద్దమ్మ లైనా వారికి ధనార్జన బాగానే వుండేది. కార్యార్థం గ్రామాలకు వచ్చే అధికారులకు, వ్యాపారు లకు భోజన వసతి సౌకర్యాలు కల్పించేది, వార్తలు విశేషాలు చెప్పేది పూటకూళ్ల పెద్దమ్మలే గదా! ప్రతిఫలం బాగానే వుండేది.
ఒక వూళ్లో పూటకూళ్ల పెద్దమ్మ యింటికి నలుగురు దొంగలు వచ్చారు. ఆ పెద్దమ్మ యింటికే కన్నం వేసి దోచుకుపోవాలని ఆలోచించారు. అక్కడే బస చేశారు. తమకి రాత్రిపూటకు కూడా భోజనం తయారుచేయమని చెప్పారు.
ఆమె వంటచేసి రాత్రి నలుగురినీ పంక్తిలో కూర్చోబెట్టి వడ్డించింది. కూరలతో తిన్న తరు వాత నలుగురికీ పెరుగు వడ్డించింది. అ పెరుగు అన్నంలో ఉప్పు వడ్డించే ముందు ఉపును ఒక్కొ కురికీ దీపానికి దగ్గరగా వెలుగు
లో చూపి వడ్డిస్తూవుంది. అది ఆ దొంగలకి వింతగా వుంది.
"పెద్దమ్మా! మాలో ప్రతి ఒక్కరికీ ఉప్పు వడ్డించే ముందు దీపానికి చూపి వడ్డిస్తున్నావెం దుకు? ఉప్పులో ఏమైనా వుందా? అది శుభ్రం గాలేదా? " అని అడిగారు.
“నాయనలారా! ఉప్పు శుభ్రంగానే వుంది। కానీ రాత్రి పూట భోజనసమయంలో పెరుగు అన్నంలో వడ్డించేట ప్పుడు ఉప్పును దీపం కాంతికి చూపి వడ్డించితే ఆయుష్షు పెరుగుతుందట। ఆరోగ్యానికి మంచిదట మీ ఆయురారో గ్యాలు బాగుండాలని, మీరు చల్లగా నూరేండ్లు జీవించాలని నేను ఉప్పుని దీపం కాంతికి చూపి వడ్డించానయ్యా, అంది పెద్దమ్మ.
దొంగలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకు న్నారు. 'ఆహా ఇలాంటి వెన్నలాంటి మనసున్న చల్లని తల్లి యింటికా మనం కన్నం వేయాలను కున్నది? ఎంత పాపానికి పూనుకున్నాం' అని చెంపలు వేసుకొని, బుద్ధితెచ్చుకొని, పెద్దమ్మ పాదాలకు వందనాలు చేసి వెళ్లిపోయారు.


అమ్మా ప్రేమ
అమ్మ... ఈ పదానికి ఎన్ని పర్యాయాలు ఉన్నా సరి తూగవు. ఇంకా ఉంటే బావుండు అనిపించే అర్థం పరమార్థం కలగలపిన పద రూపం అమ్మ. చేయూత నిచ్చే నాన్న వదిలి వెళ్ళినా ఆమె కృంగి పోలేదు. బిడ్డలు తనకు భారం అనుకోలేదు బాధ్యతను విస్మరించలేదు బిడ్డలు బరువు అనుకోలేదు. అందరినీ ఒక ఇంటివారిని చేయడానికి తాను ఎంత కష్టించిందో ఆమె రూపు రేఖలలో తెలుస్తుంది. ఆ చిక్కిన ఎముకలలో తెలుస్తుంది. అయినా అమ్మకు అలసట లేదు ఆమె ఆనందాన్నీ బిడ్డల కళ్ళల్లో చూసుకునేందుకు ఇంకను శ్రమీస్తునే ఉంది అమ్మ ప్రేమకు అవధులు లేవు అమ్మ ఓర్పు కు కొలమానాలు లేవు ఇలలో వెలిసిన దేవత ఆ దేవతకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి కాసిన్నీ నవ్వులు కొండంత అండ గా ఉన్నామనే భరోసా అందుకే అమ్మ కన్నులు ముందు నిలిచేలా నా బిడ్డకు నీ పేరు పెట్టనమ్మా నా ముందే ఉంటానని