Read With love to my father... by Yamini in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నాన్నకు ప్రేమతో....

నాన్నకు ప్రేమతో....
బిడ్డను నవమాసాలు మోసేది అమ్మ అయితే... ఆ బిడ్డ జీవితాన్ని మోసేవాడే నాన్న ... ప్రేమకు చిరునామాగా ఉంటూ, బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేస్తూ... అనుక్షణం తన బిడ్డల సుఖ సంతోషాల కోసం కరిగే కొవ్వత్తి అతడు వారి జీవితాల్లో వెలుగులు నింపే సూరీడు నాన్న. నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది నాన్న... ఈ లోకంలో నా వేల అడుగుల ప్రయాణానికి, తొలి అడుగు మొదలు పెట్టింది నాన్న.... నా గమ్యానికి చేరుకోవడానికి మార్గం చూపింది నాన్న... నా ధైర్యం నాన్న, నా సర్వస్వం నాన్న... నాన్న ప్రేమ వరం, నాన్న లేని జీవితం భారం... నాన్న ! నీకు నడక నేర్పించాడు, నలుగురిని నీతో నడిపించమనే నడవడిక నేర్పించాడు. నీకు మొదట రాత నేర్పించాడు, అది నీ తలరాత మార్చేందుకు ప్రోత్సాహాన్నిచ్చాడు. నీకు భయం వేస్తే ధైర్యాన్ని ఇచ్చాడు, అతనికి భయం కలిగితే నిన్ను తలచుకున్నాడు. నువ్వు తప్పు చేస్తే ఆవేశం చూపించాడు. అసలు తప్పే చేయకుండా ఆరాటం చూపించాడు. ? అతడు అస్తమిస్తూ నిన్ను అలరారింపచేశాడు. ఓపిక లికపోయినా ఓదార్పు కోరుకోడు. సత్తువ సన్నగిల్లినా సహనం కోల్పోడు.
Love You నాన్న అంతటి నాన్నకు నడమంత్రపు సిరి కాదు, నిటారుగా నిల్చునే శక్తినివ్వు. భుజం మీద వేసుకొని నిద్రపుచ్చిన నాన్నకు, భుజం నువ్వై ధైర్యాన్నివ్వు. అలుపెరుగని పోరాటం చేస్తున్న నాన్నకు, ఆకలి తెలియనంత ఆనందాన్నివ్వు.
నడకలో ఆసరా అందించే 'మార్గదర్శి నాన్న'... జీవితంలో ఎదురయ్యే నిశీధిలో దారి చూపే 'దివ్వె నాన్న'... కుటుంబానికై బాధ్యతను మోసే 'నిత్య శ్రామికుడు నాన్న'... కష్టమనే గరళాన్ని గొంతులో దాచుకున్నా, పెదాలపై చిరునవ్వు చెరగని 'గరళకంఠుడు నాన్న'... కష్టానికి గుర్తింపు లే(రా)ని 'కష్టజీవి నాన్న'... పోరాట స్పూర్థిని నేర్పే 'సైనికుడు నాన్న'... జీవితంలో ఓడిపోయినా, తన పిల్లల విజయాన్ని చూసి గర్వించే 'అల్పసంతోషి నాన్న'...
నిజమే చెబుతున్నా నమ్మకమే నాన్నని మనసే అంటోంది నా ధైర్యమే నీవని ఒట్టేసి చెబుతున్నా నా మార్గం నాన్నని ప్రేమతో అంటున్న నా ప్రాణమే నీదని
నడకను నడతను భాద్యతగా నువు నేర్పి మునుముందకు నేవెళితే లోలోన మురిసినావు అందనంత ఎత్తుకు నను చేర్చాలనె నీ తపన నిన్ను నీవు మర్చిపోయి యుద్ధమే చేసినావు నీ ఆఖరి మెట్టునే నా తొలిమెట్టుగా చేసినావు మా గెలుపు తలుపుకై ప్రతి నిముషం ఓడినావు నీ చెమట చుక్కలే మా పరిమళపు జీవితాలు నీ త్యాగపు బాటలే మా పువ్వుల ఈ దారులు గుప్పెడంత గుండెలోన పుట్టెడు దుఃఖాన్ని దాచి చిరునవ్వుల జీవితాన్ని మా కానుక జేసినావు ఆ గగనాన ఎగిసే గాలిపటం మేమైతే...... కనపడని దారమనే ఆధారమే నీవైనావు..... ప్రేమ అనురాగాల అనుబంధమే నాన్నంటే అన్ని వేళలా మన తోడుండే రక్షకుడు నాన్నంటే.... కప్లైనా తన ఋణమును తీర్చుకునే వీలుంటే, నా తనువైనా ఆర్పిస్తా తను బాగుంటాండంటే.... నాన్న
నాన్న అంటే త్యాగం నాన్న అంటే ప్రేమతోకూడిన బాధ్యత నాన్న అంటే ఎత్తైన శిఖరం. తన రెక్కలు ముక్కలు చేసుకుని రేయి పగలు కష్టపడి, మనకు కవచంగా నిలిచేవాడే నాన్న. తాను ఓడిపోయి మనల్ని గెలిపించే త్యాగశీలి నాన్న. తన కలల్ని మర్చిపోయి, మన కలల్ని నిజం చేసే గొప్ప మనసున్న వ్యక్తి నాన్న. మన భవిష్యత్తును నిలబెట్టేదే నాన్న. మనం ఎప్పుడూ చదవాలనిపించే ఒక మంచి పుస్తకం నాన్న.గెలిచినపుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి ఓడినపుడు భుజాలపై తట్టి గెలుస్తావ్ అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే.....తండ్రి కొడుకుల మద్య ఎన్ని సమస్యలు ఉన్న కొడుక్కి తండ్రే మొదటి హీరో, మీరు నా hero నాన్న..నేనెరిగిన తొలి నేస్తం నాన్న... తొలినడకలు నేర్పించిన నా సరిజోడీ నాన్న... నా కోసం నాలోకమై నా తోడు నాన్న... నాతోనే ఉండి నన్ను నడిపించినది... నాన్న చేసే పోరాటాలు తన కూతురి అందమైన జీవితం కోసమే ఐ లవ్ యూ నాన్నా..!!నువ్వుంటే నా ప్రక్కన నాకు ఒక ధైర్యం, నేను పడిన ప్రతి సారి తట్టి లేపి ముందుకు నడిపిస్తావని...
నేనా! ఆ పని చేయగలనా? అని నేనన్న ప్రతి సారి, హనుమంతుడికి తన శక్తి ఎవరో చెప్తేనే తెలిసింది అట... నేను చెప్తున్నాగా నువ్వు ఆ పని చేయగల సమర్ధురాలివే అంటూ నాలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నూరిపోస్తావు... నేను తప్పుచేస్తే సరిదిద్దుతావు, అల్లరి చేస్తే భరిస్తావు, ముద్దు చేస్తావు, సంస్కారాన్ని, విలువల్ని నేర్పిస్తావు... నీ ఆశీర్వాదాలు ఇస్తావు... ఇంత చేసి నా నుంచి నువ్వు ఆశించేది ఏమి ఉండదు... ఈ స్వచ్ఛమైన ప్రేమకు నేను సదా కృతజ్ఞురాలిని... నాన్నకు ప్రేమతో... మీ ప్రత్తిపాటి శ్రీనివాసరావు గారి అమ్మాయి... ప్రత్తిపాటి యామిని బిందుశ్రీ
నా జీవితంలో ఆరాధించే మొదటి హీరో నాన్న.
మొదటగా పూజించే దేవుడు నాన్న. అన్ని చెప్పే మొదటి గురువు నాన్న. చివరకు కష్టనష్టాల్లో తోడున్న మొదటి స్నేహితుడు నాన్న. నాన్న లేని జీవితం ఏమిచ్చినా పూడ్చ లేని శూన్యం లాంటిది.నాన్న
నీ ప్రతి జ్ఞాపకం నాకు ఎప్పటికి శాశ్వతం నువ్వు ఈ లోకం లో లేకపోయినా ఎప్పుడు నా నీడలా వెన్నంటే ఉంటావని నాకు కొండంత దైర్యం నాన్న..
ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా.... ఓడినప్పుడు... నేనున్నాలే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి... గెలిచినప్పుడు.పదిమందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తి...ఒక్కరే... నాన్న
నా చుట్టూ ఎందరు ఉన్నా మీరులేని లోటు నా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది...
I Miss You
నాన్న.....