మనసిచ్చి చూడు.....16
ఆ ఫోన్ కళ్యాణ్ నుంచి రావడం మధుకి చాలా భయం వేసింది.
మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎన్ని సార్లు చేస్తున్నా స్క్రీన్ చూస్తూ ఉంది.
మెసేజ్ చేశాడు.
మర్యాదగా ఫోన్ ఎత్తు అని.
చూసి సమాధానం ఇవ్వలేదు.
కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది.
36 గంటల ప్రయాణం తరువాత మమత గారు,గౌతమ్ మధుని చూడడం చాలా బాధతో కూడిన సంతోషం వచ్చేసింది.
ఎందుకు మధు ఇలా చేశావు మీ మామయ్య ఏరీకోరి చాలా మంచి సంబంధం చూశారు,అందరి పరువు తీసి వచ్చేశావు ఎందుకు తల్లి,నువ్వు ఏమీ చేసిన కారణం ఉంటుంది కానీ మాకు చెప్పలేనంతా కారణం ఏంటి అంది.
వెంటనే గౌతమ్ అందుకొని అత్తయ్య ఇప్పుడే కదా వచ్చింది ఇంటికి వెళ్లక అన్ని మాట్లాడుకుందాము ముందు ఇంటికి పదండి అత్తయ్య.
సరే గౌతమ్ అవును మధు నీ స్టమక్ ఎందుకు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది.డైటింగ్ చేస్తావ్ కదా మళ్ళీ ఏంటి మధు ఇది అంది.
ఏమి సమాధానం చెప్పలో తెలియక ఈ మధ్య ఎక్కువ తింటున్నానులే అమ్మ నువ్వు రా,రా బావ మళ్లీ చలి ఎక్కువ అవుతుంది అంది.
అందరూ ఇంటికి వెళ్ళారు,రెండు రోజుల జెట్లాగ్ తరువాత కొంచెం ఫ్రీ అయ్యారు.అప్పటి నుంచి మధుని గమనిస్తునే ఉంది మమత.అప్పుడు అప్పుడు వాంతులు చేసుకోవడం,కళ్లు తిరిగి పడడం,నీరసముగా కనిపిస్తుంది.పని ఒత్తిడి వల్ల అయి ఉంటుంది అని అనుకుంది.
******************
ఇక్కడ సమీరా కళ్యాణ్కి కాల్ చేసింది బావ ఎక్కడ ఉన్నావు అని.
ఇంట్లో ఉన్నాను సమీరా ఏంటి విషయం అన్నాడు.
ఏమి లేదు బావ కొంచెం బయటకి వెళ్లాలి నువ్వు ఫ్రీగా ఉంటే తీసుకొని వెళ్తావు ఏమో అని కాల్ చేశాను అంతే అంది.
మధ్యాహం కొంచెం ఫ్రీ అవుతాను ఇంటికి వస్తానులే అన్నాడు.
సరే బావ అని కాల్ కట్ చేసింది.
*******************
బావ కళ్యాణ్ కాల్ చేశాడు అంది.
ఎందుకు మధు ఏంటి విషయం అన్నాడు.
ఏమో బావ తెలియదు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంది.
మంచి పని చేశావు మధు,పద భోజనం చేద్దాం,ఈ విషయాలు నువ్వు ఏమీ పెద్దగా పట్టించుకోకు నేను ఉన్నాను నీకు ఏ సమస్య రాకుండా చూసుకోవడానికి అన్నాడు.
థాంక్యూ బావ,సమీరాకి తోడుగా ఉండాల్సిన టైమ్లో నాతో ఉండాల్సి వచ్చింది అంది.
పర్లేదు మధు అసలు సమీరా నిన్ను ఇండియాకి తీసుకొని రమ్మని చెప్పింది,చాలా బాధ పడుతుంది అన్నాడు.
నువ్వు చాలా అదృష్టవంతుడివి బావ సమీరా లాంటి అమ్మాయి నీకు భార్యగా రావడం అంది కొంచెం బాధతో కూడిన స్వరంతో.
బాధ పడకు మధు కళ్యాణ్ నీ కాళ్ళ దగ్గరకు వచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి అన్నాడు.
ఏమో బావ తనలో మార్పు వస్తుంది అని నాకు
అయితే ఏ నమ్మకం లేదు.
మధు వాడికి నీ మీద ప్రేమ ఉంది కానీ వాడి మరదలిని నేను చేసుకున్నాను అని ఇలా ప్రవర్తిస్తున్నాడు.అహంకారం అడ్డుగా వస్తుంది కాబట్టి వాడికి నీ ప్రేమను చూసే అదృష్టం లేదు మధు.నువ్వేమి బాధ పడకు.
ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి మధు లేదు అంటే తరువాత చాలా బాధ పడాల్సి వస్తుంది అన్నాడు.
వద్దు బావ అమ్మకు తెలిస్తే తను తట్టుకోలెందు అంది.
కానీ ఎన్ని రోజులు ఇలా దాచగలం మధు,రేపు తొమ్మిది నెలలు పూర్తి అయిన తరువాత అయిన తెలియాలి కదా మధు అన్నాడు.
చూద్దాం బావ ఇప్పుడే అయితే చెప్పకు,పద భోజనం చేద్దాం అంది.
సరే పద
*******************
సమీరాకి కాల్ చేసి బయట ఉన్నాను రా అన్నాడు.
ఇంట్లోకి రా బావ పర్లేదు అంది.
వాళ్ల అత్తయ్య మామయ్యకు చెప్పేసి బయటకు వెళ్ళారు.
దారి పొడవునా గౌతమ్ గురించి చెప్తూ ఉంది.
చాలా మంచి మనిషి,భార్యను చాలా బాగా అర్థం చేసుకుంటాడు అని.
ఇవి అన్నీ నాకు ఎందుకు చెప్తూన్నావు సమీరా అన్నాడు.
బావ నీకు మీ వైఫ్కి ఏమైనా గొడవలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా బావ అంది.
ఇప్పుడు మా మధ్య గొడవలు ఉన్నాయి అని ఎవరూ చెప్పారు సమీరా అని అడిగాడు.
బావా నాకు ఏమీ తెలియదు అని అనుకోవద్దు నువ్వు మధుని పెళ్ళి చేసుకున్నావు అని తెలుసు,నీ వల్ల తను చాలా బాధ పడింది అని తెలుసు,ఒక బిడ్డని నీ వల్ల తను కోల్పోపోయిందని కూడా తెలుసు అంది.
సడన్ బ్రేక్ వేశాడు,సమీరా ఇవన్నీ అన్నాడు.
మధు నా భర్త వాళ్ల మరదలు,నువ్వు నన్ను పెళ్ళి చేసుకోలేకపోయావని గౌతమ్ మీద పగతో ఇదంతా చేశావని......అన్ని తెలుసు బావ.ఎందుకు ఇలా చేశావు బావ అని నిలదీసింది.
ఎందుకంటే అది అంత నీ మీద ప్రేమతోనే చేశాను కాబట్టి అన్నాడు.
ప్రేమ ఏంటి బావ ఎప్పుడైనా నాకు చెప్పావా నన్ను ప్రేమిస్తున్నాను అని అంది.
చెప్పకపోతే ఏంటి సమీరా నా మరదలే కదా ఎక్కడికి పోతుంది అనుకున్నాను కానీ వాడు ఎవడో వచ్చి నిన్ను బలవంతంగా చేసుకుంటే అది పెళ్ళి అవుతుందా అన్నాడు.
ప్రేమించి చేసుకున్న,బలవంతంగా చేసుకున్న ఒక్కసారి ఆడపిల్ల మెడలో మూడు ముళ్లు పడితే ఇంకొకరికి జీవితంలో స్థానం ఉండదు బావ కట్టుకున్న భర్తకు తప్ప......?????
సరే ఆయన బలవంతంగా చేసుకున్నారు అంటున్నావు,మరి నువ్వు చేసింది ఏంటి చెప్పు బావ.
ఆయన బలవంతంగా చేసుకొని ఉండవచ్చు కానీ నీలా మోసం చేసి అయితే మాత్రం నన్ను చేసుకోలేదు.
పెళ్ళి మీద సరైన అభిప్రాయం లేక నాతో ఉండలేక ఏవో కొన్ని మనస్పర్ధలు మా మధ్య వచ్చి ఉండవచ్చు కానీ ఇంత వరకు ఒక్కసారి కూడా ఆయన నా పట్ల నీచంగా ప్రవర్తించలేదు అంది.
ఇప్పుడు ఏమీ అంటావు మీరు బాగున్నారు,నా జీవితాన్ని నిలబెడతాను అంటున్నావా అన్నాడు కోపంగా.
మధు విలువ తెలుసుకో అంటున్నాను.నువ్వు అంత చేసిన కూడా ఒక్క మాట కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.ఈ సమయంలో తనకి నీ అవసరం ఎంత ఉంటుంది అయిన నువ్వు ఏమీ పట్టించుకోవడం లేదు.అసలు నీకు ఏమి కావాలి బావ.
పాపం మధు నీ వల్ల తనని,గౌతమ్ని తప్పుగా అనుకున్నాను.అన్ని మనసులోనే భరించింది కానీ నిన్ను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు.
ఇప్పటికైనా తన విలువ తెలుసుకో,గౌతమ్,పిన్ని గారు తనని ఇక్కడికి తీసుకొని రావడానికి వెళ్ళారు అంది.
ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.
సరే బావ నన్ను ఇక్కడ వదిలిపెట్టు మా అన్నయ్య ( జగదీష్) వస్తారు అంది.
నేను పిలవడం వచ్చావు,అదే అవసరం మధుకి కూడా ఉంటుంది అని అర్థం చేసుకోవడం లేదు కదా బావ.
సరే జాగ్రత్త బై అని వెళ్లిపోయాడు.
****************
గౌతమ్ మధు సరిగ్గా తినడం లేదు ఏమైందో కనుక్కో రా అంది మమత.
నువ్వు కంగారు పడకు అత్త నేను చూసుకుంటాను అన్నాడు.
మధు పడుకుని ఉంది సమీరా నుంచి తనకు కాల్ వచ్చింది.......?????
ఇంకా ఉంది
💐 ధన్యవాదాలు 💐
అంకిత మోహన్