Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 2

                    మనసిచ్చి చూడు... 2


కళ్లు తిరిగి గౌతమ్ మీద పడిన సమీరాను చూసి అందరూ కంగారు పడ్డారు కానీ గౌతమ్ లో మాత్రం ఎలాంటి భావం లేదు.కాసేపటికి తేరుకుంది.

       జరగాల్సిన తంతు పూర్తి అవుతూ ఉంది.
మాంగల్య ధారణం జరిగే సమయానికి సమీరాకి చాలా ఏడుపు వచ్చింది.కానీ కంట్రోల్ చేసుకుంది.
అంతా పూర్తి అయిన తరువాత పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

           కొత్త పెళ్ళి కూతురికి ఉండాల్సిన కల తనలో  అసలు లేదు.గుండెల్లోని బాధ కళ్లలో తెలుస్తుంది.
ఇంత బాధలో తనకి అసలైన ఓదార్పు అంటే ఉమ గారు.సమీరాను కూతురులాగా చూసుకోవాలని ఆమె ఆశ.కొడుకు ఇలా చేశాడు మొదట్లో ఆమెకి తెలియదు,తెలిసి ఉంటే ఏ తల్లి ఒప్పుకునేది కాదు కదా.

        ప్రతాప్ వర్మ కళ్లలో కొంచెం సంతోషం కనిపిస్తుంది.తన కొడుకు పెళ్ళి కళ్లారా చూసినందుకు.

అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు,గౌతమ్ తనని అసలు మనిషిల కూడా గుర్తించడం లేదు. 

గౌతమ్.... సమీరాను నీ గదిలోకి తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో ఒక లుక్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు.తన వెనకే సమీరా కూడా వెళ్ళింది. 

      
               గౌతమ్ గదిలోకి వెళ్ళిన సమీరాను చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు.సమీరా తలుపు గడి పెట్టి,తన లగేజ్ అంత సర్దుతూ ఉంది.ఆ కోపిష్టికి కోపం ఎక్కువ అవుతు ఉంది.

        సమీరా అని గట్టిగా అరిచాడు....??? 

       చెప్పండి అనింది చాలా సింపుల్గా...??? 

    నువ్వు నేను కలిసి ఉండడం జరగని పని,తెలిసి కూడా ఎమ్ చేస్తూన్నావు నువ్వు అసలు అని అరిచాడు. 

సమీరాకి కూడా చాలా కోపం వచ్చింది. 

ఎమ్ చేయాలి ఇప్పుడు,నేను ఎమైన మీతో వస్తాను అన్నానా,నన్ను ఏదో మీరు ఉద్ధరించేల పెళ్ళి చేసుకున్నారు.పెళ్ళికి ముందు ఏ అమ్మాయికి చెప్పని మాటలు చెప్పారు.ఏ అమ్మాయి అయిన పెళ్ళి చేసుకునేది తన భర్తతో,కుటుంబంతో సంతోషంగా ఉండడానికి గానీ ఇలా రోజూ కుమలడానికి కాదు అండీ.కనీసం మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి సడన్గా నా లైఫ్లోకి వచ్చి రూల్స్ పాస్ చేస్తున్నారు.అసలు మీ ఉద్దేశ్యం ఏంటో నాకు అయితే అర్థం కావడం లేదు.మామయ్య గారి గురించి ఆలోచించి ఒక ఆడపిల్ల లైఫ్ నాశనం చేయాలి అనుకుంటున్నారు అసలు మీరు మనిషేనా.....??? 

      సమీరా......... అంటూ చేయి ఎత్తాడు కొట్టడానికి. 

ఎందుకు ఆపేసారు పర్వాలేదు కొట్టండి,నా మనసే వించేసారు,దెబ్బలు ఒక లెక్క అనింది తను బాధగా. 

గౌతమ్ : - చూడు సమీరా.... నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు,చాలా కంట్రోల్లో ఉన్నాను,నన్ను రెచ్చగొట్టకు.నువ్వు-నేను ఎప్పటికి కలిసి ఉండడం జరగని పని,ఒకే గదిలో ఉన్న కూడా నీ పని నీది,నా పని నాది.

సమీరా :- అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్ళి చేసుకోవడం బాధ పెట్టడానికా...?? 

గౌతమ్ :-  ఎందుకో నువ్వే ఆలోచించుకో నాకు 
కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నాను. 

సమీరా :- కొంచెం కూడా మనస్సాక్షి లేని మనిషి మీరు ఛీ... 😭😭

గౌతమ్ వెళ్ళిపోయాడు బయటికి.గౌతమ్ వెళ్లడం గమనించిన ఉమా గారు సమీరా దగ్గరకు వచ్చి కోడలిని తృప్తిగా చూసుకున్నారు. 

సమీరా ఇలా రా తల్లి నీతో మాట్లాడాలి. 

చెప్పండి అత్తయ్య. 

గౌతమ్కి కొంచెం కోపం ఎక్కువ తల్లి 
( సమీరా మనసులో కొంచెం కాదు అత్తయ్య చాలా చాలా ఎక్కువ) 

ఆ కోపాన్ని అర్థం చేసుకుంటే అతని ప్రేమను ఎవరు తట్టుకోలేరు.

కానీ అత్తయ్య నేను ఎమ్ చేశాను అని నాతో ఇలా రాష్గా బిహేవ్ చేయడం. 

సమీరా మీకు ఎవరికి తెలియని ఒక విషయం చెప్పనా...?? 

చెప్పండి అత్తయ్య. 

గౌతమ్ చాలా చాలా మంచి వాడు తల్లి కానీ.....?? 

కానీ...చెప్పండి అత్తయ్య ఏంటి..!!

గౌతమ్కి అక్క కూడా ఉంది.తను చేసిన పని వల్ల అమ్మాయిలు అంటేనే అసహ్యం,విరక్తి ఏర్పాచుకున్నాడు. 

ఎమైంది అత్తయ్య...?? 

నా కూతురి పేరు స్వప్న,చాలా మంచిది కానీ కాలేజీలో ఎవరినో ప్రేమించింది,పెళ్ళి కూడా చేసుకుంది కానీ ఆ పెళ్ళి విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.స్వప్నకి మీ మామయ్య గారు ఒక మంచి సంబంధం తెచ్చారు. ఆ వచ్చిన అబ్బాయి ఎవరో కాదు స్వప్న సీనియర్ అబ్బాయి.స్వప్నకి ఆల్రెడీ అనిల్ అనే అబ్బాయితో పెళ్ళి జరిగింది అని,మేము వాళ్ళని మోసం చేసినట్టు మాట్లాడి వెళ్లిపోయారు. 
అప్పుడు గానీ విషయం ఇంట్లో అందరికీ తెలియలేదు.ఆ బాధతో అప్పుడు ఆయనకు గుండె పోటు వచ్చింది,ఇల్లు అంత బోసి పోయింది.అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్లు అంటేనే  అందరిలో పరువు తీసే వాళ్ళు అన్న ఒక బలమైన భావన కలిగింది.

     మీ మామయ్య గారికి ప్రమాదం కూడా మొన్న కార్లో వస్తూ ఉంటే స్వప్న చేసిన పని గుర్తుకు వచ్చి, డ్రైవింగ్లోనే గుండెపోటు వచ్చేసింది.అప్పుడు ఆయన చివరి కోరికగా మీ పెళ్ళి చేయాల్సి వచ్చింది. 

    ఇది అంత విన్న సమీరా మనసు కొంచెం బాధ పడింది.కానీ అందరూ అలా ఎందుకు ఉంటారు ఈ మనిషిని మార్చుకోవాలి అంటే ఈయన దారిలోనే వెళ్లాలి అని బలంగా అనుకుంది. 


        మీరు ఎమ్ బాధ పడకండి అత్తయ్య.ఆయన నన్ను ఎమ్ అన్న కూడా నేను ఆయనను అర్ధం చేసుకుంటాను. 

చాలా సంతోషం తల్లి,తినేసి కాసేపు రెస్ట్ తీసుకో సమీరా.రాత్రికి ముహూర్తం బావుంది అన్నారు పంతులు గారు. 

ముహూర్తం ఏంటి అత్తయ్య....?? 

ముహూర్తం ఎందుకు ఉంటుంది తల్లి,రాత్రి మీ శోభనానికి...!!!

అత్తయ్య ప్లీజ్ ఇప్పుడు అవన్ని ఎందుకు...?? 

అలా అనకూడదు తల్లి అని చెప్పేసి వెళ్ళిపోయింది. 

( నిజానికి ప్రతాప్ గారికి గుండెపోటు వచ్చింది,కొన్ని దెబ్బలు తగిలై కానీ కొడుకు పెళ్ళి కోసం అలా నటిస్తూ ఉన్నారు దానికి డాక్టర్స్ సపోర్ట్ కూడా) 

ఉమా గారు అన్ని ఏర్పాట్లు చేస్తూన్నారు. 
సమీరాకి చాలా భయంగా ఉంది,కాసేపటికి అలాగే నిద్ర పోయింది.అప్పుడు వచ్చాడు మన హీరో బాగా అలసి పోవడం వల్ల అలా బెడ్ మీద పడుకోగానే అయ్యగారికి నిద్ర పట్టేసింది. 

నిద్రలో అయ్యగారు విన్యాసాలు మామూలుగా లేవు. 
డోర్ తట్టిన శబ్దానికి అప్పుడు మెలుకువ వచ్చింది సమీరాకి,పక్కన చూస్తే హీరో గారు సమీరా మీద హ్యాండ్ వేసుకొని పడుకొని ఉన్నాడు.ఫుల్ షాక్ తను.... 🙄🙄🙄🙄 వెంటనే లేపడానికి ప్రయత్నం చేసింది కానీ ఎమ్ లాభం .......????? 


ఇంకా ఉంది.....!!!! 

                    ధన్యవాదాలు 💐 

                   అంకిత మోహన్ ✍️