Featured Books
  • నిరుపమ - 12

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 11

                  మనసిచ్చి చూడు - 11చెప్పు మధు ఎందుకు ఇంత కంగారు...

  • ధర్మ- వీర - 7

    పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • అరె ఏమైందీ? - 25

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 11


              మనసిచ్చి చూడు - 11



చెప్పు మధు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు....???

బావా నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు...దయచేసి ఈ పెళ్ళి ఆపు బావ అంది.

ఏమ్ మాట్లాడుతున్నావు మధు రేపు పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నావు నీకు ఏమైనా పిచ్చా...??

నిజం బావా అంది ఏడుపు మొహం పెట్టుకొని.

( వెనుక నుంచి సమీరా ఇదంతా గమనిస్తునే ఉంది )

ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి కదా మధు ఇప్పుడు చెప్తే ఏమీ చేయాలి చెప్పు బంధువులు,స్నేహితులు అందరూ వచ్చేశారు అన్నాడు కోపంగా.


చాలా ప్రాధేయపడుతూ అడిగింది ప్లీజ్ బావా అంటూ..!!!

సరే కనీసం కారణం అయిన చెప్పు మధు అన్నాడు.

కారణం ఇప్పుడు చెప్పలేను బావ నన్ను ఎయిర్ పోర్ట్లో డ్రాప్ చేశాయి అంది.

పిల్ల ఆటలా మధు....?? కారణం లేకుండా నీకు పెళ్ళి ఇష్టం లేదు అంటే అందరికీ ఏమీ సమాధానం చెప్పాలి అన్నాడు చాలా కోపంగా ( అసలే హీరో గారికి కోపం ఎక్కువ).

బావ ప్లీజ్ ఇప్పుడు నేను నీకు ఏమీ చెప్పలేను కారులో వెళ్తూ మాట్లాడుకుందాము అంది.

ఎలా అడిగిన చెప్పేల లేదు అని గౌతమ్కి అర్థం అయి సరే ఉండు సమయం చూసుకొని వదిలి పెడతాను అన్నాడు.

సరే బావ థాంక్యూ అని కౌగిలించుకుంటుంది.

ఇది అంత చూస్తున్నా సమీరాకి గౌతమ్ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటూ ఏడుస్తు తన గదిలోకి వెళ్ళిపోతుంది.

  అయిన మధుకి ఎందుకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఆలోచిస్తూ అలాగే పడుకుని నిద్రపోతుంది.

గదిలోకి గౌతమ్ వచ్చి సమీరాని చూసి ఇప్పుడు విషయం తనకి చెప్పాలా....??వద్దా......?? అని కాసేపు ఆలోచించి చెప్పకపోవడమే మంచిది చెప్తే కంగారు పడుతుంది,ఈ సమయంలో తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పకుండా ఆ గది నుంచి బయటకు వచ్చేస్తాడు.

               ఇంటి పరువు పోకుండా వాళ్ల అత్తయ్యను,ప్రతాప్ గారిని పిలిచి విషయం చెబుతాడు,వాళ్ళకి చాలా కోపం వస్తుంది.వాళ్లకు చెప్పినట్టు మధుకి తెలియదు.

     ఇప్పుడు ఏమీ చేయాలి గౌతమ్ అంటారు అందరూ.
ఇష్టం లేకుండా ఏది వద్దు అత్తయ్య తన బాధ ఏంటో నేను కనుకుంటున్నాను మీరు తనని ఏమీ అనకండి అంటాడు.

పరువు పోకుండా కాపాడావు చాలా కృతజ్ఞతలు రా నీకు,పెళ్ళి వాళ్లకు నేను ఏదో ఒకటి చెబుతాను,నువ్వు తనని ఎయిర్పోర్ట్లో వదిలి పెట్టి రా.అప్పుడు అయిన ఏమైనా చెబుతుంది ఏమో అన్నాడు ప్రతాప్.


     ***********************


ఇక్కడ సమీరాకి మెలుకువ వచ్చింది లేచి చూస్తే దాదాపు బంధువులు ఎవరూ లేరు.ఏదో జరిగింది అని అర్థం అయి వాళ్ల అత్తయ్యను అడిగింది.ఆమె జరిగింది చెప్పింది కానీ సమీరా తను చూసిందే నిజం అనే భ్రమలో  ఉంది.ఆ విషయం ఎవరికీ చెప్పలేక తనలో తానే సఫర్ అవుతుంది.నిజానికి అక్కడ వాళ్ల మధ్య ఏమీ లేదు కానీ తన మనసు తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు.


           ఉన్నట్టు ఉండి పెళ్లి ఎందుకు ఆగిపోయిందని బంధువులు అంత ఏదేదో మాట్లాడుకుంటున్నారు.

           గౌతమ్-మధు ఇద్దరు కార్లో వెళ్తున్నారు.
గౌతమ్కి ఇప్పటికీ ఏమీ అర్థం కావడం లేదు.మధు ఎందుకు ఇలా చేసింది అని.

    బావ ఆకలి వేస్తుంది అంది కడుపు పట్టుకొని.

సరే మధ్యలో ఏదైనా హోటల్ వస్తే ఆపుతాను అన్నాడు.

థాంక్ యూ బావ అంది.

ఇవన్నీ కాదు మధు సీరియస్గా అడుగుతున్నాను అసలు ఎందుకు ఇలా చేశావు చెప్పు అన్నాడు.

బావ మళ్లీ అదే ప్రశ్న సమయం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి నేను చెప్పడానికి ఏమీ లేదు బావ.అదిగో అక్కడ ఏదో హోటల్ కనిపిస్తుంది చూడు అని టాపిక్ డైవర్ట్ చేసింది.

           కారు పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు తినడానికి దాదాపు సమయం రాత్రి తొమ్మిది అవుతుంది.
తినడానికి కూర్చున్న గానీ గౌతమ్ మధు గురించే ఆలోచిస్తున్నాడు.

                మధు చాలా ఆకలితో ఉన్నట్లు ఉంది బాగా తింటుంది,బావా నువ్వు కూడా తిను అంటుంది.
వద్దు మధు నువ్వు తిను నాకు ఆకలిగా లేదు అంటాడు.
అవును బావ సమీరా ఇప్పుడు గర్భవతి కదా.తనతో ఉండాల్సిన సమయంలో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా బావ అంది.

       మధు ఇప్పుడు అవన్నీ ఆలోచించకు సమీరా అలా ఏమీ అనుకోదు అన్నాడు.

ఒకే నువ్వు తింటూ ఉండు నేను సమీరాకి కాల్ చేసి వస్తాను అన్నాడు.

సరే బావ అంది.

సమీరాకి ఎన్ని సార్లు ఫోన్ చేసిన కాల్ ఎత్తలేదు.
ఏమైంది తనకి అనుకున్నాడు.

వాళ్ల అమ్మ గారికి కాల్ చేసి సమీరాకి ఇవ్వమన్నాడు,
తను నిద్రపోతుంది రా ఏమైనా చెప్పిందా మధు అని అడిగింది.

లేదు అమ్మ నేను చూసుకుంటాను మీరు తిన్నారా, సమీరా ఏమైనా తినిందా అని అడిగాడు.

హా కొంచెం తినింది రా.

సరే అమ్మ జాగ్రత్త నేను మధుని వదిలి పెట్టి త్వరగా వస్తాను అన్నాడు.

సరే గౌతమ్ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది.

మధు బయలుదేరుదామా అన్నాడు...??

అలాగే బావ అంది.

కాసేపటికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఇద్దరు.

ఇద్దరు లోపలికి వెళ్ళారు,దారి పొడవునా అడుగుతూనే ఉన్నాడు చెప్పు చెప్పు అని,కానీ మధులో ఏ చలనం లేదు.


         లోపల కూర్చున్నాకా అప్పుడు చూశాడు మధు మెడలో పసుపు తాడు.

మధు ఏంటిది అని.

ఏంటి బావ అంది కంగారుగా.

నీ మెడలో ఆ తాళి ఏంటి మధు అన్నాడు.

బావ నేను ఏమీ చెప్పలేను ప్లీజ్ అంది.

కోపంగా ఒక్క చెంప దెబ్బ వేశాడు,అప్పటి నుంచి చాలా ఓపికతో ఉన్నాను మధు కానీ నువ్వు ఎలా అడిగితే చెప్తవు చెప్పు అన్నాడు.

        ************************

బావ చెప్పడానికి నాకు నిమిషం చాలు కానీ చెప్పిన తరువాత నీ ఆవేశం చూడలేను,అందుకే ఏమీ చెప్పడం లేదు అంది.

మధు అని గట్టిగా అరిచాడు,ఏమైనా పర్లేదు నేను ఉన్నాను ముందు ఏమీ జరిగిందో చెప్పు ఊరికే నస పెట్టకుండా అన్నాడు.

బావ నేను ఇప్పుడు గర్భవతి,నాకు పెళ్ళి కూడా అయింది బావ,అతను కూడా అమెరికాలోనే ఉంటాడు,కానీ ఇప్పుడు నాతో లేడు అతను ఎవరో కాదు బావ అని కన్నీరు పెట్టుకుంది.....????

ఇంకా ఉంది...??

                💐 ధన్యవాదాలు 💐 

                    అంకిత మోహన్