మనసిచ్చి చూడు.....12
అసలు ముందు ఎవరో చెప్పు మధు అన్నాడు గట్టిగా...!!
బావ అతని పేరు కళ్యాణ్ ,అమెరికా లోనే జాబ్ చేస్తున్నాడు అంది.
ఎలా పరిచయం అన్నాడు.
బావా నిజం చెప్పాలి అంటే నువ్వు సమీరాను చేసుకున్నా నెల తరువాత నాకు పెళ్ళి జరిగింది బావ.
ఎప్పటి నుంచి నీకు పరిచయం అన్నాడు....??
బావ అసలు ఒక నెలలోనే ప్రేమ పెళ్ళి అన్ని అయ్యాయి.
మొదట నేను ఒప్పుకోలేదు కానీ అతను చూపించే అతి ప్రేమకు ఒప్పుకోక తప్పలేదు బావ అంది.
నీకు ఏమైనా పిచ్చి పట్టిందా సమీరా అంత పెద్ద దేశంలో ఉండి,మంచి ఉద్యోగం చేస్తూ ఆలోచన శక్తి లేకుండా ఇలా ఎలా చేశావు అన్నాడు.
బావ ఆలోచన శక్తి లేక కాదు,ఏ సమయానికి ఎవరికి ఎలా ప్రేమ పుడుతుందో తెలియదు కదా,అలానే నా పరిస్థితి కూడా,అప్పటికీ మీ అందరికీ చెప్పి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ కళ్యాణ్ ఇప్పుడే చెప్పకు అన్నాడు అంది.
ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమ్ జరుగుతుందో అర్థం అవుతుందా మధు నీకు....???
బావ నీకు తెలిసింది నా పెళ్ళి వరకే,తెలియంది చాలా ఉంది.
కళ్యాణ్ నన్ను ప్రేమతో పెళ్ళి చేసుకోలేదు బావ,నీ మీద పగతో నన్ను చేసుకున్నాడు అని ఏడుస్తు చెప్పింది.
వాట్ నా మీద పగ ఏంటి మధు,ఏమ్ మాట్లాడుతున్నావు అన్నాడు.
నిజం బావ కళ్యాణ్ ఎవరో కాదు సమీరా వాళ్ల అత్తయ్య కొడుకు.
గౌతమ్ షాక్ అయ్యాడు.
సమీరాని కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ మధ్యలో నువ్వు వచ్చి తనని తన అభిప్రాయం లేకుండానే పెళ్ళి చేసుకున్నావు,అదే మనసులో పెట్టుకొని నీకు సంబంధించిన వాళ్ల వివరాలు అన్ని సేకరించి ప్రతి క్షణం నిన్ను ఏదో ఒక్కటి చేయాలి అని ఎదురు చూస్తు ఉండే వాడు అంది.
నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మధు అన్నాడు.
నన్ను ట్రాప్ చేశాడు,పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తరువాత గానీ అతని నిజ స్వరూపం తెలియలేదు బావ.చాలా బాధ పెట్టాడు ,అన్ని రకాలుగా హింస పెట్టాడు.అది భరించలేక చాలా సార్లు చనిపోవాలనుకున్నాను కానీ అప్పటికి నేను గర్భవతి అని తెలిసింది.ఒక బిడ్డ పుడితే అయిన తనలో మార్పు వస్తుంది అనుకున్నాను కానీ ఎన్నో రోజులు నా ఆనందం ఉండలేదు.ఒకరోజు బాగా తాగి వచ్చి గొడవ పడ్డాడు,మెట్ల మీద నుంచి తోసేశాడు అప్పుడు గర్భం పోయింది బావ అని ఏడుస్తుంది.
ఇంత జరిగినా మాకు ఎవరికి చెప్పాలి అనిపించలేదా మధు అన్నాడు బాధగా.
చాలా సార్లు అనిపించింది బావ కానీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఉండిపోయాను.
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కళ్యాణ్.....???
అక్కడే ఉన్నాడు బావ,రెండో సారి గర్భం అని తెలిశాకా ఇంక అక్కడ ఉండలేకపోయాను.అందుకే కళ్యాణ్కి తెలియకుండా వచ్చేశాను ఇండియాకి.
నేను హైదరాబాద్ వచ్చి కూడా నెల పైన అవుతుంది బావా ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో ఉంటున్నాను అంది.
మరి ఇంటికి రావాలి అనిపించలేదా మధు, మేము ఎవ్వరం లేము అనుకున్నావా.
అలా ఏమీ లేదు బావ,ఇక్కడికి వచ్చాక తెలిసింది సమీరా కూడా నెల తప్పింది అని.ఇంకా అక్కడకు వచ్చి ఇబ్బంది ఎందుకు అని రాలేదు కానీ ఒకరోజు కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది ఇండియా వస్తున్నాను అని, అందుకే భయం వేసి ఇంటికి వచ్చేశాను అంది.
మరి ఇప్పుడు ఎక్కడికి మధు అన్నాడు.
అమెరికాకే వెళుతున్నాను బావ,కళ్యాణ్కి కనిపించనంతా దూరం ,నేను నా బేబి ,త్వరలో అమ్మకు అన్ని చెప్పి అక్కడికిపోతే రమ్మంటాను అంది.
నా మీద కోపంతో నిన్ను ఇంత బాధ పెట్టిన ఆ కళ్యాణ్ని అంత సులువుగా వదిలి పెట్టను మధు,నువ్వు జాగ్రత్తగా ఉండు, త్వరలోనే అత్తయ్యను అమెరికాకు పంపిస్తాను అన్నాడు.
థాంక్ యూ బావ అంది.
థాంక్ యూ నువ్వు కాదు చెప్పాల్సినది నేను, దాని కంటే ముందు సో సారీ మధు అంత నా వాళ్లే చాలా ఇబ్బందులు పడ్డావు అని కౌగిలించుకొని జాగ్రత్తగా ఉండు, అక్కడ ఏమీ అవసరం ఉన్న ఒక్క ఫోన్ చేయి చాలు అన్నాడు.
అలాగే బావ సమీరాను జాగ్రత్తగా చూసుకో అని బై చెప్పి వెళ్లిపోయింది మధు.
*********************
ఎప్పుడు వెళ్లాడు ఇంత వరకు రాలేదు అని చాలా కోపంగా ఉంది సమీరా.
ఒక గంట తరువాత గౌతమ్ ఇంటికి వచ్చాడు చాలా డల్గా ఉండడం గమనించి ఏమైంది అండీ,మధు వెళ్లిపోయినందుకు బాధ పడుతున్నారా అంది వెటకారంగా.
నేను అంత చూశాను అసలు ఏమీ జరుగుతుంది మీ మధ్య,నన్ను మోసం చేయాలి అనుకుంటూన్నారా అంది ఆవేశంగా.
సమీరా కాసేపు కామ్ ఉంటావా.....అయిన ఇంక నిద్ర పోకుండా ఏంటి నువ్వు అన్నాడు చాలా ప్రేమగా.
నా నిద్ర సంగతి తరువాత ముందు మీరు చెప్పండి అంది.
ఏమి చెప్పాలి...ఇప్పుడు నాకు మాట్లాడే ఓపిక అసలు లేదు పడుకో నువ్వు అన్నాడు.
అవును ఎందుకు ఓపిక ఉంటుందిలే కొత్తగా వచ్చిన మరదలితో పెళ్ళి ఆపి మరి షికారు కొట్టి వస్తే అంది.
సమీరా అని గట్టిగా అరిచాడు.
ఎందుకు అంత అరుపు అంది.
చూడు నీతో వాదించే అంత శక్తి నాకిప్పుడు లేదు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుతాను.నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి కళ్ళు మూసుకున్నడు.
సమీరాకి చాలా కోపం వస్తుంది గౌతమ్ ప్రవర్తనలో మార్పు చూసి.
*********************
పాపం మధు ఇక్కడ ఎవరూ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది.
తనకి తన బావ ఉన్నాడు ఏ కష్టం రాకుండా చూసుకోవాడానికి అని ఇప్పుడు తెలియడం లేదు.
ఎంత దుర్మార్గుడు అయిన మధుకి భర్త,తన బిడ్డకు తండ్రి.కళ్యాణ్ ప్రేమ నెల రోజులు ఎంత స్వచ్చంగా ఉందో ఇప్పుడు అంత క్రూరంగా ఉంది.అయిన అది ప్రేమ కదా తలుచుకోకుండా ఉండలేరు.
పల్లవి :-
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓ
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
చరణం :-
ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ
ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ
మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ
అది కూడా చిత్రంగా బాగానే ఉందీ
ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం
తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం
ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియ స్వరం
ఎప్పుడు ఎటు తోస్తుందో చెబుతుందా ఈ క్షణం
అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా
హో విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా
చరణం :-
ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ
కోపంతో ఎర్రబడి కసిరే నా కళ్ళూ
ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ
గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారూ
చప్పున ఒకటై పోదా ఈ దూరం జరగనీ
ఎక్కడికైనా పోదా మన లోకం వేరనీ
ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ
ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ
చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా
మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా
ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ
ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా ఓ
అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే
ఓ... నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
ఓ... అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే...
ఓహో హో నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే
కళ్యాణ్ని తలుచుకుంటు చాలా బాధ పడింది మధు.
******************
ఉదయం చెబుతాను మీ పని అనుకొని సమీరా కూడా పడుకుని నిద్రపోతుంది.అర్థరాత్రిలో మధు..... అని ఉలిక్కిపడి లేచింది.
గౌతమ్ సమీరాను దగ్గరకు తీసుకొని నీళ్ళు తాగు లేనిపోనివి ఆలోచించుకు సమీరా అన్నాడు.
అది కాదు అండీ మధుకి ఏదో జరిగినట్టు కల వచ్చింది అంది.
తనకి ఏమీ కాదు నువ్వు కంగారు పడకు వచ్చి పడుకో అని చెప్పి భుజం తడుతూ నిద్ర పుచ్చాడు.కానీ అప్పటి నుంచి గౌతమ్కి నిద్ర పట్టులేదు.
సమీరా నిద్రపోయాకా బయటికి వచ్చి ఆలోచించిస్తు ఉన్నాడు.
ఆ కళ్యాణ్ ఎవరూ అని......?????
💐 ధన్యవాదాలు 💐
అంకిత మోహన్