Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 7

 

                  మనసిచ్చి చూడు - 07



ఎందుకు కోపం రాదు చాలా వస్తుంది కానీ మీ మీద కాదు అండీ,నా మీద నాకే కోపం వస్తుంది.

ఎందుకు ఇలా నా జీవితం ఉంది బాధతో కూడిన కోపం అంతే అంది తను.

ఇంక నుంచి నీకు ఆ పరిస్థితి ఉండదులే సమీరా.

అంటే అర్థం కాలేదు అండీ...???

అర్థం కాకపోవడానికి ఏమీ లేదు ఇంక నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు అంటున్న.
అదే సడన్గా ఏంటి ఈ మార్పు.....??
సమీరా ముందు ఇలా రా వచ్చి కూర్చో నీతో ఒక విషయం మాట్లాడాలి.....???

చెప్పండి ఏంటి.

సమీరా నేను చెప్పే విషయం నీకు కోపాన్ని,బాధని ఇవ్వచ్చు కానీ తప్పదు అన్నాడు.

ముందు విషయం చెప్పండి ఊరికే సాగతీయకుండా.

సమీరా నేరుగా పాయింట్కి వస్తున్న.
మనం ఇంక కలిసి ఉండటానికి వీలు లేదు.
నువ్వు ఎవరైనా ప్రేమిస్తు ఉంటే చెప్పు తప్పకుండా వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తాను.

😭😭😭😭😭😭 మీరు అసలు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు అండీ.

అవును ఇప్పటికి కూడా నేను చెప్పకపోతే మంచిది కాదు.

నేను ఏమైనా మిమ్మల్ని ప్రేమించానా కనీసం పెళ్ళి సంబంధంగా అయిన మా ఇంటికి వచ్చారా...???
నా ప్రమేయం లేకుండానే బెదిరించి పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు ఏమో ఇంకొకరికి ఇచ్చి మళ్ళీ పెళ్ళి చేస్తారా....??
అసలు నన్ను ఏమీ అనుకుంటున్నారు,ఇదేమైన బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా చెప్పండి అని గట్టిగా నిలదీసింది.

చూడు అవన్ని నాకు తెలియదు చెప్పాల్సిన్ది చెప్పాను ఇంక నీ ఇష్టం సమీరా.

అయితే నా మాట కూడా వినండి.

మూడు ముళ్లు వేసిన భర్త మీరు మిమ్మల్ని కాదు ఆనుకొని నేను ఎక్కడికి వెళ్లను,మీ మనసులో ఉండే ఆలోచనలు ఆ తీసివేయండి.

నీకు ఎంత చెప్పినా అర్థం కాదా అని కొట్టేదానికి చేయి ఎత్తడు.

ఎందుకు ఆపేశారు కొట్టండి.

నేను కారులో ఉంటాను తొందరగా రా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు.

మీ మనసు ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు.

సమీరా వచ్చి కార్లో కూర్చుంది.

స్పీడ్గా వెళుతున్నాడు.

ఈ కోపానికి మాత్రం ఏమీ తక్కువ లేదు ఆనుకొని పడుకుంది అలానే విండో మీద.


        ***********************

ఇంట్లో రావడం ఉమా గారు కొడుకు కోడలుని చూసి కొంచెం కంగారుగా,కొంచెం సంతోషంగా చూస్తూ ఉంది.

కోడలు మొహములో మాత్రం బాధ కనిపించి ఏదో జరిగింది అని అర్థం అయింది ఉమా గారికి.

కోపంగా వెళ్ళి డోర్ గట్టిగా వేసుకున్నాడు.

ఇద్దరు అదిరిపడి చూశారు.

ఏమైంది సమీరా ఎందుకు అలా ఉన్నావు.

ఏమి లేదు అత్తయ్య కొంచెం తలనొప్పిగా ఉంది అంది.
సరే వెళ్ళి పడుకో తల్లి నేను ఏమైనా కాఫీ తీసుకొని వస్తాను.

ఉమా గారిని గట్టిగా కౌగిలించుకొని నా మనసులోని బాధను అర్థం చేసుకునే మనిషి మీరు ఒక్కరే అత్తయ్య థాంక్యూ అత్తయ్య 😭

పిచ్చి పిల్ల దీనికే ఎవరైనా ఏడుస్తారా అంది.వెళ్ళి పడుకో సమీరా.

అలాగే అత్తయ్య అంటూ గదిలోకి వెళ్ళింది.

గౌతమ్ రెడీ అవుతు ఉన్నాడు ఆఫీసుకి.

వెళ్ళి పడుకుంది జ్వరం వచ్చేలా ఉంది తన పరిస్థితి.

బాగా నిద్ర పోయింది ఐదు నిమిషాలకు గౌతమ్ వెళ్తు వెళ్తు చూశాడు తనని చలికి వణుకుతుంది.

వెళ్ళి దుప్పటి కప్పేసి టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు.

ఉమా గారు కాసేపటి తరువాత రూమ్లోకి వెళ్ళారు ఒళ్ళు కాలిపోతుంది లేపి ఒళ్ళు తుడిచి గంజి కాచి ఇచ్చింది.అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్లాలి  అనుకొని రూమ్లోనే పడుకోబెట్టి బయటకు వచ్చింది.


ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళి సమీరాకి ఇలా ఉంది అని చెప్పింది.

సరే ఇదే మంచి అవకాశం వాళ్ళ ఇద్దరిని ఒక్కటి చేయడం అనుకొని వెళ్ళి గౌతమ్కి కాల్ చేసి చెప్పమన్నాడు.

సరే అండీ కానీ ఆలస్యం చేయడం ఎందుకు చెప్పండి మళ్ళీ ఏదైనా జరిగితే అంది....???

చూడు ఉమా అలా ఏమీ జరగదు ముందు వెళ్ళి కాల్ చేయి.

సరే అండీ చేస్తాను.

       ************************

గౌతమ్ అప్పుడే తన క్యాబిన్లోకి వెళ్ళాడు ఇంత లోపు వాళ్ల అమ్మ గారి నుంచి కాల్ రావడం చూసి మళ్ళీ చేద్దాంలే అనుకున్నాడు.

అలా రింగు అవుతునే ఉండేసరికి కాల్ లిఫ్ట్ చేశాడు.
అమ్మ కాసేపటి తరువాత నేనే చేస్తాను అన్నాడు.

గౌతమ్ ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను...??

చెప్పు అమ్మ.

సమీరాకి చాలా జ్వరంగా ఉంది త్వరగా నువ్వు ఇంటికి రా అంది.

అమ్మా ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చింది మళ్ళీ ఏంటి ఇదంతా...???

గౌతమ్ నీకు అసలు విషయం అర్థం అవుతుందా,ఆరోగ్యం బాగలేకుండా నీ భార్య ఇక్కడ ఉంది కనీసం బాధ్యత ఉందా నీకు అని కొంచెం గట్టిగానే అడిగింది.

సరే అమ్మ నేను ఇప్పుడు రాలేను మీరు హాస్పిటల్కి తీసుకొని వెళ్లి రండి.

లేదు గౌతమ్ నేను మీ నాన్న గారిని చూసుకోవాలి నువ్వే రా అరగంటలో అని కాల్ కట్ చేసింది.

అబ్బ అమ్మ ఎందుకు నన్ను ఇలా సాధిస్తారు అని గట్టిగా అరిచాడు.

కాసేపు ఆలోచించి మళ్ళీ ఇంటికి వెళ్లాడు.

వెళ్ళే  సరికి సమీరా చలికి వణుకుతూ ఉంది.
ఒళ్ళు అంత వేడిగా కాలిపోతుంది.
సడన్గా ఏంటి ఈ జ్వరం అనుకున్నాడు.

వెంటనే తనని లేపాడు సమీరా లేయి హాస్పిటల్కి వెళ్ళి వద్దామని.

తను కనీసం కళ్ళు కూడా తెరిచి చూసే పరిస్థితిలో లేదు.

ఇలా కాదు ఆనుకొని సమీరాని తన రెండు చేతుల్లోకి ఎత్తుకున్నాడు.
తనని తీసుకొని బయటికి వస్తున్నాడు వాళ్ల అమ్మ నాన్న చూస్తూ ఉన్నారు.ఇప్పుడు అయిన గౌతమ్లో మార్పు రావాలి అని.

వెళ్ళి కార్లో కూర్చోబెట్టి కారు పోనిచ్చాడు.

కాసేపటి తరువాత పెద్ద హాస్పిటల్ వచ్చింది బయటకు దిగి తనను ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు.
డాక్టర్ చెక్ చేసి కొన్ని పరీక్షలు చేయాలి మీరు కాసేపు బయట ఉండండి అని చెప్పారు.

మధ్యాహం అవుతున్న ఎవరి నుంచి సమాధానం లేదు.
వెళ్ళి అడిగాడు ఏమైంది తనకి అంతా ఒకేనా డాక్టర్ అన్నాడు కంగారు కూడిన స్వరంతో.

మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కానీ..............???????

ఇంకా ఉంది

                   ధన్యవాదాలు 💐

                  అంకిత మోహన్ 💙