Featured Books
  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 6

   

                  మనసిచ్చి చూడు -06


అప్పుడే సడన్గా కరెంట్ పోయింది....!!!

సమీరా చాలా టెన్షన్గా ఫీల్ అయింది. 

చంపేస్తాడా ఏంటి.....అనుకుంది. 

గౌతమ్ క్యాండిల్ వెలిగించి సమీరా హ్యాండ్ పట్టుకున్నాడు. 

ఉలిక్కిపడి ఏంటండి ఇది అని హ్యాండ్ విసురుగా వెనక్కి తీసుకుంది. 

హలో మేడం మీరు అనుకునట్టు ఎమ్ జరగదు ఇక్కడ. 
ముందు ఈ వాటర్ తీసుకో,వచ్చి ఇలా కూర్చో అన్నాడు ఆన్గ్రీ బర్డ్. 

కొంచెం రిలీఫ్ అనిపించింది చెప్పండి ఏంటి విషయం నేరుగా అడిగింది. 

వెయిట్ చెప్తాను పవర్ రాని..... అన్నాడు.

అలాగే నాకు ఆకలిగా ఉంది అంది సమీరా.

ఓకే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి వెళ్ళి తిను అన్నాడు.

లేదు నాకు చీకటి అంటే చాలా భయం నేను వెళ్లలేను...!!!

అంటే ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చి ఇవ్వాలా....???

తప్పదు అన్నట్టు ఒక చూపు చూసింది.

వెళ్ళి తెచ్చి ఇచ్చాడు తింటూ ఉంది... మీకు కావాలా అంది గౌతమ్తో..!!

అవసరం లేదు నువ్వు కానివ్వు అన్నాడు వచ్చి రాని నవ్వుతో...!!

సమీరా తినేసి అలాగే సోఫాలో పడుకుంది.

కాసేపు తరువాత కరెంట్ వచ్చింది కానీ సమీరా అంత ప్రశాంతంగా నిద్రపోతుంటే నిద్ర లేపడానికి గౌతమ్కి మనసు రాలేదు. 

ఫ్యాన్ ఆన్ చేసి గౌతమ్ కూడా అలాగే సోఫాలో కూర్చొని కళ్లు మూసుకున్నాడు. 

దాదాపు టైమ్ రాత్రి రెండు ఒకటి అవుతుంది అప్పుడు మెలుకువ వచ్చింది సమీరాకి.

ఎదురుగా గౌతమ్ నిద్ర పోతున్నాడు.

ఎప్పుడు కోపంగా ఉండే మనిషి నిద్ర పోయేటప్పుడు మాత్రం చిన్న పిల్లడిలా ఉన్నాడు ఇలాగే నిద్ర లేచిన తరువాత కూడా ఉంటే ఎంత బావుణ్ణు కదా అనుకుంది తను. 

ఎంత సేపటికి నిద్ర పట్టలేదు సరి కదా గౌతమ్ కొంచెం చలికి వణుకుతూన్నట్టు అనిపించింది వెంటనే దుప్పటి తెచ్చి కప్పి ఫ్యాన్ స్పీడ్ తగ్గించింది. 

అలాగే కాసేపు వాక్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది.గుండె చాలా భారంగా అనిపించింది,ఎందుకు తన జీవితం ఇలా ఉంది అనుకొని బాధ పడుతూ నిద్ర పోతున్నా గౌతమ్ దగ్గరకు వెళ్ళి సోఫా కింద కూర్చుంది. 

గౌతమ్ ఇష్టం,ప్రేమ లేని పెళ్లికి అసలు విలువ ఉండదు అంటే నేను ఇప్పుడు మీ దృష్టిలో విలువ లేని మనిషిగా ఉన్నాను అనే కదా అర్థం. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత బలవంతంగా నన్ను పెళ్ళి చేసుకున్నారు.మీ మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.నా మనసు ఏమో మీకు అర్ధం కాదు.నన్ను ఇలా బాధ పెట్టడానికే పెళ్ళి చేసుకున్నారా చెప్పండి అని ఏడుస్తూ అక్కడే కూర్చొని అలాగే నిద్రపోయింది. 

ఉదయం గౌతమ్కి మెలుకువ వచ్చి మీద దుప్పటి ఉండడం గమనించి కింద చూశాడు సమీరా నిద్రపోతుంది. 

దుప్పటి విసిరి కొట్టాడు తన మీదకి. 

వెంటనే నిద్ర లేచి చూసింది కోపంగా ఉండే సింహాన్ని. 

లేచి సోఫాలో కూర్చుంది. 

సమీరా అసలు విషయం మాట్లాడడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను కానీ కుదరలేదు. 

చెప్పండి అంది. 

చెప్పడానికి ఎమ్ లేదు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఏమాత్రం ఆలోచించకుండా. 

షాక్ అయింది తను, వెంటనే ఎమ్ మాట్లాడుతున్నారు మీరు కొంచెం ఐనా మతి ఉందా...?? 

మతి ఉంది కాబట్టే మాట్లాడుతూన్నాను.

చూడండి ఈ పెళ్ళి చేసుకోవడం నాకసలు ఇష్టం లేదు కానీ బలవంతంగా చేసుకున్నారు ఒక్కసారి ముడి పడిన తరువాత ఈ జన్మకి నాకన్ని మీరే.పెళ్ళికి ముందు నా మనసులో ఎవరు లేరు,ఇప్పుడు కూడా ఎవరూ లేరు.ఒక భర్తగా మీరు తప్ప నా మనసులో ఇంకొకరికి స్థానం లేదు. 

అది కాదు నేను చెప్పేది......??? 

ఎమ్ చెప్తారు మీరు.... కన్యాదానం చేస్తాను అంటారా....??? 
ఈ విషయం ఇంతటితో వదిలేయండి లేదు అంటే నేను మావయ్య గారికి చెప్పాల్సి ఉంటుంది. 

చూడు సమీరా మా నాన్న గారు అంటే నాకు గౌరవం ఉంది భయం కాదు. 
ఆయన కోసమే నిన్ను చేసుకున్నాను కానీ నావల్ల నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అందుకే నీ జీవితం ఇక నుంచైన సంతోషంగా ఉండేలా ఈ అవకాశం ఇస్తున్నాను అన్నాడు. 

మీ అంత గొప్ప హృదయం నాకు లేదు.అసలు మీ గురించి మీరు ఎమ్ అనుకుంటున్నారు చెప్పండి.ఎమ్ చేసిన అడిగే వారు లేరు అనా..... 

ఏంటి నోరు లేస్తుంది. 

అవును ఏంటి ఇప్పుడు పెళ్లి జరిగి కనీసం నెల కూడా అవ్వలేదు అప్పుడే కట్టుకున్న భార్యకు ఇంకో పెళ్ళి చేస్తాడు అంటా......???

సమీరా........ 😠😠

అవును సమీరానే ఒకప్పుడు కానీ ఇప్పుడు 

           😍 సమీరా గౌతమ్ 😍

ఆ విషయం మైండ్లో పెట్టుకొని మాట్లాడండి ఏదైనా సరే. 

ఏంటి వింటున్న కదా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెంప చెళ్లుమనిపిస్తాడు. 

కన్నీళ్లుతో బాల్కనీలోకి వచ్చి ఏడుస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళకి కాల్ చేసింది. 

అమ్మ సమీరా ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా అడుగుతారు వాళ్ళు. 
మీ చెల్లికి కూడా పెళ్ళి కుదిరింది తల్లి అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ వచ్చే మూడు నెలల్లో పెళ్ళి చేయాలి అనుకుంటూన్నాము అని ఎంతో సంతోషంగా చెప్పింది. 

వాళ్ళకు తన బాధ చెప్పి బాధ పెట్టడం కరెక్ట్ కాదు ఆనుకొని కొంచెం సేపు మాట్లాడుతూ ఉంది. 

నువ్వు అల్లుడు గారు నెల ముందే రావాలి అన్ని మీరే దగ్గర ఉండి చూసుకోవాలి అంది. 

తప్పకుండా అమ్మ. 

ఓకే సమీరా జాగ్రత ఉంటాను. 

నా మనసు ఏంటో తెలుసుకోకుండా మంచి సంబంధం అని ఒక్క రోజులో హడావిడిగా పెళ్ళి చేశారు.

ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. 

గౌతమ్ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. 

నేరుగా బెడ్ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి 
అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంది. 

అయితే ఇప్పుడు ఎమ్ చేయాలి ఇది కూడా నా ఇల్లె అర్థం అయిందా 😠😠😠😠

అర్థం అయింది కానీ నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము అక్కడ అత్తయ్య గారు ఒక్కరే మావయ్య గారిని ఎలా చూసుకుంటారు ఈ విషయం మీకు అర్ధం అవుతుందా.....?? 

గౌతమ్ మనసులో పర్లేదు మా అమ్మ నాన్న గురించి బాగానే ఆలోచిస్తుంది అనుకున్నాడు. 

సరే గంట సేపు తరువాత స్టార్ట్ అవుదాము అన్నాడు. 

సరే అంది. 

సమీరా నేను నిన్ను ఇన్ని మాటలు అంటున్నా నా మీద నీకు అసలు కోపం రావడం లేదా అని కన్సర్న్ వేలో అడిగాడు. 

ఎందుకు కోపం రావడం లేదు చాలా కోపం వస్తుంది కానీ....... ❣️

ఇంకా ఉంది......!!!!! 

                    ధన్యవాదాలు 💐 

                   అంకిత మోహన్ ✍️