Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 10


               మనసిచ్చి చూడు - 10




రెస్టారెంట్లోకి అడుగు పెట్టడం ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికి.మనస్పూర్తిగా మాట్లాడుకోవడానికి మంచి ప్లేస్ల ఉంటుంది.

నీకు ఏమీ కావాలో ఆర్డర్ ఇవ్వు సమీరా అంటాడు గౌతమ్.

మీరు ఏది తింటారో అదే చెప్పండి అని అంటుంది తను.

కాసేపటికి ఇడ్లీ,సాంబార్ తింటూ ఇంత కూల్ వెదర్లో టిఫిన్ చాలా బాగుంది అని ఆస్వాదిస్తు తింటారు.

తిన్న తరువాత సమీరా అడుగుతుంది ఇప్పుడు కేరళ ఎందుకు అని....??

ఇన్ని రోజులు ఇంటి దగ్గరే కదా ఉన్నాము.మార్పు సహజంగా రావాలి అంటే ప్రదేశం కూడా మారాలి సమీరా.

నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇంక నుంచి నువ్వు బాధ పడే ఏ పని చేయను అన్నాడు.

ఇది కలో నిజమో ఏమీ తెలియడం లేదు కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉంది అండీ అంది.

ఇది కల ఏమీ కాదు అని గిల్లుతాడు,
సరే టైమ్ అవుతుంది పద  బయలుదేరుదాము అన్నాడు.

        *********************

తరువాత రోజు  ఉదయం పది గంటలకు కేరళ చేరారు.
కాసేపు నిద్రపోయి తరువాత విజిటింగ్ ప్లేసస్కి వెళ్లారు.

చీకటి పడుతుంది అనగా మళ్లీ కాటేజ్కి వచ్చారు 

మొదటి సారి ధైర్యంగా గౌతమ్ గుండెల మీద తల పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంది సమీరా.

ఇద్దరిలోను కొత్త భావన మొదలైంది.

ఇలా జీవితాంతం మీ గుండెల నిద్రపోవలని ఉంది అండీ అంటుంది.

ఐ లవ్ యూ సమీరా అంటాడు

ఐ లవ్ యూ టూ అంటుంది సమీరా.


పల్లవి:

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా..
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

చరణం 1:

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే నీ విరజాజులై

మిస మిస వన్నెలలో మిల మిలమన్నవిలె
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...

చరణం 2:

తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా

సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె

కలలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...

మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కా...సే ఈ రేయి హాయిగా


పెళ్ళి అయిన ఏడు నెలల తరువాత ఇద్దరు ఒక్కటి అయ్యారు సంతోషంగా.

అలా వారం తరువాత తిరిగి ఇంటికి వచ్చారు.

గౌతమ్లో చాలా మార్పు వచ్చింది,సమీరాను చాలా బాగా    చూసుకుంటున్నాడు.

ఈ మార్పులో ఏమైనా తేడా ఉంది ఏమో అని ప్రతాప్ గారు  గౌతమ్ని ఎప్పుడు గమనిస్తునే ఉన్నారు.కానీ ఒక పక్క సంతోషంగా ఉన్నారు కొడుకు కోడలని చూసుకొని.
అలా ఒక సంవత్సరం గడిచింది.

        కొద్ది రోజుల తరువాత అమెరికా నుంచి గౌతమ్ వాళ్ల మరదలు వచ్చింది.తన పేరు మధు.

సమీరా చాలా బాధ పడుతుంది మధు తన భర్తకు దగ్గరగా ఉండడం చూసి.

మధు బాగా చదువుకున్న,తెలివైన అమ్మాయి.

ఒక రోజు గౌతమ్ని అడిగింది ఇంక దాచుకోలేక.

మీరు మధుని ప్రేమించారా.....???

సమీరా......ఏమీ మాట్లాడుతున్నావు అసలు అర్థం అవుతుందా అన్నాడు.

నిజమే మాట్లాడుతున్నాను అండీ అంది.

చూడు చూసే కళ్ళు అన్ని నిజమే చెప్పాలని లేదు.
తను నేను చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాము.
ఆ మాత్రానికి తప్పుగా ఎలా అనుకుంటావు అన్నాడు.

ఏ భార్య అయిన అలానే అనుకుంటుంది అండీ.
తన భార్య తనతో తప్ప ఎవరితోను ఎక్కువ మాట్లాడకూడదు ఎలా మీరు అనుకుంటారో,అలాగే తన భర్త తనతో తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు అని మేము అనుకుంటాము అంది.

అనుకో తప్పు లేదు కానీ తప్పుగా అనుకోవద్దు సమీరా.
నువ్వు భయపడే అంత సాన్నిహిత్యం మా మధ్య లేదు మేము చాలా మంచి స్నేహితులం.తనకి వచ్చే నెలలో పెళ్ళి.తండ్రి లేని పిల్ల కాబట్టి అన్ని దగ్గర ఉండి మనమే చూసుకోవాలి.మీ చెల్లి పెళ్లి ఎంత ఘనంగా చేశామో,ఇప్పుడు మధు పెళ్ళి కూడా అలాగే చేయాలి అన్నాడు.

సారీ మీ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అంది.

భర్తలను అనుమానించడం భార్యలుగా అది మీ హక్కు కదా.
పర్లేదులే పెళ్లం గారు అన్నాడు నాటీగా.

సిగ్గు పడింది తను.

గౌతమ్తో మాట్లాడుతూ ఉండగానే తను కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోయింది.

వెంటనే గౌతమ్ టెన్షన్ పడి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు.

మీకు శుభవార్త మీరు తండ్రి కాబోతున్నరు అంది డాక్టర్.

థాంక్ యూ డాక్టర్ అన్నాడు.

ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.

గౌతమ్ అయితే తను తండ్రి అవుతున్నాడు అని తెలిసినప్పటినుంచి చాలా సంతోషంగా ఉన్నాడు.

తనకి ఏమీ కావాలన్నా అడిగితే చాలు అన్నట్టు అందరూ  చూసుకుంటూన్నారు.

మధు పెళ్ళి కూడా దగ్గర పడింది.

కానీ మధుకి ఈ పెళ్ళి చేసుకోవడం పెద్దగా ఇష్టం లేదు అన్నట్లు డల్గా ఉంది.
అది గమనించిన ప్రతాప్ గారు పిలిచి అడిగారు.

ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు మధు ఎందుకు అంత డల్గా ఉన్నావు అన్నాడు.

అదేమీ లేదు మామయ్య అంది తను.

సమీరా కూడా గమనిస్తుంది మధుని అసలు పెళ్లి కళ లేదు తనలో ఆనుకుంది.

రేపు పెళ్ళి అనగా ముందు రోజు గౌతమ్తో మాట్లాడింది మధు....అది అంత చూసిన సమీరా షాక్ అయింది తను.

ఇంకా ఉంది 

                 💐 ధన్యవాదాలు 💐 

                     అంకిత మోహన్