Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 4

మనసిచ్చి చూడు - 04



హలో ఎవరు.... ❣️ 

అవతల మాట్లాడకపోయే సరికి ఎవరు అండీ అన్నాడు చాలా కోపంగా....??? 

నేను సమీరా..... ❣️ 

సమీరా.....చెప్పు ఏంటి,ఎందుకు కాల్ చేశావు. 

అది అది....??? 

ఇలా లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు..??? 

మీరు ఇంటికి రండి నేను కొంచెం బయటకు వెళ్లాలి కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. 

ఏంటి నాటకాలా.... నేను ఆఫీసులో ఉంటే ఇప్పుడు నీకోసం రావాలా....?? 

వస్తే ఎమ్ అవుతుంది రాకూడదా.....?? 

చూడు అవన్ని జరగని పనులు ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు.నీకు ఎమ్ కావాలి అన్న కొనుక్కో నా కార్డ్స్ ఇస్తాను,నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, ఇంకోసారి ఫోన్ చేయకు. 

నా దగ్గర డబ్బులు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా అండీ....?? 

నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తు లేదు అనుకుంటా.... మీ వల్లే నా లైఫ్ ఇలా అయింది. 
మీకు ప్రేమించడం ఒక్కటే రాదు అనుకున్నాను,కానీ కనీసం ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం కూడా రాదు అని ఇప్పుడే అర్థం అయింది. 

ఇవన్నీ అనవసరం ఉంటాను. 

ఒక్క నిమిషం నేను బయటకి వెళ్తున్నాను,లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి రండి. బై 😠

అబ్బా నీకు ఎమైన పిచ్చా....?? 
నాకు ఇష్టం లేదు అంటే మళ్లీ మళ్లీ ఏంటి ఇదంతా...?

వెంటనే గౌతమ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది.

మీకు ఇష్టం లేకుండా నేను మీ జీవితంలోకి రావాలి అనుకోవడం లేదు కానీ నా బాధ అంత ఒక్కటే నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశారు.నేను మీకు ఎమ్ అన్యాయం చేశాను అని ఇలా చేశారు 😭😭😭

మెసేజ్ చూసి కూడా చూడనట్లు కామ్గా అలాగే తల వాల్చూకున్నాడు గౌతమ్.

              *****************


అమ్మ సమీరా వాడికి లంచ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు నెమ్మదిగా వాడిని నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయి తల్లి. 

మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనసులో నేను లేను కదా అత్తయ్య ఉపయోగం ఏమీ ఉంది చెప్పండి. 

అలా అంటే ఎలా తల్లి మన ప్రయత్నం ఏదో మనం చేయాలి కదా. 

ఇప్పుడు నేను అక్కడికి వెళ్లిన నా మీద కోపం చూపిస్తారు. 

నువ్వు వెళ్ళు సమీరా నేను చూసుకుంటాను. 

అలాగే అత్తయ్య. 

సమీరా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది, ఎదురుగా జగదీష్ ఎదురు వచ్చి బాగున్నావా సమీరా అని అడిగాడు. 

బాగున్నాను అన్నయ్య నేను ఎలా ఉన్నానో మీకు తెలుస్తునే ఉంది కదా. 

ఓకే సమీరా ఎమ్ కాదు అన్ని క్లియర్ అవుతాయి, వాడికి లంచ్ తెచ్చావా...?? 

ఆయనకే కాదు అన్నయ్య మీకు కూడా తెచ్చాను పదండి అన్నయ్య. 

ముందు నువ్వు క్యాబిన్లోకి వెళ్ళు నేను రెండు నిమిషాలలో వస్తాను. 

అలాగే అన్నయ్య. 


ఆఫీస్ డోర్ నాక్ చేసింది. 

కం ఇన్ అన్నాడు మన హీరో. 

సమీరా  బ్లూ కలర్ శారీలో కుందనపు బొమ్మలాగా ఉంది.సమీరాను చూడడం సూపర్ అనుకున్నాడు మళ్లీ కోపంగా నువ్వు ఏంటి ఇక్కడ....??

మీకోసం లంచ్ తీసుకొని వచ్చాను అండీ. 

ఎవరు చెప్పారు నేను నిన్ను అడిగానా లంచ్ కావాలి అని ఏదో ఒక కారణంతో నాకు దగ్గర కావాలి అని చూడకు. 

లంచ్ మీకోసం తెస్తే ఇన్ని మాటలా....??! 

నువ్వు తేవలసిన అవసరం లేదు అంటున్నాను అర్థం అవుతుందా. 

అప్పుడే జగదీష్ లోపలికి రావడం గమనించి కామ్గా ఉన్నాడు. 

రే రారా మా చెల్లి వంట అద్భుతంగా చేస్తుంది అని చెప్పారు ఒక పట్టు పడదాము. 

నాకు వద్దు నువ్వు తిను

ఓవర్ యాక్షన్ చేయకు రా రా నువ్వు తింటేనే నేను తింటాను లేకపోతే లేదు పో అసలే నాకు చాలా ఆకలిగా ఉంది. 

జగదీష్ బాధ చూడలేక సరే అన్నాడు. 

ఇద్దరికి వడ్డిస్తుంది. నువ్వు కూర్చో సమీరా అన్నాడు జగదీష్. 

పర్లేదు అన్నయ్య మీరు తినండి నేను మళ్లీ తింటాను. 

సరే నీ ఇష్టం సమీరా. 

సమీరా సూపర్గా ఉన్నాయి అన్ని కూరలు. 
ఎమ్ రా అంతే కదా. 

అంతే అంతే అన్నాడు కోపంగా. 

గౌతమ్ కోపాన్ని గ్రహించిన సమీరా చాలా భయపడుతూ ఉంది. 

లంచ్ ఫినిష్ చేశారు ఇద్దరు. 

( ఇక్కడ ఉమా గారు సమీరా తీసుకొని వెళ్ళిన కార్ను మళ్లీ ఇంటికి రప్పించింది.వాళ్ళ ఇద్దరు కలిసి రావాలి అనే ప్లాన్తో )

సరే నేను వెళ్ళి వస్తాను అండీ

ఆన్గ్రీ మ్యాన్ ఒక లుక్ చూశాడు సరే అన్నయ్య నేను ఉంటాను మరి బై. 

బై సమీరా జాగ్రత. 

బయట వచ్చి చూస్తే కార్ లేదు. 

అయ్యో దేవుడా ఎమైంది కార్ ఆనుకొని కంగారు పడుతూ వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసింది. 

అత్తయ్య మన కార్ ఇక్కడ లేదు అని చెప్పింది. 

నువ్వు ఎమ్ కంగారు పడకు అది అవసరం ఉండి ఇంటి దగ్గరకు వచ్చింది,నువ్వు మీ ఆయనతో కలిసి వచ్చేయి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. 

అబ్బా ఇప్పుడు ఎలా అనుకుంటూ మళ్లీ లోపలికి వెళ్తు ఉంది. 

మళ్లీ వెనక్కి వస్తున్న సమీరాను దగ్గరకు వెళ్ళి ఎమైంది అని అడిగాడు జగదీష్. 

జరిగింది చెప్పింది. 

సరే ఉండు రా.వాడిని పంపిస్తాను లోపలికి వెళ్ళి. 

అలాగే అన్నయ్య. 

రే సమీరా కార్ లేదు ఆంటీ తీసుకొని వెళ్ళారు నువ్వు వెళ్ళి తనని ఇంటి దగ్గర వదిలి పెట్టి రా. 

ఏంటి రా అన్ని కార్లు ఉండి కొత్తగా...?? 

అన్ని ఉన్నాయి కానీ అవసరానికి ఇప్పుడు లేవుగా ముందు వెళ్ళు నువ్వు తను బయట ఒక్కటే ఉంది. 

ఇప్పుడు నాకు ఓపిక లేదు నువ్వు వెళ్ళి వదిలి పెట్టి రా అన్నాడు. 

నీకు ఎమైన పిచ్చా రా నువ్వు ముందు పైకి లే అని లేపి పంపించాడు. 

గౌతమ్ రాడు అనుకుంది కానీ రావడం చూసి షాక్ అయింది. 

కార్ తీసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. 

కార్ ఎక్కి కూర్చుంది స్పీడ్గా వెళ్తున్నాడు. 

స్పీడ్గా వెళ్తున్న కార్ను కొంచెం స్లో చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్టాప్ చేశాడు. 

చుట్టూ చూసింది. 

గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేశాడు దిగు అన్నట్టు. 

ఎందుకు ఇక్కడ....??? 

మొన్న ఏమో తీసుకోవాలి అన్నావు కదా వెళ్లి రా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కార్డ్ చేతిలో పెట్టి పిన్ నెంబర్ చెప్పాడు. 

ఇప్పుడు ఏమీ వద్దు అంది తను. 

30 నిమిషాల్లో రా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కార్లో కూర్చున్నాడు. 

నాతో మాట్లాడకపోయిన నేను ఎమ్ అడిగిన బాగానే గుర్తు పెట్టుకుంటారు ఆనుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకోని వచ్చి కార్లో కూర్చుంది. 


       కార్డ్ తీసుకోండి అంది. 

       వద్దు నీ దగ్గరే పెట్టుకో ఎమ్ అవసరం ఉన్నా వాడుకో,నన్ను ఇబ్బంది పెట్టకుండా. 

     పర్లేదు తీసుకోండి అంది. 

ఒక్క ఆన్గ్రీ లుక్కి కామ్ అయిపోయింది. 

నాతో మాట్లాడడానికి మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు కానీ మీరు అంటే మాత్రం నాకు చాలా ప్రేమ ఉంది.నా ప్రేమతోనే నేను మిమ్మల్ని మార్చుకోవాలి ఆనుకొని అలాగే విండో మీద తల వాల్చి కళ్లు మూసుకుంది. 


తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే
తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా

సడన్ బ్రేక్ వేయడం వల్ల ఉలిక్కిపడి లేచి చూసింది ఇల్లు వచ్చింది అని అర్థం అయి పక్కన చూసింది గౌతమ్ కోపంగా చూస్తూ ఉన్నాడు......??????

                  ధన్యవాదాలు 💐 

                 అంకిత మోహన్ ✍️