Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 8


                 మనసిచ్చి చూడు - 08


మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ తనకి ఆరోగ్యం అసలు బాలేదు.అంటే ఎక్కువగా దేని గురించో ఆలోచించడం వల్ల చాలా సఫర్ అవుతున్నాట్టు ఉన్నారు అందుకే ఇంత ఎక్కువగా జ్వరం కూడా రావడం జరిగింది.ముందు కొంచెం కోలుకొన్న తరువాత తన మానసిక పరిస్థితి తెలుసుకొండి.

అలాగే డాక్టర్ ఎప్పుడు ఇంటికి తీసుకొని వెళ్లచ్చు...??

ఇంకో రెండు రోజుల తరువాత డిస్చార్జ్ చేస్తాం.

అలాగే డాక్టర్ అని చెప్పి పక్కకు వెళ్లి వాళ్ల అమ్మ గారికి కాల్ చేసి విషయం అంత చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పాడు.

ఆమె బాగా ఆలోచించి లేదు రా మీ నాన్న గారికి అక్కడ పడదు అని చెప్పింది.నువ్వే దగ్గర ఉండి చూసుకో అంది.

అమ్మా అన్నాడు.

ఉంటాను జాగ్రత్త రా సమీరా అని కాల్ కట్ చేసింది.

సాయంత్రం అవుతుంది ఇంత వరకు తను ఏమీ తినలేదు కదా ఆనుకొని బయటికి వెళ్లి వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ తెచ్చాడు.

తను ప్రశాంతంగా నిద్రపోతుంది.

వెళ్ళి తనని నిద్ర లేపి వద్దు అన్న కూడా తినిపించాడు తరువాత మాత్రలు వేసి పడుకోబెట్టి మళ్ళీ వస్తాను చెప్పి బయటకి వచ్చాడు.జగదీష్కి కాల్ చేసి రెండు రోజులు రాలేను మేనేజ్ చేసుకొ రా అన్నాడు.

తరువాత ఒక మాల్కి వెళ్లి తనకి కావాల్సిన బట్టలు తీసుకొని,పండ్లు తీసుకుని వచ్చాడు.

సమీరా దగ్గరకు వెళ్ళి బట్టలు ఇచ్చి మార్చుకో అన్నాడు.

ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ ప్రేమ అంది తను.

నా వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందని అర్థమవుతోంది.ఈ గొడవలు,సమస్యలు ఇంక ఏమీ వద్దు డిస్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన తరువాత నీకు ఒక మంచి వార్త చెపుతాను.వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు.


తన మనసు కూడా కొంచెం పాజిటివ్గా అనిపించడం వలన వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది.ఈ లోపు ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టాడు.

ఈ సమయంలో ఇవి నేను తినలేను అంది.
తింటేనే ఆరోగ్యం కుదుట పడుతుంది వద్దు అనకుండా తిను అని తినిపిస్తాడు.

తిన్న తరువాత కాసేపు అలా నడువు వెంటనే పడుకోవద్దు అన్నాడు.

అలాగే అంది తను.

తొమ్మిది వరకు మేలుకొని తరువాత బాగా నిద్రపోయింది.

గౌతమ్ కూడా అలాగే కుర్చీలో కూర్చొని కునుకు తీశాడు.మెలుకువ వచ్చిన తరువాత వెళ్ళి తనని పట్టి చూశాడు జ్వరం తగ్గిందా లేదా అని.....????

నార్మల్గానే అనిపించింది.

మార్నింగ్ సమీరా నిద్ర లేవక ముందే తన ముందు అన్ని ఉన్నాయి.

తరువాత నిద్ర లేపాడు.తను రెడీ అయి వచ్చింది.ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు రేపు ఇంటికి వెళ్లాచ్చు అన్నారు డాక్టర్ అన్నాడు.

అలాగే అంది.

సమీరా ఇలా డల్గా ఉండకు కాస్త ఫ్రీగా నార్మల్గా ఉండు అన్నాడు.

మీరు అన్న మాటలు ఇంకా నా మదిలో నుండి వెళ్లలేదు అండీ.ఇంక ఎలా నార్మల్గా ఉంటాను చెప్పను.

ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండు సమీరా అన్ని సర్దుకుంటాయి.

ఎలా అంది.

నీ బాధకు సొల్యూషన్ ఏదైనా నా నుంచే కదా వచ్చేది.
కొంచెం ఎదురు చూడు చాలు అన్ని నార్మల్ అవుతాయి అన్నాడు.

మాటలు చెప్పినంత తేలిక కాదు కదా గౌతమ్ భరించడం అంది.

నీ ఇష్టం సమీరా కాసేపు పడుకో నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను అన్నాడు.

హాం అంది తను.

డాక్టర్ ఇప్పుడు తనకి అంతా నార్మల్నా అడిగాడు.

ఇప్పుడు ఏ సమస్య లేదు కానీ తన మానసికంగా బాధ పడకుండా  చూసుకోండి చాలు అంది.

సరే డాక్టర్ మరి ఈరోజు ఇంటికి వెళ్లాచ్చా...??

తప్పకుండా వెళ్లవచ్చు అంది.

థాంక్యూ డాక్టర్ అన్నాడు.

సమీరా దగ్గరకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లచ్చు అన్నాడు.

ఎక్కడ ఉన్న మార్పు ఏముంది అనుకుంది తను.

నీ మనసులో ఏముందో అర్దం అయింది సమీరా ఆనుకొని అక్కడే కూర్చున్నాడు.

ఎప్పుడు కోపంగా ఉండే ఈ మనిషి ఇప్పుడు ఏంటి ఇంత మార్పు చాలా కూల్గా కూడా కనిపిస్తున్నారు అనుకుంది. 

ఏదో మార్పు అయితే వచ్చింది ఆనుకొని సంతోష పడింది.


             *******************

కొడుకు కోడలు కలిసి సంతోషంగా ఇంటికి వస్తే బాగుంటుందని ప్రతాప్ వర్మ-ఉమా గారు అనుకున్నారు.

సాయంత్రం అవుతుండగా హాస్పిటల్ నుంచి బయలుదేరుతున్నామని కాల్ చేశాడు గౌతమ్.  

వాళ్ల కోసం హారతి సిద్ధం చేసి పెట్టారు ఉమా గారు.

5 అవుతుండగా వచ్చారు ఇద్దరు.

కొంచెం నీరసముగా ఉన్నట్లు అనిపించింది సమీరా.

ఎలా ఉంది తల్లి ఇప్పుడు అంది ఉమా గారు.

పర్లేదు అత్తయ్య బాగున్నాను ( మీరు ఎందుకు రాలేదో నాకు అర్థం అయింది అత్తయ్య అనుకుంది మనసులో)

సరే తల్లి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అంది.

సరే అత్తయ్య అంది.

గౌతమ్ నువ్వు ఒక్క నిమిషం ఉండు రా అంది.

చెప్పు అమ్మ అన్నాడు సమీరా గదిలోకి వెళ్ళిన తరువాత.


సమీరా మీద నీ అభిప్రాయం ఏంటి రా అసలు అడిగింది సూటిగా.

అభిప్రాయం ఏముంది అమ్మ అన్నాడు.

ఆపు గౌతమ్...గట్టిగా అంది.

మొన్న కూడా బాగుంది ఆరోజు నువ్వు వచ్చి బయటికి తీసుకొని వెళ్ళి వచ్చినప్పటి నుంచి తనకి ఇలా జ్వరం వచ్చింది ఎందుకు అంది.

అదేమి లేదు అమ్మ అన్నాడు.

చూడు గౌతమ్ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఏ అమ్మాయి అయిన ఎన్నో ఆశలతో మెట్టినింటిలో అడుగు పెడుతుంది.తన పెళ్ళి కూడా తన ఇష్ట ప్రకారం జరగలేదు బలవంతంగా బెదిరించి చేసుకున్నావు మళ్ళీ ఆ అమ్మాయితో కనీసం సంతోషంగా ఉండకుండా ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నావు గౌతమ్ చెప్పు అంది.


అమ్మ నీకు తెలుసు కదా నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇదంతా ఇష్టం లేదు అని అన్నాడు.

అంతా ఇష్టం లేనప్పుడు ఎందుకు రా పెళ్ళి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అంది.

నాన్న గారి కోసం అని తెలుసు కదామ్మ అన్నాడు.

నిజంగా నాన్న గారి కోసమే అయితే పెళ్ళి చేసుకున్న భార్యను ఇలా బాధ పెట్టవు రా అంది.

ఇప్పుడు నేను ఏమీ చేయాలో నాకు అర్థం అయింది అమ్మ హాస్పిటల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఏంటి ఆ నిర్ణయం అంది.

ఇప్పుడు కాదు అమ్మ మీకు త్వరలోనే చెప్తను అన్నాడు.

సరే రా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఇంకోసారి సమీరాను ఇలా చూడకూడదు అంది.

సరే అమ్మ అన్నాడు.

ఒకే వెళ్ళి తనకి ఎలా ఉందో చూసుకో అంది.

సరే అని చెప్పి లోపలికి వచ్చాడు.సమీరా గమ్మునే కూర్చొని ఆలోచించుకుంటు ఉంది.


వెళ్ళి తన పక్కనే కూర్చొని సమీరా చేయి పట్టుకున్నాడు......????

ఆలోచనలో ఉన్న సమీరా ఒక్కసారిగా ఉలిక్కిపడింది పక్కన చూస్తే గౌతమ్.....????

ఇంకా ఉంది

                 💐 ధన్యవాదాలు 💐

                     అంకిత మోహన్