Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 9

 

                    మనసిచ్చి చూడు - 09 


సమీరా ఉలిక్కిపడి చూస్తే ఎదురుగా గౌతమ్ ఉన్నాడు.

తనకి మాట్లాడలని మనసే రావడం లేదు అయిన బాధను బయట పెట్టకుండా ఏంటో చెప్పండి అంది అసహనంగా.

నీతో ఒక విషయం చెప్పాలి సమీరా అన్నాడు...??

మీరు చెప్పడానికి,నేను వినడానికి ఇంకేముంది అంది.

నీ కోపానికి అర్థం ఉంది కానీ ఒక్క అవకాశం ఇవ్వు, నన్ను మాట్లాడనివ్వు అన్నాడు బాధగా.

సరే ఏంటో చెప్పండి నాకు నిద్ర వస్తుంది అంది.

సమీరా నాకు ఈ పెళ్ళి పిల్లలు ఇది అంత పెద్దగా ఇష్టం ఉండదు దానికి బలమైన కారణమే ఉంది.సమయం వచ్చినప్పుడు చెప్తను.ఆరోజు నీతో అలా మాట్లాడి ఉండకూడదు దానికి నన్ను క్షమించు అన్నాడు.

సడన్గా ఈ మార్పు ఎందుకు అని అడిగింది.

మార్పు ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ మంచి సమయం రావాలి అంతే అన్నాడు.

ఒకే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అంది.

గుడ్ నైట్ సమీరా అన్నాడు ప్రేమగా ఇంకా ఎక్కువ మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక..!!!

          *******************

తరువాత రోజు ఉదయం నిద్ర లేచి రెడీ అయి త్వరగా ఆఫీసుకి వెళ్లిపోయారు గౌతమ్.

సమీరా అలాగే పడుకుని ఉంది.

ఉమా గారు సమీరా దగ్గరకు చాలా సంతోషంగా వచ్చింది.

సమీరాను నిద్ర లేపి కాఫీ ఇచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది.

ఏంటి అత్తయ్య అంత సంతోషం అంది.

చెప్తే నువ్వు కూడా అంతే సంతోషంగా ఉంటావు తల్లి అంది.

ఏంటో చెప్పండి కంగారు పెట్టకుండా అంది.

సాయంత్రం నువ్వు గౌతమ్ కేరళ వెళ్తున్నారు అంది.

ఎందుకు అత్తయ్య ఇప్పుడు నాకు వెళ్లాలని లేదు అంది.

పిచ్చి పిల్ల వాడు ఇప్పుడు ముందు గౌతమ్ కాదు చాలా మారిపోయాడు అంది ఉమా గారు.

అంటే అర్థం కాలేదు అత్తయ్య.

అవును తల్లి వాడు నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు.ఎప్పటికి నీ చేతిని విడిచి పెట్టను అని మాట ఇచ్చాడు అంది.

ఏంటి అత్తయ్య మీరు చెప్పేది నిజమా....??

నిజమే సమీరా,రాత్రి నువ్వు నిద్ర పోయినా తరువాత వాడు నాతో మాట్లాడాడు.

తనని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడూ అలా చేయను తను ఎప్పటికి నా వైఫ్ అన్నాడు.

ఎందుకు ఈ మార్పు అని అడిగితే...??
తన జీవితాన్ని తన అంగీకారం లేకుండానే పాడు చేశాను అనే బాధ నాకు నిన్న తనని హాస్పిటల్లో చూసినప్పుడు అర్థం అయింది అమ్మ,మరి నేను అంత చెడ్డవాడినా అనిపించింది అన్నాడు.అందుకే ఎన్ని రోజులు ఇలా ఉంటాను మిమ్మల్ని తనని బాధ పెడుతూ మారాలీ కదా అమ్మ అన్నాడు తల్లి.

అందుకే ఈ నిర్ణయం తీసుకుంటూన్నాను అమ్మ తనతో కలసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను,ఆఫీసు పనులు అన్ని ఈరోజు చూసుకొని సాయంత్రం త్వరగా వస్తాను అన్నాడు.హాని మూన్కి కూడా ప్లాన్ చేశాడు తల్లి అంది ఉమా గారు పట్టారని సంతోషంతో.

ఇది అంత కల నిజామా అనే భ్రమలో ఇంకా ఉంది సమీరా.అత్తయ్య నేను అసలు నమ్మలేకపోతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని ఉమా గారిని కౌగిలించుకుంది సమీరా.

అవును తల్లి నాకు మీ మామయ్య గారికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది.

నిద్ర లేచిన తరువాత నిన్ను ఒక్కసారి కాల్ చేయమని చెప్పాడు తల్లి అంది.

అలాగే అత్తయ్య చేస్తాను.

త్వరగా తినడానికి రా సమీరా అని చెప్పి గది తలుపు వేసుకొని వచ్చేసారు ఉమా గారు.

గౌతమ్లో ఇంత మార్పునా అసలు ఊహించలేదు అని చాలా సంబరపడిపోతుంది.
ఇప్పుడు కాల్ చేయాలి అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఎలా చేయాలి అని ఆలోచిస్తూప్పుడు ఒక మెసేజ్ వచ్చింది.

హసమీరా తిన్నవా 💙

గౌతమ్ నుంచి అంత ప్రేమగా మెసేజ్ రావడంతో చాలా సంతోషంగా మెసేజ్ చేసింది.

థాంక్యూ 💙 అని 

లగేజ్ ప్యాక్ చేయి సమీరా అని ఇంకో మెసేజ్ చేశాడు.

అలాగే అండీ 💙

సమీరా తనని అర్థం చేసుకుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

ఇక్కడ సమీరా కూడా చాలా హ్యాపీగా ఉంది.

సాయంత్రం కలసి తన భర్తతో ప్రయాణం గురించి చాలా కలలు కంటు ఉంది.

వాళ్ల అత్తయ్య దగ్గరకు వెళ్ళి సంతోషంగా కౌగిలించుకొని 
" మీలాంటి అత్తయ్య నాకు దొరకడం నా అదృష్టం "
అని చెబుతుంది.

మీ సంతోషమే మా సంతోషం తల్లి అంటుంది ఉమా గారు.సరే నువ్వు తీనేసి వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకో నేను వంట పూర్తి చేస్తాను అంటుంది.

అత్తయ్య నేను చేస్తాను మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటుంది.

పర్లేదు తల్లి నువ్వు వెళ్ళి త్వరగా అన్ని సిద్దం చేసుకో అంటుంది.

అలాగే అత్తయ్య అని వెళుతుంది.

      *********************

గౌతమ్ సాయంత్రం రావడం ఇద్దరు కలసి ఉమా - ప్రతాప్ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరులుతారు.
కారులో వెళుతున్న అంతా సేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం మొదలైంది.

సిటీ దాటిన తరువాత సమీరా అన్నాడు గౌతమ్.

చెప్పండి అంది కొంచెం సిగ్గు పడుతూ.

నిన్ను చాలా బాధ పెట్టాను కదా అన్నిటికీ కలిపి సారీ అన్నాడు.

ఇప్పుడు అవన్నీ ఎందుకు సారీ అంగీకరించాను హ్యాపీ హా అంది.

చాలా హ్యాపీ సమీరా అన్నాడు.

కానీ మీరు కారణం మాత్రం చెప్పలేదు ఎందుకు అలా ఉంటున్నారు అని అంది.

సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను అన్నాడు.

ఒకే అండీ మీ ఇష్టం బలవంతం పెట్టను కానీ ఇంకెప్పుడూ నన్ను వద్దు,వెళ్లిపో అన్నట్టు మాట్లాడకండి అంది.

అలాగే సమీరా అన్నాడు.

సమీరా కాసేపు అలాగే కళ్ళు ఆర్పకుండా గౌతమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఉంది.



ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే ఉంటుందమ్మ ఓ ప్రేమ
అన్నింటా నీ తీరే అడుగాడుగు నీ జోరె

గుండెల్లో గోదారే పొంగే భావమ
వెంటాడే పరిచాయమో వేటాడే పరిమాలమో
మౌనంతో మాటాడే మంత్రాల మరి మహిమో

అరెరే ఎంత ప్రేమో అది ఎం పిచ్చి తనమో
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో
ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటే చెప్పమ్మా

అచ్చంగా ఇతగాడల్లే ఉంటుందమ్మ ఓ ప్రేమ
చినుకంతాయిన చిరు చెమటచెమరేస్తుంటే
నా నుదుట సూర్యుడినే కసిరేస్తాడట

తుప్పర పడిన నాపైన న సుకుమారం
కందేనట పువ్వులతో కలహిస్తాడట
కలిసొచ్చిన తొలివరమో కనిపించని కలవరమో

శ్రుతి మించిన రాగములో ఓ హావనమో
తను నా కంటి మెరుపో కలిగే అదా మారుపో
తనకైనా తెలిసేలా అదేంత కొంటె తనమో

అరెరే ఎంత ప్రేమో అది ఎం పిచ్చి తనమో
పేరైతే వెరైన ఆ రెండు ఒక్కటేమో.

గౌతమ్ అది గమనించి ఏంటి అన్నాడు కళ్ళతో సైగ చేశాడు.

ఏమి లేదు అని చిన్నగా నవ్వుతూ బదులిచ్చింది.

ఒక్క నైట్ మొత్తం పడుతుంది వాళ్ళు కేరళ వెళ్లడానికి.

తినేసి వెళ్లడానికి ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాడు గౌతమ్.

తన వెనుకే సంతోషంగా వెళుతుంది.


ఇంకా ఉంది 

                💐 ధన్యవాదాలు 💐 

                   అంకిత మోహన్