Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 3

                     

                  మనసిచ్చి చూడు...3



డీప్ స్లీప్లో ఉన్న గౌతమ్కి సమీరా వాయిస్ అసలు వినిపించడం లేదు.

ఎలాగోలా విడిపించుకొని పైకి లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సమీరా వాళ్ళ చెల్లి సంహిత.

అక్కా..... అంటూ కౌగిలించుకుంది.

సంహి... ❣️ ప్రేమగా తల నిమిరి మీ బావ నిద్రపోతున్నారు పద పైకి వెల్దాము.

అక్క చెల్లెలు ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమా గారు కబుర్లు కాదు మీ అక్కను రెడీ చేయాలి రండి అని కిందకు తీసుకొని వెళ్ళారు. 

కింద సమీరా వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు. 

ఇక్కడ మన హీరో గారు పంచె కట్టులో చాలా హుందాగా కనిపిస్తున్నారు. 

********************************

సమీరాని చాలా అందంగా రెడీ చేశారు.కేరళ శారీలో సింపుల్ అండ్ బ్యూటీఫుల్గా ఉంది.

       పాల గ్లాస్తో లోపలికి వచ్చిన సమీరాను చూసి మొహం తిప్పుకున్నాడు. 

పాల గ్లాస్ తీసుకోండి అంటూ గ్లాస్ను ముందుకు చాచింది. 

అవసరం లేదు అన్నట్టు బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాడు.

సమీరాకి చాలా బాధ వేసింది కానీ ఇదే తన రాత అని అర్థం అయినప్పుడు ఎమ్ చేయలేక గమ్మునే నేల మీద చాప వేసుకొని పడుకుంది కొన్ని పాలు తాగేసి. 
సమీరా-గౌతమ్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.

        తెల్లవారుజామున మెలుకువ వచ్చి వాటర్ కోసం నిద్ర లేచింది,పాల గ్లాస్ ఖాళీగా ఉండడం గమనించి.... ఓహ్ ఈ మనిషి పాలు తీసుకున్నారు అంటే ఈయన మనసులో ఏదో ఒక మూల నేను ఉన్నాను అని అర్థం అయింది.నా సంసారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అనుకుని వాటర్ తాగేసి పడుకుంది.అప్పుడు టైమ్ మూడు అవుతుంది.

" కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
ఏ తోటవైనా నీ పూజకేలే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా

హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
నా పాట వింటే నీ పైట జారే
కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
ప్రేమించుకుందాం ఏ జన్మకైనా " 

కల గంటు అలాగే నిద్ర పోయింది సమీరా. 

              ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచి పూజ చేసుకొని వంట చేస్తూ ఉంది సమీరా.గౌతమ్ అప్పుడే జాగింగ్ వెళ్ళి ఏడు గంటలకు వచ్చాడు. 
రావడం అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు,వంట గదిలో నుంచి సమీరా బయటకు వచ్చి అత్తయ్య గారు లేరు అండీ,గుడికి వెళ్ళారు అని చెప్పింది.
ఎమ్ సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. 

        జ్యూస్ తీసుకొని గౌతమ్ గదిలోకి వెళ్ళింది 
సమీరా. 
జ్యూస్ తీసుకోండి అనింది..... 😍😍

😠😠😠😠😠 కోపంతో ఒక లుక్ ఇచ్చి వద్దు అన్నాడు. 

పర్లేదు తీసుకోండి,అత్తయ్య గారు మీరు వచ్చాక ఇవ్వమని చెప్పు గుడికి వెళ్లారు,ఇక్కడ పెడుతున్నాను తీసుకోండి అంటూ పెట్టేసి వెళ్ళిపోయింది.

హే..... వద్దు అంటున్నా ఏంటి ఇది 

సమీరా వెళ్లిపోయింది. 

మెంటల్ అనుకున్నాడు బ్లష్ అవుతూ... 😍

గౌతమ్ ఆఫీసుకి వెళ్ళడానికి బయటకు వచ్చాడు. 
ఉమా గారు అప్పటికే ఇంటికి వచ్చేసున్నారు. 
రా గౌతమ్ టిఫిన్ తిందువు అనింది. 
ఓకే అమ్మ ❤️ 
గౌతమ్ టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు ఉమా గారు సమీరాను కూడా కూర్చో సమీరా నువ్వు కూడా తిను ఇద్దరు కలిసి తినండి అనింది. 

పర్లేదు అత్తయ్య ఆయన తిన్న తరువాత తింటాను అనింది.
సమీరా ముందు కూర్చో నువ్వు అని కొంచెం గట్టిగా అనింది. 
ఇద్దరికి కలిపి ఒక్క ప్లేట్లోనే టిఫిన్ వడ్డిస్తున్నారు ఉమా గారు. 
ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు ఒకరు ప్రేమగా- ఇంకొకరు కోపంగా. 
ఇద్దరిని దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే ఉమా గారు ఇలా చేస్తున్నారు అని ఇద్దరికి అర్థం అయింది. 

ఇలా తినడం కాదు ఒకరికి ఒకరు తినిపించుకొండి a అనింది ఉమా గారు. 

దేవుడా.... అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. 

పర్లేదు రా అది నీ ఆఫీసు ఎప్పుడు అయిన వెళ్ళచ్చు. 
తప్పదా అమ్మ..???
తప్పదు నాన్న అంటూ చూసింది. 
సరే ఆనుకొని సమీరాకి తినిపించడానికి టిఫిన్ తీసుకున్నాడు.
కొంచెం కంగారు పడుతునే తన కళ్లలోకి చూశాడు ఎంతో ఆశగా ఆ కళ్లు తననే చూడడం కొత్తగా అనిపించింది గౌతమ్కి. 

తిను అని పెట్టాడు.

భర్త ప్రేమగా ఒక ముద్ద పెట్టిన అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. 

గౌతమ్ అలా తినిపిస్తు ఉంటే చాలా సంతోషంగా ఉంది తనకి. 

ఇప్పుడు సమీరా వంతు... ❣️ 
గౌతమ్కి ఒక ముద్ద పెట్టగానే ముందు కోపంగా చూసిన తరువాత ఏదో తెలియని ఫీలింగ్ తనలో కలిగింది. 

అలా కొడుకు-కోడలు ఉండడం చూసి చాలా సంతోషం వేసింది ఉమా గారికి. 

అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళి నాన్న గారిని చూసుకొని ఆ తరువాత ఆఫీసుకి వెళ్తాను. 

ఓకే నాన్న నీ భార్యకు కూడా చెప్పి వెళ్ళి రా నాన్న. 

ఓకే బై అని చెప్పి సమీరాను సైడ్ లుక్ చూస్తూ వెళ్ళాడు.

               *****************

ఇక్కడ ప్రతాప్ వర్మ గారు ఆ హాస్పిటల్ వాతావరణం సెట్ అవ్వకా త్వరగ డిస్చార్జ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. 

గౌతమ్ రావడం గమనించి కొంచెం బాగాలేదు అన్నట్టు  పడుకుని ఉన్నారు. 

నాన్న....ఇప్పుడు ఎలా ఉంది. 

పర్లేదు రా ఇప్పుడు కొంచెం బాగుంది సాయంత్రం ఇంటికి వెళ్లిపోదాము. 

ఎందుకు నాన్న అప్పుడే ఇంకో రెండు రోజులు ఉండి తరువాత చూద్దాం నాన్న. 

వద్దు గౌతమ్ ఇక్కడ ఉంటే ఇంకా బాగా లేకుండా వచ్చేల ఉంది.ఇంట్లోనే మేలు.

అలాగే నాన్న సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇలానే వచ్చి తీసుకొని వెళ్తాను,మీరు జాగ్రత బై నాన్న.ఆఫీసుకి టైమ్ అవుతుంది.

ఓకే గౌతమ్ జాగ్రత్త బై. 

********************************

రే ఏంటి రా అప్పుడే ఆఫీసుకి వచ్చావు నిన్నానే కదా రా పెళ్ళి జరిగింది అని ప్రేమగా చూశాడు గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్ జగదీష్.

అయితే ఎమ్ చేయాలి రా ఇంట్లోనే ఉండి పూజ చేయాలా....!! 
ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని తెలుసు కదా మళ్లీ ఎందుకు రా పదే పదే అందరూ అడుగుతారు. 

అలా అంటావు ఏంటి రా ఇష్టం లేకపోవడానికి ఆ పెళ్ళి ఏమీ పెద్దలు కుదిర్చిన వివాహం కాదు కదా.నువ్వే ఏరీ కోరి మరి తనని చేసుకున్నావు ఎందుకు ఇలా బాధ పెట్టడానికా...??? అంత ఇష్టం లేని వాడివి అంత బలవంతంగా తనని చేసుకోవాల్సిన అవసరం ఏంటి రా నీకు అని కోపంగా అడిగాడు జగదీష్. 


      జగదీష్ ఊరికే నన్ను విసగించకు రా అసలే చాలా చిరాకుగా ఉంది.
ఉంటుంది రా ఎందుకు ఉండదు.పాపం రా తను అందరినీ కాదు ఆనుకొని మీ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లని అలా బాధ పెట్టడం ఎమైన బాగుందా....?? 

కనీసం భార్యగా కాకపోయినా తనని ఒక స్నేహితురాలిగా అయిన చూడడం నేర్చుకో రా ముందు. 

సలహా ఇచ్చినందుకు థాంక్స్ రా పద చాలా పని ఉంది. 

నువ్వు ఎప్పటికి మారావు రా స్వామి 🙏 

    సరే సరే రా ముందు నువ్వు 

సాయంత్రం హాస్పిటల్కి నువ్వు కూడా రారా నాన్నను తీసుకొని ఇంటికి వెళ్లాలి. 

మనసులో (పోరా వెధవ నేను అంకుల్ కలిసి ఇంత ప్లాన్ చేస్తే నీలో ఏ మార్పు కనిపించడం లేదు కట్టుకున్న భార్య మీద కొంచెం కూడా ప్రేమ లేదు. నీ ఇష్ట ప్రకారం చేసుకొని మళ్లీ ఇప్పుడు మా చెల్లిని నీ కోపానికి బలి చేస్తూన్నావు) 

ఎమైంది రా వినిపించడం లేదా....??? 

చెప్పు రా ఏంటి...??

అంటే నేను చెప్పింది....!! 

ఓకే ఓకే వస్తాను వరీ అవ్వకు స్వామి. 

ఈరోజు ఆఫీసు లో ఎమ్ వర్క్ ఉన్న నువ్వే దగ్గర ఉండి చూసుకో జగదీష్ నాకు మూడ్ ఎమ్ బాలేదు. నా క్యాబిన్లోకి ఎవరు రాకూడదు అని చెప్పు రా. 

ఓకే రా నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడకు అంకుల్కి ఎమ్ కాదు. 

ఓకే వెళ్లి ఏదైనా వర్క్ ఉంటే చూసుకోరా నన్ను ఒంటరిగా ఉండనివ్వు. 

అలాగే బై....!! 


********************************

అలా సీటులో తల వాల్చినా గౌతమ్ ఫోన్కి గంట తరువాత ఒక కాల్ వచ్చింది.తెలియని నెంబర్ నుండి కాల్ రావడం వల్ల లిఫ్ట్ చేయలేదు. 

మళ్లీ అరగంట తరువాత అదే నెంబర్ నుంచి కాల్ రావడం గమనించి ఎవరో అని లిఫ్ట్ చేశాడు....??? 

హలో ఎవరు..... ❣️ 


ఇంకా ఉంది.....!!! 


                    ధన్యవాదాలు 💐 

                  అంకిత మోహన్ ✍️