మనసిచ్చి చూడు.....15
ఏ....ఎంత ధైర్యం ఉంటే నా మీదే చేయి చేసుకుంటావు అన్నాడు కళ్యాణ్.
నోటిలో నుంచి ఇంకొక మాట వచ్చిన నీ నోరు పని చేయదు జాగ్రత్త అన్నాడు గౌతమ్.
అప్పుడే అక్కడికి సమీరా రావడం ఇద్దరు గమనించి ఏమీ జరగనట్టు ఉన్నారు.
అత్తయ్య పిలుస్తున్నారు మిమ్మల్ని అంది.
బాబు గౌతమ్ సమీరాకి ఇప్పుడు ఐదో నెల కదా సీమంతం చేయాలి అనుకుంటున్నాము,రేపు మీరు అమెరికా వెళుతున్నారు అంటా కదా ఈరోజు పూజారి గారితో మాట్లాడాను,మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంది.
సరే అత్తయ్య మీ ఇష్టం నేను కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని బయటికి వెళ్తాడు.
సాయంత్రంకి అన్ని ఏర్పాట్లు జరుగుతు ఉంటై పాపం మధుకి కూడా సీమంతం మీద ఆశ ఉంటుంది కదా.ఎవరు లేకుండా అక్కడ ఒక్కటే ఎన్ని కష్టాలో పడుతుందో ఏంటో చాలా బాధ పడ్డాడు గౌతమ్.
ఎంతో గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతున్న సమీరా మైండ్లో వాళ్ల ఇద్దరి సంభాషణ తిరుగుతూ ఉంది.
అసలు కళ్యాణ్ బావ మధు భర్తనా.....మధుని చాలా తప్పుగా అనుకున్నాను అని తన మీద తనకే కోపం వస్తుంది.
సమీరా వాళ్ల భర్త వచ్చి నలుగు పెడుతున్నప్పుడు గౌతమ్ మీద తన ప్రేమను కన్నీళ్లతో చూపించింది.తన కాళ్ళకు నమస్కారం చేసుకొని నన్ను క్షమించండి అంది.
సమీరాను కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.
అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఫంక్షన్ అంత అయిపోయిన తరువాత భోజనాలు చేసి అందరూ రిలక్స్ అవుతున్నారు.మధు వాళ్ల అమ్మ,గౌతమ్ లగేజ్ సర్దుకుంటున్నారు రేపు వెళ్లడానికి.
కళ్యాణ్ని అడిగాలనుకుంది సమీరా ఎందుకు ఇలా చేశావు అని కానీ తనకి అంత తెలిసిపోయింది అని తెలిస్తే ఏమీ చేస్తాడో అని ఏమీ తెలియనట్టు ఉంది.
గదిలోకి వెళ్ళి గౌతమ్ని వెనుక నుంచి కౌగిలించుకొని
మధు గురించి అంత బాధ తెలిసి కూడా ఎందుకు అండీ ఏమీ తెలియనట్టు ఉన్నారు అంది.
తనని ముందుకి తీసుకొని చేతిలో చేయి వేసి నీకు ఇలాంటి సమయంలో ఏ ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు సమీరా అందుకే నువ్వు నన్ను మధుని అనుమానిస్తున్నావు అని తెలిసిన ఏమీ అనలేదు అన్నాడు.
నన్ను క్షమించండి చాలా తప్పుగా అనుకున్నాను మీ గురించి అంది.
పర్లేదు గానీ రేపటి నుంచి జాగ్రత్తగా ఉండు సమీరా.సమయానికి తిను,సమయానికి మందులు వేసుకో,ఎక్కువగా ఆలోచించకు అన్నాడు.
నన్ను ఇక్కడ చూసుకోవడానికి మా అమ్మ-నాన్న అత్తయ్య-మామయ్య అందరూ ఉన్నారు అండీ.మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి అంది.మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేయండి ఎలాగైనా తనని ఒప్పించి.
నాకు తనని ఇక్కడికి తీసుకొని రావాలని ఉంది సమీరా కానీ మీ బావ ఏ టైమ్లో ఏమీ చేస్తాడో అని కొంచెం టెన్షన్గా ఉంది.
పాపం అండీ మధు అక్కడ ఒంటరిగా ఎంత నరకం అనుభవిస్తుందో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అంది.
ఎలాగైనా మా బావ మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను మీరు మధుని ఇక్కడికి తీసుకొని వచ్చేయండి.తను ఆల్రెడీ ఒక బిడ్డను పోగొట్టుకున్నది చాలు అంది బాధగా.
సమీరా ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఏమీ టెన్షన్ పడకు.అమ్మ నాన్నలకు ఈ విషయాలు ఏవి తెలియకూడదు.అత్తయ్య కూడా చెప్పకూడదు కానీ మధుని తప్పుగా చూడకూడదు కాబట్టి అత్తయ్యకి నేను అర్థం అయ్యేలా చెబుతాను అన్నాడు.
నువ్వు జాగ్రత్త ఏ అవసరం ఉన్న జగదీష్కి ఒక్క ఫోన్ చేయి చాలు అన్నాడు.
సరే నువ్వు వెళ్లి పడుకో సమీరా నాకు కొంచెం పని ఉంది గంటలో వస్తాను.
సరే అండీ జాగ్రత్తగా వెళ్లి రండి.
గౌతమ్ సమీరా కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాడు.
తనకి కావాల్సిన బట్టలు,పండ్లు,అవసరమైన వస్తువులు
కొనుక్కొని వచ్చాడు.
వచ్చేలోపు తను ప్రశాంతంగా నిద్రపోతుంది.
అన్ని కబోర్డ్లో సర్ది స్నానం చేసుకొని వచ్చి పడుకున్నాడు.
ఉదయం తొమ్మిది గంటలకు ఫ్లయిట్ అన్ని రెడీ చేసుకొని బయలుదేరడానికి సిద్దంగా ఉన్నారు.సమీరా ఎయిర్పోర్ట్ వరకు వస్తాను అంది కానీ వద్దు ఈ టైమ్లో జర్నీ చేయడం అంత మంచిది కాదు అన్నాడు.
సరే అండీ జాగ్రత్త,పిన్ని గారిని జాగ్రత్తగా చూసుకోండి అంది.
సరే సమీరా వెళ్లి వస్తాను,అమ్మ నాన్న మీరు జాగ్రత్త,అత్తయ్య మామయ్య సమీరాను జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు.
అలాగే బాబు మీరు వెళ్ళి రండి అన్నారు అందరూ.
అన్నయ్య వెళ్లి వస్తాను అంది.
అలాగే మమత,మధుని జాగ్రత్త మనకి కోపం ఏమీ లేదు అని చెప్పు అన్నాడు ప్రతాప్ గారు.
సరే అన్నయ్య,సరే వదిన వెళ్లి వస్తాము అని చెప్పి బయలుదేరారు.మధ్యలో జగదీష్ కాల్ చేసి త్వరగా రండి రా అన్నాడు.
ఇప్పుడే స్టార్ట్ అయ్యాము రా అన్నాడు.
సరే త్వరగా రండి .
అలాగే రా బై.
*****************
ఇక్కడ సమీరా వాళ్ళు వెళ్లడం కళ్యాణ్తో మాట్లాడింది.
బావ మీ పెళ్లి ఫోటో చూపించండి అంది.
కళ్యాణ్ వెంటనే ఆ ఫోన్ పోయింది సమీరా ఇంట్లో పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఇంటికి వెళ్లక సెన్డ్ చేస్తాను అన్నాడు.
సరే బావ ఏమైనా విశేషమా అంది.
అదేమి లేదు సమీరా అన్నాడు.
నువ్వు ఎంత దుర్మార్గుడివి బావ అసలు నమ్మలేకపోతున్నాను నువ్వే నా ఇది అని మనసులో అనుకుంది.
అవును సమీరా మీ అయన ఎక్కడికి వెళ్లాడు అంది.
అమెరికా వెళుతున్నారు మా చెల్లిని తీసుకొని రావడానికి అంది.
కళ్యాణ్లో కంగారు చూసింది.
ఎప్పుడు వస్తారు అంది.....??
ఏమో తెలియదు అంది.
సమీరా ఏంటి తేడాగా మాట్లాడుతుంది అనుకున్నాడు.
ఇప్పుడు ఏమీ చేయాలి అందరికీ నేను మధు భర్త అని తెలిస్తే ఏమీ చేస్తారో ఏంటో అనుకున్నాడు.
కళ్యాణ్ వాళ్ల అమ్మ నాన్నకు కూడా తెలియదు మధు వాళ్ల కోడలు అని.ఎవరో అమ్మాయి అనుకున్నారు.కొడుకు ఇంత వెధవ అని తెలిస్తే వాళ్లు అసలు తట్టుకోలేరు.
బావ ఒక్కసారి మీ వైఫ్కి కాల్ చేయి బావ అంది.
ఎందుకు సమీరా ఇప్పుడు తను ఆఫీసుకి వెళ్ళి ఉంటుంది,సరే మేము ఇంకా బయలుదేరుతాము అన్నాడు.
ఎందుకు బావ అప్పుడే ఉండండి కొన్ని రోజులు అంది.
లేదు సమీరా వెళ్లాలి.
సరే బావ అంది.
సమీరాకి కళ్యాణ్ని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది.కానీ తనని మార్చి మధు కాపురం నిలబెట్టలని ప్రయత్నం చేస్తుంది.
****************
రెండు రోజుల తరువాత మధు వాళ్ల అమ్మ,బావ కోసం ఎదురు చూస్తుంది ఎయిర్పోర్ట్లో.
కాసేపటిలో వస్తారు అనగా మధుకి ఒక కాల్ వస్తుంది......??????
ఇంకా ఉంది
💐 ధన్యవాదాలు 💐
అంకిత మోహన్