Featured Books
  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసిచ్చి చూడు - 1

మనసిచ్చి చూడు.....1

అత్తయ్య ఈరోజే కదా చివరి రోజు నాకు ఈ ఇంట్లో రేపటి నుంచి నేను మీకు ఎవరికి కనిపించకూడదు కదా అంటూ ఏడుస్తూ ఉమా గారిని పట్టుకొని ఏడుస్తుంది సమీరా.
       
           సమీరా ఏడుపు చూసి ఉమా గారికి కూడా చాలా బాధ వేస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ఏడవకు సమీరా వాడి మనసు మార్చే ప్రయత్నం నేను చేస్తాను,తప్పకుండా మిమ్మల్ని కలుపుతాను.నువ్వు మా ఇంటి కోడలివి నిన్ను ఎందుకు బయటకు పంపుతాను.ఎమ్ చేసైనా మీ ఇద్దరు కలిసి ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు బాధ పడకు సమీరా.

         లేదు అత్తయ్య మీరు ఎన్ని చెప్పిన ఆయన మనసు మారదు.పెళ్ళికి ముందే చెప్పారు కదా ఏడు నెలలు మాత్రమే భార్యగా అని.అప్పుడు నా కుటుంబం కోసం తల వంచాను.ఈ ఏడు నెలలలో రాని మార్పు ఇప్పుడు ఎలా వస్తుంది అత్తయ్య. 

      వస్తుంది సమీరా ఎదురు చూడు,సమయం అన్నిటిని మారుస్తుంది.గౌతమ్ మంచి వాడు కాకపోవచ్చు కానీ దుర్మార్గుడు అయితే కాదు కదా అమ్మ.

        నిజంగా ఆయనలో మార్పు వస్తే,నాకు అంత కంటే ఆనందం ఇంకోటి లేదు అత్తయ్య. 
ఓకే వెళ్లు సమీరా వాడి వచ్చే టైమ్ అయింది కదా. ఎమ్ మాట్లాడాతాడో విను.నీ సాయశక్తులా నువ్వు ట్రై చెయ్,మిగతాది నేను చూసుకుంటాను. 

అలాగే అత్తయ్య. 


సమీరా తన గదిలో కూర్చొని వాళ్ళ పెళ్ళి ఫోటోలు చూస్తూ,ఏడుస్తూ ఉంది అప్పుడే గదిలోకి వచ్చిన గౌతమ్ అది చూసినా అతని కళ్లు ఎర్రగా మారిపోయాయి.అది గమనించని సమీరా బాధగా ఆ ఫోటోలను చూస్తూ అలాగే నిద్రపోయింది. 

గౌతమ్ వెంటనే తలుపు గట్టిగా శబ్ధం వచ్చేల తన్నాడు.వెంటనే ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న తన భర్తను చూసి భయ పడింది. 

ఈ చూపుకు అర్థం ఏంటి నేను ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాను అనా...అనుకుంది మనసులో. 
వెంటనే పైకి లేచి బయటకు వెళుతున్న సమీరాను ఆగు అన్నట్టు చేయి  అడ్డం పెట్టాడు గౌతమ్. 

నువ్వు ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావు అని గట్టిగా అడిగాడు గౌతమ్. 

మీతో కొంచెం మాట్లాడిన తరువాత వెళ్లాలి అని ఎదురు చూస్తూన్నాను. 

ఎమ్ మాట్లాడాలి,మాట్లాడడానికి ఇంకేమీ ఉంది. 
కొంచెం నేను చెప్పేది వినండి అంటూ ఉండగానే, నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు సమీరా.
నాకు ఈ పెళ్ళి,పిల్లలు,కుటుంబం ఇవన్నీ వద్దు నాకు నేను చాలు దయచేసి వెళ్లిపో నా లైఫ్ నుంచి. 

        గౌతమ్ ఎంత చెప్పినా,ఏమీ చెప్పిన వినిపించుకోడు అని అర్థం అయిన సమీరా అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి కదులుతుంది.అంతే ఒక్కసారిగా చెయ్ పట్టుకొని వెనక్కి లాగి కౌగిలించుకుంటాడు గౌతమ్. 

     అలా చేస్తాడు అని ఊహించని సమీరా షాక్లోనే ఉంటుంది.కాసేపటికి వదిలి సారీ నేను కావాలని చేయలేదు నాన్న గారు అటు సైడ్ వెళ్లడం చూశాను మన మాటలు ఆయన విన్నారు ఏమో అని ఇలా చేయాల్సి వచ్చింది.ఇంక పో అన్నాడు గౌతమ్.

    నువ్వు ఎప్పటికి మారవు అనుకోని ఆ గది నుండి బయటికి వచ్చింది సమీరా. 

కింద తన కోసం కూర్చొని ఉన్న మామయ్య గారిని చూసి కొంచెం టెన్షన్ పడింది. 

మామయ్య గారు ఎందుకు అలా చూస్తున్నారు అని మనసులో అనుకొని దగ్గరకు వెళ్ళి ఎమైన కావాలా మామయ్య గారు అని అడుగుతుంది. 

ఎమ్ వద్దు సమీరా నీకు,గౌతమ్కి ఎమైన మనస్పర్ధలు  ఉన్నాయా...??? 

ఎందుకు మామయ్య గారు ఇలా అడుగుతున్నారు అని అనుకుంటూ అదేమి లేదు మామయ్య అంటుంది. 

ఓకే అమ్మ ఏమీ ఉన్న మీరు మీరే సర్దుకోవాలి తల్లి. వాడిని భోజనానికి రమ్మని చెప్పు అమ్మ వెళ్ళి. 
ఓకే మామయ్య గారు అని చెప్పి మళ్ళీ గదిలోకి వెళుతుంది. 

అప్పుడే గౌతమ్ ఫ్రెష్ అప్ అయి బయటకి వస్తాడు. ఏంటి మళ్లీ వచ్చావు అని అడుగుతాడు. 

మీకు ఏమైనా పిచ్చా అండీ ఎమ్ మాట్లాడుతున్నారు. కింద మామయ్య గారు మన కోసం ఎదురు చూస్తున్నారు భోజనానికి రండి. 
నాకు ఆకలిగా లేదు నేను రాను. 
మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది వెళ్ళు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్లాలి అండీ నేను.ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఆయన ఆరోగ్యం ఎమ్ అవ్వాలి.నన్ను మీరు పెళ్ళి చేసుకుందే ఆయన కోసం అని మర్చిపోయారా చెప్పండి.నేను వెళ్లిపోతాను సరే మామయ్య గారికి ఎమ్ సమాధానం చెప్తారు చెప్పండి. 

అది అంత నీకు అవసరం లేదు.చెప్పింది చెయ్ చాలు.

మీ ఇష్టం గౌతమ్ కానీ ఒక వారం తరువాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను అంత వరకు నన్ను పదే పదే వెళ్ళు వెళ్ళు అని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. 

కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు గౌతమ్. 
ఇద్దరి మధ్య ప్రేమ లేదు కానీ బంధం ఉంది.ఒక్కరే ఇష్టాన్ని,ప్రేమను చూపిస్తే ఎదుటి వారికి ఎప్పటికి చులకన అవుతారు అని సమీరా కూడా తన ప్రేమను తనలోనే సమాధి చేసుకుంది.

********************************

         గౌతమ్ కృష్ణ ఒక బిజినెస్ మ్యాన్. 
        తల్లితండ్రులు ఉమా - ప్రతాప్ వర్మ 

ప్రతాప్ గారికి ఒక ప్రమాదం జరగడం వల్ల కుటుంబం చాలా బాధ పడింది.ఆయన బ్రతుకుతారో లేదో అన్న పరిస్థితిలో ఆయన చివరి కోరికగా గౌతమ్ పెళ్ళి చూడాలి అని.తప్పని పరిస్థితుల్లో సమీరాను పెళ్ళి చేసుకున్నాడు.సమీరా ఫ్యామిలీకి కూడా ఈ సంబంధం ఓకే అవ్వడం వల్ల పెళ్ళి చేశారు.కానీ పెళ్లికి ముందు గౌతమ్ సమీరాతో మాట్లాడడు.

        నేను పెళ్ళి కేవలం మా నాన్న గారి కోసం మాత్రమే చేసుకుంటున్నాను.నా నుంచి నువ్వు ఎమ్ ఆశించకూడదు.అన్నిటికీ సరే అనుకుంటే చెప్పు లేదు అంటే లేదు.కానీ ఒప్పుకోకపోతే మాత్రం నీకు చుక్కలు కనిపించడం ఖాయం.

          నాకు ఆడవాళ్లు అంటేనే గిట్టదు ఒక్క మా అమ్మ గారు తప్ప.అందుకే బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు.ఇప్పటికే నా పెళ్ళి అవ్వడం లేదు అని అమ్మ వాళ్ళు చాలా బాధ పడుతున్నారు. ఇప్పుడు అమ్మ వాళ్ళకి నచ్చిన సంబంధం,అబ్బాయి ఏమో ఇలా అంటున్నాడు ఎమ్ చేయాలి అర్థం కావడం లేదు సమీరాకి. 

              మనిషి మంచివాడే కానీ కోపిష్ఠి.ముక్కు మీదే ఉంటుంది కోపం.ఈ కోపాన్ని భరించాలి మా అమ్మ నాన్న కోసం.కానీ నా జీవితం నరకం అవుతుంది ఏమో అని భయంగా ఉంది.బాగా ఆలోచించి గౌతమ్ని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. 

       పెళ్ళి చాలా సింపుల్గా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రతాప్ గారు హాస్పిటల్లోనే ఉన్నారు.ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది.

        ప్రేమ లేని మనిషితో పెళ్ళి ఈ ఆలోచన చాలా భారంగా ఉంది కానీ తప్పడం లేదు ఆనుకొని తనకి తాను సర్ది చెప్పుకుంది.

        
          తరువాత రోజు ఉదయం హాస్పిటల్లోనే వాళ్ళ నాన్న గారి ముందు పెళ్లి చేయడానికి సిద్దంగా ఉన్నారు.అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు రెండు కుటుంబాలు అన్నిటికీ సిద్ధం చేస్తూన్నారు. 

       సమీరా కోసం గౌతమ్ ఒక పట్టు చీర తెచ్చాడు అదే కట్టుకోవాలని ఆర్డర్. 

అమ్మాయి - అబ్బాయి ఇద్దరు వచ్చి పీటల మీద కూర్చున్నారు సడన్గా సమీరా కళ్లు తిరిగి గౌతమ్ మీద పడిపోయింది......???? 


ఇంకా ఉంది. 

                       ధన్యవాదాలు 

                     అంకిత మోహన్ ✍️