జతగా నాతో నిన్నే

(9)
  • 143.6k
  • 17
  • 76.6k

ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు ,దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళుతూ ఉంది . ఆకాశం అంచులోకి ఆకు చేరినప్పుడు భూమి పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమలలాగా కనిపించారు .ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు స్పృశించగానే ఆకులోని పత్ర రంధ్రాలు ,దాని ఈకలు స్పష్టంగా ఒక పాదదర్శకం తేరలా కనిపించింది. ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు-జతలుగా వాటి ఇళ్ళను సమీపిస్తున్నాయి .సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకుని, తన ప్రభావాన్ని వాటి పైన చూపుతున్నాడు. అందుకే లేత నారింజ రంగులో మేఘలన్నీ ముస్తాబయ్యాయి . ఆహారం కోసం పొద్దున అనగా బయలుదేరిన పక్షులు, తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జెట్ లాగా మార్చి ,ఎగురుతూ వెళుతున్నాయి. ఆ పక్షుల అరుపులు ,ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి. అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది

Full Novel

1

జతగా నాతో నిన్నే - 01

ఆకాశంలో తేలి ఆడుతున్న ఒక ఆకు ,దానికి గమ్యం ఏంటో తెలియక గాలి చూపిన మార్గంలో వెళుతూ ఉంది . ఆకాశం అంచులోకి ఆకు చేరినప్పుడు పైన ఉన్న మనుషులంతా చిన్న అల్పజీవులైన చీమలలాగా కనిపించారు .ఆ పచ్చని ఆకు పైన సాయంత్రపు సూర్యకిరణాలు స్పృశించగానే ఆకులోని పత్ర రంధ్రాలు ,దాని ఈకలు స్పష్టంగా ఒక పాదదర్శకం తేరలా కనిపించింది. ఆకాశంలో ఉన్న మేఘాలు జతలు-జతలుగా వాటి ఇళ్ళను సమీపిస్తున్నాయి .సూర్యుడు గొర్రెల కాపరిలా వాటన్నిటికీ కాపలాదారుడులా నిలబడుకుని, తన ప్రభావాన్ని వాటి పైన చూపుతున్నాడు. అందుకే లేత నారింజ రంగులో మేఘలన్నీ ముస్తాబయ్యాయి . ఆహారం కోసం పొద్దున అనగా బయలుదేరిన పక్షులు, తమ బృందాన్ని యుద్ధానికి సిద్ధమైన జెట్ లాగా మార్చి ,ఎగురుతూ వెళుతున్నాయి. ఆ పక్షుల అరుపులు ,ఆ ప్రశాంతమైన సాయంత్రంలో ఒక చక్కటి సంగీతాన్ని చెవులకు అందించాయి. అనుకోకుండా ఉన్నట్టుండి గాలి వేగం పెరిగింది ...మరింత చదవండి

2

జతగా నాతో నిన్నే - 02

ఉదయం ఆరు గంటలు అప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేసి దాని లోపల అంతా క్లీన్ చేసి చెత్తను బయటపడేయటానికి వచ్చాడు ఓనర్ .అక్కడ ఏదో చెడు రావడాని గుర్తించాడు . “ ఏంటి ఎప్పుడు లేంది ,ఇంత దుర్వాసన వస్తుంది ” అంటూ ముక్కు పుట్టలని మూసేస్తూ ముందుకు కదిలాడు . అక్కడ కనిపించిన దృశ్యానికి ఒక్కసారి భయపడిపోయి కిందపడ్డాడు. ఏదో తరుముతున్నట్టుగా భయపడుకుంటూ అక్కడ నుంచి రోడ్డు పైకి వచ్చాడు. వెంటనే తన చోక్క జోబుని తడుముకొని అందులో ఉన్న ఫోన్ ని ఓపెన్ చేసి పోలీసులకు ఫోన్ చేశాడు. ******* సూర్యుడికిరణాలు కిటికీలో నుంచి నేరుగా బెడ్ పైకి పడ్డాయి .ఆ వెచ్చదనంతో నిద్రమత్తు కూడా పారిపోయింది . బద్దకంగా వల్లూవిరిస్తూ లేచింది మన హీరోయిన్. “ అబ్బా అప్పుడే ఏడు అయిపోయిందా? ఇంత పొద్దు పొద్దున్నే వచ్చి ఏం చేస్తావయ్యా నువ్వు? మా నిద్ర చెడగొట్టడానికి ...మరింత చదవండి

3

జతగా నాతో నిన్నే - 03

వారి వెనుక ఒక అబ్బాయి నిలుచున్నాడు. అతడు పవన్ కళ్యాణ్ లాగా తలపై కొద్దిగా మధ్య పాపిడి తీసి ఉన్న తన హెయిర్ ని సరి . అతని వెంట్రుకలు నల్లని రంగుతో చూడగానే అట్రాక్టివ్ లుక్ లో ఉన్నాయి .ఇంకా కనుబొమ్మల పైన ఉన్న ఆ నల్లని వెంట్రుకలు,అస్సలు గ్యాప్ లేనట్టుగా లైట్ గా కలిసిపోయాయి . అతనిను దాదాపు పిల్లిలాగా నీలిరంగు కళ్ళతో కనిపించాడు. తన బుగ్గల పైన ఉన్న అందమైన సొట్టబుగ్గ సూర్యుని కాంతి కారణంగా ముత్యంలా మెరుస్తుంది . అతడు వేసుకున్న తెలుపు రంగు స్వెటర్ లాంటి కోటుని ,దానిపై మోస్తున్న బ్యాగుని ,అతడి మైంటైన్ చేస్తున్న తన స్టైల్ ని చూడగానే ముగ్గురు ఫిదా అయిపోయారు . ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అప్పటిదాకా మాట్లాడుకుంటున్న అమ్మాయిలు అందరూ ,తన వెనక ఒక పెద్ద సైన్యంలా ఫాలో అవుతున్నారు. వాళ్లందరి కళ్ళలో అసూయ ...మరింత చదవండి

4

జతగా నాతో నిన్నే - 04

“ సరే ఆ దేవుని ప్రార్థిస్తూ వచ్చి నీ చివరి మిషన్ ఏంటో ఆ ప్రభువునే అడుగు ” అంటూ ఆ పోప్ చెప్పగానే ,గది తీసుకొని ఏసుప్రభు ముందు కూర్చున్నాడు. పోప్ ఏదో మంత్రిస్తూ ఉండగా ఏసుప్రభు తల నుంచి ఒక పేపర్ ఎగురుకుంటూ పోప్ చేతికి అందింది. కాగితం పూర్తిగా బంగారు రంగులో మెరిసిపోతుంది .దానిపై రచించబడిన నల్లని అక్షరాలు ఏదో సంస్కృత భాషకు చెందిన దానిలాగా అనిపించాయి. దాన్ని చూసిన పోప్ ఆశ్చర్యంగా ,“ మీ మిషన్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అంటా! అప్పటిదాకా నువ్వు ఓపికగా ఉండాలి ” అంటూ చెప్పాడు . సరే ! కోన్ని రోజులైతే నేను విశ్రాంతి తీసుకుంటాను . నా ఖర్చులకి కొంచెం డబ్బులు అరేంజ్ చేయగలరా ? అంటూ చాలా జాలిగా చూశాడు . “ సరే ఈ మానవ ప్రపంచంలో బతకడం ఎలా ఉంది ...మరింత చదవండి

5

జతగా నాతో నిన్నే - 05

నెమ్మదిగా కారుచీకట్లు అన్ని తొలగిపోయి వేకువ కిరణాలు అందరిని నిద్రలేపాయి. ప్రశాంతంగా పడుకున్న అన్వి ఫోన్ లోని రింగ్టోన్ , “ హేయ్ .....డూమ్ ....డూమ్...డా...ఏ ...ఏ ” అంటూ శబ్దం చేస్తూ అందర్నీ నిద్రలేపేసింది. “ అబ్బా ఏంటి? కాసేపు పడుకున్న తర్వాత నన్ను లేపొచ్చుగా! ఎదవ గోల వేసుకుని ఆ ఫోను ఒకటి ” అంటూ కసిరినట్టుగా అరిచి మళ్లీ పడుకుంది సంజన. “ చాలు చాల్లే ! మళ్ళీ లేట్ అయిందని ఏడుస్తావు. టైం కి మనల్ని నిద్ర లేపుతున్న ఈ ఒక్క ఫోన్ నన్న జాగ్రత్తగా చూసుకుందాం ” అంటూ పగిలిపోయిన స్క్రీన్కి ఒక మూడు రబ్బర్ బ్యాండ్ లేసి మరి వాడుతుంది అన్వి. “ థాంక్స్ రా బుజ్జి ,టైం కి లేపావు ” అంటూ ముందు దానికి గుడ్ మార్నింగ్ చెప్పి బాత్రూంలోకి దూరింది . తను పూర్తిగా రెడీ అయిన ...మరింత చదవండి

6

జతగా నాతో నిన్నే - 06

“ మీరు ఒక్క మాట చెప్తే నేనే వచ్చేవాడిని కదా! మీకు ఇక్కడ పని ఏంటి యువ రాజా ” అంటూ వినయంగా అడిగాడు . లేదు .నాన్నగారు ఒక పని అప్పచెప్పారు. అందుకే వచ్చాను .ఇంతకీ ఈ అమ్మాయి ఏ క్లాసులో చదువుతుందో నీకు తెలుసా? అంటూ తన చేతిలోని ఫోటోని చూపించాడు . “ హో తనా? తెలుసు . తను సెకండ్ ఇయర్ సైన్స్ గ్రూపులో చదువుతుంది .తన పేరు అన్వేషణ. కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పదు. ఇంకా ఆ అమ్మాయి చూడ్డానికి ” అంటూ ఏదో చెప్పబోతున్న అతని ఆపేయి అన్నట్టు చెయ్ చూపించాడు. “ నాకు అమ్మాయితోనే పని ఉంది. నన్ను ఆ అమ్మాయి గదిలో వదిలిపెట్టండి ” అంటూ ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పి బయటికి నడిచాడు . తన వెనకే నడిచిన ప్రిన్సిపాల్ ,అప్పటికే క్లాస్ స్టార్ట్ అవ్వడంతో నేరుగా ఆ ...మరింత చదవండి

7

జతగా నాతో నిన్నే - 07

ఆరోజు జరిగిన సంఘటన గురించి రూముకు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంది అన్వి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ? ఆరోజు కూడా అంతే, వచ్చి ఇలా రక్షించేసి వెళ్లిపోయాడు . మళ్ళీ అలాగే ఈరోజు కూడా జరిగింది. ఆ అబ్బాయికి నేను ప్రమాదంలో ఉంటే ముందే ఎలా తెలిసిపోతుంది ? నాకు ప్రమాదం అని తెలిస్తే చాలు ,అడ్డుగా వచ్చి రక్షిస్తున్నాడు. నాకు ఆ అబ్బాయికి మధ్య ఏదైనా బలమైన బంధం ఉందా? మేం పదే పదే కలుస్తున్నాము ఏలాగా? అంటూ ఆలోచిస్తూ తన జుట్టుతో ముంగురులు తిప్పుతూ ఆడుకుంటుంది అన్వి. “ ఏంటి మేడం ,తేగ ఆలోచిస్తున్నారు ” అంటూ పక్కగా వచ్చి కూర్చుంది డిటెక్టివ్ గీత . “ ఏం లేదు మామూలుగానే ఉన్న ” అంటూ అసలు విషయం దాచేస్తూ తిరిగి పడుకుంది. “ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, మాకు బాగా ...మరింత చదవండి

8

జతగా నాతో నిన్నే - 08

“ అబ్బా నా చివరి మెషిన్ మామూలుగా ఉంటుందనుకుంటే , ఇంత కష్టంగా ఉంది ఏంటి? ముందే నా పైన తనకి మంచి అభిప్రాయం లేదు. తనతో ఎలా మాట్లాడాలి ” అంటూ ఆలోచించసాగాడు అభయ్. అభయ్ అలా ఆ రాత్రంతా గడిపేసాడు . మరునాడు తనతో ఎలాగైనా సరే మాట్లాడాలని , తనకి ఎలాగైనా సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆరోజు అందరికంటే ముందు కాలేజీకి వెళ్లిన అతడు అన్వి పాప కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా అభయ్ ఒకరి కోసం ఎదురు చూడటంతో మిగిలిన వాళ్లంతా చాలా ఆత్రుతగా తన దగ్గరికి వెళ్లి ,మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఏం పట్టించుకోకుండా నిశ్శబ్దంగా అన్నాడు. అతడేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు కొన్ని క్షణాల్లోనే కాలేజీకి వచ్చిన అమ్మాయిలంతా తనని చుట్టుముట్టేశారు . “ గీవ్ మీ ఫ్రీడం .ప్లీజ్ గో నౌ ” అంటూ కాస్త అరిచాడు ...మరింత చదవండి

9

జతగా నాతో నిన్నే - 09

“ మనము ఈసారి ఎలాగైనా గాని కాంపిటీషన్లో గెలవాలి . నాకు తెలిసి ఈసారి యాభై వేలు కాబట్టి ఒక్క కాంపిటీషన్ పెడతారనుకుంటా ” అంది సందేహిస్తూ . “ ఒక కాంపిటీషన్ అయితే ఎలా గెలవనగలుగుతాం మనం. ఛ ఇంతసేపు మనం గెలుస్తామనుకున్నాను కాదే! ” అంది అన్వి బాధగా . “ ఉట్టికేగరలేనమ్మ ,ఆకాశానికి ఎగిరింది అంటా! అట్టుంది నీ పంచాయతీ .కాంపిటీషన్లో గెలిచి, ప్రైస్ తీసేసుకున్నట్టు అప్పుడే ఊహలు కూడానా ?” అంటూ నిజాన్ని వెళ్ళగకింది గీత. “ అవునే మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి అడిగి కనుక్కుంటే సరిపోద్ది . ఎందుకని మనలో మనం గొడవ పడుతున్నాము ” అంది ఆలోచిస్తున్న సంజన . “ నువ్వు చెప్పింది బాగానే ఉంది. వెళ్లి అదే చేద్దాం ” అంటూ పైకి లేయబోయారు ముగ్గురు . వాళ్ల ముందరే ఆ మాటలు వింటున్న అభయ్ ఇంకా ...మరింత చదవండి

10

జతగా నాతో నిన్నే - 10

తన అలా వెళ్తూ ఉన్నప్పుడు క్యాంటీన్లో టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ జరుగుతూ ఉంది. ఆ కామెంట్రీ అన్వి చెవికి చేరగానే , “ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా? చూద్దాం ” అంటూ కాంటీన్ లోకి లాక్కొని వెళ్ళింది . అప్పుడే యమకింకారుడిలా నిలబడ్డాడు ఆ క్యాంటీన్ లో పని చేసే ఒక అబ్బాయి. వాడి పొడుగు కారణంగా అన్వి చిన్నగా తల పైకెత్తి చూడాల్సి వచ్చింది .వాడేమో కోపంగా చూస్తూ ,“ మీకు ఎన్ని సార్లు చెప్పాలి .క్యాంటీన్లో తినే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి అనీ ” అంటే విసూరుగా మాట్లాడాడు . అప్పుడు కానీ తన చిట్టి బుర్రలో వెలగలేదు. ఒకసారి ఇలాగే మ్యాచ్ అని క్యాంటీన్లోకి రాగానే మెడ పట్టుకు గెంటేస్తారు. దాంతో ఇంకెప్పుడు అటుగా రాకూడదా అనుకుంది అన్వి. కానీ మన అన్వి పాప మనసు మాత్రం క్రికెట్ .....క్రికెట్ అంటూ ...మరింత చదవండి

11

జతగా నాతో నిన్నే - 11

రాహుల్ ఆజ్ఞ ప్రకారమే ఆత్మ ,అన్వి గురించి ఏ చిన్న విషయమైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళిపోయింది . ఆరోజు ఎలాగైనా సరే కాంపిటీషన్ లో, ....ఏ ప్రోగ్రాంలో పాటిస్పేట్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవాలని చాలా ఆతృతగా క్లాస్ వైపు నడిచిన వాళ్లకి ,మధ్యలో మన క్రికెట్ కామెంట్రీతో అంత చెడిపోయింది . ఇక సాయంత్రం ఆ విషయం గురించే వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇండియా గెలిచిన ఆనందంలో కొత్త ఉత్సాహంతో ఊర్రుతలుగుతూ వెళ్ళిపోయారు .ఈరోజు ఇండియా గెలవడం మన అదృష్టమే ! మనం కూడా మన ప్రోగ్రాంలో విజయం సాధించల్సిందే అని వాళ్ళ బ్యాగ్ ని భుజాలకేసుకొని వాళ్ల రూమ్ వైపు వెళ్లారు . రూమ్లోకి వెళ్లి కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత “ సరే ఇక మనం వెళ్దామా ?” అంటూ అడిగింది అన్వి. “ పదా..... పోదాం .అసలే మనకి దొరక దొరక రెండు రోజులు ...మరింత చదవండి

12

జతగా నాతో నిన్నే - 12

గాలిలో వేగంగా ఎగురుతున్న ఒక హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ,ఒక పదాంతస్తుల భవనం పై ఏర్పాటు చేయబడిన హెలికాప్టర్ ల్యాండింగ్ పానెల్ పై ఆగింది . రెక్కల నుండి వచ్చే గాలి శబ్దం , తుమ్మెద నాదముల మారుమోగుతుంది . దాని గాలికి చుట్టుపక్కల ఉన్న దుమ్ము రేణువులంతా దూరంగా నెట్టి వేయబడ్డాయి . అందులో నుండి కోటుని సరిచేసుకుంటూ, పాలిష్ చేయబడిన బ్రాండెడ్ బూట్లతో, రోలెక్స్ వాచ్ సరిచేసుకుంటూ కిందికి దిగాడు అతడు . అలా దిగగానే తనకి సెక్యూరిటీ కల్పిస్తూ ఇద్దరు సైనికులులాగా వచ్చి నిలబడ్డారు. వాళ్ళ చేతిలో రెండు పెద్ద గన్నులు ఉన్నాయి. చెవిలోని బ్లూటూత్ని నొక్కిపెట్టి " ఆ అమ్మాయి వివరాలు ఏమైనా తెలిసయా ?" అంటూ గంభీరంగా అడిగాడు . ఆ అమ్మాయి గురించి ఒక ఫోటో దొరికింది సార్ . మేము మీ క్యాబిన్లోనే వెయిట్ చేస్తున్నాను సార్ అంటూ భయపడిపోతూ ...మరింత చదవండి

13

జతగా నాతో నిన్నే - 13

అన్వి తీసుకున్నది ఒక రూమ్ అవ్వడం వల్ల ఎదురుగా ఉండే ఒక హాస్టల్లో వాళ్లకి తినడానికి ఫుడ్డు లభిస్తుంది . నిజానికి వాళ్లు వంట చేసుకోవడానికి ఉన్న, వాళ్ళ దగ్గర సరుకులకి కావాల్సినన్ని డబ్బులు ఉండేవి కాదు . అందుకని కొంత మొత్తాన్ని ఆ హాస్టల్ వార్డెన్ కి ఇచ్చి ముగ్గురు తినేవాళ్లు. ఇప్పుడు కాఫీ షాప్ ఓనర్ ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా వీళ్ళకి వండుకోవడానికి స్వతంత్రం లభించింది . “ వావ్ ఈరోజు ఆంటీ దోస వేశారు తెలుసా! ” అంటూ గదిలోకి వచ్చిన గీత దాని తెరచింది వాసన చూస్తూ ! “ ఏంటే నిజమా! ” అంటూ పరుగు పరుగున గీత చేతులలో బాక్స్ లాక్కున్నారు . ( నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే, ఏ హాస్టల్లోనైనా దోసనే కొంచెం తినేలాగా ఉంటుంది మరి ) ఇక ముగ్గురు వాళ్ళ ప్లేట్స్ కడుక్కొని వచ్చి ...మరింత చదవండి

14

జతగా నాతో నిన్నే - 14

అన్వి చికెన్ చూడు సన్న ,సన్న పీసెస్ గా కొయ్యాలా లేకపోతే పెద్దగా కోయినా ? ఆ స్టవ్ పైన అవి మాడిపోతున్నట్టుగా ఉన్నాయి చూడు ఇద్దరు తొందర పెట్టారు .“ ఆ చూస్తున్న చూస్తున్న ....” అంటూ సెల్లో మల్లి పాటలు పెట్టేసి బెడ్ పై పడేసి వచ్చేసింది .వాళ్లు మళ్లీ ఆ పాటలు వింటూ చికెన్ చేయడంలో నిమగ్నమైపోయారు .ఒక 30 నిమిషాల తర్వాత చికెన్ గుమగుమలాడుతూ వాసనను బయటికి పంపింది. చికెన్ రెడీ అయిపోయింది. “ ఇక బిర్యాని వద్దు మామూలుగా అన్నంతోనే తిద్దాం. ఎప్పుడు హోటల్ లో తింటున్నాం కదా బిర్యాని ” అంటూ అన్వి చెప్పగానే, సరే అని ఒప్పుకున్నారు. అప్పటికే స్టౌ పైన అన్నం ఉడికింది . “ ఎన్ని రోజులైంది .ఇంటి వంట తిని .ఈరోజు మనకి నిశ్చయంగా స్వేచ్ఛ లభించినట్టుంది .మనకు నచ్చినంత సేపు బయటకు వెళ్లి తిరిగాము, ...మరింత చదవండి

15

జతగా నాతో నిన్నే - 15

లారీ డ్రైవర్ వేగంగా తనని ఢీకొట్టి కాస్త ముందుకు వెళ్లి లారీని ఆపేశాడు .అక్కడినుండి లారీని వదిలేసి భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు .కొన ఊపిరితో కొట్టుకుంటూ తీసుకోలేక ఇబ్బంది పడుతూ రక్తమాడుపులో ఉంది గీత. ఆమెకు “ గీత.....” అంటూ తన వైపే వస్తున్న మాటలు మాత్రమే వినిపించాయి. నెమ్మదిగా గీత కళ్ళు మూతపడ్డాయి. “ గీతా......గీత నీకేం కాదు. నేనున్నాను ” అంటూ ధైర్యంగా తను నిద్రపోకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది అన్వి. సంజన కింద భూమి అంత కనిపించినట్టు అనిపించింది .తన ఎదురుగా రక్తం మడుపులో కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితురాలిని చూసి చలించిపోయింది . గీత తలకున్న రక్తం ,అన్వి వేసుకున్న బట్టలకి మొత్తం అయింది. తన చేతులకి అంతా అయింది. గీత అంటూ గట్టిగా గొంతు తడి పూర్తిగా ఆరిపోయే ఏడుపు మాత్రమే తనకు వస్తుంది. చుట్టుపక్కన ఎవ్వరూ లేరు . ఆ రోడ్డుపైన కొంచెం దూరంలో ...మరింత చదవండి

16

జతగా నాతో నిన్నే - 16

గీతకు జరిగిన విషయాన్ని కాఫీ షాప్ యజమానికి కూడా చెప్పి, కొన్ని రోజులు తన కోసం సెలవులు అడిగారు. తన పని కూడా వాళ్లే చేస్తామని కూడా ఇచ్చారు . ఆయన అదేమీ వద్దు .తనకి నేను డబ్బులు ఇస్తాను. మీ పని మీరు చేయండి చాలు! అంటూ ఒప్పుకున్నాడు . ఎంతైనా మూడు సంవత్సరాలుగా అతడి దగ్గరే పని చేస్తున్నారు వాళ్ళు . తన కింద పని చేసే వాళ్లపైన ఆమాత్రం అభిమానం ఉండటంలో తప్పులేదు కదా!. అప్పుడే కాఫీ షాప్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాడు అభయ్ . అతడు వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లిన అన్వి అతని చూసి , “ సార్ మీకు ఏం కావాలి ....” అంటూ ప్రశాంతమైన వదనంతో అడిగింది . అంత బాధ పడుతూ కూడా ఎలా ఇలా? అంటూ ఆమె మొఖం వైపు ...మరింత చదవండి

17

జతగా నాతో నిన్నే - 17

గాలిలో వేగంగా ఎగురుతున్న ఒక హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ ,ఒక పదాంతస్తుల భవనం పై ఏర్పాటు చేయబడిన హెలికాప్టర్ ల్యాండింగ్ పానెల్ పై ఆగింది . రెక్కల నుండి వచ్చే గాలి శబ్దం , తుమ్మెద నాదముల మారుమోగుతుంది . దాని గాలికి చుట్టుపక్కల ఉన్న దుమ్ము రేణువులంతా దూరంగా నెట్టి వేయబడ్డాయి . అందులో నుండి కోటుని సరిచేసుకుంటూ, పాలిష్ చేయబడిన బ్రాండెడ్ బూట్లతో, రోలెక్స్ వాచ్ సరిచేసుకుంటూ కిందికి దిగాడు అతడు . అలా దిగగానే తనకి సెక్యూరిటీ కల్పిస్తూ ఇద్దరు సైనికులులాగా వచ్చి నిలబడ్డారు. వాళ్ళ చేతిలో రెండు పెద్ద గన్నులు ఉన్నాయి. చెవిలోని బ్లూటూత్ని నొక్కిపెట్టి " ఆ అమ్మాయి వివరాలు ఏమైనా తెలిసయా ?" అంటూ గంభీరంగా అడిగాడు . ఆ అమ్మాయి గురించి ఒక ఫోటో దొరికింది సార్ . మేము మీ క్యాబిన్లోనే వెయిట్ చేస్తున్నాను సార్ అంటూ భయపడిపోతూ ...మరింత చదవండి

18

జతగా నాతో నిన్నే - 18

ఆ మరుసటి రోజు కాలేజీకి రాహుల్ వచ్చాడు. అప్పుడే కాలేజీకి వచ్చిన అన్వి, తనని చూసింది . “ ఏయ్ .....రాహుల్ ” అంటూ అరుస్తూ దగ్గరికి వచ్చింది. ఏంటి అన్నట్టు కళ్ళతోనే చూశాడు. “ నిన్ను ఎందుకు నువ్వు ప్రోగ్రాంలో ఉండలేదు. అంత తొందరగా వెళ్ళిపోయావు ఏంటి? ” అంటూ ఆయాసంగా శ్వాస తీసుకుంటూ పలికింది. “ లేదు. కొంచెం హెల్త్ బాగోలేదు. అందుకే తొందరగా వెళ్ళిపోయాను ” ఏదో చెప్పి కవర్ చేశాడు. “ అవునా! ఇదిగో మన ప్రోగ్రాం ఫస్ట్ వచ్చింది. అందులో నీ వాటా డబ్బులు ” అంటూ చేతిలో పెట్టబోయింది. “ పర్వాలేదు. నీకే అవసరాలు ఉంటాయి, తీసుకో!” అంటూ చెప్పి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు వచ్చేశాడు . “ నాకు చాలా సహాయము చేశావు. ప్లీస్ ఈ ఒక్కసారికి తీసుకో ” అంటూ అతడి ప్రమేయం లేకుండ చోక్క జేబులో ...మరింత చదవండి

19

జతగా నాతో నిన్నే - 19

ఒకరినొకరు చూసుకుని ఇద్దరు షాక్ అవుతారు. కానీ మరే మాట్లాడుకోరు . రాహుల్ గదిలోకి వెళ్లడానికి దారి వదులుతాడు అభయ్. “ సరే బాబు గదిని పాడు చేయకుండా శుభ్రంగా ఉంచుకోండి ” అంటూ చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతాడు . రాహుల్ ని పలకరిద్దాం అనుకుంటున్నాడు .కానీ తను ఏమి పలకరించకుండా అలాగే కాసేపు బెడ్ పై కూర్చుంటాడు . తన వస్తువులన్నీ సర్దుకున్న తర్వాత ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు రాహుల్ కి. అందుకే మౌనంగా ప్రశ్నార్థకంగా ,అభయ్ వైపు చూస్తాడు . అభయ్ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా లేచి తన బెడ్ని ఒకపక్కగా లాగుతాడు . అంతే! రెండు అటాచ్డ్ బెడ్లు విడిపోతాయి . రాహుల్ తన బెడ్ ని తనువైపుగా లాక్కొని కాసేపు పడుకుంటాడు . “ రాహుల్ నాకు కొంచెం పని ఉంది. నేను వెళ్తున్నాను డోర్ లాక్ చేసుకో ” ...మరింత చదవండి

20

జతగా నాతో నిన్నే - 20

కాలేజీకి వెళ్ళిన రాహుల్,అభయ్ కి ఒకచోట అన్వి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి ఏదో మాట్లాడుతూ ఉంటుంది . కొన్ని క్షణాల్లోనే వాళ్ళు మాట్లాడే మాటలు సీరియస్ విషయానికి సంబంధించిన అని అర్థం అయింది .దాంతో వాళ్ళిద్దరూ అటుగా నడిచారు. “ హాయ్ ! ఏంటి , ఏదో డీప్ డిస్కషన్ లో ఉన్నారు? ” అనీ అభయ్ పలకరించగానే .... “ అదేం లేదు అభయ్ . రెండు వారాల్లో కాలేజీ ప్రాజెక్టు ఉంది కదా! దాని గురించే మాట్లాడుతున్నాము ” అంది చేపుతూ. “ దాంట్లో మాట్లాడుకోవడానికి ఏముంది? ఏ గూగుల్ లో లేకుంటే ఎలక్ట్రానిక్స్ సిటీ లోను మనీ ఇస్తే, ప్రాజెక్ట్ చేసి ఇస్తారు అంటా కదా? ” అన్నాడు ఉచిత సలహా ఇస్తూ . “ అయ్యా మహానుభావా! మేము అదే సలహా ఇచ్చాం ” అంది సంజన వెక్కిరిపూగా. ఏం అర్థం కానట్టుగా ...మరింత చదవండి

21

జతగా నాతో నిన్నే - 21

“ అయినా భూమి పైన మొక్కలు నాటడం పెద్ద విషయమేం కాదు కదా? ఎందుకు దీనికి అంత సీన్ చేస్తున్నారు . నేను ఇక్కడికి వచ్చింది చూడడానికి , ఎందుకు ఇంకా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచించడం ? చిల్ మామ చిల్ ” అంటూ ఎగురుతూ వెళ్ళిపోయాడు అభయ్. కొంత దూరం వెళ్ళాక “ ఛీ నేనేంటి ? మనిషి లాగా మారిపోతున్నాను . కొన్ని రోజులు వాళ్ళతో ఉండేసరికి వాళ్ళలా ప్రవర్తిస్తున్నాను ” అని వోళ్ళంతా జలదరిస్తుండటంతో సద్దుమనీగాడు. కొంతసేపటికి తన ఇంటిని చేరుకున్న అభయ్ తన కుటుంబంతో చాలా సంతోషంగా గడిపాడు. భూమి పైన జరిగిన ఒక్కొక్క విషయాన్ని తనకు వచ్చిన ఆ చివరి మిషన్ గురించి చెప్పాడు . తను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ......వాళ్ళ అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నాడు. చివరిగా ఒకసారి తన మిత్రులందరికీ చూసి మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో? ...మరింత చదవండి

22

జతగా నాతో నిన్నే - 22

లేత సూర్యకిరణాలు పగిలిపోయిన టెర్రస్ ఖాళీ ప్రదేశం నుండి వాళ్ళ పైన పడ్డాయి . దాంతో మేల్కొన్న అన్వి, రాహుల్ ఒడిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది నెమ్మది నెమ్మదిగా తనకి రాత్రి జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదిలాయి. దాంతో బాధగా ముఖం పెట్టి , తన బ్యాక్ తీసుకుని ఏడుస్తూనే పక్కకు నడిచింది . తను లేచిన చప్పుడికి మేలుకున్న రాహుల్ ,ఏం మాట్లాడకుండా తననే చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి “ అన్వి........” అంటూ చిన్నగా పలకరించాడు రాహుల్. “ రాహుల్ చాలా థాంక్స్!. ఇన్ని రోజులుగా నాలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు. ఇప్పుడు నీవల్ల అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బహుశా నా బాధ కారణంగానే అనుకుంటా ,ఇంకా నా కళ్ళముందే అమ్మానాన్నలు ఉన్నారు అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన ఓదార్పుతో ఇకనైనా ఈ నిజాన్ని గ్రహిస్తాను ” అంటూ కంటి పైన ఉన్న ...మరింత చదవండి

23

జతగా నాతో నిన్నే - 23

రాహుల్ ఆ ఇంటి ప్రస్తావని తీసుకొని రాగానే “ ఏంటి నిజమా ....? ” అంటూ అందరూ ఒక్కసారిగా అన్నారు. అవును నిజమే అంటూ తల ...అన్వి వైపు చూశాడు. తను ఏం మాట్లాడకుండా మౌనంగా తన రూమ్ వైపుకి నడిచింది . అలా ఎందుకు ప్రవర్తిస్తుందో.......అర్థం కాక గీత , సంజన ఇద్దరు అలాగే చూస్తూ ఉండిపోయారు . “ సరే అయితే రేపు ఆ స్థలాన్ని చూద్దాం. ఇంకా రేపే మన ఆర్గనైజేషన్ ని అందంగా రెడీ చేద్దాం ” అన్నాడు నవ్వుతూ. దానికి అందరూ ఒప్పుకున్నారు . ఆ తర్వాత అక్కనుండి అభయ్ నేరుగా సెయింట్ చర్చ్ కి వెళ్ళాడు . “ నేను వచ్చేసాను.....” గట్టిగా అంటూ డోర్ తీసుకొని చెప్పాడు. “ ఏంటి ఈ రోజు చాలా అంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ” అంటూ అప్పుడే ప్రార్థన పూర్తి చేసుకున్న పోప్ ...మరింత చదవండి

24

జతగా నాతో నిన్నే - 24

అభయ్ ఫెయిల్ అయ్యాడు అని తెలియగానే రాహుల్ కూడా ఎందుకో చాలా బాధపడతాడు. మిగిలిన వారి సంగతి చెప్పనక్కర్లేదు . ఎంతైనా మన తోటి వారు సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. వాళ్లకి చిన్న కష్టం వచ్చినా మన కష్టంగానే భావించమని తత్వాలు చాలామందికి ఉంటాయి. ఇన్ని రోజులు వాళ్ళని నవ్విస్తూ .....కష్టాల్ని పంచుకున్న అభయ్ ఒక్కడికి మాత్రమే అలా అవ్వడంతో అందరూ నిరాశగానే ఉన్నారు . దాంతో వాళ్ళ స్థాపించిన ఆర్గనైజేషన్ ని కొన్ని రోజులు నడపకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు కూడా రాహుల్ నిరాశగానే కాలేజీకి వచ్చాడు. కానీ అమ్మాయిలు చూపు మాత్రం తన నుంచి దూరంగా వెళ్లలేదు . వాళ్ళకి పాస్ హా? ఫెయిలా ? అని కాదు , అబ్బాయి ఎలా ఉన్నాడు అన్నదే ముఖ్యం . ఆ విషయం కొంచెం ఉపశమనం కలిగించిన, మనసు మాత్రం మొండిగా ప్రవర్తిస్తూ ఉంది ...మరింత చదవండి

25

జతగా నాతో నిన్నే - 25

భూమి పైన మాయమైనా రాహుల్ నేరుగా డ్రాకులాల రాజ్యంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చుట్టూ పరికించి చూస్తే , తనకి ఏదో తేడా కనిపించింది . గాలిలో వాసన ఏంటి ? చాలా వింతగా ఉంది . ఈ గ్రామంలో ప్రజలు ఉండాలి కదా ! ఎక్కడికి వెళ్లారు ? అంటూ చుట్టూ చూస్తూ ఉన్నాడు . ఇంతలో ఏవో అరుపులతో తనపైన ఒక పది, పదిహేను దయ్యాలు దూకాయి . అవి అలా రాహుల్ పైకి దూకగానే తను వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నాడు . కానీ తనతో పాటు తీసుకువచ్చిన శవలను మాత్రం మాయ చేయలేకపోయాడు . ఆ దయ్యాలు పిచ్చి పట్టిన వాటిలాగా ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొరకడం మొదలుపెట్టాయి. అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో రాహుల్ కి అర్థం కాలేదు . ఈ సామ్రాజ్యంలో నేను యువరాజుని ప్రతి ఒక్క దయ్యానికి తెలుసు! కానీ ...మరింత చదవండి

26

జతగా నాతో నిన్నే - 26

రాహుల్ చూపు షాప్ ముందు ఉన్న దానిపై పడింది . అది రాత్రి అవ్వటం వల్ల పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. అది ఒక స్వీట్ దాని యజమాని బయటికి వచ్చి “ పనికిమాలినదాన ....” అంటూ కాలితో కుక్కని తంతున్నాడు. అది బాధగా “ కుయ్యో ......మోర్రో .....” అంటూ అరుస్తుంది . “ నువ్వు ఇలా చెప్తే అసలు ఎందుకు వింటావే? నా షాప్ ఒకటే నీకు కనిపిస్తుందా? వేరే ఏది కనిపించదా? ” అంటూ రాడ్ తీసుకోని విసిరాడు. అది నేరుగా వెళ్లి ఆ కుక్క వెనక కాలికి తకింది. దానితో నొప్పి ఎక్కువ అయ్యి గట్టిగా అరిచింది కుక్క. దాని కాలివెంట నుంచి రక్తం చిన్నగా కారుతుంది . అది చూడగానే రాహుల్ కి ఆ వ్యక్తి పైన చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ కుక్కని చేరుకొని దాన్ని పైకెత్తుకుంటాడు . “ ...మరింత చదవండి

27

జతగా నాతో నిన్నే - 27

కుక్క పిల్లతో చాలా సంతోషంగా ఆడుకుంటున్న అన్విని చూడగానే రాహుల్ మనసులో కలుకుమంది. “ అసలు ఎలా ఉండగలుగుతున్నావు అన్వి. కన్న వాళ్ళని పోగొట్టుకున్న నువ్వు కష్టాలు పడి ఉంటావో నేను ఊహించగలను . అసలు ఈ విషయం మీ ఫ్రెండ్స్ కి అయినా తెలుసా లేదా? ” అంటూ ప్రేమగా తన వైపు చూస్తూ ఉన్నాడు. అలా తన వైపు చూస్తూ ఉండగానే కళ్ళల్లో నీళ్లు గ్రావిటీకి కిందికి దూకుతానన్నట్టు మోరాయిస్తున్నాయి. “ ఏంటో నేను ఒక డ్రాకులా అన్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. మనుషుల్లాగా ఈ మధ్య మారిపోతున్నానని భయమేస్తుంది ” అంటూ తలతిప్పి కన్నీళ్ళను తుడుచుకున్నాడు రాహుల్ . నేను ఎలాగైనా అన్వి యొక్క అసలు నిజాన్ని తెలుసుకుని తీరాలి . నాకు తెలిసి ఈ విషయాన్ని తన స్నేహితులకు కూడా చెప్పిండదు . కాబట్టి మళ్లీ వెళ్లి ఆ తోటమాలిని అడగాలి అని ...మరింత చదవండి

28

జతగా నాతో నిన్నే - 28

అలా రోడ్డుపై ఆలోచించుకుంటూ వస్తున్న రాహుల్ కంటికి దూరంగా ఏదో కనబడింది .దాన్ని చూడగానే అతడి అడుగుల వేగం పెరిగింది. దాని సమీపించే కొద్దీ అది అర్థం అయ్యి అప్రయత్నంగానే బాధగా “ స్నూపీ .........” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు . దాన్ని చేరుకుని దాని చేతిలోకి తీసుకోగానే, దానికి ఉన్న రక్తం అంతా అతడి శరీరాన్ని తడిపేసింది. “ స్నూఫీ ఎవరు నిన్ను ఇలా చేసింది ?” అంటూ ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయాడు . రోడ్డు పైన అన్విని వెతుక్కుంటూ వస్తున్న అభయ్కి దూరంగా రాహుల్ కనిపించేసరికి , పరుగు పరుగున తన దగ్గరికి చేరుకున్నాడు. రాహుల్ చేతులో కుక్క పిల్లని చూడగానే , “ రాహుల్ అన్వి ఎక్కడ ? ” అన్నాడు భయంగా. అప్పటిదాకా ఏడుస్తున్న రాహుల్ తేరుకొని, “ అన్వి ఎక్కడ ?” అంటూ తిరిగి ప్రశ్నించాడు. “ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ...మరింత చదవండి

29

జతగా నాతో నిన్నే - 29

మరోవైపు అన్వి కోసం వెతుక్కుంటూ వెళ్లిన అభయ్ దిక్కులాన్ని పరికించి పరికించి చూసాడు. కానీ తనకి ఎక్కడ అన్వి జాడ కనిపించలేదు . “ బహుశా దురదృష్టవంతుడిని అనుకుంటా!. నా ప్రేమను తెలియజేసే అదృష్టం నాకు ఉండదనుకుంటా . నేను ప్రేమని తెలియజేస్తాను అని చెప్పడం వల్లే , తనకి ఇలా అయ్యి ఉంటుందా ?” అని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే, అక్కడ ప్రతిక్షణం తనకి ఒక నరకమే! త్వరగా కనుక్కోవాలి అంటూ వెతుకుతూ అటు పక్క ఉన్న నగరాన్ని అంతా చూసాడు .కానీ తనకి అన్వి ఎక్కడ కనిపించలేదు. అప్పుడే తనకి ఎత్తుగా ఉండే ఒక టవర్ కనిపించింది. చుట్టూ అంత గమనించాడు. ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాతే , ఒక్కసారిగా తన తెల్లని రెక్కలని విప్పి ఆకాశంలోకి ఎగిరాడు అభయ్. అలా ఎగురుతూ వెళుతున్నప్పుడే అటుగా ఏదో పని పైకి వచ్చినా భూషణ్ కంటికి ...మరింత చదవండి

30

జతగా నాతో నిన్నే - 30

బయటికి వచ్చిన రాహుల్ కి ఎవరిని అడగాలో తెలియదు . ఏం చేయాలో తెలియదు . అసలు తను ఇంకా బ్రతికే ఉందన్న విషయం కూడా అలాగే రోడ్డుపైన ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. అప్పుడే తన జోబులో ఉండే ఫోన్ రింగ్ అవ్వటం మొదలైంది . మొదట దాన్ని పట్టించుకోకుండా అన్వి కోసం వెతకడం మొదలుపెట్టాడు . మళ్ళీ రెండోసారి రింగ్ అవ్వడంతో, అవతల వారికి ఏదైనా అవసరమేమో అన్న ఉద్దేశములో ఫోన్ తీసి “ హలో ..........” అన్నాడు. అవతల నుంచి చాలా కంగారుగా మాట్లాడుతున్నాడు అభిషేక్ . “ రాహుల్ నేను అభిషేక్ నీ! నీకు అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. అన్విని మా నాన్నగారికి కిడ్నాప్ చేశారు . తనని చంపాలని కూడా ప్లాన్ చేశారు. నాకు అన్వికి, నీకు మధ్య గొడవ ఉందని తెలుసు. కానీ ఒక అమ్మాయిని చంపేంత మూర్ఖునైతే కాదు . ...మరింత చదవండి