Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 07








ఆరోజు జరిగిన సంఘటన గురించి రూముకు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంది అన్వి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ? ఆరోజు కూడా అంతే, అలా వచ్చి ఇలా రక్షించేసి వెళ్లిపోయాడు . మళ్ళీ అలాగే ఈరోజు కూడా జరిగింది.


ఆ అబ్బాయికి నేను ప్రమాదంలో ఉంటే ముందే ఎలా తెలిసిపోతుంది ? నాకు ప్రమాదం అని తెలిస్తే చాలు ,అడ్డుగా వచ్చి రక్షిస్తున్నాడు. నాకు ఆ అబ్బాయికి మధ్య ఏదైనా బలమైన బంధం ఉందా? మేం పదే పదే కలుస్తున్నాము ఏలాగా? అంటూ ఆలోచిస్తూ తన జుట్టుతో ముంగురులు తిప్పుతూ ఆడుకుంటుంది అన్వి.


“ ఏంటి మేడం ,తేగ ఆలోచిస్తున్నారు ” అంటూ పక్కగా వచ్చి కూర్చుంది డిటెక్టివ్ గీత .


“ ఏం లేదు మామూలుగానే ఉన్న ” అంటూ అసలు విషయం దాచేస్తూ తిరిగి పడుకుంది.


“ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, మాకు బాగా తెలుసులే! ” అంటూ గీత, సంజన ఒకరిని ఒకరు చూసుకున్నారు. చిన్నగా నవ్వుకొని ,వాళ్లు కూడా వెళ్లి పడుకున్నారు .


ఆరోజు ఉదయం చాలా సంతోషంగా అనిపించింది .ఎందుకో తెలియదు కానీ మనసంతా ఉరకలు పెడుతుంటే ,అందరి కంటే ముందే అన్వి కాలేజీకి చేరుకుంది .


తన వెనుకే వచ్చారు మన కోతులు ఇద్దరు. వారు గదిలోకి అడుగు పెట్టారో లేదో, ఏవో గొడవలు, అరుపులు వినిపిస్తున్నాయి .


“ ఏంటే ఎప్పుడు లేనిది, ఈరోజు మన క్లాస్ టామ్ టామ్ అయ్యేలా ఉంది ” అంటూ నెమ్మదిగా తలపెట్టి తొంగి చూసింది అన్వి.


తన భుజంపై చేతులు పెడుతూ తన తలపై నుంచి తొంగి చూసింది గీత . “ ఏంటే ఏం చూస్తున్నారు .నేను చూస్తున్నాను ఆగు ” అంటూ వాళ్ళిద్దరిపై చేతులు వేస్తూ తను కూడా నెమ్మదిగా గదిలోకి తొంగి చూసింది సంజన .


అక్కడ ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. క్లాస్ రెండు భాగాలుగా విడిపోయి గొడవ పడుతున్నారు .అబ్బాయిలు ,అమ్మాయిలు అని తేడా లేకుండా రెండు గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధం చేస్తున్నారు. చేతికి దొరికిన పుస్తకాలు, పెన్నులు ....చిరిగిన రాకెట్లతో క్లాస్ రూమ్ అంత గోలగోలగా ఉంది .


అంత గందరగోళంలో కూడా రాహుల్ ఇంకా అభయ్ , అన్వి కూర్చునే దగ్గర నిలబడుకొని వాళ్ళ బుక్స్ ని చెరోకపక్క పెట్టుకున్నారు. ఇంకా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప, ఏ ఒక్కరు కూర్చోడానికి ప్రయత్నించలేదు.


నెమ్మదిగా వాళ్ళ గొడవలోని మాటలు అర్థం అవడం మొదలుపెట్టాయి.


“ ఏం మాట్లాడుతున్నారు మీరు? మొదట వచ్చింది అభయ్. మొదట తన పక్కన కూర్చున్నాడు .అన్వి ప్లేస్ మారడంతో వచ్చి నన్ను అడిగాడు .అందుకే నేను చెప్పా! తను అక్కడ కూర్చుంటుంది అనీ ” కాస్త గట్టిగా అంది ఒక అమ్మాయి .


ఆ అమ్మాయి మనసులో అభయ్ ,అన్వి పక్కన కూర్చున్నప్పటికీ ,తనతో మాట్లాడాడని సంతోషం చెప్పలేనంతగా ఉంది .అందుకే తనని సపోర్ట్ చేస్తుంది.


“ ఏయ్ ఆపవే! తను నిన్న రాలేదు .ఆ టైంలో ఈ ప్లేస్ లో రాహులే కూర్చున్నాడు .కాబట్టి ఇది కచ్చితంగా తన ప్లేసే! .ఇప్పుడు మధ్యలో వచ్చి తను అలా ఎలా కూర్చుంటాడు. కావాలంటే తను వెళ్లి ఆ చివరి కూర్చోమను ” అంటూ అభిషేక్ ని కొడుతున్నప్పుడు చూసిన అమ్మాయిల్లో ఒకరు అన్నారు .


“ మీరు ఎంతైనా చెప్పండి. అన్వి పక్కన కూర్చునే అర్హత అభయ్ కి మాత్రమే ఉంది ” అంటూ కొంతమంది అబ్బాయిలు కాలర్ పైకి ఎగరేస్తూ అన్నారు. వాళ్లంతా ఫైటింగ్ ఇష్టపడకుండా కేవలం తమ అందంతో ఆకట్టుకునే వ్యక్తులు !అందుకే అభయ్ని సపోర్ట్ చేస్తున్నారు.


“ రేయ్ అలా ఏం కాదు .న్యాయం ప్రకారం మాట్లాడితే ముందు రాహులే కూర్చున్నాడు ” అంటూ కాస్త మాస్ గా ఉండే అబ్బాయిలు తమ చేతి చోక్కను పైకి మడుస్తూ గొడవకి సై అన్నట్టుగా సపోర్ట్ చేశారు.


లేదు అభయ్ కూర్చోవాలి.....లేదు రాహులే కూర్చోవాలి అంటూ ఇరువర్గాల వాళ్ళు నోట్బుక్లు ఒకరిపై ఒకరి విసిరేసుకుంటున్నారు .


“ ఏంటి వీళ్ళకి ఏమైనా చిన్న మెదడు చితికిందా? నీ పక్కన కూర్చునే వ్యక్తి కోసం ఎందుకని వాళ్ళు అలా గొడవ పడుతున్నారు ” అంటూ చిరాగ్గా అంది గీత .


“ అవునే నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది. నీ పక్కన ఎవరు కూర్చుంటే బెటర్ అంటావు? ” అంటూ తన వైపు ప్రశ్నార్థకంగా చూసింది సంజన.


“ నువ్వు చెప్పు నా పక్కన ఎవరు కూర్చుంటే మంచిది అంటావు? ” అంటూ దొంగ చూపులు చూస్తూ కింది నుంచి అడిగింది అన్వి.


“ నాకెందుకో నీ పక్కన రాహుల్ కూర్చుంటేనే మంచిది. ఎందుకంటే తన నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆ అభయ్ గాడి వల్ల ఎప్పుడు తన్నులే తింటున్నాం మనం ” అంటూ ముందురోజు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని భయపడుతూంది సంజన.


“ ఈరోజు అన్వి పక్కన అభయ్ కూర్చుంటేనే, లేదంటే అది మా చేతులు అయిపోతుంది ”

” లేదు.....లేదు.ఈరోజు తన పక్కన కూర్చుని చాన్స్ కచ్చితంగా రాహుల్ కి ఇవ్వాలి .లేదంటే అది మా చేతిలో చచ్చిపోతుంది ” అంటూ వాళ్ళ గొడవ అన్వి వైపుకి మళ్ళింది.


“ ఊరంతా ఉరిమి మంగళం పై పడ్డట్టు ! వీళ్లేంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని టాపిక్ నా దగ్గరికి తీసుకొచ్చారు ” అంటూ ముక్కు చీదుకుంటూంది అన్వి.


“ చూస్తుంటే ఈరోజు కూడా మనం క్లాసులోకి అడుగుపెట్టలేం అనుకుంటా ” అంది గీత బాధపడుతూ .


ఒసేయ్ డిటెక్టివ్ ! నా దగ్గర ఒక ఐడియా ఉంది అంటూ వెంటనే సంజనాన్ని పట్టుకొని క్లాసులోకి అడుగు పెట్టింది అన్వి.


అప్పటిదాకా యుద్ధం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న కోపంతోనే, అన్విని కాల్చేసేలా ఉన్నారు. ఇప్పుడు తను ఎవరిని కూర్చోడానికి ఒప్పుకుంటుంది అని ఆత్రుతగా చూస్తూ ఉన్నారు .


అన్వి వచ్చిన విషయం గ్రహించిన రాహుల్ ,అభయ్ ఇద్దరూ తన వైపు చూస్తారు.



అన్వి, సంజనాన్ని తీసుకొని మొదటి బెంచ్ వదిలేసి, రెండో బెంచ్ లో తనతో పాటుగా కూర్చుంటుంది. అది చూసిన క్లాసులో మిగతా వాళ్లందరూ షాక్ అవుతారు .


“ ఏయ్ అన్వి......” అంటూ గొడవకి సిద్ధమవుతున్న వాళ్లు క్లాసులోకి వచ్చిన భూషణ్ గారిని చూసి నిశ్శబ్దం అయిపోయారు. ఎవరి ప్లేస్ లో వాళ్లకు కూర్చుంటారు.


స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు రావడం మామూలే ! దానివల్ల ఆయన లెక్చర్ కు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు .ఒకవేళ అలా జరుగుతే ఆయన కోపాన్ని తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు.


అందుకే క్లాస్ ఎలా ఉన్నా, సరే అందరూ నిశ్శబ్దంగా కూర్చునారు . చెప్పేది వింటున్నారు. ఆయన కూడా పెద్దగా పట్టించుకోకుండా తను చెప్పాలనుకున్నది చెప్తున్నాడు. ఇక అందరూ కూర్చున్నారు .


ముందు నిలబడిన రాహుల్ , అభయ్ తప్ప మరెవరు కూర్చోడానికి వీలు లేకుండా అందరూ నిండిపోయారు . లెక్చర్ చెప్పూతూన్న భూషణ్ వెనక్కి తిరిగి చూస్తే వీళ్లిద్దరూ ఇంకా నిలబడుకొని చూసుకుంటున్నారు .



“ మీకు సపరేట్ చెప్పాలా? కూర్చోండి ?” అంటూ కసిరినట్టుగానే చెప్పి, మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇక వేరే దారి లేక అభయ్, రాహుల్ ఇద్దరు ఒకటే బెంచ్లో కూర్చున్నారు.



అభయ్, రాహుల్ ఇద్దరు అదేదో అలర్జీ ఉన్నట్టు బెంజ్ కి చేరువైపున కూర్చుని మధ్యలో స్థలాన్ని వదిలేశారు .


“ రాను రాను ....నా లైఫ్ ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు . క్లాస్ అవ్వగానే తొందరగా ఎస్కేప్ అయిపోదాం ” అంటూ మళ్ళీ ప్లాన్ రెడీ చేసింది అన్వి.


ఆరోజు క్లాస్ మొత్తం భూషణ్ గారిది అవటంతో, ఆయన విరామం లేకుండా ఒక మూడు గంటల పాటు క్లాస్ని చెప్పారు.


ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోండి అని ఆయనే పరిమిషన్ ఇవ్వడంతో అన్వి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం వీళ్ళ అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి తుర్రుమన్నారు.



అభయ్ కూడా ఏం మాట్లాడకుండా మళ్లీ సెయింట్ చర్చ్ వైపుకు వెళ్ళాడు .అతడు వెళ్తున్న వైపే చూస్తూ రాహుల్ కాస్త కోపంగా , “ ఇతడికి పైన ఒక కన్నేసి ఉంచాలి ” అని మనసులో అనుకున్నాడో లేదో వెంటనే తన కళ్ళల్లో చిన్న జ్వలా వెలిగింది .వెంటనే తన శక్తిని అదుపు చేసుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు .



సెయింట్ చర్చ్ లోపలికి వెళ్లిన అభయ్ ,“ నేను వచ్చేసాను .....” అంటూ నిరాశగా అన్నాడు.


“ ఏమైంది ఈరోజు చాలా బాధపడుతున్నట్టు ఉన్నావు ” అంటూ పోప్ అడిగాడు.


“ ఈరోజు ఒక మనిషి కారణంగా నాకు ఇష్టమైన వాళ్ళ పక్కన కూర్చోలేకపోయాను .నాకు ఆ వ్యక్తి పైన కోపం విపరీతంగా ఉంది ” అంటూ మొఖం చిట్లించాడు అభయ్.


పోప్ ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ,“ నువ్వేంటి మనిషిలాగ ప్రవర్తిస్తున్నావు. ఏంజెల్స్ అంటే ఎప్పుడు శాంతపరులే కదా ! నీ శక్తుల పైన నువ్వు నియంత్రణ కోల్పోతున్నట్టు అనిపిస్తుంది” అంటూ ఆశ్చర్యాన్ని కళ్ళల్లో నిలుపుకొని అడిగాడు.


అప్పుడు కానీ అభయ్ కి అర్థం కాలేదు .తను ఏం చేస్తున్నాడు అన్నది . వెంటనే తేరుకొని, “ అవును నిజమే! ఎప్పుడూ లేనివిధంగా నాకు కోపం ఎందుకు వస్తుంది .అది కూడా ఒక మనిషి పైన ” అంటూ తనని తాను చూసుకుంటున్నాడు.


“ ఏది ఏమైనా సరే! ఈరోజు నీ చివరి మిషన్ నువ్వు పూర్తిచేయి .ఇలాంటి పట్టింపులకు వెళ్లి నీకు వచ్చే అధికారాలని, అత్యంత ఉన్నతమైన స్థానాన్ని వదులుకోకు ” అంటూ మందలిస్తున్నట్టుగా మళ్లీ దేవుని ప్రార్థించాడు పోప్.


వెంటనే గాల్లో ఒక బంగారపు కాగితం ఎగురుకుంటూ వచ్చింది . దాన్ని అభయ్కి అందిస్తూ, “ నీ చివరి మిషన్ ఏంటో అడుగు ఆ ప్రభువునీ ” అని ఆయన కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు .


అభయ్ తన మనసును శాంతపరుచుకొని తన చేతుల్లోకి ఒక తెల్లని కాంతి కాగితాన్ని చేతులకి తీసుకున్నాడు .


“ ప్రభు నా చివరి పరీక్ష ఏంటి ? సెలవు ఇవ్వండి .మీ నియమ నిబంధనలకు ,లోబడే నేను దాన్ని పూర్తి చేస్తాను ” అని మనసులో కోరుకుంటూ కళ్ళు మూసుకున్నాడు .


వెంటనే ఆ కాగితం పైన నల్ల రంగులో ఏవో ముద్రించబడ్డాయి .కళ్ళు తెరిచిన అభయ్ దాన్ని చూశాడు. ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎప్పుడూ ఒకరికి సహాయం చేయడం, ఏదైనా జీవులని కాపాడడం మాత్రమే వచ్చేది.


ఇప్పుడు వింతగా అందులో అన్వి ఫోటో ఉంది. దానికి తోడు , “ ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించేలా చేసుకోవడమే! నీ చివరి పరీక్ష ” అని అందులో ఉంది.


ఒకపక్క చీకటి శక్తులకి రాజైన డ్రాకులా తన జాతిని కాపాడుకోవడం కోసం అన్విని ప్రేమిస్తున్నాడు. మరోపక్క తనకి శక్తి అధికారాలతో కూడిన ఉన్నతమైన స్థానం కోసం ,తన చివరి మిషన్ అన్విని ప్రేమించేలా చేసుకోవడం కోసం దేవదూత అయిన ఏంజెల్ ప్రయత్నిస్తున్నాడు .


ఇప్పుడు అన్వేషణ నిజమైన ప్రేమను ఏలా అన్వేషిస్తూందో ? ఎవరిని నిజంగా ప్రేమిస్తుందో , ఆ కాలమే నిర్ణయించాలి!.


——— ***** ———