Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 09










“ మనము ఈసారి ఎలాగైనా గాని కాంపిటీషన్లో గెలవాలి . నాకు తెలిసి ఈసారి యాభై వేలు కాబట్టి ఒక్క కాంపిటీషన్ పెడతారనుకుంటా ” అంది గీత సందేహిస్తూ .


“ ఒక కాంపిటీషన్ అయితే ఎలా గెలవనగలుగుతాం మనం. ఛ ఇంతసేపు మనం గెలుస్తామనుకున్నాను కాదే! ” అంది అన్వి బాధగా .


“ ఉట్టికేగరలేనమ్మ ,ఆకాశానికి ఎగిరింది అంటా! అట్టుంది నీ పంచాయతీ .కాంపిటీషన్లో గెలిచి, ప్రైస్ తీసేసుకున్నట్టు అప్పుడే ఊహలు కూడానా ?” అంటూ నిజాన్ని వెళ్ళగకింది గీత.


“ అవునే మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి అడిగి కనుక్కుంటే సరిపోద్ది . ఎందుకని మనలో మనం గొడవ పడుతున్నాము ” అంది ఆలోచిస్తున్న సంజన .


“ నువ్వు చెప్పింది బాగానే ఉంది. వెళ్లి అదే చేద్దాం ” అంటూ పైకి లేయబోయారు ముగ్గురు .

వాళ్ల ముందరే ఆ మాటలు వింటున్న అభయ్ ఇంకా రాహుల్ వారి పరిస్థితిని అర్థం చేసుకొని ,వాళ్లకి సహాయం చేయాలి అనుకున్నారు . ఇద్దరు ఒకటేసారి వెనక్కి తిరిగి ఏదో చెబుదామని లేచారు.


కానీ టక్కున ఇద్దరు మూఖలని చూసుకొని మళ్లీ సైలెంట్ అయిపోయారు .


“ స్టూడెంట్స్! ఒక్క నిమిషం నాకోసం ఉంటారా ?” అంటూ అప్పుడే గదిలోకి ప్రవేశించాడు ప్రిన్సిపల్ చటర్జీ .

ప్రిన్సిపల్ క్లాస్ లోకి రావడంతో వెంటనే లేచి నిలబడ్డారు అందరూ. కూర్చొనిమనట్టు చెప్పి , “మీకు భూషణ్ సార్ చెప్పావుంటారు .ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఫెస్ట్ మన కాలేజ్ స్పాన్సర్ చేస్తుంది. అందులో గెలిచిన టీంకి యాభై వేలు అని ప్రకటించాం ” అంటూ మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేశారు.


అందరూ అవును, తెలుసు అన్నట్టు తలలూపారు .

“ కానీ సార్ యాభై వేలు అంటే కేవలం ఒక్క పోటీనే జరుగుతుందా? ” అంటూ సందేహంగా అడిగింది గీత. ఎంతైనా మన డిటెక్టివ్ కదా.


“ నేను ఆ విషయంపైనే మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఇలా వచ్చాను ” అంటూ రాహుల్ వైపు చూస్తూ, “ పైనుంచి అఫీషియల్స్ కోరిక మేరకు ఈ సంవత్సరం మన కాలేజీ ఈ పోటీని నిర్వహిస్తుంది. ఈ పోటీలో పాల్గొనటానికి మన యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజెస్ వస్తాయి .యాభై వేలు అన్నది పూర్తిగా ఏ కాలేజీ టీమ్ అయితే ఎక్కువ గేమ్స్ గెలుస్తుందో దానికే వెళుతుంది .ఇందులో మేము మీకు బాగా ఇష్టమైన ,మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొన్ని గేమ్స్ ని ఉంచాం ” అంటూ చెప్పాడాయన .


చెప్పిన విషయాలు పైన కాస్త అవగాహన ఏర్పడడంతో ,“ మరి సార్ ! ఏ గేమ్స్లో పాల్గొనవచ్చు ” అంటూ అడిగింది యాంకర్ సంజన .

“ క్రికెట్ , ఆర్చరీ, చెస్ ,డాన్స్ ,స్కిట్స్, మారతాన్ ఇంకా అన్నిటికీ మించి ఒక స్పెషల్ గేమ్ ని ప్లాన్ చేస్తున్నాము ” అంటూ ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు .


అంతలోనే ఒక అమ్మాయి లేచి ,“ సార్ మరి చాలా కాలేజెస్ వస్తున్నాయి అన్నారు .ఎన్ని కాలేజెస్ రావచ్చు ?”


“ నాకు తెలిసి ఒక అయిదు కాలేజీలు పాల్గొనవచ్చు ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి ,ఇక మందు పెరగొచ్చు, పెరగకపోవచ్చు” అంటూ చెప్పాడు చటర్జీ .


“ ఇక మన కాలేజీకి బహుమతి వచ్చినట్టే ! యాభై వేలు గెలిచినట్టే ,అయినా మా నాన్న నాకు ఇచ్చే పాకెట్ మనీ అంత కూడా లేదు . దీంట్లో పాల్గొనడం అంత అవసరమా ? ” అంటూ అప్పటికే క్లాసులో ఉన్న వాళ్ళు వెనక్కి తగ్గారు .


ఏదైనా పర్లేదు .ఒకసారి ట్రై చేద్దాం ! అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని ధైర్యం చేసి సగం మంది ఆసక్తిగా వింటున్నారు.


అప్పుడే సందేహిస్తున్న అన్వి , “ సార్ ప్రతి గేమ్ కి ఏదైనా ప్రైజ్ మనీ ఉంటుందా? ” అంటూ చిన్నగా అడిగింది .ఆ మాటలకి క్లాసులో ఉన్న వాళ్లంతా తనవైపు చిరాగ్గా చూశారు. చాలా చిన్న చూపుగా అనిపించి వెంటనే కూర్చుంది అన్వి.


“ ఉంటుంది. ప్రతి ఫైనల్ విజేతకి బహుమతిగా ఉంటుంది. ఈ గేమ్స్ లో ఏ టీం అయితే ఎక్కువ విజయాలు సాధిస్తూందో ఆ కాలేజీకి యాభై వేలు పంపడం జరుగుతుంది . ఆ తర్వాత ఆ డబ్బుని ఎలా అన్నది ఆ కాలేజీ యాజమాన్యం ఇష్టం ” అంటూ ఆ గేమ్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసి బయటికి నడిచారు.


“ ఏంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్టుంది .మనం గెలుస్తామంటావా ?” బాధగా అంది యాంకర్ సంజన .


అప్పటిదాకా బయటికి వెళ్లిపోయిన చటర్జీ మళ్ళీ లోపలికి అడుగు వేసి , “సంజన కం టు మై క్యాబిన్ ” అంటూ చెప్పి వెళ్ళిపోయాడు .


నన్నెందుకు పిలిచారు ప్రిన్సిపల్ సార్ అంటూ చిన్నగా అంటూ కళ్ళు రెండు పెద్దవి చేసి ,సార్ వైపు చూస్తూనే ఉంది .


“ ఏయ్ నిజం చెప్పవే ? మాకు తెలియకుండా నువ్వు ఏదైనా తప్పు చేసావా ?” ధబైస్తున్నట్టు అడిగింది గీత.


“ అసలు నేను మిమ్మల్ని వదిలి ఒక్క క్షణమైనా ఉంటున్నానా, తప్పు చేయడానికి? అయినా అందరి మనపైన పెతనం చూపే వాళ్లే కానీ ,మనకి అంత తప్పు చేసేంత చోరవ ఎవరిచ్చారు?” నిలదీస్తున్నట్టుగా కోప్పడింది .


“ సరేలే ! ముందైతే అసలు విషయానికి కనుక్కుందాం పదండి. నీకు తోడుగా మేము వస్తున్నాం పదా ” అంటూ సంజనాని తీసుకొని క్యాబిన్ దగ్గరికి వెళ్లారు .


లోపలికి వెళ్లిన సంజన ప్రిన్సిపల్ గారితో ఏదో మాట్లాడుతూ ఉంది . వీళ్లు రూమ్ బయట ఎదురు చూస్తూ ఉన్నారు .కాసేపటికి రూమ్ నుండి బయటకు సంజన ఫుల్ సంతోషంగా వచ్చింది .

“ ఏంటే కళ్ళు మతాబులాగా వెలిగిపోతున్నాయి. అసలు ఏమన్నారు ప్రిన్సిపాల్ సర్ ?” అంటూ సందేహంగా అన్వి.


“ మన కాలేజ్ ఫెస్ట్ కి ఫైనల్ ఈవెంట్ కి నన్ను యాంకర్ గా సెలెక్ట్ చేశారంటా! ” అంటూ చెప్పింది .


“ హే నిజంగానా ? కంగ్రాట్స్ ” అంటూ చేతులు కలిపింది అన్వి.


“ దానికి ఎందుకు అంతలా నవ్వటం. మనకి ఇదొక పెద్ద ఇరిటేషన్ కాకపోతే ” అంటూ నీరసంగా ఉంది గీత .


“ ఆ మొదట నేను అలాగే అనుకున్నాను .దాని బదులు కాంపిటీషన్లో పాటిస్పేట్ చేస్తే, గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా అని అనుకున్నాను . అప్పుడే ప్రిన్సిపాల్ సార్ నాకు ఒక విషయం చెప్పారు. నేను యాంకరింగ్ చేస్తే, ఆయన నాకు ఐదువేలు ఇస్తానన్నారు .దాంతో మనకి నచ్చినవి తినొచ్చు ” అంటూ నాలుకతో తన పెదవుల్ని తడుపుకుంది సంజన.


తను పెట్టిన ఎక్స్ప్రెషన్ కి గీతకి నోట్లో నీళ్లుఉరాయి .


అన్నీ కూడా చాలా రోజులైంది .మేం బయట హోటల్లో తినీ! ఆ పూటైనా సంతోషంగా తినగలుగుతాం అనుకుంటా అని మనసులోనే అనుకోని , లేదు ....లేదు .నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను .దాన్ని మా ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు అని మనసులోని నిర్ణయం తీసుకొని , “లేదు ఆ డబ్బులు నాకు ఇవ్వు. నేను జాగ్రత్తగా మన ఖర్చులకి వాడుకుందాం ” అంటూ చాలా స్ట్రెక్టుగా చెప్పింది అన్వి.


వాళ్లకి తెలుసు అన్వి అలా ఎందుకు అంటుందో, కానీ అదేం పట్టించుకోకుండా సంజన మాట్లాడటం మొదలు పెట్టింది.

“ ప్లీజ్ అన్వి, నా బంగారు కాదా! మనము బయట ఫుడ్ ఎన్ని నెలలు అవుతుంది తీని,ఒక్కసారి వెళ్లి కడుపునిండా తినేద్దామే! నాకు ఈ అవకాశం రాకపోతే అసలు మనకి మనీ వచ్చేవే కాదు కదా? ప్లీజ్ ఇప్పుడు కూడా రాలేదనుకోవచ్చు కదా!” అంటూ బ్రతిమిలాడుతున్నట్టు అడిగింది .


“ కానీ............” అంటూ ఏదో సాగదీస్తున్న అన్విని మధ్యలోనే ఆపేసి , “ఆ యాంకరింగ్ జరిగేది లాస్ట్ రోజు .కాబట్టి ముందైతే మనం ఏదైనా ఒక కాంపిటీషన్లో పాటిస్పేట్ చేద్దాం. తర్వాత ఎంతో కొంత మనీ సంపాదిద్దాం .ఏమంటారు ?” అంటుంది గీత.


“ సరే పదండి .క్లాస్ రూమ్ లోకి వెళ్లి డిస్కషన్ చేద్దాము ” అంటూ అన్వి వాళ్ళని పట్టుకుని క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది .


——— ***** ———