Featured Books
  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • చిన్న రక్షకుడు

    ఒకప్పుడు, కొండల మధ్య ఉన్న ఒక గ్రామంలో, రాజన్ అనే రైతు ఉండేవా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 10









తన అలా వెళ్తూ ఉన్నప్పుడు క్యాంటీన్లో టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ జరుగుతూ ఉంది. ఆ కామెంట్రీ అన్వి చెవికి చేరగానే , “ మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారా? చూద్దాం ” అంటూ కాంటీన్ లోకి లాక్కొని వెళ్ళింది .


అప్పుడే యమకింకారుడిలా నిలబడ్డాడు ఆ క్యాంటీన్ లో పని చేసే ఒక అబ్బాయి. వాడి పొడుగు కారణంగా అన్వి చిన్నగా తల పైకెత్తి చూడాల్సి వచ్చింది .వాడేమో కోపంగా చూస్తూ ,“ మీకు ఎన్ని సార్లు చెప్పాలి .క్యాంటీన్లో తినే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి అనీ ” అంటే విసూరుగా మాట్లాడాడు .


అప్పుడు కానీ తన చిట్టి బుర్రలో వెలగలేదు. ఒకసారి ఇలాగే మ్యాచ్ అని క్యాంటీన్లోకి రాగానే మెడ పట్టుకు గెంటేస్తారు. దాంతో ఇంకెప్పుడు అటుగా రాకూడదా అనుకుంది అన్వి. కానీ మన అన్వి పాప మనసు మాత్రం క్రికెట్ .....క్రికెట్ అంటూ కలవరిస్తూ ఉంది .ఇక ఏమీ చేయలేక దీనంగా ముఖం పెట్టి బయటికి నడుద్దామని వెనక్కి తిరిగింది .


“ అన్వి! నా దగ్గర ₹10 ఉన్నాయి ” అంటూ చెవిలో చిన్నగా చెప్పింది సంజన.

“ నిజంగానా ? ” అంటూ కళ్ళు రెండు పెద్దవి చేసి ధైర్యంగా ముందుకు తిరిగి , “ మేము కొనుక్కొని తినడానికి వచ్చాము ” అంటూ చెప్పింది.


క్షణాలలో మారిన అన్విని చూస్తూ,“ సరే వెళ్లి కూర్చోండి ” అంటూ చెప్పాడు .కాసేపు ఉన్నాక వాళ్లంతా ఆ టీవీ సరిగ్గా కనిపించే ఒక టేబుల్ దగ్గర కూర్చొని కామెంట్రీలో క్రికెట్ చూస్తూ ఉన్నారు .


అతడు వెళ్లి కౌంటర్ దగ్గర నిలబడ్డాడు , “ వీళ్ళు ఏం కొంటారా అనీ ”


అన్వి ,సంజన దగ్గర ఉన్న పది రూపాయలు తీసుకొని వెళ్లి “ మాకు ........” అంటూ అక్కడున్న అన్ని ఐటమ్స్ వైపు చూసింది. వాటి ధరలు చూసి మైండ్ పోయింది .అంతలోనే తన వైపు జాలిగా ఏదో చూస్తున్నట్టు అనిపించి ,అటుగా చూసింది .

రూపాయి చాక్లెట్ల డబ్బా ! ఏదో మూలన కనిపించింది. “ సరే ఈ పది రుపీస్ కి చాక్లెట్లు ఇవ్వండి ” అంటూ డబ్బా వైపు చూపించింది. అతను ఆ పది రూపాయలు తీసుకొని పది చాక్లెట్లు అన్వి చేతిలో పెట్టాడు .


తర్వాత అన్వి వెళ్లి తన టేబుల్ దగ్గర కూర్చొని చాక్లెట్లు తినడం మొదలు పెట్టింది .తన ఫ్రెండ్స్ కి కాసిన్ని ఇచ్చి ముగ్గురు తింటూ ఆ టీవీని చూస్తూ అన్నారు . అతడు మళ్లీ ఒక రెండు నిమిషాలకు వచ్చి “ ఏంటి మీరు ఇంకా వెళ్లలేదా? చాక్లెట్లు తీసుకున్నారు కదా, వెళ్లండి ” అంటూ అరిచాడు .


“ అదేంటి ఈ క్యాంటీన్ లో ఏది కొనకుండా ఊరికే కూర్చోకూడదు కదా తప్పు. అందుకే మేము చాక్లెట్ కొన్నాం. అవి తింటున్నాం .అవి తినేంతవరకు మేము ఇక్కడ కూర్చునే హక్కు ఉంది ” అంటూ నిలదీసింది అన్వి.


అతడు బిక్కమూఖం వేసుకొని, ఒకసారి ఆ ముగ్గురు వైపు చూసి వెళ్లిపోయాడు .అలా ఆ క్యాంటీన్ లో పనిచేసే ఆ అబ్బాయిని బోల్తా కొట్టించి ,వీళ్ళ ఆరోజు కామెంట్రీ సగం చూశారు. మధ్య మధ్యలో మనవాళ్లు సిక్స్లు, పౌర్లు కొడుతుంటే ఎగిరి గంతేశారు .వికెట్లు పడితే ఏమో బాధగా నిట్టూర్చారు.


అదంతా క్యాంటీన్లో కూర్చున్న అభయ్ గమనిస్తూనే ఉన్నాడు. ఓహో తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా! అయితే నేను క్రికెట్ లో పార్టిసిపేట్ చేస్తాను. అందులో నేను బాగా ఆడితే, నా పైన ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోతుంది అని మనసులోనే అనుకొని సంతోషంగా బయటికి వెళ్లిపోయాడు.


క్యాంటీన్లో అన్వి ఉంది అన్న విషయం తెలుసుకున్న రాహుల్ అటుగా వచ్చాడు .అప్పుడే తనని పట్టించుకోకుండా, చిన్నగా నవ్వుతూ వెళుతున్న అభయ్ని చూసి , “ ఏంటి వీడేదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు ” అని మనసులోనే అనుకొని క్యాంటీన్లోకి వెళ్ళాడు .


అప్పటికి మ్యాచ్ సగం అయిపోయి, కాస్త బ్రేక్ దొరికింది. దాంతో చాక్లెట్లు అయిపోయాయి. అప్పటిదాకా బాగా అరిచి గోల చేసిన వాళ్ళు ,పక్కనే ఉన్న నీళ్లు తాగి సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.


“ హమ్మయ్య సగం మ్యాచ్ అయిపోయింది .కాబట్టి ఇప్పుడు నేను ఛానల్ మార్చిన ,ఎవరు ఏమనుకోరు ” అనుకున్న అంతను వెళ్లి ఇంకో స్పోర్ట్స్ ఛానల్ పెట్టాడు .


అందులో ఆర్చరీ పోటీ జరుగుతుంది .అది ఎప్పుడో జరిగిపోయిన ఒలంపిక్స్ గేమ్. అందులో తలపడుతున్నది ఫైనల్లో ఇండియా ఇంకా కొరియా. అవి చూసిన ఆశ్చర్యలో అన్వి , “ మన వాళ్లు ఆడుతున్నారా? ” అంటూ మళ్ళీ సంజనని చిన్నగా గోకింది.



“ అది అయిపోయిన మ్యాచ్, ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు ” అంటూ చెప్పింది .కాస్త నాలెడ్జ్ ఉన్న సంజన!


“ కానీ ఫైనల్ లో ఇండియా ఉంది కదా ” అంటూ వాళ్ళు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు .


అప్పుడే కాంటీన్ లోకి వచ్చినా రాహుల్ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో టీవీ చూస్తున్న వీళ్ళ ముగ్గురిని చూశాడు .అందులో ఆర్చరీ పోటీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు దూరంగా కూర్చున్న టేబుల్ లో చూస్తూ , వింటూ ఉన్నాడు.


అప్పుడే అక్కడికి వచ్చిన ఆ బెరర్ర్ “ మేడం మీ చాక్లెట్లు కూడా అయిపోయాయి .ఇప్పుడు ఆ మ్యాచ్ కూడా అయిపోయింది. కాబట్టి మీరు ఇక వెళ్తారు అని అనుకుంటున్నాను .లేకపోతే మెడ పట్టుకు గెంటల్సివస్తుంది ” అంటూ చిన్నగా మాట్లాడితూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు .


ఆ మాటలు నచ్చలేదు రాహుల్ కి ! వెంటనే బెరర్ర్.......అంటూ పిలిచాడు .ఆ మాటలకి ఉలిక్కి పడ్డాడు అతడు. పరుగు పరుగున రాహుల్ దగ్గరకు వచ్చాడు .



దాదాపు భయపడిపోయిన ఈ ముగ్గురు కూడా రాహుల్ వైపు చూశారు. రాహుల్ ఏవో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసి ,తనకి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపించాడు .


అన్వి చూపు రాహుల్ నుంచి అసలు పక్కకు వెళ్లడం లేదు .దాంతో అతడి వైపే చూస్తూ ఉండిపోయింది .


“ ఏయ్ అన్వి, మనకు టీవీ చూడాలని ఎంత ఉన్న మనం చూడలేమే! పద ఇంకా లేట్ చేస్తే మళ్లీ ఆ ఎదవ వచ్చి గొడవ పెట్టుకుంటాడు .నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ” అంటూ బాధగా అంది సంజన.



“ అవును తను చెప్పింది కూడా నిజమే వెళ్ళిపోదాం ” అంటూ వాళ్ళ బ్యాగులు తీసుకొని పైకి లేచారు .


వెంటనే ఆ బెరర్ర్ పరిగెత్తుకుంటూ వచ్చి “ మేడం .....మేడం కూర్చోండి. ఇందాక మీతో అలా ప్రవర్తించినందుకు సారీ! ” అంటూ వాళ్ళ టేబుల్ పైన మూడు కూల్ కేక్ పీసెస్ పెట్టాడు.


“ హేయ్!ఏం చేస్తున్నావు ? మా దగ్గర డబ్బులు కూడా లేవు .మేము ఆర్డర్ ఇవ్వలేదు కదా ” అంటూ భయపడుతూ దూరం పెడుతూ అంది అన్వి.

“ మేడం కానీ! ఆ సార్ ఇచ్చారు .ఇప్పుడు మీరు దీన్ని తింటూ మిగిలిన క్రికెట్ కూడా చూడొచ్చు” అంటూ చిన్నగా చెప్పి ,“ మీ బిల్ కూడా సారే పే చేశారు” అంటూ చెప్పాడు.


ఆ మాటలకి అన్వి కాస్త తనని తాను తమాయించుకొని రాహుల్ వైపు చూసింది. ఆ చూపులకి వెంటనే రాహుల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు . వెళ్లిపోతున్న అతని వైపు ముగ్గురు మళ్లీ చూస్తూ ఉండిపోయారు.


“ లేదు మాకు అసలు వద్దు మేము వెళ్ళిపోతున్నాము ” అంటూ అన్వి అక్కడి నుండి కదలబోతుంటే ,అతడు మధ్యలోనే ఆపి ,


“ లేదు మేడం .సార్ మీ కోసం ఆర్డర్ ఇచ్చారు. మీరు కచ్చితంగా తినే తీరాలి .నేను అతడి దగ్గర డబ్బులు తీసుకొని తీసుకున్నాను ” అంటూ కరాఖండిగా చెప్పాడు.




“ వీడేంటే డబ్బుల్లేకపోతే ఏమో మెడ పట్టుకొని బయటికి , ఒకవేళ ఆర్డర్ ఇచ్చి తినకపోతే ఏమో ఇలా బలవంతం చేస్తాడు ” అని మనసులోని తిట్టుకుంటూ, “ ఓకే ఫైన్ .......” అంటూ కూర్చుంది .


ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి అని పైకి చూస్తే ,వాళ్ళ ముఖచిత్రాలన్నీ ఆ కేక్ ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది .వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకుంటూ ,“ సరేనే మీ కోసం ఒప్పుకుంటాను ” అంటూ చిన్నగా తినడం ప్రారంభించింది .


ఆ ప్లాస్టిక్ స్పూన్ లో కొద్దిగా కూల్ కేక్ తీసుకుని తన నోట్లో పెట్టుకుని , గాజు గ్లాసెస్ గోడల అవతల నడుస్తున్న రాహుల్ వైపే చూస్తూ ఉంది అన్వి.


అసలు ఎందుకు నా ఇష్టాన్ని నువ్వు గౌరవించాలి .అసలు ఎందుకు నువ్వు నన్ను కాపాడాలి .నీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా! పైగా ఎవరితోనూ మాట్లాడవు. ఆఖరికి నాతో కూడా నా? అంటూ మనసులోనే తన గురించి ఆలోచిస్తూ ఉంది .


తన కంటి చూపు నుండి అతడు దూరమైన తర్వాత టీవీలో వినిపిస్తున్న ఆ శబ్దాలకి మళ్లీ క్రికెట్ చూడ్డంలో మునిగిపోయింది .



“ తినటానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు .తన గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. తనకి ఎలాగైనా సహాయం చేయాలి ” అని మనసులోని బలంగా అనుకున్నాడు రాహుల్ .



కాసేపు తన గురించి ఒక బెంచ్ పై కూర్చుని ఆలోచించిన తర్వాత, “ తను ఇష్టంగా ఆర్చరీ చూడటం గమనించాను. నేను ఆ పోటీల్లో పాల్గొంటే ఎలా ఉంటుంది. ఒకవేళ నేను వాళ్లతో పాల్గొనటానికి వాళ్ళు ఒప్పుకోకపోతే, నేను ఇలాగా ఒంటరిగా పాల్గొని తనకి హెల్ప్ చేస్తాను ” అని మనసులోనే అనుకుంటూ చుట్టూ చూసాడు.


అక్కడ ఎవరు కనిపించలేదు .దాంతో నెమ్మదిగా తన కళ్ళని ఎరుపువర్ణంలోకి మార్చాడు. అంతే! ఎక్కడినుండి వచ్చిందో తెలియదు .కానీ ఎదురుగా ఒక చిన్న నల్లని పొగ గాల్లో ఎగురుతూ కనిపించింది. వెంటనే రాహుల్ సైగ చేయగానే అది అతని నీడలో దాక్కొని , “ చెప్పండి యువరాజ !నన్నెందుకు పిలిచారు ” అంటూ వినయంగా అడిగింది.


“ నేను ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ” అంటూ చాలా కచ్చితంగా చెబుతూ .


“ అలాగే మహారాజా! నేను ఆ అమ్మాయి శరీరంలోకి వెళ్లి, తనని ఆవాహన చేసుకునా? లేకపోతే తనని భయపెట్టి తన ఇంటికి పంపించనా? ” అంటూ మళ్ళీ అడిగింది.


“ తనకి చిన్న దెబ్బ కూడా తగలకూడదు ” అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్టు , కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు.


“ నువ్వు అవేం చేయాల్సిన అవసరం లేదు. తనని నువ్వు ఫాలో అవుతే చాలు. తను నాకు కావలసిన వ్యక్తి ” అంటూ చెప్పాడు .


మొదట భయపడిన ఆత్మ తర్వాత నెమ్మదిగా అక్కడి నుండి సరే అని చెప్పి గాల్లో కలిసిపోయింది.


——— ***** ———