Featured Books
  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 08









“ అబ్బా నా చివరి మెషిన్ మామూలుగా ఉంటుందనుకుంటే , ఇంత కష్టంగా ఉంది ఏంటి? ముందే నా పైన తనకి మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు తనతో ఎలా మాట్లాడాలి ” అంటూ ఆలోచించసాగాడు అభయ్.

అభయ్ అలా ఆ రాత్రంతా గడిపేసాడు . మరునాడు తనతో ఎలాగైనా సరే మాట్లాడాలని , తనకి ఎలాగైనా సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు.



ఆరోజు అందరికంటే ముందు కాలేజీకి వెళ్లిన అతడు అన్వి పాప కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా అభయ్ ఒకరి కోసం ఎదురు చూడటంతో మిగిలిన వాళ్లంతా చాలా ఆత్రుతగా తన దగ్గరికి వెళ్లి ,మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఏం పట్టించుకోకుండా నిశ్శబ్దంగా అన్నాడు.


అతడేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు కొన్ని క్షణాల్లోనే కాలేజీకి వచ్చిన అమ్మాయిలంతా తనని చుట్టుముట్టేశారు .


“ గీవ్ మీ ఫ్రీడం .ప్లీజ్ గో నౌ ” అంటూ కాస్త అరిచాడు .కానీ వాళ్ళు అవేం పట్టించుకోకుండా , “ ప్లీజ్ ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వవా? ” అంటూ వాళ్ళ పుస్తకాలను ఓపెన్ చేసి ఇచ్చారు.


“ నేను ఆటోగ్రాఫ్ ఇస్తే, మీరు కచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతారా? ” అంటూ సీరియస్ గా అడిగాడు .


“ కచ్చితంగా! ఈరోజు కదిలించాము ” అని అందరూ ఒకటే సారి అన్నారు .


అరచేతిని తలపై కొట్టుకుంటూ , “ ఈ మనుషులు ఏంట్రా ,ఇలా ఉన్నారు ” అనీ తిట్టుకుంటూ, తన పేరుని ఆటోగ్రాఫ్గా రాయడం స్టార్ట్ చేశాడు .


తన చేతులు పూర్తిగా నొప్పి వచ్చాయి .ఇక తనిచేత కాక చేతిని విదిలించుకుంటూ ఆపేద్దామని ఎంత ప్రయత్నిస్తున్న సరే, అక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు తన ఆటోగ్రాఫ్ కోసం ఒక పెద్ద క్యూని కట్టారు.


మొదటిసారి నా మంచితనానికి ,నా అందానికి నా పైన కోపం వస్తుంది .దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు.


అప్పుడే కాలేజ్ లోకి అడుగుపెట్టిన అన్వి వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద లైన్ ని చూసి ఆశ్చర్యపోయారు .


“ ఏంటే అల్లు అర్జున్ లేకపోతే ప్రభాస్ వచ్చాడా? ఇంతమంది ఉన్నారు ” అంటూ కళ్ళు రెండు పెద్దవి చేసి చూసింది అన్వి .


గీత కూడా తన స్పెట్స్ తో వాళ్ల చివరి భాగంలో చూసి ,“ అంత సీన్ లేదు .వాళ్లంతా అభయ్ కోసమే ఎదురు చూస్తున్నారు ” అంటూ చెప్పింది తీరికగా.




“ వాడి కోసం ఇంత పెద్ద క్యూనా? ” అంటూ ఆశ్చర్యపోతున్నారు.


“ పదండి మనకెందుకు వాడితో,ఎంతమందితో ఊరేగితే మనకేంటి ? వాడి వల్ల మనం దెబ్బలు తిన్నం. కాబట్టి మనం కచ్చితంగా వాడిని పట్టించుకోకూడదు ” అంటూ అక్కడి నుండి వాళ్ళని లాక్కొని వెళ్లడం మొదలుపెట్టింది సంజన .



“ మధ్యలో దీనికేమయిందే ...” అంటూ వేగంగా నడుచుకుంటూ వెళ్తున్న అన్వి అడగ్గాని నోరు ముయ్ అన్నట్టు చూపుడువేలు అని నోటి దగ్గర పెట్టి ముందుకు లాక్కెళ్ళింది .


అప్పుడే కాలేజ్ లోకి వచ్చిన రాహుల్ అక్కడన్న లైన్ ని చూసి ఆశ్చర్యంగా ముందుకు చూశాడు. అప్పుడే చేతులు నొప్పి పెడుతున్న సరే సంతకాలు చేస్తూ కష్టపడుతున్న అభయ్ని చూసి చిన్నగా , “బాగా అయింది ” అని మనసులోని క్రూరంగా నవ్వుకున్నాడు.



మొదటిసారి వాడి అందమే వాడికి శాపం అయింది అనుకుంటా ! లేకపోతే ఏదో పిల్లోడు కదా చెప్తే వింటాడు అనుకున్నాను. కానీ వాడికి నా అన్వి కావాల్సి వచ్చింది అని చిన్నగా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళబోయాడు .


అతడు వెళ్లడాన్ని గమనించిన అభయ్ ! నిన్న జరిగిన దానికి ఇదే రివెంజ్ తీర్చుకోవడానికి మంచి టైం అనుకున్నాడు.


“ రాహుల్ ఈ కాలేజీలో నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారనుకుంటా! ” అని వెళ్తున్న అతని వైపు చేయి చూపించి పిలిచాడు.


రాహుల్ పేరు వినగానే అప్పటిదాకా సంతకాలు తీసుకున్న అమ్మాయిలంతా తన చుట్టూ మూగారు.

“ రాహుల్ చూడు ,అభయ్ ఎంత మంచి వాడో! అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. నువ్వు కూడా ఇవ్వచ్చు కదా ?” అంటూ పెన్ను పేపర్ తన చేతిలోకి ఇవ్వబోయారు.


తన పథకం ఏంటో అర్థం అయినా రాహుల్ ఏ మాత్రం ఆలోచించకుండా , “ షట్ అప్. నాకు అంత ఖాళీ టైం లేదు .కావాలంటే అతని దగ్గరే మళ్లీ తీసుకోండి ” అంటూ గట్టిగా అరిచాడు .


ఆ అరుపుకి తన చుట్టూ ఉన్న అమ్మాయిలంతా భయపడి పోయి కాస్త దూరం జరిగి పోయారు. అదంతా వెళ్తున్న అన్వి చూసి ఆశ్చర్యపోయింది .


“ ఈ మానవుడికి ఇంత కోపం ఎందుకు? నిన్న మాట్లాడిద్దామంటే పెద్ద పోజు కొట్టాడు .కానీ నాకు ప్రాబ్లమ్ అంటేనే వచ్చేసాడు కదా! ” అని మళ్ళీ అంతలోనే కోపం నుంచి సాఫ్ట్ కార్నర్ వైపు మళ్ళింది.


“ ఏ అన్వి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? చాలా తప్పుకాదు ” అని మనసులోని తనంతను తిట్టుకొని క్లాసులోకి వెళ్ళిపోయింది .


అతడి కోపానికి అందరూ దూరంగా జరగడంతో అతడు కూడా నడుచుకుంటూ క్లాస్ కి వచ్చాడు .తన పక్క ముందుగానే కూర్చున్న సంజనాన్ని చూసి తన ప్లేసులో తాను కూర్చున్నాడు. అతి కష్టం మీద అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చి ,పడిపోయిన తన చెయ్యిని మరో చేతితో లేపుతూ క్లాసులోకి వచ్చాడా అభయ్.


తనని చూడగానే రాహుల్ పడి పడి నవ్వడం మొదలుపెట్టాడు .తనాల ఎందుకు నవ్వుతున్నాడో అన్వికి కూడా అర్థమైంది .


పాపం అన్నట్టుగా అభయ్ వైపు చూస్తూ ఉంది. అతడు మాత్రం చాలా కోపంగా, ఏం మాట్లాడకుండా వచ్చి రాహుల్ పక్కన కూర్చున్నాడు .కాసేపు నవ్వినా తర్వాత సైలెంట్ అయిపోయిన రాహుల్ ,భూషణ్ గారు చెప్పే క్లాస్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.


“ ఛ! నా కర్మ కాకపోతే నేను వచ్చి వీడి పక్కనే కూర్చోవాల్సి వస్తుంది .నాకు ఇలాంటి ఒక మనిషి చేత ఇంత అవమానం జరుగుతుందని అసలు అనుకోలేదు ” అని చిరాగ్గా కోప్పడుతున్నాడు మనసులోనే అభయ్!


మనసులోనే రాహుల్ బొమ్మని ఊహించుకొని దాన్ని బాక్సింగ్ లాగా తుక్కుతుక్కుగా కోడుతున్నాడు అభయ్.


నువ్వు ఎంత ట్రై చేసినా కానీ అన్వి నాకు మాత్రమే సొంతం..అయినా నాకెందుకో ఆ అమ్మాయితో బలమైన సంబంధం ఉంది అనిపిస్తుంది. మనుషులను చంపే నేను కూడా మొదటి సారి అన్విని చూడగానే పడిపోయా ! తనని కాపాడాను. అది కూడా నా ప్రమేయం లేకుండానే! భాహూష దీన్నే ప్రేమ అంటారా? అని మనసులోని దాని గురించి ఆలోచనలు పడ్డాడు రాహుల్.



ఇలా అయితే అన్వి దృష్టిలో నేను హీరోల్లా కాదు. వెధవల్లా తయారవుతాను. ముందు తనకి ఏ విషయము ఇష్టమో దాన్ని కనుక్కొని, అందులో నెంబర్ వన్ గా నిలవాలి .తర్వాత తన దృష్టిలో మంచి ఒపీనియన్ ని ఏర్పరచుకొని, తనని ప్రేమించేలా చెయ్యాలి అని మనసులోనే ఆలోచించడం మొదలుపెట్టాడు అభయ్.


కాసేపు రాహుల్ ని ఊహించుకొని కొట్టడం మానేసి ,“ నేను ఏంటి ? ఈ రాహుల్ విషయంలో చాలా కోపంతో ఊగిపోతున్నాను. నిజంగా దేవతలకి అసలు కోపం రాదు కదా ,మనుషుల పైన నాకెందుకు ఇలా అవుతుంది ” అని మరోసారి ఆలోచనలో మునిగిపోయాడు.

తన క్లాస్ మొత్తం పూర్తి అవ్వడంతో తన కళ్ళకు ఉన్న కళ్లద్దాలని చేతిలోకి తీసుకొని , “ స్టూడెంట్స్ ఈరోజు పాఠం ఇంతటితో ముగిసింది .ప్రిన్సిపాల్ గారి అభ్యర్థన మేరకు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం జరిగే ఇంటర్నేషనల్ ఫెస్ట్ కాంపిటీషన్లు మన కాలేజ్లో మొదలవుతున్నాయి. ఇందులో గెలిచిన టీంకి యాభైవేల రూపాయల క్యాష్ ఫ్రై ఉంటుంది. అంతేకాకుండా వచ్చే సంవత్సరం వరకు మీ ఫోటోలు బ్యానర్ల రూపంలో బెస్ట్ కాంపిటీషన్ లోనే ఉంటాయి. ఇక మీకు సర్టిఫికెట్ మెడల్స్ అవన్నీ మామూలుగానే అందుతాయి ” అంటూ చెప్పడం పూర్తి చేసి తన టెక్స్ట్ బుక్ చేతిలో పట్టుకొని వెళ్లిపోయారు .




“ అన్వి విన్నావా? కచ్చితంగా పాటిస్పేట్ చేసి , ఎలాగైనా గెలవాలి .అవి మన కాలేజీ ఫీస్ కి సరిగ్గా సరిపోతాయి కదా! ” అంటూ ఆశ్చర్యంతో నిండిన కళ్ళతో అంది సంజన .


“ అవును .ఆ డబ్బు నాకు దొరికితే చాలా బాగుంటుంది ” అని మనసులోనే అనుకోని తలని నిలువుగా ఊపింది అన్వి.


——— ***** ———